భారతీయ సంపన్న మహిళలు!

15th Apr 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

వేగంగా అభివృద్ధి చెందుతున్న‌ దేశాల్లో భార‌త్ ఒక‌టి. పారిశ్రామికంగా కూడా ఇప్పుడిప్పుడే ప్ర‌పంచ‌స్థాయిలో పేరొందింది. ఎంద‌రో కొత్త బిజినెస్‌మెన్‌లు ఫోర్స్బ్ జాబితాలో చోటు సంపాదిస్తూ కార్పొరేట్ ఇండియా స‌త్తా చూపిస్తున్నారు. మ‌రి ఈ జాబితాలో అటు పురుషుల‌తో పాటు మ‌హిళ‌లు సైతం తామేమి తీసి పోలేదంటూ దూసుకొస్తున్నారు. తాజాగా ఫోర్బ్స్ మ‌హిళా పారిశ్రామిక వేత్త‌ల టాప్ 50 ఆసియా జాబితాలో నీతా అంబానీ, అరుంధ‌తీ భ‌ట్టాచార్య‌ టాప్ ప్లేసులో పేర్లు ద‌క్కించుకున్నారు. ఫోర్బ్స్ ఏషియా ఏప్రిల్ తాజా ఇష్యూలో వీరి పేర్లు వ‌చ్చాయి.

వీరితో పాటు మ‌రో ఆరుగురు భారతీయ మ‌హిళ‌లు ఈ లిస్ట్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ లిస్ట్ టాప్ మొద‌టి స్థానం ద‌క్కించుకున్న నీతా అంబానీ రిల‌య‌న్స్ ఇండస్ట్రీస్ బోర్డ్ డైర‌క్ట‌ర్‌గా ఉన్నారు. రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ చైర్ ప‌ర్స‌న్‌ కూడా. అలాగే రెండో స్థానంలో నిలిచిన అరుంధ‌తి భ‌ట్టాచార్య.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మ‌న్, మేనేజింగ్ డైర‌క్ట‌ర్ గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.

ఇక టాప్ 50 లో చోటు సంపాదించుకున్నభార‌తీయ మ‌హిళ‌ల్లో అంబిగ ధీర‌జ్, 14వ‌ స్థానం( సీఈవో, ఎంయూ సిగ్మా), దీపాలి గోయంకా, సీఈవో వెల్స్‌ప‌న్ ఇండియా (16వ స్థానం); వినితా గుప్తా , సీఈవో లుపిన్ (18 వ స్థానం); చందా కొచ్చార్, ఎండీ, సీఈఓ ఐసీఐసీఐ బ్యాంక్ (22వ స్థానం); వంద‌నా లుథ‌ర్, వీఎల్‌సీసీ ఫౌండ‌ర్ (26వ స్థానం); కిర‌ణ్ మ‌జుందార్ షా, ఫౌండ‌ర్ ఛైర్మ‌న్ బ‌యోకాన్ (28వ స్థానం)

image


నీతా అంబానీ..!

నీతా మొట్ట‌మొద‌టి సారిగా ఫోర్బ్స్ లిస్టులో స్థానం ద‌క్కించుకుంది. ఆమె గ‌తంలో బిజినెస్ టుడే, ఇండియా టుడే, ఫిక్కీల‌కు చెందిన ప‌లు ప్ర‌తిష్టాత్మ‌క మ్యాగ‌జైన్లలో టాప్ ప్లేస్‌ల‌లో నిలిచింది. నీతా కేవ‌లం ఒక ప్రొఫెష‌న‌ల్ బిజినెస్ ఉమెన్ గా మాత్ర‌మే కాకుండా.. ఐపీఎల్ ముంబై ఫ్రాంచైజీ ఓన‌ర్‌గా కూడా ఉన్నారు. అలాగే ప‌లు సేవా కార్య‌క్ర‌మాల్లో సైతం నీతా భాగ‌స్వామిగా ఉన్నారు. నీతా రిటైల్ మార్కెటింగ్ నుంచి రిల‌యెన్స్ జియో వ‌ర‌కు తన మార్కు బిజినెస్ చేస్తున్నారు. మ‌హిళ‌లు కేవ‌లం తెర‌వెనుకే కాదు వేదిక‌పై కూడా రాణిస్తారు అనేందుకు నీతా ఒక మంచి ఉదాహ‌ర‌ణ‌.

అరుంధ‌తీ భ‌ట్టాచార్య‌..!

దేశంలోనే అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా. అలాంటి బ్యాంకుకు చైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరక్ట‌ర్ గా పనిచేయ‌డం అనేది సామాన్య‌మైన విష‌యం కాదు. కానీ అరుంధ‌తీ భ‌ట్టాచార్య ఆ ప‌దవిని ఒక చాలెంజ్ గా తీసుకున్నారు. ఒక‌వైపు రుణాల ఎగ‌వేత‌దారులు, మ‌రోవైపు స‌వాళ్లు. వీట‌న్నింటి మ‌ధ్య ఎస్‌బీఐ గ‌త త్రైమాసికంలో 60 శాతం వృద్ది రేటును సాధించింది.

చందా కొచ్చ‌ర్ ఫోర్బ్స్ జాబితాలో గ‌త ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది మూడు స్థానాలు దిగ‌జారి 19వ ర్యాంకు వ‌చ్చిచేరింది. ఇక కిర‌ణ్ మజుందార్ షా సైతం టాప్ 20 లోకి వ‌చ్చి చేరింది. కానీ గ‌తంలో క‌న్నా 8 స్థానాలు దిగ‌జారింది.

అంబిగా ధీర‌జ్‌..!

మ్యూసిగ్మా కంపెనీ సీఈవో బాధ్య‌త‌లు చేప‌ట్టిన అంబిగా ధీర‌జ్.. ఏడాదైన గ‌డ‌వ‌క ముందే ఫోర్బ్స్ లిస్ట్ లో చోటు సంపాదించారు. కంపెనీ చైర్మ‌న్‌గా ఉన్న ధీర‌జ్ కుమార్.. అమెరికాలో త‌న కార్య‌క‌లాపాల‌ను విస్త‌రించేందుకు అక్క‌డికి వెళ్లిపోగా, అంబిగా బెంగుళూరులో స్థిర‌ప‌డిన కంపెనీ కార్య‌క‌లాపాలను చూసుకుంటోంది. ఒక బిలియ‌న్ డాల‌ర్ టెక్నాల‌జీ కంపెనీకి సీఈవో బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం అంటే ఆషామాషీ కాదు. టెక్నాల‌జీ స‌ర్వీసెస్ మార్కెట్ లో దిగ్గ‌జాలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్, విప్రోల‌ పోటీని త‌ట్టుకుంటూ, నాలుగు వేల మంది ఉద్యోగుల‌తో మ్యూసిగ్మా కంపెనీ దూసుకెళుతోంది. అంతేకాదు ఫార్చ్యున్ 500 కంపెనీల్లో సుమారు 140 కంపెనీల‌కు మ్యూసిగ్మా సేవ‌ల‌ను అందిస్తోంది. ఇదంతా అంబిగా ధీర‌జ్ స‌మ‌ర్థ‌త వ‌ల్లే సాధ్యం అయ్యింద‌ని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

దీపాలి గోయెంకా..!

వెల్ స్పాన్ కంపెనీ సీఈవోగా దీపాలి గోయెంకా ఫోర్బ్స్ జాబితాలో 16వ స్థానంలో చోటు ద‌క్కించుకుంది. ఆసియాలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ కంపెనీ వెల్ స్ప‌న్ పేరొందింది. సుమారు 3.5 బిలియ‌న్ డాల‌ర్ల కంపెనీగా ఖ్యాతి గ‌డించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్కెట్ క‌లిగిన వెల్‌స్పాన్ సీఈవోగా దీపాలీ త‌న మేనేజ్ మెంట్ స్కిల్స్‌తో అద్భుతంగా రాణిస్తున్నారు.

వినితా గుప్తా..!

ఇండియాలో మూడో అతిపెద్ద ఫార్మా కంపెనీ లుపెన్ కు సీఈఓ గా వినితా గుప్తా ఫోర్బ్స్ మ్యాగ‌జైన్ లో 18వ స్థానం సంపాదించారు. ఏటా 1.7 బిలియ‌న్ డాల‌ర్ల రెవెన్యూ సాధిస్తూ లుపెన్ దూసుకెళుతోంది. పాతికేళ్ల వ‌య‌స్సులోనే కంపెనీలో ప్ర‌వేశించిన వినితా, కంపెనీకి చెందిన అమెరికా ఆప‌రేష‌న్స్ లో స‌త్తా చాటారు. కంపెనీ వ్యాపారాన్ని అంత‌ర్జాతీయంగా ముందుకు తీసుకెళ్లారు.

వంద‌న లుథ్రా..!

వీఎల్‌సీసీ వెల్‌నెస్ సెంట‌ర్ ఫౌండ‌ర్ గా ముందుకు వ‌చ్చిన వంద‌న.. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం 131 మిలియ‌న్ డాల‌ర్ల లాభాన్ని సాధించారు. దేశ‌వ్యాప్తంగా 70 బ్రాంచీల‌తో వీఎల్‌సీసీ విస్త‌రించింది. ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో ఆమె 26 వ స్థానాన్ని దక్కించుకున్నారు. 

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India