మీట్ మార్కెట్‌కు కార్పొరేట్ హంగులద్దిన 'లిసియస్'

మీట్ మార్కెట్‌కు కార్పొరేట్ హంగులద్దిన 'లిసియస్'

Monday November 02, 2015,

4 min Read

"నేను భారత్ రాగానే శాఖాహారిగా మారిపోయాను"అని అభయ్ హంజూరాతో అతని స్నేహితుడు ఓ సారి అన్నాడు. అయితే ఇండియాలో ఎంతో రుచికరమైన మాంసాహార వంటకాలు ఉంటాయని తెలుసుకున్న అభయ్‌కు అది నమ్మబుద్ధికాలేదు. ఈ విషయంలో లోతైన అధ్యయనం చేసిన తరువాత... మాంసం నాణ్యత విషయంలో ప్రజలకు పెద్దగా నమ్మకం ఉండదని అతని తెలుసుకున్నాడు.

image


అభయ్, అతని స్నేహితుడు వివేక్ గుప్తా ప్రారంభించిన లిసియస్ స్వచ్ఛమైన మాంసాన్ని డెలవరీ ఇస్తుంది. ఈ వెంచర్‌కు ముందు వివేక్ గతంలో హీలియన్ వెంచర్స్‌లో భాగమైన ఫండ్ పోర్ట్‌ఫోలియో కంపెనీల వ్యూహరచనలు, కార్యకలాపాలకు సంబంధించి విధులు నిర్వహించారు. అభయ్ ఫ్యూచరిస్క్ అనే రిస్క్ అడ్వైజరీ, కార్పొరేట్ బీమా బ్రోకరేజ్ కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు.

వీసీ సహా-వ్యవస్థాపకుడికి ప్రెజెంటేషన్

అప్పటికి తాము చేస్తున్న ఉద్యోగాలతో ఆనందంగా ఉన్నా... మాంసం ఉత్పత్తి రంగంలో ఓ కంపెనీని ప్రారంభించాలనే ఆలోచన అభయ్‌కు వచ్చింది. తాము అర్డర్ ఇచ్చిన గొర్రె మాంసం, చేపలు రుచి పచి లేకుండా ఉండటం అతని ఆలోచనకు మరింత ఊతమిచ్చింది.

అక్కడ ఉన్న స్టాఫ్‌తో మాట్లాడటాన్ని బట్టి అక్కడి వంటకాల్లో వినియోగిస్తున్న మాంసం నిల్వ చేసి ఉంచిందని అభయ్‌కు అర్థమైంది. ఇదే విషయాన్ని వివేక్‌కు పలుసార్లు అతను తెలిపాడు.

ఏదేమైనా, ఈ విషయంలో ఎంతో నమ్మకంగా ఉన్న అభయ్ దీనిపై గుర్గావ్, బెంగళూరులో సొంతంగా రీసెర్చ్ ప్రారంభించాడు. మాంసం కొనడానికి ముందు వినియోగదారులు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనే దానిపై అధ్యయనం చేశాడు. ఈ అంశంలో మార్కెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తీసుకుని ఓ రిపోర్ట్ తయారు చేసిన అభయ్... దానితో వివేక్‌ను అతని ఆఫీసులో కలిశాడు.

"నేను ఈ విషయంలో సీరియస్‌గా ఆలోచిస్తున్నానని వివేక్‌కు అప్పుడే అర్థమైంది. అంతేకాదు ఈ రంగంలో మంచి అవకాశం ఉందని, ఇక ఎదురుచూడటం మంచిది కాదు" అన్నాడు అభయ్. ఇదే విషయాన్ని ఇద్దరు తమ బాస్‌లు కన్వల్జిత్ సింగ్, ప్రవీణ్ దాస్‌లకు చెప్పినప్పుడు సీడ్ ఇన్వెస్టర్లుగా ఉండేందుకు వారు అంగీకరించారు.

ఫ్రెండ్ అపార్ట్‌మెంట్ నుంచి ఇందిరానగర్ వరకు...

మొదటగా ఓ ఫ్రెండ్‌కు చెందిన అపార్ట్‌మెంట్ లో ఈ స్నేహితులిద్దరూ కార్యాలయాన్ని ప్రారంభించారు. " ఈ రంగంలో లభ్యతకు కొదవలేదని గ్రహించి.. సమస్య ఏంటనే దానిపై దృష్టి పెట్టాం. వినియోగదారులు బ్రాండ్‌కు ఎక్కువగా ఆకర్షితులవుతారని తెలుసుకున్నాం. అలాంటి ఓ బ్రాండ్‌ను సృష్టించుకుని... దాని ద్వారా వారికి ఇచ్చే హామీలను నెరవేర్చాలని భావించాం" అని తెలిపారు అభయ్.

ఈ కారణంతో వారు మార్కెట్లోని బెస్ట్ బ్రాండ్ కన్సల్టెంట్స్‌తో కలిసి పని చేయాలని భావించారు. లిసియస్ అనే బ్రాండ్‌ను ఫిక్స్ చేయడానికి ముందు ఫ్రెస్కామీట్, చాప్ షాప్ 365, పాపాబుచర్, చాంప్ బాక్స్ వంటి 300 పేర్లను పరిశీలించారు. మిగతా వారితో పోటీ పడాలనే ఆలోచన కంటే క్వాలిటీతో కూడిన స్వచ్ఛమైన మాంసాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు.

వ్యాపారంలోని మౌలిక వసతులపై దృష్టి

ముఖ్యమైన టీమ్ సభ్యులను ఇందులో భాగస్వామ్యం చేయాలని.. ఈ ఇద్దరు స్నేహితులూ గుర్తించారు. ఈ రంగంలో ఎన్నో ఏళ్లుగా అనుభవం ఉన్నవారికి ఇందుకోసం తీసుకున్నారు. వారంతా మొదట మౌలిక వసతులు సమకూర్చుకోవడంపైనే పెట్టారని అభయ్ తెలిపారు.

"దేశంలో అతి పెద్ద హైపర్ మార్కెట్లకు సప్లయ్ చేసేందుకు వీలుగా మొత్తం బ్యాక్ ఎండ్ కార్యకలాపాలు విజయవంతంగా నడిపేందుకు మా టీంలో నిష్ణాతులు ఉన్నారు. దీన్ని బట్టే మాకు దీనిపై పూర్తి అవగాహనతో పాటు కోల్డ్ చైన్ మేనేజ్‌మెంట్ పై ఎంతో అవగాహన ఉంది "అని చెప్పొచ్చని అభయ్ వివరించారు.

లిసియస్‌లో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది. అక్కడే సరుకులను హెల్త్, సేఫ్టీ, ఎన్వైర్‌మెంట్... సహా పలు అంశాల వారీగా రివ్యూ చేసి... వారు అనుకున్న స్వచ్ఛమైన చైన్ మేనేజ్‌మెంట్ మార్గదర్శకాలకు తగ్గట్టుగా ఉందో లేదో చూస్తారు. ఆ తరువాత నిష్టాతులైన చెఫ్‌ల ఆధ్వర్యంలో మాంసం ఎలా ఉండాలనే దానిపై చర్చిస్తారు.

ఆ తరువాత దీన్ని తాత్కాలిక కోల్డ్ స్టోరేజ్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి బెంగళూరులోని వేర్వేరు డెలవరీ సెంటర్లకు పంపిస్తారు. వీటిని షిప్పింగ్ ఇచ్చే చివరి నిమిషయంలోనూ హబ్ మేనేజర్లు క్వాలిటీని చెక్ చేస్తారు.

మొత్తం ఫ్రెష్ చైన్ మేనేజ్‌మెంట్ ను అఖరి వరకు క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. ఎక్కడా ఆగకుండా, కోల్డ్ స్టోరేజీలో పెట్టని స్వచ్ఛమైన మాంసాన్ని వినియోగదారులకు అందించడమే ఈ టీమ్ ప్రధాని లక్ష్యం.

" మా సరుకు ఎంత ఫ్రెష్‌గా ఉంటాయనే దానిపై మీకో ఉదాహరణ చెప్పాలి. ఒక రోజు వల వేసి పట్టిన పీతలు అదే రోజు మాకు డెలివరీ వచ్చింది. కొచ్చి నుంచి వచ్చిన బెస్ సీర్ ఫిష్ కూడా 24 గంటల్లోపే మాకు చేరింది " అన్నారు అభయ్. బెంగళూరులోని మాంస ప్రియుల నమ్మకాన్ని లిసియస్ సంపాదించిందని అభయ్ చెప్పారు.

image


వ్యాపార విస్తరణ, నిధుల సమీకరణ

మారథళ్లి డెలివరీ హబ్ నుంచి కార్యకలపాలు మొదలుపెట్టిన ఒక్క నెలలోనే దాదాపు 1300 ఆర్డర్లను డెలవరీ ఇవ్వగలిగింది ఈ స్టార్టప్ కంపెనీ. "ఇది మా నమ్మకాన్ని పెంచడంతో కమలహల్లిలోని రెండో డెలివరీ సెంటర్లో కార్యకలాపాలు మొదలుపెట్టాం. మరోసారి కొద్దిపాటి పెట్టుబడిని సమీకరించాం. నెలలోపు మరో మూడు డెలివరీ హబ్‌లు ప్రారంభించడానికి ఈ నిధులను వినియోగిస్తాం" అన్నారు అభయ్.

దేశంలోని మాంసపు అమ్మకాల మార్కెట్ విలువు దాదాపు 1,95,00 కోట్లు (30 బిలియన్ డాలర్లు) కాగా, మాంసాన్ని ఎక్కువగా ఎగుమతి చేసే దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ రంగం ఎప్పటికప్పుడు విస్తరిస్తుండటంతో పాటు ప్రతీ యేడూ రెండంకెల వృద్ధిని సాధిస్తోంది. పౌల్ట్రీ వంటి రంగాల్లో ఏడాదికి 20 శాతం వృద్ధి కనిపిస్తోందని వీరి ప్రాథమికంగా పరిశీలనలో వెల్లడైంది.

"ఈ రంగంలో 90 శాతం వ్యాపారం అసంఘటిత మార్కెట్ ద్వారానే జరుగుతుండటంగా మిగిలిన మార్కెట్ వాటాను సంఘటిత కంపెనీలు సొంతం చేసుకోగలిగాయి. ఇక సంఘటిత కంపెనీలు ఎక్కువగా నిల్వ చేసిన మాంసాన్ని వ్యాపారం చేయడం, ఎక్కువగా ఎగుమతలపై దృష్టి పెడుతున్నాయి" అని తెలిపారు అభయ్.

మార్కెట్ పరిస్థితులను అవగాహన పెంచుకోవడం

ముఖ్యంగా పట్టణంలో ఉన్న వినియోగదారులు తాము కోనుగోలు చేస్తున్న మాంసం ఎక్కడి నుంచి వస్తుందనే విషయంలో ఇతరులను నమ్ముతుంటారు. కొందరైతే... వారి జీవన విధానం, సమయానికి తగినట్టుగా నిల్వ ఉందని మాంసాన్ని బలవంతంగా తినడం అలవాటు చేసుకున్నారని అభయ్ తెలిపారు.

నమ్మకమనే ఒకే ఒక్క అంశంతోనే పరిశుభ్రత, పౌష్టిక విలువులు సహా అనేక అంశాలు ముడిపడి ఉండటం నిజంగా ఆందోళన కలిగించే విషయం. "రాబోయే కాలంలో ఈ అంశంలో పూర్తి పారదర్శకతను పాటించే విషయంపై దృష్టి పెట్టాం. ఇందుకోసం ఓ మంచి బృందాన్ని నియమించి కస్టమర్ బిజినెస్ నమూనాలతో పాటు వాటి ప్రాముఖ్యత గురించి విశ్లేషించబోతున్నాం" అని అభమ్ స్పష్టం చేశారు

తదుపరి వర్షన్ అధునాతన కన్సూమర్ పరిజ్ఞానాన్ని ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకుంది లిసియస్. పలు కొత్త కేటగిరిలను జత చేయడంతో పాటు భోజన ప్రియుల కోసం కొత్త సెగ్మెంట్లను కలపాలని భావిస్తోంది. "ఇప్పటి నుంచి రాబోయే మూడేళ్ల లోపు 11 నగరాల్లో నెట్ వర్క్ ను విస్తరించడంతో పాటు లిసియస్ ను దేశంలోని ఇష్టమైన ఆహార బ్రాండ్ గా చేయాలనుకుంటున్నాం" అన్నాడు అభయ్.