యాప్స్‌కు ప్రాణం పోసే రామ లక్ష్మణులు
రామ్ పాపినేనికి ప్రొడక్ట్ మేనేజ్మెంట్పై మంచి పట్టుంది. యాప్‌లను రూపొందించడంతోపాటు, టెక్నాలజీ అంటే ఎంతో ఆసక్తి. ఈట్స్, స్లీప్స్, డ్రింక్ యాప్స్ అన్నది రామ్‌కు అచ్చంగా సరిపోయే కాన్సెప్ట్. రెండేళ్ల క్రితం రైల్వే ప్రయాణికులకు కోసం రెండు యాప్‌లను సృష్టించాడు.
అందులో ఒకటి ఎంఎంటీఎస్ ట్రైన్ టైమింగ్స్.. ఈ యాప్ హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ ట్రైన్ల టైమింగ్స్ తెలుసుకునేందుకు ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. హైదరాబాద్‌లో ట్రైన్ టైమింగ్స్ తెలిపిన తొలి యాప్ ఇదే. ప్రతిరోజు 20 వేల మంది ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. అలాగే ఈ యాప్ కు ప్లేస్టోర్‌లో 4.4 రేటింగ్ లభించింది.
అయితే యాప్‌ను రూపొందించే సమయంలో సరైన గ్రోత్ హ్యాక్స్ లేని విషయాన్ని రామ్ గుర్తించారు. దీంతో సొంతంగా లేక ఎస్‌డీకేలను ఉపయోగించి యాప్‌లను అభివృద్ధి చేయాల్సి వచ్చింది.
యాప్ వైరాలిటీ ఆవిష్కరణలో రామ్ సోదరుడు లక్ష్మణ్ కూడా భాగస్వామి అయ్యారు. ' యాప్స్ అభివృద్ధి కోసం గ్రోత్ హ్యాకింగ్ టూల్ కిట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. యాప్ ప్రారంభించిన ఏడాదిలోపే ప్రముఖ ఇన్వెస్టర్ ఇన్‌మొబి సహ వ్యవస్థాపకుడు రాజన్ ఆనందన్ ఈ సంస్థలో పెట్టుబడి పెట్టినట్టు ' వివరిస్తారు లక్ష్మణ్. మరిన్ని స్టార్టప్ వివరాలను లక్ష్మణ్ యువర్ స్టోరీకి తెలిపారు.
యువర్‌స్టోరీ: మీ సంస్థ ఆరంభ రోజుల గురించి చెప్పండి..? యాప్ ఆవిష్కరణ ఎలా జరిగింది ?
లక్ష్మణ్: మాకు ఈ ఆలోచన వచ్చిన తర్వాత 100 మంది మొబైల్ యాప్ డెవలపర్స్‌తో చర్చించాం. యాప్ డెవలపర్స్ కోసం ప్లగ్ అండ్ ప్లే విధానాన్ని ప్రవేశపెడితే ఈ రంగంలో మంచి వ్యాపార అవకాశాలుంటాయని మేం గుర్తించాం. డెవలపర్ల సమస్యలను తీర్చే పరిష్కారమిదేనని మేం భావించాం. నిమిషాల్లో సరైన గ్రోత్ టెక్నిక్‌ను గుర్తించి, యాప్ డెవలపర్లకు సాయపడే డూ ఇట్ యువర్ సెల్ఫ్ డాష్ బోర్డు ను రూపొందించాం. మేం రూపొందించిన డీ ఐటీ ఎంతో ఉపయుక్తంగా ఉంది. దానికి ఎలాంటి కోడింగ్ కానీ, ప్లే/యాప్ అప్డేట్స్ కానీ అవసరం లేదు.
యువర్‌స్టోరీ: ప్రస్తుతం మీరు ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నారు? ఇప్పుడూ గత మోడల్‌నే మీరు ఫాలో అవుతున్నారా?
లక్ష్మణ్: అవును. మేం గతంలో రూపొందించిన మోడల్‌నే ఫాలో అవుతున్నాం. అయితే యూజర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం. గ్రోత్ టూల్‌కిట్ యాప్ వైరాలిటీ సంస్థాగతంగా అభివృద్ధి చెందే టెక్నిక్‌ను రూపొందించింది. స్వీప్ టేక్స్, స్మార్ట్ సోషల్ షేరింగ్ వంటి పర్సనలైజ్డ్ ఇన్ యాప్ టెక్నిక్ లను యాప్ డెవలపర్లకు అందుబాటులో ఉండేలా రూపొందించాం. అన్ని గ్రోత్ హ్యాక్‌లను డూ ఇట్ యువర్ సెల్ఫ్ వెబ్ డాష్ బోర్డు నుంచే నిర్వహిస్తున్నాం. యాప్స్ డెవలపింగ్‌కు కోడింగ్, యాప్ స్టోర్ అవసరం లేదు.
యువర్ స్టోరీ: యాప్ విరాలిటీ ఇన్ యాప్ రిఫరల్ లను ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది ?
లక్ష్మణ్: ఎలాంటి యాప్ కైనా 25 కేబీ SDK, డూ ఇట్ యువర్ సెల్ఫ్ డాష్ బోర్డు 30 నిమిషాల్లో యాప్ రెఫరల్స్ లైవ్‌ను అందిస్తుంది. యూఐ, యూజర్ రివార్డ్స్, ఈ-మెయిల్స్, నోటిఫికేషన్లను పంపడం, ఏబీ టెస్టింగ్ వంటి వాటి జాగ్రత్తలను యాప్ విరాలిటీ పర్యవేక్షిస్తుంది.
యువర్ స్టోరీ: మొదట్లో మీకు కస్టమర్లు ఎలా వచ్చేవారు ? ఆరంభంలో ఉచిత పైలెట్ టెస్టులు నిర్వహించారా ?
లక్ష్మణ్: మొదట్లోనే మాకు ఎంతో మంది ఆసక్తి కలిగిన కస్టమర్లు లభించారు. వాళ్ల ఇంట్రెస్ట్‌ను గుర్తించేందుకు ఎస్ ఎంబీ యాప్స్‌తో ఆరంభించాలని భావించాం. వారి స్పందన ఆధారంగా ముందుకెళ్లాలని అనుకున్నాం. అయితే అదృష్ట వశాత్తూ కొందరు కస్టమర్లు తమ యాప్‌లకు ఇన్ యాప్ రెఫరల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. అలా మేం మా పనిని ప్రారంభించాం.
యువర్ స్టోరీ: రెవెన్యూ మోడల్ ఏంటి ? ప్రైజింగ్ ఎలా ఫిక్స్ చేశారు ?
లక్ష్మణ్: ఇప్పటికీ ఓ ప్రైసింగ్ మోడల్‌ను ఫిక్స్ చేయలేదు. వివిధ రకాల ధరలతో ఇప్పటికీ ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం. కాస్ట్ పర్ ఇన్ స్టాల్/డౌన్ లోడ్ (సీపీఐ/సీపీడీ) ద్వారానే ఆదాయం సమకూర్చుంటున్నాం. ఈ మోడల్ ద్వారా ఇప్పటికే ఐదంకెల అమెరికా డాలర్ల ఆదాయం లభిస్తోంది. ఏడాదిలో మా ఆదాయాన్ని ఒక మిలియన్ డాలర్లకు పెంచాలన్నదే మా లక్ష్యం.
యువర్ స్టోరీ: ప్రస్తుతం ఎలాంటి వ్యవహారాలు నిర్వహిస్తున్నారు? మీ లక్ష్యమేంటి ?
లక్ష్మణ్: ప్రస్తుతానికైతే భారత్‌తోపాటు మరో నాలుగు దేశాల్లో వందకుపైగా యాప్ లకు వివిధ రకాల గ్రోత్ టెక్నిక్స్‌ను యాడ్ చేస్తున్నాం. భారత్‌లో యాత్ర, క్వికర్, మేక్ మై ట్రిప్, హెల్త్ కార్ట్ వంటి కొన్ని సంస్థలు మా కస్టమర్లే.
ఆరంభంలో భారత్‌లోనే సేవలందించాం. సంస్థ ప్రారంభించిన కొత్తలో సొంతగడ్డపై విజయం సాధించడం ముఖ్యం. ఇండియా బయట కూడా ఇప్పుడు వేగంగా మా సంస్థ అభివృద్ధి చెందుతోంది.
యువర్ స్టోరీ: యాప్ ప్రపంచం ఇప్పుడు ఎలా మారుతుందని మీరు అనుకుంటున్నారు. అందులో యాప్ విరాలిటి స్థానమేమిటి ?
యువర్ స్టోరీ: ఇప్పుడు చర్చంతా యాప్‌లపైనే. భవిష్యత్ అంతా యాప్ ప్రపంచానిదే. అందుకే ప్రతి ఒక్కరు ఏడాదిలోపే మిలియన్ డౌన్ లోడ్ల మార్కును చేరుకోవాలని భావిస్తున్నారు. అందుకోసం ఏదైనా చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారు.
యాప్ వైరాలిటీ ఈ రంగంలో పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యింది. వివిధ రకాల యాప్‌లకు వివిధ గ్రోత్ టెక్నిక్స్‌ను అందజేస్తూ గూగుల్, ఇన్ మొబీ వంటి చానల్స్ ప్రశంసలు పొందుతోంది. ప్రతి ఒక్క కస్టమర్ తమ తొలి యాప్ లాంచ్‌లో మమ్మల్ని భాగం చేసుకోవాలని మేం కోరుకుంటున్నాం. మా అనుభవాన్ని బట్టి చూస్తే ఆ రోజు సాకారమయ్యేందుకు ఎంతో దూరంలో లేదు.