ఫంక్షన్లు, పార్టీలకు పర్ఫెక్ట్ ప్లేస్ వెతికిపెట్టే 'అర్బన్ రెస్ట్రో'

ఫంక్షన్లు, పార్టీలకు పర్ఫెక్ట్ ప్లేస్ వెతికిపెట్టే 'అర్బన్ రెస్ట్రో'

Sunday August 30, 2015,

2 min Read

ఇప్పుడు చాలా కంపెనీలు రెస్టారెంట్ సేవలను ఆన్ లైన్‌లో అందిస్తున్నాయి. అయితే చాలా సందర్భాల్లో ఏ రెస్టారెంట్‌లో సౌకర్యాలు బాగున్నాయో.. దేన్ని బుక్ చేసుకోవాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఆన్‌లైన్లో ఫోన్ నెంబర్లు వెతుక్కొని.. వాళ్లకు కాల్ చేసి అక్కడి సౌకర్యాలు, అందుబాటు.. రేటు లాంటి విషయాలన్ని కనుక్కొని మనకు ఎంత వరకూ ఇవ్వగలుగుతారో కనుక్కుంటాం.

పై సందేహాలన్నింటికీ సమాధానం చెబుతోంది అర్బన్ రెస్ట్రో (UrbanRestro). రెస్టారెంట్లలో తినడానికి రిజర్వేషన్ కల్పించడంతోపాటు బాంక్వెట్ హాల్స్ కూడా బుక్ చేయడం అర్బన్ రెస్ట్రో ప్రత్యేకత. అంతేకాక.. మిగిలిన వెబ్ సైట్లకు భిన్నంగా.. సిటీలో జరిగే ఈవెంట్లను కూడా పొందుపరుస్తోంది.

అర్బన్ రెస్ట్రో వ్యవస్థాపకురాలు శృతి ఛాజెద్

అర్బన్ రెస్ట్రో వ్యవస్థాపకురాలు శృతి ఛాజెద్


ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన శృతి ఛాజెద్ అర్బన్ రెస్ట్రోను 2012లో ప్రారంభించారు. టెక్ మహీంద్రాలో పనిచేసేటప్పుడు ఈవెంట్స్ నిర్వహించడం, టీంను బిల్డ్ చేయడం లాంటి ఇతర కార్యక్రమాలపై ఆమె ఎక్కువగా ఆసక్తి కనబరిచేది. చివరకు ఒక థీమ్ రెస్టారెంట్‌ను ప్రారంభించాలనుకుని జాబ్ మానేశారు. అయితే.. చివరకు ఎంబీఏ చదివేందుకు వెళ్లారు. ఆ తర్వాత HCLలో రెండున్నరేళ్లు పనిచేసి.. చివరకు 2012 డిసెంబర్‌లో అర్బన్ రెస్ట్రోను ప్రారంభించారు.

ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, పూణె, అహ్మదాబాద్, బెంగళూరులో అర్బన్ రెస్ట్రో సేవలు అందిస్తోంది. వెయ్యికిపైగా రిసార్ట్స్, బాంక్వెట్ హాల్స్, రెస్టారెంట్స్, క్యాటరర్స్ వీళ్ల దగ్గర భాగస్వాములై ఉన్నారు. కెపాసిటీ, ఫుడ్, పార్కింగ్, ప్రదేశం లాంటి వివిధ అంశాలపై రెస్టారెంట్లను, బాంక్వెట్స్‌ను పోల్చి చూసుకోగలగడం అర్బన్ రెస్ట్రో వెబ్ సైట్ ప్రత్యేకత. దీంతో మనకు నచ్చినదాన్ని చూసి ఎంపిక చేసుకోవచ్చు.

అందరిలాగే శృతి కూడా కంపెనీ ప్రారంభానికి అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. నెలవారీ ఖచ్చితంగా వచ్చే జీతాన్ని వదులుకుని కంపెనీ ప్రారంభించడానికి ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. చివరకు వాళ్లను ఒప్పించి అర్బన్ రెస్ట్రోకు శ్రీకారం చుట్టారు.

వివిధ రెస్టారెంట్లను పోల్చుకోగలగడం అర్బన్ రెస్ట్రో ప్రత్యేకత

వివిధ రెస్టారెంట్లను పోల్చుకోగలగడం అర్బన్ రెస్ట్రో ప్రత్యేకత


అర్బన్ రెస్ట్రో 2012లో 13 మందితో ప్రారంభమైంది. ప్రస్తుతం ఏడాదికి 50వేలకు పైగా హిట్స్ వస్తున్నాయి. రోజూ సుమారు 700 మంది వెబ్ సైట్ సందర్శిస్తున్నారు.

మేరా వెన్యూ(MeraVenue), వెన్యూపండిట్ (VenuePandit) లు కూడా ఈ రంగంలో ఉన్నాయి. అయితే ఇవేవీ అర్బన్ రెస్ట్రో లాగా ముందస్తు బుకింగ్స్‌ను, ఈవెంట్లను కలిపి బుక్ చేయట్లేదు. ఈ రెండింటినీ అందిస్తుండడం అర్బన్ రెస్ట్రో ప్రత్యేకత.

ఈ సందర్భంగా శృతి చెప్పేదేంటంటే…

1. సంస్థ కలకాలం ఉండాలంటే నియామకలు చాలా పకడ్బందీగా ఉండాలి. వాళ్ల నేపథ్యం ఏంటో తెలుసుకోవాలి.

2. వేగంగా ఎదగాలి అంటే మనం సాధించిన విజయాలను గర్వంగా చెప్పుకోవాలి.

3. మీ సిబ్బందితో కాకుండా ఈ రంగంలోని వ్యక్తుల నుంచి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు తీసుకుంటూ ఉండాలి.