వరుస అపజయాల తర్వాత స్వర్ణాన్ని గెలుచుకున్న విట్టిఫీడ్
బ్రాండ్ ఫెయిల్యూర్ తో పాటుగా, నాలుగు వరుస అపజయాల తర్వాత ఆ స్టార్టప్ భవిష్యత్ ఎలా ఉంటుంది?
ప్రతీ నెలా 60 మిలియన్ల విజిటర్లు, 250 మిలియన్ల పేజ్ వ్యూస్ తో ఫ్లాగ్ షిప్ పోర్టల్ లా ఉంటుందని అనిపిస్తుంది.
అంతేనా, ఈ స్టార్టప్ ఇటీవలే బ్యాంకాక్ లో జరిగిన ఆల్ ఇండియా అచీవర్స్ ఫౌండేషన్ నిర్వహించిన ఫంక్షన్లో "ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఇన్ ఐటి సెక్టార్" అనే అవార్డ్ ను గెలుచుకుంది. దీంతోపాటె, తమ ప్రొడక్ట్స్ ద్వారా సక్సెస్ ఫుల్ అయిన ఎలైట్ గ్రూప్ స్టార్టప్స్ లో గూగుల్ ద్వారా ఎంపికచేయబడింది.
విట్టీఫీడ్ ఫామిలీ
కంటెంట్ మ్యాప్, వైరల్ కంటెంట్ తో రీడర్లను కట్టిపడేసే అంశాల్తో, ఆపరేషన్ ప్రారంభమయిన ఏడాదిలోనే విట్టిఫీడ్ టాప్ 500 మోస్ట్ విజిటెడ్ వెబ్ సైట్స్ జాబితాలో చేరిపోయింది. చదవడం, రాయడం, ఎక్స్ ప్రెస్ చేయడం, ఎక్స్ ప్లోర్ చేసే వారికి చార్టికల్ ప్లాట్ ఫాం లా బ్రాండ్ అయింది wittyfeed.com. ఫోటో స్టోరీస్, లిస్టికల్స్ రాసే మోడర్న్ ఏజ్ బ్లాగర్స్ కు ఇది యూ ట్యూబ్ లా మారింది. ప్రపంచ వ్యాప్తంగా, ఇంటర్నెట్లో వైరల్ గా మారిన కంటెంట్ తొ, మిలియన్ల సంఖ్యలో రీడర్లను సంపాదించుకోవడానికి విట్టిఫీడ్ ఏం చేసింది?
ప్రారంభంలో అపజయాల తర్వాత విట్టిఫీడ్ స్వర్ణాన్ని ఎలా కైవసం చేసుకుంది? evrystry.com, thestudpidstation.com ను రూపొందించిన తర్వాత సక్సెఫుల్ అయిందే విట్టిఫీడ్. ఇవన్నీ వత్సన టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రొడక్ట్సే. వత్సన గురించి యువర్ స్టోరి సెప్టెంబర్ 2014 లోనే వివరించింది. బ్రాండ్ న్యూ అవతార్ తో వచ్చిన విట్టిఫీడ్, కేవలం ఏడాది కాలంలోనే తన పేజ్ వ్యూస్ సంఖ్యను నెలకు 5 మిలియన్ల నుంచి 250 మిలియన్లకు పెంచుకుంది. అదంతా ఎలా జరిగింది? "రాత్రికి రాత్రే ఇదంతా జరుగలేదు. నాలుగేళ్ల పాటు ట్రయల్ అండ్ ఎర్రర్ చేసిన తర్వాత ఈ స్థాయికి చేరుకున్నాం. ప్రొడక్ట్ బ్రాండింగ్ లో ఎన్నో పాఠాల్ని నేర్చుకున్నాం. ఇంతకుముందు మా evrystry పోర్టల్ టీం కు కానీ, రీడర్లకు కానీ నచ్చలేదు. ఆ తర్వాత మా ప్లాట్ఫాం కు క్యాచీగా ఉండే పేరుతో ముందుకొచ్చాం" అంటున్నారు విట్టిఫీడ్ కో-ఫౌండర్ అయిన వినయ్ గుప్త.
ఒక రోజుకి వెబ్ సైట్ ను విజిట్ చేసే 6 మిలియన్ల విజిటర్లు, 45,000 యూజర్లతో ఇటీవలే మార్క్ క్రాస్ చేసింది విట్టిఫీడ్. ఈ సంఖ్యలను సూచించే అతి పెద్ద స్క్రీన్ ముందు 35 మంది సభ్యులతో కూడిన టీం, సిలికాన్ వ్యాలి తరహాలో డాన్స్ చేసింది.
స్టోరీ టెల్లింగ్ అండ్ రెవెన్యూ
విట్టి ఫీడ్ రీడర్లకు కంటెంట్ అందిస్తుంది. ఇక గూగుల్ ఆడ్ ఎక్స్, ఓపెనెక్స్, ఎపొం, కంటెంట్.ఆడ్ వంటి డిస్ ప్లే ఆడ్ టూల్స్ ద్వారా రెవెన్యూ ఆర్జిస్తుంది. viral9.com అనే వన్-ఆఫ్-ఏ-కైండ్ కంటెంట్ డిస్టిబ్యూషన్ చానల్ ద్వారా, 6000 మంది ఆన్-బోర్డ్ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సియర్స్ కంటెంట్ ను వైరల్ గా మార్చడం వీరి ప్రత్యేకత. ఇక వీరికున్న వెబ్ సైట్ వ్యూస్ కోసం గూగుల్ ఒక అకౌంట్ మేనేజర్ ను నియమించింది.
"వైరల్ కంటెంట్ ను కనిపెట్టే టీం ఇప్పుడు మాకుంది. రైటర్లు వెబ్ సైట్ కు పోస్ట్ చేసేముందు కంటెంట్ రాస్తారు. ఏది వైరల్, ఏది కాదు అనేది తెలుసుకోవడానికి, విట్టిఫీడ్ లీడర్ గా మారడానికి అవసరమైన సిస్టం మీద వర్క్ చేస్తున్నాం" అంటున్నారు కో-ఫౌండర్ శశాంక్ వైష్ణవ్. 2012 లో కాలేజ్ మూడో సంవత్సరం చదువుతున్నపుడు శశాంక్ అమేజింగ్ థింగ్స్ అనే కంటెంట్ వెబ్ సైట్ కు సహ వ్యవస్థాపకుడుగా ఉన్నారు.
"ప్రస్తుతమున్న ఆడ్ లింక్స్ భవిష్యత్తులో అడ్వర్టైజింగ్ కు సరిపోవు. స్టోరీలతో పాటే ఆడ్స్ ను కూడా రూపొందించుకోవాలి" అంటారు విట్టిఫీడ్ కు మూడో కో-ఫౌండర్ అయిన పర్వీన్ సింఘాల్.
విట్టీఫీడ్ ఫౌండర్స్
మార్కెట్లో కంటెంట్ క్యూరేటర్ వెబ్ సైట్స్ అప్పటికే లేవా? అంటే, "మేము ప్రారంభించినపుడు బజ్ ఫీడ్, డిప్లీ అనే రెండు మేజర్ కాంపిటీటర్స్ మా మదిలో ఉన్నారు. ఆ రెండు అప్పటికే ఎస్టాబ్లిష్ అయి మార్కెట్లో పేరు సంపాదించాయి. మమ్మల్ని మేము విభిన్నంగా భావించాం. కంటెంట్ కోసం మేము మరో వెబ్ సైట్ ను క్రియేట్ చేయకుండా, ప్లాట్ ఫాం ను రూపొందించాం. అందరితో పంచుకోవడానికి ఫోతో బ్లాగ్ తో పాటుగా, వ్యాక్యానాల్ని కూడా అందులో పొదుపరిచే చార్టికల్ ను తయారుచేశాం" అంటున్నారు పర్వీన్.
మా దగ్గర పనిచేయాలనుకుంటున్నారా? అయితే లేచి డాన్స్ చేయండి
విట్టిఫీడ్, పేరు లాగే ఉద్యోగుల్ని హైర్ చేసుకోవడంలోను కొత్తదనం చూపిస్తుంది. వాళ్లదగ్గర ఎవరైనా, ఏ పొజిషన్లో అయినా పనిచేయాలని భావిస్తే, వాళ్లు పాటలు పాడడం, జోక్స్ చెప్పడం, కామెడి పండించడం లేదా డాన్స్ చేయాల్సి ఉంటుంది. "కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి, భయపడకుండా పర్ఫాం చేయగలిగి ఉండాలి. అలాంటి వారినే మేము హరి చేయాలని అనుకుంటున్నాం. ఎం చేస్తే ఎలా తీసుకుంటారో అనే భయం లేకుండా చేయగలగాలి" అంటారు వినయ్.
"మా దగ్గరున్న ఎంప్లాయీస్ అంతా ఫ్రెషర్లే. ఫ్రెష్ టాలెంటే విట్టిఫీడ్ ఎన్విరాన్మెంట్ ను అర్థం చేసుకుంటుందని, నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తారని భావిస్తాం" అంటున్నారు పర్వీన్.
టీం లో పెళ్లికాని బాయ్స్ కోసం ఒక అపార్ట్ మెంట్ ఉంది. అక్కడంతా కలిసే ఉంటారు. వారి నెలవారి ఖర్చుల కోసం స్టార్టప్ పే చేస్తుంది. అక్కడ వారు ఫిట్ అండ్ హెల్తీ గా ఉండడానికి కుక్ ను ఏర్పాటుచేశారు.
ఇండోర్ కు మారిన బేస్
వినయ్, పర్వీన్ అన్నదమ్ముళ్లు. వీరికి కాలేజ్ డేస్ లో చెన్నైలో శశాంక్ కలిశాడు. శశాంక్ ఇండోర్ లోనే పుట్టి, పెరిగారు. కాలేజ్ లో థర్డ్ ఇయర్ చదువుతున్నపుడే స్టార్టప్ ను ప్రారంభిoచి, మూడేళ్ల పాటు కొనసాగించారు. ఇక శశాంక్ స్వస్థలమైన ఇండోర్ ను దర్శించిన వినయ్ కు అదే తమ స్టార్టప్ కు పర్ ఫెక్ట్ స్థలమని భావించారు. ఆ తర్వాత మూడు నెలల కాలంలోనే, 2014 లో జూన్ లో ఇండోర్ కు షిఫ్ట్ చేశారు. ఇక అప్పటి నుంచి వెనుకకు తిరిగి చూసుకోలేదు.
ఇక ప్రస్తుత రేటింగ్ ను బట్టి చూస్తే, 201516 ఆర్ధిక సంవత్సరానికి విట్టిఫీడ్, 6 అమెరికన్ మిలియన్ డాలర్ల ఆన్యువల్ టర్నోవర్ ను సాధించాలని భావిస్తోంది. దీంతోపాటే క్రెడిట్ అంతా తమ టీం దేనని అంటున్నారు విట్టిఫీడ్ వ్యవస్థాపకులు. "మేము నైపుణ్యాల్ని హైర్ చేసుకోము, వ్యక్తుల్ని హైర్ చేసుకుంటాం. వాళ్లకు ఇష్టమున్న దాన్ని చేసేలా మేము చూస్తాం, దాంతో వారి పనితనం అందరూ నచ్చేలా ఉంటుంది. మేమంతా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటాం" అంటున్నారు శశాంక్.
"సక్సెస్ కు ఎలాంటి పర్ ఫెక్ట్ ఫార్ములా ఉండదు. కానీ, మీకంటూ బలమైన టీం ఉంటే, మీరే మీ స్వంత ఫార్ములాలను రూపొందించుకుంటారు" అంటారు వినయ్.
కంటెంట్ ఇండస్ట్రీ అవధుల్లేకుండా ఎదుగుతోంది. 2020 నాటికల్లా, వెబ్-బేస్డ్ ఇంఫర్మేషన్ (ఎక్కువగా కంజ్యూమర్-డ్రివెన్) 600 శాతం వృద్ధి చెందుతుందని అంటున్నారు బ్లాగర్, ఆఠర్ అయిన మార్క్ షేఫర్. ఇక మీడీయా అంచనాల ప్రకారం, కేవలం ఒక్క కంటెంట్ మార్కెటింగ్ మాత్రమే, 2019 కల్లా 313 బిలియన్ డాలర్ల ఇండస్ట్రీగా మారుతుంది.