కర్బన ఉద్గారాలపై యుద్ధం ప్రకటించిన యువకుడు

కాలుష్యం తగ్గిస్తూ లాభాలు గడిస్తున్న స్టార్టప్

కర్బన ఉద్గారాలపై యుద్ధం ప్రకటించిన యువకుడు

Friday October 14, 2016,

4 min Read


విశ్వమానవాళికి టెర్రరిజం పెద్ద సవాల్ గా మారింది. దాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి ప్రపంచ దేశాలన్ని ఏకమవుతున్నాయి. బద్ధ శత్రువులుగా ఉన్న దేశాలు సైతం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాయి.

కానీ టెర్రరిజం కంటే ప్రపంచానికి పెనుముప్పుగా మారిన అంశం మరొకటి ఉంది. అవే కర్బన ఉద్గారాలు. గ్రీన్ హౌస్ గ్యాసెస్.

గత ఏడాది పారిస్ లో భూతాప సదస్సు జరిగింది. దాదాపు ప్రపంచ దేశాలన్నీ పాల్గొన్నాయి. కర్బన ఉద్గారాలను, భూతాపాన్ని తగ్గించకపోతే మొత్తం మానవాళికే ముప్పు ఏర్పడుతుందని అందరూ ముక్తకంఠంతో అంగీకరించారు. వాటిని తగ్గించేందుకు ఒప్పందం కూడా చేసుకున్నారు. 

లెక్కల ప్రకారం చూస్తే కర్బన ఉద్గారాల విడుదలలో భారత్ టాప్ త్రీ పొజిషన్ లో ఉంది. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం కర్బన ఉద్గారాల విడుదలను చాలా వరకు తగ్గించాల్సి ఉంది. 2014లో ప్లానింగ్ కమిషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం 2030 కల్లా భారత్ 42 శాతం గ్రీన్ హౌజ్ గ్యాస్ విడుదల తగ్గించాల్సి ఉంటుంది. ఇందుకోసం 834 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని ప్లానింగ్ కమిషన్ అంచనా వేసింది. వాస్తవానికి భారత్ లో ఒక్క శాతం ఉన్న అత్యంత ధనవంతులే ఎక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నారు. 823 మిలియన్ల పేద ప్రజలు సున్నా శాతం కూడా ఈ పాపం చేయడం లేదు. కానీ లెక్కలు మాత్రం అందరినీ ఒకే గాటన కట్టేస్తున్నాయి.

వివేక్ గిలానీ... గ్రీన్ క్రూసేడర్

ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచానికే పెనుముప్పుగా మారిన సమస్యపై ముందుగా యుద్ధం ప్రారంభించాడు వివేక్ గిలాని. no2CO2 (నో టు సీవోటు ) cBalance ( సీబ్యాలెన్స్ ) అనే రెండు స్టార్టప్ లు ఈ లక్ష్యంతోనే ప్రారంభించాడు. ఇందులో "నో టు సీవోటు" స్టార్టప్ లాభాపేక్ష లేనిది. ప్రజల్లో ముఖ్యంగా వ్యక్తిగత స్థాయిలో కర్బన ఉద్గారాల విడుదలపై అవగాహన పెంచుతుంది. రెండోది సీ బ్యాలెన్స్. కంపెనీలు విడుదల చేసే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ను తగ్గించడానికి అవసరమైన సలహాలు, టెక్నాలజీని అందిస్తూ లాభాల బాటలో పయనిస్తోంది. నిజానికి వివేక్ కు టీనేజీ నుంచే పర్యావరణంపై కాన్షియస్ ఉంది. అందుకే పదహారేళ్ల వయసులో "అసోసియేషన్ ఆఫ్ యూత్ ఫర్ బెటర్ ఇండియా" అనే సంస్థలో చేరి.. వేస్ట్ మేనేజ్ మెంట్ పై అవగాహన పెంచుకున్నాడు. అప్పుడే ఓ అపార్ట్ మెంట్ లో ఉన్న ప్లాట్ల యజమానులందర్నీ ఒప్పించి వ్యర్థ పదార్థాలను రీసైకిల్ చేసేలా ఒప్పించగలిగాడు.

తర్వాత మసాచుసెట్స్ యూనివర్శిటీలో ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ చేశాడు. ఆ తర్వాత కర్బన ఉద్గారాలను తగ్గించడానికి సలహాలు అందించే సంస్థల్లో ఉద్యోగాలు చేశాడు. భారత్ లో భీకరంగా పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలను తగ్గించాలనే లక్ష్యంతో- 2009లో భారత్ తిరిగి వచ్చాడు. ఈ విషయంలో వ్యక్తులు, కాలేజీలు, సంస్థలు ప్రైవేటు, పబ్లిక్ సంస్థలు, ప్రభుత్వం ఇలా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని వివేక్ గట్టిగా నమ్ముతాడు. అందుకే రెండు సంస్థలను ప్రారంభించాడు.

వివేక్ గిలాని, no2co2, cBalance ఫౌండర్ <br>

వివేక్ గిలాని, no2co2, cBalance ఫౌండర్


"నో టు సీవోటు" ఓ సచ్ఛంద సంస్థ లాంటి స్టార్టప్

no2CO2 సంస్థ లాభాపేక్షలేనిది. ఈ సంస్థ వ్యక్తుల్లో అవగాహన పెంచి వారి వైపు నుంచి ఎలాంటి కర్బన ఉద్గారాలు విడుదల లేకుండా చేయలనేది ఈ సంస్థ సంకల్పం. ఇందుకోసం ఆన్ లైన్లో "సి.పుట్ ప్రింట్ కాలిక్యులేటర్" పేరుతో ఒక టూల్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీన్ని ఉపయోగించుకుని ఎవరైనా.. తను విడుదల చేస్తున్న కర్బన్ ఫుట్ ప్రింట్స్ వాల్యూని తెలుసుకోవచ్చు. విద్యుత్, ఎయిర్ ట్రావెల్, ఫుడ్, వాటర్ వినియోగం, వాహన ఉపయోగం లాంటివి ఇందులో ఎంటర్ చేస్తే... తన వల్ల ఉత్పత్తువుతున్న కర్బన ఉద్గారాలు ఎంత పరిమాణమో తెలిసిపోతాయి. దీన్ని వ్యక్తిగత స్థాయిలో తగ్గించడానికి అవసరమైన సలహాలను కూడా నోటుసీవోటు అందిస్తుంది. ఇలా ప్రజలను సొంతంగా అవగాహన పెంచుకునేలా చేస్తే కొత్త పరిష్కారాలు కూడా వస్తాయని వివేక్ నమ్ముతున్నారు. మూడు మూడు స్టెప్పుల్లో వివేక్ దీనికి పరిష్కారం చూపిస్తున్నారు. 

1. రియలైజ్

2. మినిమైజ్ 

3. న్యూట్రలైజ్

no2co2.in స్క్రీన్ షాట్ <br>

no2co2.in స్క్రీన్ షాట్


"ఆఫీసులు, రెస్టరెంట్లు, సినిమా హాళ్లలో చాలా తక్కువ టెంపరేచర్స్ ఉన్నప్పుడు కూడా ఏసీలు వినియోగిస్తూంటారు. వాస్తవంగా మన శరీరాలు 24 డిగ్రీల వరకు కంఫర్టబుల్ గా ఉంటాయి. కాఫీ షాపులు ఏసీల్లో 24 టెంపరేచర్ ఉంచేందుకు అంగీకరిస్తే ఏడాదికి రూ.పదివేలు ఆదా అవుతాయి. దానితో పాటు 0.29 శాతం co2ని తగ్గించగలుగుతాం" వివేక్ 

విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో జర్మనీలోని SAP ప్రధాన డాటా సెంటర్ లో ఏసీల టెంపరేచర్ ని 14 డిగ్రీల నుంచి 15 డిగ్రీలకు పెంచడానికి యాజమాన్యాన్ని, ఉద్యోగులను ఒప్పించిన విషయాన్ని వివేక్ గుర్తు చేసుకుంటారు. ఇలా ఒక్క ఆఫీసులో చేయడం వల్ల భారీగా విద్యుత్ ఆదా అవుతుంది. ఇలా మిగిలే విద్యుత్ భారత్ లాంటి దేశాల్లో వెయ్యికిపైగా కుటుంబాలు నెల అంతా వాడే కరెంటుతో సమానమంటారు వివేక్.

భారీ పరిశ్రమల కోసం "సీ బ్యాలెన్స్"

వ్యక్తిగతంగా అవగాహన పెంచడం సామాజిక బాధ్యతగా భావించిన వివేక్.. వ్యాపార పరంగా భారీ కంపెనీలకు సేవలు అందించేందుకు సీబ్యాలెన్స్ పేరుతో సంస్థను ప్రారంభించారు. పెద్ద పెద్ద సంస్థలు విడుదల చేస్తున్న కర్బన ఉద్గారాలను లెక్కించడంతో పాటు, వాటిని తగ్గించడానికి అవసరమైన సలహాలు, టెక్నాలజీ కిటుకులను సీబ్యాలెన్స్ అందిస్తుంది. సీబ్యాలెన్స్ సంస్థ నుంచి సేవలు పొందుతున్న సంస్థల జాబితాలో పెద్ద సంఖ్యలో ఎమ్మెన్సీలున్నాయి. గిట్స్, లెమన్ ట్రీ హోటల్స్, ఐసిఐసిఐ బ్యాంక్, షిండ్లర్ ఎలక్ట్రిక్, విప్రో లాంటి సంస్థలకు సిబ్యాలెన్స్ సేవలు అందిస్తోంది. యాభై ఏళ్ల చరిత్ర ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ గిట్స్ కు 2014లో వివేక్ బృందం వినూత్న ప్రక్రియను అందించింది. ఎక్కడతే కార్బన్ వాయువులను తగ్గించడానికి అవకాశం ఉంటుందో అలాంటి హాట్ స్పాట్ లను గుర్తించి పెట్టింది. ఇలాంటి హాట్ స్పాట్ ల వల్ల వెలువడుతున్న కాలుష్య వాయువులను 63శాతం గిట్స్ తగ్గించుకో గలిగింది. గిట్స్ పరిశ్రమల్లో ఇలాంటి హాట్ స్పాట్స్ మరిన్ని గుర్తించడం వల్ల ఆ కంపెనీ ఏడాదికి రెండు వేల టన్నుల కార్బన్ డైయాక్సైడ్ విడుదలను డిక్రీస్ చేసుకోగలిగింది.

భావితరాలకు చైతన్యం...

వ్యక్తులకు, సంస్థలకు ఎంత సహాయ సహకారాలు అందించినా.. కొత్తతరం ఎలా అందిపుచ్చుకుంటుందనే సందేహం వివేక్ కి వచ్చింది. అందుకే వారికి ఈ విష వాయువులపై అవగాహన పెంచింతే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చాడు. దాని ఫలితమే "అకడిమిక్ కరికులా ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్". దీని లక్ష్యం.. వచ్చే జనరేషన్ కు అవగాహన పెంచడం. ఆర్కిటెక్టులు, ఇంజినీర్లు, బిల్డింగ్ కన్సల్ టెంట్లు, ఎనర్జీ మోడలర్స్ లాంటి వారికి గ్రీన్ బిల్డింగ్స్ పై అవగాహన పెంచేందుకు వివేక్ దీన్ని ప్రారంభించారు. డిజైన్ ప్రిన్సిపల్స్, వాటికవే చల్లగా ఉంచుకునే నిర్మాణాలు, ఎనర్జీ ఎఫిషియంట్ కన్ స్ట్రక్షన్స్ పై మూడు నుంచి ఐదు రోజుల పాటు వర్క్ షాపులు నిర్వహిస్తూంటారు. ఇప్పటికే రెండు వందల మంది భావి ప్రొఫెషనల్స్ కు ముంబై, ఢిల్లీ, పుణెలాంటి నగరాల్లో వర్క్ షాపులను నిర్వహించారు.

కర్బన ఉద్గారాల వల్ల ముంచుకొస్తున్న ముప్పు గురించి ఇటీవలి కాలంలో వ్యక్తులు, సంస్థల్లో అవగాహన పెరుగుతోంది. నిజానికి కర్బన ఉద్గారాలను కచ్చితంగా తగ్గించాలనే చట్టాలు ఇంకా దేశంలో పూర్తి స్థాయిలో రాలేదు. అయితే ప్రభుత్వం ఇలా ప్రయత్నించేవారికి కొన్ని ప్రొత్సాహకాలు మాత్రం ప్రకటించింది. వేల మైళ్ల దూరమైన ఒక్క అడుగుతో ప్రారంభమవుతుంన్నట్లు ఓ వ్యక్తిగా తను చిన్న స్థాయిలో ప్రయత్నం ప్రారంభించినా... విప్లవంగా మారుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు.

వెబ్ సైట్: