బైక్ టాక్సీ కోసం ఉబర్ కంపెనీ హైదరాబాదునే ఎందుకు ఎంచుకుంది..?
ఉబర్ సీఈవోకు సిటీలో ఏం నచ్చింది?
ఇకపై ఉబర్ కార్లతో పాటు ఉబర్ బైకులు కూడా హైదరాబాద్ రోడ్లపై దౌడు తీయబోతున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి ఉబర్ టూ వీలర్స్ అందుబాటులోకి రానున్నాయి. ఉబర్ బైక్ ట్యాక్సీలను సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. అయితే మోటో రైడ్ కోసం ఉబర్ కంపెనీ హైదరాబాద్ నే ఎందుకు ఎంచుకుంది? ఉబర్ సీఈవోకు మన సిటీలో ఏం నచ్చింది?
ఉబర్. ఆన్ లైన్ ట్రాన్స్ పోర్ట్ దిగ్గజం. ఉబర్ క్యాబ్స్ ఇప్పటికే మంచి సక్సెస్ అయ్యాయి. అదేదారిలో ఇప్పుడు ఉబర్ బైకులు కూడాహైదరాబాద్ రోడ్ల మీదికి రాబోతున్నాయి. దేశంలోని ఇతర నగరాలను కాదని హైదరాబాద్ నే ఏరికోరి ఎంచుకుంది ఉబర్. సిలికాన్సిటీలో అయితే క్యాబ్స్ తరహాలో బైక్ ట్యాక్సీలు కూడా సక్సెస్ అవుతాయని ఉబర్ సీఈవో ట్రావిస్ మనసావాచా నమ్మారు. అందుకు ఓ కారణముంది. ఇంతకుముందు కూడా బెంగళూరు లాంటి నగరాల్లో ఉబర్ బైక్ షేరింగ్ సర్వీస్ ప్రారంభించి చూశారు. అయితే అక్కడవి అనుకున్నంతగా వర్కవుట్ కాలేదు. ఉబర్ బిజినెస్ మోడల్ కు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించలేదు. దాంతో ఆ రాష్ట్రాల్లో ఉబర్ మోటో సర్వీసులు సక్సెస్ కాలేదు.
కానీ హైదరాబాద్ సిటీ పూర్తిగా వేరు. ఆంట్రప్రెన్యూర్ షిప్ ను అక్కునచేర్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం రెడ్ కార్పెట్ తో రెడీగా ఉంటుంది. వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడానికి టీ-హబ్ ఉండనేఉంది. బిజినెస్ చేయడానికి హైదరాబాద్ పర్ ఫెక్ట్ ప్లేస్ అని స్వయానా ఉబర్ సీఈవోనే చెప్పారు. ప్రపంచంలోని మిగతా నగరాలతోపోలిస్తే హైదరాబాద్ లో ఇన్నోవేషన్ మంచి ప్రోత్సాహం ఇస్తున్నారని తెలిపారు. పైగా ఇక్కడ బిజినెస్ నిలదొక్కుకోవడం, సర్వీస్డెలివరీ కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి.. బైక్ ట్యాక్సీలకు భాగ్యనగరాన్ని సెలక్ట్ చేశామన్నారు ట్రావిస్.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు అద్భుతమని ఉబర్ కంపెనీ చాలాసార్లు ప్రకటించింది. రాష్ట్రంలో 300 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వంతో గత ఏడాదే ఒక ఒప్పందం కుదర్చుకుంది. తాజాగా టీ-హబ్, మెట్రో రైల్ తోనూ అగ్రిమెంట్లు చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉబర్ కస్టమర్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్ సపోర్ట్ సెంటర్ ను హైదరాబాద్ లో నెలకొల్పారు. అంతేకాదు, అమెరికా బయట రెండో అతి పెద్ద బ్రాంచ్ ను హైదరాబాద్ లోనే ఏర్పాటు చేశారు. భాగ్యనగరంలో నిత్యం 75 వేల పైచిలుకు ఉబర్ క్యాబ్ లు తిరుగుతున్నాయి. తక్కువ కాలుష్యం, తక్కువ రద్దీ లక్ష్యంగా లాంఛైన మోటో సర్వీస్ కూడా సక్సెస్ అవుతుందని ఉబర్ సీఈవో గట్టి నమ్మకం.
ఇకపోతే ఉబర్ బైకుల గురించి చెప్పుకోవాలి. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్, హెల్మెట్ సహా అన్ని సేఫ్టీ ఫీచర్స్ పక్కాగా ఉంటాయి. ఇదిఅత్యంత సేఫ్ బైక్ టాక్సీ. నడిపే వాళ్లతో సహా వెనకాల కూర్చున్న వారికీ హెల్మెట్ తప్పనిసరి. రెండువైపులా ఫీడ్ బ్యాక్ ఇచ్చేఫెసిలిటీ వుంది. ట్రిప్ డిటెయిల్స్ ఫ్రెండ్స్ కు షేర్ చేయోచ్చు. మొదటి 3 కిలోమీటర్లకు 20, తర్వాత ప్రతీ కిలోమీటరుకు 5 రూపాయల చొప్పున చార్జ్ చేస్తారు. హైదరాబాదులో ఇది అతి చవకైన పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఆప్షన్. ఇళ్ల నుంచి ఆఫీసులకు, మెట్రో స్టేషన్లకు, ఇంకా ఇతర ప్రదేశాలకు మైల్ టు మైల్ కనెక్టివిటీ ఇవ్వడంలో ఉబర్ ది బెస్ట్ సర్వీస్.