పండంటి స్టార్టప్‌కి పాతిక సూత్రాలు! సక్సెస్ ఫుల్ అంట్రప్రెన్యూర్స్ అందించిన రత్నాల్లాంటి మాటలు!!
సక్సెస్ నుంచి స్ఫూర్తి పొందుతూ..ఫెయిల్యూర్స్ నుంచి పాఠాలు నేర్చుకుంటూ సాగిపోవడమే జీవితం.. స్వీయానుభవాలనుంచే కాకుండా ఎదుటివారి తప్పులనుంచి కూడా నేర్చుకోవడం తెలివైన వారి లక్షణం. అనుభవజ్ఞులు చెప్పే ఆ మాటలలోని సారాన్ని గ్రహించి .. వాటిని తాము ఎదుర్కునే సమస్యలకు.. సంఘటనలకు అన్వయించుకుంటే తెేలికగా బయటపడవచ్చు. అలాంటి మాటలే మంత్రాలవుతాయి. మహత్తర ప్రభావాన్ని కలిగిస్తాయి. మహోన్నతుల్ని చేస్తాయి. క్రియేటివిటీ నుంచి కామర్స్ వరకూ స్టార్టప్ నుంచి సక్సెస్ వరకూ ఇండియన్ అంట్రెప్రెన్యూర్స్ మెమరబుల్ జర్నీని మీ ముందుకు తెస్తున్నది యువర్ స్టోరీ .కామ్. స్టోరీ బైట్స్ పేరుతో ఆ వారంలో సక్సెస్ ఫుల్ అంట్రపెన్యూర్స్ అందించిన రత్నాల్లాంటి మాటల్ని గుది గుచ్చి మీకందించే ప్రయత్నం చేస్తోంది.
లక్ష్యసాధన పిరికివారి వల్లకాదు.. కానీ అది వారనుకున్నంత కష్టమైన పని కూడా కాదు!
_ లక్ష్మణ్ పాపినేని, యాప్ వైరాలిటి
ఆస్వాదించే మనసు ఉండాలే కానీ మనం ఉన్న చోటే.. మన మధ్యలోనే ఎన్నో వింతలు ఉన్నాయి .
_ఎలిజిబెత్ గిల్ బర్ట్-(ఈట్ ప్రే లవ్)
ఆలోచనలు , నైఫుణ్యాలు చాలామందికి ఉంటాయి.. కానీ వాటిని ఎంత బాగా ఆచరణలోకి తెచ్చామనే దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది.
_అంకుర్ గుప్తా, క్యాంపస్ మాల్.
సుదీర్ఘకాలం నీతో కలిసి ఎవరూ పనిచేయరు. నీ మీద, నీ సామర్థ్యం మీద అచంచల విశ్వాసం ఉంటే తప్ప.
_తరుణ్ భరధ్వాజ్-ప్యుచ్చా
సరికొత్త ఆవిష్కరణలు చేయడానికి బలమైన సంకల్పం, కృషి, తపనతో పాటు ఇది మనది ఆనే భావన కల్పించడం కూడా చాలా ముఖ్యం.
_ప్రగతి నగార్కర్, రోటిమాటిక్
ఇండియాలోని చాలా ఈ కామర్స్ కంపెనీలు నిధులకోసం ఇతర దేశాలకు తరలిపోతున్నాయి.
_అరవింద్ సింఘాల్ , టెక్నో పాక్
వ్యాపారం ప్రారంభించడానికి ముందే నిదులు సమకూర్చుకోవడం ఇండియాలో అత్యావశ్యకం. ఎందుకంటే ప్రారంభించిన తర్వాత నిధుల సమీకరణ దుర్లభం.
_పాలా మరివాలా, సీడ్ ఫండ్
2016 లో సైబర్ సెక్యురిటీపైనే వ్యాపారుల దృష్టంతా ఉంటుంది.
_ఆదిత్య వెంకటేశన్, గూటెన్ బర్గ్ కమ్యూనికేషన్స్.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ గురించిన విషయాల్ని రహస్యంగా దాచి అపోహలు పెంచే కంటే వాటిని బహిరంగ పర్చడం ఉత్తమం.
_విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్
స్థానిక బాష,మొబైల్ ఈ రెండూ రాబోయే రోజుల్లో డిజిటల్ కామర్స్ రంగంలో కీలక పాత్ర పోషించబోతున్నాయి.
_రోహిత్ బన్సల్, స్నాప్ డీల్
డిజైన్ అంటే ఒక పనికిరాని వస్తువును అందంగా తయారు చేయడం కాదు..కొత్త దానికి రూపకల్పన చేయడం.
_పంకజ్ జైన్ , 500 స్టార్టప్స్
నేర్చుకోవడంతో పాటు నమూనాగా నిలువడం కూడా ప్రాధమిక సమాచార సాధనం.
_రినీ డి రెస్టా,బ్రాడీ ఫారెస్ట్ ,ర్యాన్ విన్ యార్డ్-ది హార్డ్ వేర్ స్టార్టప్
డెలివరీ బాయ్సే మా కంపెనీ యెక్క రాయబారులు
_సందీప్ పడోషి-వోవ్ ఎక్స్ ప్రెస్
ఏదైనా మంచి చేస్తే..అది మళ్లీ మీకు తిరిగొస్తుంది
_శ్రీకాంత్ బొల్లా,బొల్లాంట్ ఇండస్ట్రీస్
ప్రస్తుత తరంలోని బహు సంపన్న,సంపన్న వర్గాలు మరింత దాతృత్వాన్ని చాటుకుంటాయని ఆశిస్తున్నాను.
_అజీమ్ ప్రేమ్ జీ, విప్రో
కెరీర్,ఫ్యామిలీ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఉండాలనే వైఖరితో కాకుండా..రెండూ ఉండాలనే వైఖరిని పెంపొందించుకోండి .
_పద్మశ్రీ వారియర్
ఈనాటికీ చాలామంది మహిళలు తాము ధరించే లో దుస్తుల ఎంపిక విషయంలో కనీస అవగాహన లేకుండా ఉన్నారు.
_రిచా కర్, జివామే
జనాభాలోని విటమిన్,మినరల్స్ లోపం వల్ల ఇండియా జీడీపీలో12 అమెరికన్ బిలియన్ డాలర్లు నష్టపోతోంది.
_సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్
అవరోధాల్ని దాటి ఆలోచించగలిగితే విజయం సాధించే సామర్థ్యం అందరికీ ఉంటుంది.
_స్వప్న అగస్టిన్
వృధ్దాప్యాన్ని మర్యాదపూర్వకంగా కాకుండా నిజంగా అందమైనదిగా చెయ్యలేమా?
_వ్లాది రప్పో, బ్యూటిఫుల్ ఇయర్స్
మీ పిల్లాడిని కనీసం డ్రైవర్ గా చూడాలనుకున్నా 8వ తరగతి పాస్ కావాలి! ఒక ఫ్యాక్టరీలో వర్కర్ గా పనిచేయాలన్నా కనీస అర్హత పది పాస్ కావాలి.
_ఇందర్ జిత్ కుమార్,దీపాలయ పాఠశాల.
ఈనాటి రూరల్ అర్బన్ సప్లై చెయిన్ లో అత్యధికంగా లాభపడాల్సిన కార్మికుడు అట్టడుగున మిగిలిపోతున్నాడు.
_పూజా తెర్వాడ్,నివారణ్ ఆన్ లైన్
విజయగర్వాన్ని ఎప్పుడూ తలకెక్కించుకోవద్దు.
- పండిట్ జస్ రాజ్
విజయం సాధించిన వారిని అనుకరించడం కంటే.. నీ లోపల దాగి ఉన్న నైఫుణ్యాన్ని వెలికితీసి ప్రదర్శించడం ఉత్తమం.
_శిభానీ కశ్యప్
నువ్వు చేసే పని ఇతరుల కంటే భిన్నంగా ఉంటేనే విజయం సాధిస్తావు.. అందుకు మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవడం తక్షణావసరం.
_సురేష్ ఇరియట్, STUDIO EEKSAURUS