అద్దె ఇంటి సమస్యలకు అద్భుతమైన పరిష్కారం

అద్దె ఇంటి సమస్యలకు అద్భుతమైన పరిష్కారం

Thursday October 29, 2015,

3 min Read

ఓ కొత్త ఊరిలో ఉపాధి వెతుక్కుంటూ వెళ్ళే వారంద‌రికీ ఎదురయ్యే స‌మ‌స్య ఒక‌టే. 2014లో మొద‌టి సారి బెంగ‌ళూరు వెళ్ళిన నికుంజ్ బ‌తేజాకి కూడా అదే స‌మ‌స్య ఎదుర‌ైంది. అదే అద్దెకి ఇల్లు వెతుక్కోవ‌డం. త‌ాను ప‌డిన ఇబ్బంది మరొక‌రు ప‌డ‌కుండా వుండాలంటే ఏం చేయాల‌ని ఆలోచించాడు నికుంజ్. దానికి స‌మాధానమే హోమిగో పోర్ట‌ల్. వ‌ర్కింగ్ ప్రొఫెష‌న‌ల్స్‌కి షేరింగ్ బేసిస్‌లో ఫుల్లీ ఫ‌ర్నిష్డ్ ఇళ్ళ‌ను అందించ‌డం ఈ పోర్ట‌ల్ ప్ర‌త్యేక‌త‌.

చివ‌రికి ఆన్ లైన్ హౌసింగ్ కంపెనీల్లో కూడా బ్రోక‌ర్ల ప్ర‌మేయం వుండ‌డాన్ని నికుంజ్ త‌న స్వీయానుభ‌వంలో చూసాడు. ఆన్‌లైన్లో ఇల్లు వెతుక్కున్నా స‌రే, బ్రోక‌ర్ల చేతిలోమోసపోవ‌డం, కాలం, డ‌బ్బు వృధా చేసుకోవ‌డం సర్వ సాధార‌ణంగా వుండేది.

అప్పుడే కాలేజీ నుంచి బ‌య‌టికొచ్చిన నికుంజ్‌కి ఒక నెల అద్దె బ్రోక‌రేజిగా ఇవ్వ‌డం, ప‌ది నెల‌ల అద్దె సెక్యూరిటీ డిపాజిట్ చేయ‌డం లాంటివి చాలా భారంగా వుండేవి. పోనీ ఇంత క‌ష్ట‌ప‌డినా.. చూపించే ఇళ్ళు ప‌ర‌మ భ‌యంక‌రంగా వుండేవి. ఫుల్లీ ఫ‌ర్నిష‌డ్ అని గొప్ప‌గా చెప్పి ఎక్కువ డ‌బ్బులు వ‌సూలు చేస్తారు. తీరా చూస్తే, అక్క‌డ పాడుప‌డిన ఫ‌ర్నిచ‌ర్ వుండేది. వైఫై, డి టి హెచ్, గ్యాస్ క‌నెక్ష‌న్ల లాంటి వాటికోసం నానా పాట్లు ప‌డాల్సి వ‌చ్చేది.

image


కోర్ టీమ్

కొద్ది రోజుల్లోనే త‌న బ్యాచ్‌మేట్ జ‌తిన్ మిత్రుకాతో క‌లిసి దీనికో ప‌రిష్కారం వెత‌కాల‌నుకున్నాడు. చాలా మంది ప్రాప‌ర్టీ ఓన‌ర్ల‌ను క‌లిసి వారికి ర‌క‌ర‌కాల ఆఫ‌ర్ల గురించి చెప్పాడు. ఇటు అద్దెకు వుండేవారికి, అటు ఓన‌ర్ల‌కు కూడా న‌ష్టం లేని విధంగా ఒక ప‌రిష్కారం వుండాల‌నుకున్నాడు. మొత్తం మీద వీరికి ఓ విష‌యం బాగా అర్థ‌మయింది. ఓన‌ర్లు, టెనెంట్లు ఒక‌రితో ఒక‌రు డీల్ చేసే బాధ లేకుండా వుంటే బావుంటుంద‌నుకుంటున్నారు. క‌నుక వీళ్ళిద్ద‌రికీ ఈ స‌మ‌స్య‌ను త‌ప్పించ‌డానికే హోమిగో పుట్టింది.

కొంత మార్కెట్ రీసెర్చి, బోలెడంత మేధోమ‌ధనం త‌ర్వాత నికుంజ్, మిత్రుకా .. ఇద్ద‌రూ క‌లిసి హోమిగోను మొద‌లుపెట్టారు. మే మొద‌టి వారంలో వారికి మొద‌టి ఇల్లు దొరికింది. మేం ఆఫ‌ర్ చేసే ఇల్లు గురించిన వివ‌రాల‌తో ఫేస్ బుక్ గ్రూపులో ఒక ప్ర‌క‌ట‌న ఇచ్చాం. మా పేరు లేకుండా ప్ర‌క‌ట‌న ఇచ్చిన‌ప్ప‌టికీ రెండు గంట‌ల్లోనే ఆ ఇంట్లో అద్దెకు దిగేసారు. అని త‌న తొలి ప్ర‌య‌త్నం గురించి చెప్పాడు నికుంజ్.

వెంట‌నే మ‌రికొన్ని ఇళ్ళ‌ను కూడా వెబ్ సైట్ లో పెట్టాల‌నుకున్నారు. అయితే, దీనికి సంబంధించిన టెక్నిక‌ల్ ప‌నులు చూడ‌డానికి మ‌రొక‌రు అవ‌స‌ర‌మయ్యారు. అప్పుడే వీళ్ళ బ్యాచ్ మేట్ ఆకాశ్ వ‌ర్మ కూడా జాయిన్ అయ్యారు. ఇప్పుడు వీరి వెబ్ సైట్ లో త‌మ ఇళ్ళ‌ను పెట్ట‌మంటూ మ‌రో నాలుగువంద‌ల మంది పంపిన రిక్వెస్టులు పెండింగ్ లో వున్నాయి. ఈ ఇళ్ళ‌న్నిటికీ హోమిగో హౌస్ అని పేరుపెట్టి, అందులో ప్లేట్లు, గిన్నెల‌తో స‌హా మొత్తం ఫ‌ర్నిచ‌ర్‌ను వీళ్ళే అమ‌ర్చుతున్నారు.

డిమాండ్ , స‌ప్ల‌యిల మ‌ధ్య వార‌ధి

మంచి ఇళ్ల కోసం వున్న డిమాండ్ కు, అద్దెకు ఇచ్చేందుకు సిద్ధంగా వున్న ఇళ్ల కు మ‌ధ్య గ్యాప్ ను పూడ్చ‌డానికే హోమిగోస్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని నికుంజ్ చెప్పారు. మ‌న దేశంలో ఈ ప‌ని ఇప్ప‌టి దాకా ఒక ప‌ద్ధ‌తిhలో సాగ‌డం లేద‌ని నికుంజ్ అభిప్రాయం.

మొత్తం మీద ఇటు ఓన‌ర్ల‌కు, అటు టెనెంట్ల‌కు లాభ‌దాయ‌క‌మైన ఒక వ్య‌వ‌స్థ‌ను త‌యారు చేయాల‌న్న‌దే వీరి ప్ర‌య‌త్నం. ఓన‌ర్ల‌కు సంబంధించినంత వ‌ర‌కూ టెనెంట్ల‌ను వెతుక్కోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు. ఇంటికి సంబంధించిన మంచి చెడ్డ‌లు చూడాల్సిన ప‌ని లేదు. హాయిగా త‌మ ఇంట్లో కూర్చుని నెల నెలా అద్దె వ‌సూలు చేసుకోవ‌డ‌మే..

ఇక టెనెంట్లకు కావ‌ల్సిన ఫుల్లీ ఫ‌ర్నిష‌డ్ ఇల్లు హోమిగోస్ వారికి వెతికి పెడుతుంది. ఇంటి్కి సంబంధించిన బిల్లుల‌న్నీ హోమిగోస్ క‌డుతుంది. సెక్యూరిటీ డిపాజిట్ కూడా చాలా త‌క్కువ‌. బ్రోక‌రేజి త‌క్కువ‌. ఇల్లు ఖాళీ చేసేట‌ప్పుడు, రిపేర్ల‌కి, పెయింటింగుల‌కి అని డ‌బ్బులు క‌ట్టాల్సిన ప‌ని లేదు. ఓన‌ర్లు, టెనెంట్ల‌తో వేర్వేరు అగ్రీమెంట్లు చేసుకుంటుంది... హోమిగోస్.

ఇళ్ళ‌ను ఎంపిక చేసుకోవ‌డంలో ఈ టీమ్ చాలా ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తుంది. జిమ్, స్విమింగ్ పూల్, క్ల‌బ్ హౌస్ లాంటి అన్ని స‌దుపాయాలు వుండే కాల‌నీల్లోనే ఇళ్ళ‌ను వెతుకుతారు. మామూలుగా బ్యాచిల‌ర్స్‌కి ఇల్లు ఇవ్వాలంటేనే భ‌య‌ప‌డే ఏరియాల్లో హోమిగోస్ ఇళ్లు వెతికి పెడుతుంది. మొత్తంగా చెప్పాలంటే, హోమిగోస్ ఒక కంపెనీ కాదు.. ఒక ప‌రిష్కారం.. ఇటు ఓన‌ర్ల‌కు, అటు టెనెంట్ల‌కు అనువైన ప‌రిష్కారం అని నికుంజ్ చెప్తారు.

రేప‌టి మార్కెట్

వ‌చ్చే ఏడాదిలోగా ప‌దివేల బెడ్స్ టార్గెట్ గా పెట్టుకుంది హోమిగోస్ టీమ్. బెంగ‌ళూరు, హైద‌రాబాద్, పూనే, చెన్నై న‌గ‌రాల్లో వ్యాపారాన్ని విస్త‌రించాల‌నుకుంటున్నారు. త్వ‌ర‌లోనే ఒక యాప్ కూడా త‌యారు చేయాలనే ప్లాన్‌లో వున్నారు. ఇప్ప‌టికే రెండు ల‌క్ష‌ల డాల‌ర్ల ఫండింగ్ వ‌చ్చింది. మెబెల్ కార్ట్ సిఇవో రాహుక్ అగ‌ర్వాల్ మ‌ద్ద‌తు కూడా దొరికింది.

2025 నాటికి ప్ర‌పంచంలో షేరింగ్ ఎకాన‌మీ 335 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుతుంద‌ని ఒక అంచ‌నా. AirBnB , స్టేజిల్లా లాంటి సంస్థ‌లు ఈ రంగంలో గ‌ట్టిగా కృషి చేస్తున్నాయి. 2013 నాటికి న‌ల‌భై ల‌క్ష‌ల మంది AirBnB సంస్థ అందించిన నివాసాల్లో వుంటున్నారు. ఇండియాలో మాత్రం ఈ రంగం ఇంకా మొగ్గ ద‌శ‌లోనే వుంది. భ‌ద్ర‌త‌, ముందు జాగ్ర‌త్త‌లు, రెగ్యులేష‌న్స్ లాంటి అనేక అంశాల్లో ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సి వుంది.

website