సంకలనాలు
Telugu

ఉరుకుల పరుగుల ఉద్యోగులకు 'ఈట్ ఆన్ గో' బ్రేక్ ఫాస్ట్

Lakshmi Dirisala
24th Sep 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

బీహార్‌‌లో దొరికే లిట్టి చొక్కా, ఇండోర్‌లో చేసే మసాలా పోహా లేదా డిల్లీలో ఎంతో ఇష్టంగా తినే కచోరీ సబ్జీ…ఇవన్నీ మీ ఇంట్లోనే మీరు తినగలిగితే ? సూపర్ కదా…పైగా వాటికోసం వాడే పదార్ధాలు కూడా ఆయా ప్రాంతాలనుంచే తెప్పించినవి కూడా అయితే ?... నోరు ఊరిపోతోంది కదూ ?

ఈ ఆలోచన నుంచి పుట్టిందే ఈట్ ఆన్ గో కంపెనీ. ఇదొక ఆన్‌లైన్ ఫుడ్, స్నాక్ డెలివరింగ్ కంపెనీ. బెంగళూరులో ఉండే బిజీ ఉద్యోగులకు పొట్ట నిండే విధంగా బ్రేక్ ఫాస్ట్ మరియు బ్రంచ్ ఆప్షన్స్‌ని ఇస్తోంది.

ఈట్ ఆన్ గో సహ వ్యవస్థాపకులు తరు రాజ్ అగర్వాల్ మరియు ఉదిత్ సారన్

ఈట్ ఆన్ గో సహ వ్యవస్థాపకులు తరు రాజ్ అగర్వాల్ మరియు ఉదిత్ సారన్


కజిన్స్ అయిన ఉదిత్ సారన్, తరు రాజ్ అగర్వాల్ తమ సొంత వ్యాపారం మొదలుపెట్టాలనే ఆలోచనకి 2015 ఫిబ్రవరిలో బీజం పడింది. ఉదిత్‌కు గతంలో ఫుడ్ ఇండస్ట్రీలో పని చేసిన అనుభవం ఉంది. డెల్ మాంట్, జనరల్ మిల్స్ , పిల్స్ బరీల్లో అతను పనిచేసారు. తరుకి మింత్రా, కాపిల్లరీ టెక్నాలజీస్ లో పనిచేశారు.

బెంగళూరులో ఇద్దరూ కలిసే ఉంటున్నారు, ఇద్దరూ బిజీ ప్రొఫెషనల్స్ కావడంతో ఆఫీస్‌కి చాలాసార్లు పరగడుపునే వెళ్లేవారు. అప్పుడే వీళ్లిద్దరకీ తమ జీవితం ఎంతలా మారిపోయిందో తెలిసొచ్చింది. కనీసం బ్రేక్ ఫాస్ట్ చెయ్యడానికి కూడా సమయం లేకపోవడం బాధనిపించి. ఇదే 'ఈట్ ఆన్ గో' కి రూపకల్పనకు కారణమైంది.

ఈట్ ఆన్ గో ప్రయాణం

మొదట్లో స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి నిధులు సమీకరించుకుని ఈట్ ఆన్ గో మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ వెంచర్‌కి ప్రముఖ వ్యాపారవేత్తలు జిఎస్ఎఫ్ యాక్సలరేటర్స్‌కి చెందిన రాజేష్ సానీ, చెఫ్ బాస్కెట్‌కి చెందిన నిపున్ కతియాల్ వంటివారు నిధులు అందిస్తున్నారు.

కిచెన్ మరియు డెలివరీ సిబ్బంది

కిచెన్ మరియు డెలివరీ సిబ్బంది


ఈ ఏడాది ఫిబ్రవరీలో ఎనిమిది మందితో మొదలైన టీమ్ ఇప్పుడు 30కి చేరుకుంది. ఇందులో 12 మంది డెలివరీ బాయ్స్, 12 మంది కిచెన్ స్టాఫ్ ఉన్నారు. కార్యకలాపాలు మొదలుపెట్టిన నెలలోనే వారానికి 100 నుంచి 150 ఆర్డర్ల వరకూ సంపాదించారు. చాలా త్వరగానే ఆ సంఖ్య 2500 కి పెరిగింది. అంటే నెలకి 50 శాతం చొప్పున సగటు వృద్ధి రేటు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం 3000 మంది యాక్టివ్ కస్టమర్లతో, అందులోనూ 60 శాతం మంది మళ్లీ మళ్లీ ఆర్డర్లు ఇచ్చేవారితో ఈ వ్యాపారం కొనసాగుతోంది.

image


ఈ స్టార్టప్ త్వరలో తమ మొదటి ఫండింగ్ రౌండ్‌ని ముగించాలని చూస్తోంది. తద్వారా పది లక్షలని సమీకరించాలని భావిస్తోంది. ఈ విధంగా చెయ్యడం వల్ల ఇంకొంత మంది సిబ్బందిని చేర్చుకోవచ్చు, మార్కెట్ లో తమ పరిధిని, అందించే సేవల్ని పెంచుకోవచ్చు. గత రెండు నెలల్లో వీళ్లు ఎనిమిది కొత్త వంటకాలని జోడించారు. ఇప్పుడు మొత్తం 36 రకాల వంటకాలని అందిస్తున్నారు.

మరింత వేగంగా ముందుకి దూసుకుపోవాలని ప్రయత్నిస్తోంది ఈ కజిన్స్ ద్వయం. తమ సేవల్ని దక్షిణ బెంగళూరు మొత్తం విస్తరించాలని చూస్తున్నారు. మరథలి, HSR లేఔట్, కోరమంగళ, ఎలక్ట్రానిక్ సిటీ, సర్జార్పుర్ రోడ్ మరియు వైట్ ఫీల్డ్ లలో తమ జెండా పాతాలని చూస్తున్నారు. ప్రస్తుతం, ఈ స్టార్టప్ ఇందిరానగర్, ఉల్సూర్, కొడిహల్లి, మురుగేష్ పాల్య, దోమ్లూర్ ప్రాంతాల పరిధిలోనే డెలివరీని అందిస్తోంది. యాండ్రాయిడ్, ఐఒఎస్‌ల కోసం మొబైల్ అప్లికేషన్‌ని తెచ్చే పనిలో కూడా ఉంది.

image


మిగతావాళ్లనుంచి తమను ప్రత్యేకంగా నిలిపే కీలక విషయాలంటే వంటకాల ప్రమాణం మరియు వాటికి ఉపయోగించే పదార్ధాలే అంటారు.

“ఈ ప్రామాణికమైన వంటలు తయారీ పద్ధతి మా వద్ద డాక్యుమెంట్ అయి సేఫ్‌గా ఉన్నాయి. మేము ఆరోగ్యకరంగా ఉండే ఇంటి మసాలాల మిశ్రమాన్ని కూడా వాడుతున్నాం. అందుకే వండేవారు ఒకరే కాకపోయినా ఆహార నాణ్యత, రుచి మాత్రం ఎక్కడా తగ్గదు. కస్టమర్లకి మేమేం అందించాలో, ఎలా అందించాలో మాకు బాగా అవగాహన ఉంది. కాబట్టి మేం ఎప్పుడూ కస్టమర్ల అంచనాలను అందుకుని.. వారి అభిప్రాయాలనూ తీసుకుంటున్నాం. ఆహార తయారీకి వాడే పదార్ధాలను ఆయా ప్రాంతాల నుండే తెప్పించుకుంటాం. ఉదాహరణకి.. లిట్టి చొక్కా అనేది బిహార్ వంటకం, అందుకే అందులో వాడే సత్తుని బిహార్ నుండే తెప్పిస్తాం. అదే విధంగా ఇండోర్‌కి చెందిన మసాలా పోహా కోసం బియ్యాన్ని ఇండోర్ నుండే తెప్పిస్తాం. ఈ విధానమే మా వంటకాలకు ఒక ప్రత్యేకమైన రుచిని తీసుకొస్తోంది.

తప్పులు చేశాం.. నేర్చుకున్నాం

తప్పులు చెయ్యడం, వాటి నుండి గుణపాఠాలు నేర్చుకోవడం, ఇవే ఏ సంస్థకైనా బలం చేకూర్చే పునాదులు అని ఈ సంస్థ కో – ఫౌండర్స్ నమ్ముతారు. కొంచెం ప్రత్యేకంగా ఆలోచిస్తూ ముందుకు సాగుతున్న వీరు వివిధ భాగస్వాములను తమ వ్యాపారంలో చేర్చుకోవడానికి, వారినుండి సూచనలు తీసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు.

“మన సొంత ఆలోచన ఆటుపోట్లతో అభివృద్ధి చెందడాన్ని గమనించడం ఒక గొప్ప అనుభూతి. స్టార్టప్ ప్రపంచంలో ఎన్నో అపరిమిత అవకాశాలతో కూడిన సానుకూలత ఉంది. కొత్త కొత్త భాగస్వామ్యాలను ఏర్పరుచుకుంటూ బ్రేక్ ఫాస్ట్, బ్రంచ్, స్నాక్స్ విషయంలో మాకు తిరుగులేదు అనిపించుకునేలా ముందుకు సాగాలని భావిస్తున్నాం”.
image


పరిశ్రమ

బెంగళూరు లో జరిగిన యువర్ స్టోరీ ఫుడ్ టెక్ క్రౌడ్ పిచ్ చాలెంజ్‌లో ఏప్రిల్ నెలకల్లా 17 కొత్త ఫుడ్ టెక్ స్టార్టప్స్ పుట్టుకొచ్చాయి. ఒక పక్క స్టార్ స్టార్టప్స్ అయిన స్విగ్గీ, టైనీ ఓల్, ఫ్రెష్ మెనూ, హోలా చెఫ్ వంటివి ఈ రంగాన్ని శాసిస్తున్నా, మిగతావారికి కూడా పెట్టుబడిదారుల నుండి నిధులకు మాత్రం కొరత ఉండటం లేదు. దగ్గరనుంచి గమనిస్తే, ఈ విభాగాన్ని ఇన్వెస్టర్లు మరింత ఇష్టపడేలా ముందుకు తీసుకెళ్తున్నాయి ఈ స్టార్టప్స్.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags