మామూలు విలేజ్ కుర్రాడు 28 కోట్ల టర్నోవర్‌ సాధించాడు..!!

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో కోచింగ్‌ క్లాసులు అందిస్తున్న కెరీర్‌ పవర్‌..బ్యాంకింగ్‌, ఎస్సెస్సీ ఎగ్జామ్స్‌కు ఈజీ ప్రిపరేషన్‌..

9th Feb 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

తలరాతను తిట్టుకుంటూ కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావు. మన రాతను మనమే రాసుకోవాలి. మన భవిష్యత్తుకు మనమే బాటలు వేసుకోవాలి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని దానకౌర్‌ అనే మారుమూల గ్రామంలోని రైతు కుటుంబంలో పుట్టిన అనిల్‌ నగర్‌ నమ్మిన మాటలివి. బాల్యం నుంచే ఎంతో మెచ్యురిటీతో ఆలోచించే అనిల్‌ IIT - JEE ఎగ్జామ్‌కు ప్రిపేర్‌ అవ్వాలనుకున్నాడు. కోచింగ్‌ సెంటర్‌లో చేరి రాత్రిపగలు అన్న తేడా లేకుండా కష్టపడ్డాడు. శ్రమకు ఫలితం దక్కింది. 1998లో ఐఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మంచి ర్యాంక్ సాధించి IIT భువనేశ్వర్‌లో చేరాడు. ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్‌ లో బీటెక్‌ కంప్లీట్‌ చేశాడు.

జేపీ గ్రూప్‌, లిక్విడ్‌ (ఆన్‌లైన్‌ ఎడ్యేకేషన్), ITM యూనివర్సిటీ, కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ లాంటి కార్పొరేట్‌ కంపెనీల్లో పనిచేసిన అనిల్‌ ఏదో సాధించాలన్న తపనతో 2010లో ఉద్యోగానికి గుడ్‌ బై చెప్పాడు. తన స్నేహితుడైన సౌరభ్‌ బన్సల్‌తో కలిసి కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌కు ప్రిపేరయ్యే స్టూడెంట్స్‌కు ట్రైనింగ్‌ ఇచ్చే కెరీర్‌ పవర్‌ అనే స్టార్టప్‌ను ప్రారంభించారు. ఇందుకోసం వారిద్దరూ పెట్టిన పెట్టుబడి కేవలం లక్ష రూపాయలే.

image


దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు, ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌కు ప్రిపేరయ్యే స్టూడెంట్స్‌కు ట్రైనింగ్‌ ఇవ్వడమే కెరీర్‌ పవర్‌ లక్ష్యం. ప్రస్తుతం ఈ స్టార్టప్‌ 70కిపైగా క్లాస్‌ రూం ట్రైనింగ్‌ సెంటర్లు నడుపుతోంది. sscadda.com, bankersadda.com వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్న దేశంలోని మొట్టమొదటి సంస్థ అని గర్వంగా చెప్పుకుంటోంది.

“బ్యాంకింగ్‌ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుల్లో చాలా మంది bankersadda.comను ఆశ్రయిస్తున్నారు. ఈ సైట్‌లోని స్టడీ మెటీరియల్‌ను రోజుకు సగటున 10లక్షల మంది వీక్షిస్తున్నారు. గతేడాది sscadda.com 20లక్షల మందికి ఉపయోగపడింది.”- అనిల్‌

బీటెక్‌ అనంతరం అనిల్‌ గోవా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి ఎంబీఏ కంప్లీట్‌ చేశాడు. కెరీర్‌ పవర్‌ కో ఫౌండర్‌ అయిన 32ఏళ్ల సౌరభ్‌ ఢిల్లీలోని కాలేజ్‌ ఆఫ్‌ బిజినెస్‌ స్టడీస్‌ నుంచి ఫైనాన్స్‌లో డిగ్రీ, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఫైనాన్స్‌ లో మాస్టర్స్‌ కంప్లీట్‌ చేశారు. కిప్కో గ్రూప్‌, ICRA, యస్‌ బ్యాంకుల్లో పదేళ్ల పాటు పనిచేసిన అనుభవం సౌరభ్‌కు ఉంది.

ఫ్లాష్‌బ్యాక్‌

కెరీర్‌ పవర్‌ ను తొలుత క్లాస్‌ రూం బేస్డ్‌ కోచింగ్‌ సెంటర్‌గా ప్రారంభించారు. ఫస్ట్ బ్యాచ్‌లోని 32 మంది స్టూడెంట్స్‌ లో 26మంది మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సంపాదించడం గర్వంగా ఉందంటారు అనిల్‌. మొదటి ప్రయత్నం సక్సెస్‌ అయినా బిజినెస్‌ ఎక్స్‌పాన్షన్‌కు అవసరమైన ఫండ్స్‌ లేకపోవడంతో ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే సమయంలో డబ్బు విలువ కూడా వారికి తెలిసొచ్చింది.

“కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌లో స్టూడెంట్స్‌ తమ ప్రతిభను కనబరచే విధంగా కోచింగ్‌ ఇస్తున్నాం. రెగ్యులర్‌ అసైన్‌మెంట్లు, టెస్ట్‌లు, క్విజ్ ప్రోగ్రాంలు ఎగ్జామ్‌ ప్రిపరేషన్‌లో స్టూడెంట్స్‌కు ఎంతో ఉపయోగపడతాయి.” – సౌరభ్‌. కెరీర్‌ పవర్‌ కో ఫౌండర్‌

కెరీర్‌ పవర్‌లో ప్రస్తుతం 700మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వారిలో 300మంది టీచర్లున్నారు.

ఈ స్టోరీ కూడా చదవండి

image


కోర్సులు

కెరీర్‌ పవర్‌ ప్రస్తుతానికి బ్యాంకింగ్‌ ఎగ్జామ్స్‌, ఎస్‌ఎస్‌సీ ఎగ్జామ్స్‌ పైనే దృష్టిపెట్టింది. ఈ వెబ్‌సైట్లు నిర్వహించే ఆన్‌లైన్‌ టెస్టులు బ్యాంక్స్‌, ఎస్‌ఎస్‌సీ ఎగ్జామ్స్‌కు ప్రిపేరయ్యే స్టూడెంట్స్‌ సెల్ఫ్‌ అసెస్‌ మెంట్‌తో పాటు డీటెయిల్డ్‌ అనాలసిస్‌కు ఉపయోగపడతాయి. సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్, ట్రాన్స్ లేటర్స్, టైపిస్టులతో కూడిన కంటెంట్‌ టీం మారుతున్న పరీక్షా విధానాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కంటెంట్‌ను అప్‌డేట్‌ చేయడంతో పాటు బుక్స్‌, మాక్‌ టెస్ట్స్‌, అసైన్‌మెంట్స్‌ ప్రిపేర్‌ చేస్తుంది.

bankersadda.com క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌, వకాబులరీ, కంప్యూటర్‌, మార్కెటింగ్, బ్యాంకింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ తదితర అంశాలకు సంబంధించి స్టడీ మెటీరియల్స్‌ అందిస్తుంది. ఇక sscadda.comలో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ స్టడీస్, జనరల్‌ ఇంటలిజెన్స్, రైల్వే నోట్స్‌ లకు సంబంధించి మెటీరియల్‌ అందిస్తున్నారు. కెరీర్‌ పవర్‌ రెగ్యులర్‌ క్లాస్ రూం కోర్సులకు 10వేల రూపాయల ఫీజు వసూలుచేస్తోంది.

రెండు మూడేళ్లలో సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటి టెస్ట్‌(సీటెట్‌), రైల్వేస్‌, నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, సీడీఎస్‌ తదితర పరీక్షలకు అవసరమైన మెటీరియల్‌ అందుబాటులోకి తీసుకురావాలని కేరీర్‌ పవర్‌ భావిస్తోంది.

“సాధారణంగా ఆఫ్‌లైన్‌ క్లాస్‌ రూం కోచింగ్‌లలో ప్రాఫిట్‌ మార్జిన్‌ 25-26శాతం ఉంటుంది. అదే ఆన్‌లైన్ బిజినెస్‌లో ఇది 50శాతం కన్నా ఎక్కువ ఉంటుంది.” -అనిల్‌

పెరుగుతున్న ఆదరణ

2015 ఆర్థిక సంవత్సరంలో కెరీర్‌ పవర్‌ దాదాపు 28 వేల మంది స్టూడెంట్స్‌కు ట్రైనింగ్‌ ఇచ్చింది. అందులో 16వేల మంది క్లాస్‌ రూం పోగ్రాంకు హాజరుకాగా.. 12వేల మంది ఆన్‌లైన్ విధానంలో ప్రిపేర్‌ అయ్యారు. 2016 ఆర్థిక సంవత్సరంతో 50వేల మంది క్లాస్‌ రూం, 50 వేల మంది ఆన్‌లైన్‌ స్టూడెంట్స్‌తో కలుపుకుని మొత్తం లక్ష మందికి కోచింగ్‌ ఇవ్వాలని కేరీర్‌ పవర్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇటీవల జరిగిన కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌లో కెరీర్‌ పవర్‌లో కోచింగ్‌ తీసుకున్న దాదాపు 12వందల మంది స్టూడెంట్స్‌ IBPS PO, IBPS క్లర్క్ ఉద్యోగాలు సాధించారు. వెయ్యి మందికిపైగా విద్యార్థులు 2015లో నిర్వహించిన SBI POకు ఎన్నికయ్యారు. భవిష్యత్తులో మరో 30 బ్రాంచిలను ఏర్పాటు చేసి 60వేల మంది స్టూడెంట్స్ కు క్లాస్‌ రూం కోచింగ్‌ ఇవ్వాలని కెరీర్‌ పవర్‌ భావిస్తోంది.

ప్రస్తుతం కెరీర్‌ పవర్‌కు ఢిల్లీ, లక్నో, కాన్పూర్‌, పాట్నా, రాంచీ, కోల్‌కతా, భోపాల్‌, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌తో పాటు మరికొన్ని నగరాల్లో బ్రాంచీలున్నాయి. ప్రస్తుతం దేశంలోని పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టిన ఈ స్టార్టప్‌ 2016లో బెంగళూరు, చెన్నై, పూనే, ముంబై, నాగ్‌పూర్‌, తిరుచ్చి, వైజాగ్ తో పాటు మరికొన్ని నగరాల్లో30కి పైగా బ్రాంచులు ఏర్పాటు చేసేందుకు ప్లాన్‌ రెడీ చేసింది.

యువర్‌ స్టోరీ టేక్‌

గత రెండేళ్లుగా ఆన్‌లైన్‌ టెస్ట్‌ ప్రిపరేషన్‌ మార్కెట్‌ కు ఆదరణ పెరుగుతోంది. స్మార్ట్‌ ఫోన్ల వినియోగం పెరుగుతుండటంతో ఇలాంటి సేవలందించే స్టార్టప్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఫలితంగా కెరీర్‌ లాంఛర్‌, టైం తదితర బడా కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ కూడా ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌ వైపు మొగ్గుచూపుతున్నాయి. కోర్స్‌ఎరా, ఉడెమి, ఉడాసిటీ, ఖాన్ అకాడమీ లాంటి సంస్థలు సంప్రదాయ పద్దతులను ఎప్పుడో వదిలిపెట్టాయి. టాపర్‌, ఎంబైబ్‌, ఆన్‌లైన్‌తయారీ, ఎంట్రెన్స్ ప్రైమ్‌, క్రాక్‌యు, క్రంచ్ ప్రెప్ GRE లాంటి స్టార్టప్‌లు కూడా ఇలాంటి సేవలే అందిస్తున్నాయి.

ఆన్‌లైన్‌ టెస్ట్‌ ప్రిపరేషన్‌ ఇండస్ట్రీ వాల్యూ భారత్‌లో 8 బిలియన్‌ డాలర్లుండగా.. ప్రపంచవ్యాప్తంగా 80 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అభివృద్ధికి అవకాశమున్న ఈ రంగంలో పెట్టుబడులు పెట్టెందుకు వెంచర్‌ క్యాపిటలిస్టులు కూడా ముందుకొస్తున్నాయి. బెంగళూరుకు చెందిన వేదాంతు కంపెనీ యాక్సెల్‌ పార్ట్‌నర్‌, టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి 5 మిలియన్‌ డాలర్లు నిధులు పొందింది. టాపర్‌ కంపెనీ ఎక్స్ పాన్షన్ కోసం 65 కోట్లు సమీకరించగా.. ఆన్‌ లైన్‌తయారీ కంపెనీ ఏంజిల్‌, వెంచర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్టర్ల నుంచి 5 కోట్ల రూపాయల మేర ఫండ్స్‌ సమకూర్చుకుంది.

ఢిల్లీకి చెందిన కెరీర్‌ పవర్‌ మాత్రం ఫండింగ్‌ విషయంలో సులువైన మార్గాన్ని ఎంచుకోవడంలేదు. 70కిపైగా క్లాస్‌రూం ట్రైనింగ్‌ సెంటర్స్‌ను నడుపుతున్న ఈ స్టార్టప్‌ ఆన్‌ లైన్‌ తో పాటు ఆఫ్‌ లైన్‌ లోనూ సమాంతరంగా ఎదుగుతోంది. గత ఐదేళ్లుగా కంపెనీ వృద్ధి రేటు కూడా స్థిరంగా కొనసాగుతోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 28కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించగా.. 2015-16లో ఆదాయం 30కోట్లకు చేరుతుందని అంచనా వేస్తోంది.

“ఆఫ్‌లైన్‌ బిజినెస్‌లో గతేడాదితో పోలిస్తే 200శాతం వృద్ధి నమోదుచేశాం. భవిష్యత్తులో ఆన్‌లైన్‌ బిజినెస్‌ గ్రోత్‌ దాదాపు 500శాతం ఉంటుందని ఆశిస్తున్నా.”-అనిల్‌

కెరీర్‌ పవర్‌ త్వరలోనే వీడియో, లైవ్‌ క్లాస్‌లతో పాటు ఆన్‌ లైన్‌ డౌట్‌ క్లియరింగ్‌, ఇంటరాక్టివ్‌ బుక్స్‌ ప్రోగ్రామ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. వీటితో పాటు వెబ్‌, మొబైల్‌ అప్లికేషన్స్‌ను డెవలప్‌ చేస్తోంది.

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India