ఆఫీసుకెళ్లేముందు ఈ 5 అంశాలు చెక్ చేసుకోండి..

మిమ్మల్ని మీరు అందంగా ప్రజెంట్ చేసుకోండి.. మీ ప్రత్యేకతను నిలపుకోండి..

ఆఫీసుకెళ్లేముందు ఈ 5 అంశాలు చెక్ చేసుకోండి..

Tuesday March 01, 2016,

2 min Read


హడావుడి లైఫ్ లో ఎవరి లెక్కవారిది.. ఎవరి స్టైల్ వారిది. కానీ అల్టిమేట్ గా తమను తాము డిగ్నిఫైడ్ గా అందంగా ప్రెజెంట్ చేసుకోవటమే అందరి టార్గెట్ . అవును..!! వేష భాషల్ని బట్టి ప్రపంచం మనల్ని అంచనా వేస్తుంది. మనం వేస్కున్న డ్రస్, ఉపయోగించే గాడ్జెట్స్, యాక్సెసరీస్ ఇలా చాలా చిన్న చిన్న ఎలిమెంట్స్ మన అభిరుచిని మాత్రమే కాదు... మన ఆత్మవిశ్వాసాన్ని కూడా ఎదుటివారికి తెలియజేస్తాయి. అందుకే ఇల్లు దాటే ముందు మనం ఎలా రెడీ అయ్యామో ఓ సారి నిలువుటద్దంలో స్కాన్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, తమల్ని తాము రిప్రజెంట్ చేసుకోవటంలో ఎవరి టేస్ట్ వారిదే అయినప్పటికీ ఈ క్రమంలో ఒక్కోసారి అంచనాలు తప్పుతుంటాం. అలాంటి సందర్భాలను వీలైనంత ఎవాయిడ్ చేసుకుంటే మనం లుక్స్ తోనే ప్రపంచాన్ని సగం జయించొచ్చు. ఈ క్రమంలో గమనించాల్సిన 5 అంశాలను ఒకసారి చూద్దాం...

1. నప్పని బట్టలను ఎంచుకోవటం..

చాలామంది అయితే లూజ్ లేదంటే టైట్ గా ఉండే బట్టలను ఎంచుకుంటారు. అవి వెస్టర్న్ ఫార్మల్స్ కావచ్చు, దేశీ వేర్ కావచ్చు.. ఏవైనాసరే ముందు శరీరాకృతికి తగినట్టుగా ఉన్నాయా లేవా అనేది మొదటి ప్రశ్న. లూజ్ గా వేలాడుతూ ఉన్నా బావుండదు.. అదే సమయంలో కంఫర్ట్ ని మింగేసేంత టైట్ గా ఉన్నా సమస్యే. అందుకే బాడీ షేప్ కి తగ్గట్టుగా బట్టలను ఎంచుకోవాలి.

2.ఎక్కువ యాక్సెసరీస్ ఉపయోగించటం...

మేకప్ అంతా అయి బయల్దేరేముందు కనీసం ఒక్క యాక్సెసరీనైనా తీసేయమని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కొకో చానల్ చెప్తుంది. ఈ సలహా ఎలా ఉన్నా.. యాక్సెసరీస్ ట్రెండీ లుక్ ని, హుందాతనాన్ని, కొత్త మెరుపుని తీసుకొస్తాయి. సింపుల్ గా చెవులకు రింగులు, చేతికో వాచ్, ఓ కలర్ ఫుల్ స్కార్ఫ్ ... ఇంతకు మించిన సింపుల్ అండ్ బ్యూటీ ఏముంటుంది చెప్పండి. అందుకే యాక్సెసరీస్ విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలి.. ఓ హడావుడి పడి ఎక్కువగా వేసుకుంటే మొదటికే మోసమని గమనించాలి..

3.మూడ్ కి తగ్గట్టు బట్టలు ధరించకపోవటం..

మహిళలు ధరించే బట్టలకు వారి మూడ్ కి సంబంధం ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. అందుకే కొంచెం కేర్ ఫుల్ గా ఉంటే ఈ విషయాన్ని చాలా పాజిటివ్ గా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు మూడ్ సరిగ్గా లేని రోజు ఆఫీసుకి ఓ మాంచి కలర్ పుల్ పింక్ డ్రస్ వేసుకెళ్లండి. ఫలితం మీకే తెలుస్తుంది. కాంప్లిమెంట్ల వరద మీ మూడ్ ని క్షణాల్లో సెట్ చేస్తుంది. రోజుల తరబడి టెన్షన్ పడుతున్న కాన్ఫరెన్స్ కి పాపులర్ పవర్ డ్రెస్సింగ్ స్కర్ట్ అండ్ సూట్ లో వెళ్లి చూడండి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కచ్చితంగా పెరగటాన్ని గమనిస్తారు..

image


4.డల్ గా ఉండే రంగులకు పరిమితం కావటం..

ఎప్పుడూ అవే డల్ కలర్సా..? అవే పాత మూడీ రంగులు రోజును మరింత నీరసంగా మారుస్తాయి. అవును అందుకే చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. ఆ మార్పులు చాలా డిఫరెంట్ గా కనిపించేలా చేస్తాయి. ఉదాహరణకు రెగ్యులర్ గా వేసుకునే ప్యాంట్స్ బదులు లేటెస్ట్ ట్రెండింగ్ కలర్ ప్యాంట్స్ వేసుకొని చూడండి. ఫన్నీగా, ఫంకీగా, ఎట్రాక్టివ్ గా ఉండి మిమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తాయి. ఇదే చిట్కా టాప్స్, స్కార్ఫ్ లకు కూడా అప్లై చేయండి... నలుగురూ మిమ్మల్ని కళ్లప్పగించి చూడకపోతే చెప్పండి..!!

5 ఆకట్టుకోని మేకప్ తో ఫలితమేంటి?

మేకప్ అనేది మిమ్మల్ని మీరు అందంగా ప్రెజెంట్ చేసుకోటానికి చాలా బెస్ట్ వే. అయితే, అందంగా తయారవటానికి, ఓవర్ గా డ్రెస్ అప్ అవటానికి మధ్య చాలా చిన్న భేదం ఉంటుంది. ఆ ఒక్క విషయాన్ని గమనించగలిగితే మీ లుక్స్ కచ్చితంగా అదుర్స్. డౌట్ అనవసరం. అందుకే ఓవర్ గా మేకప్ అవకుండా, మీ బెస్ట్ ఫీచర్స్ ని హైలైట్ చేస్తూ తయారైతే.. మీ వర్క్ ప్లేస్ లో కచ్చితంగా మీకో ప్రత్యేకత ఏర్పడుతుంది.