కార్పొరేట్ ఉద్యోగుల ఆరోగ్యాన్ని పట్టించుకునే స్టార్టప్ 'హెల్త్5సి'

14th Oct 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

ఒక రోజున మితీష్ చిట్‌నవీస్ స్నేహితుడు ఒకరు.. రోజూ మాదిరిగానే మార్నింగ్ వాక్‌ వెళ్లి.. హఠాత్తుగా పడిపోయి మరణించాడు. దీనితో అతని కుటుంబం అనాథగా మిగిలిపోయింది.

ప్రస్తుతం ప్రజలు వారి ఆరోగ్యం ఎంతగా దిగజారుతోందో తెలుసుకోవడంలో అవగాహన లేమికి.. ఈ ఉదాహరణ సరిపోతుంది. డాక్టర్ దగ్గరకు వెళ్లి తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంలో అలసత్వంతోపాటు.. భయం కూడా చాలామందిలో ఉంది. తమకు ఎదురైన దుర్ఘటనే మితేష్ చిట్‌నవీస్, బాల ఉన్నికృష్ణన్‌లిద్దరూ కలిసి హెల్త్5సీ ప్రారంభించడానికి కారణమైంది. ఈ జీవితం దేవుడిచ్చినదే, అంతా ఆయనిష్టం అని వేదాంతానికి వదిలేయకుండా.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేందుకు ఈ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న పీడీహెచ్‌పీ (ప్రోగ్రాం ఫర్ ది డెవలప్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ పొటెన్షియల్) టెక్ కంపెనీ కృషి చేస్తోంది.

image


ఎంఫసిస్‌కు చీఫ్ సెక్యూరిటీ కం ప్రైవసీ ఆఫీసర్‌గాను, ఓబోపేకు ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్‌గాను విధులు నిర్వహించారు చిట్‌నవీస్. ఐఐఎంలో విద్యాభ్యాసం చేసిన ఉన్నికృష్ణన్‌కు.. రెడిఫ్.కాం, ఆన్‍‌మొబైల్ గ్లోబల్, ఓబోపే, నోకియా ఇండియాలలో కలిపి మొత్తం 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది.

మితీష్ చిట్‌నవీస్, హెల్త్5సీ సహ వ్యవస్థాపకుడు

మితీష్ చిట్‌నవీస్, హెల్త్5సీ సహ వ్యవస్థాపకుడు


" 2011లో హెల్త్‌5సీని కేవలం ₹2 లక్షల పెట్టుబడితో ప్రారంభించాను. కస్టమర్లకు అనువైన, సౌకర్యవంతమైన, చవకైన, తేలికైన హెల్త్ ప్లాట్‌ఫాం అందించాలన్నది నా ఆలోచన. ఉపయోగించడంలో సులభంగా ఉండడం.. దీనిలో అత్యంత ప్రత్యేకం"అంటున్నారు హెల్త్5సీ కో ఫౌండర్ మితీష్ చిట్‌నవీస్.


స్టార్టప్‌లకు సాధారణంగా ఎదురయ్యే ప్రధాన సమస్య.. నిధుల కొరత. హెల్త్‌5సీకి కూడా ఈ సమస్య తప్పలేదు. దీనితో ఓ సమయంలో తమ డెవలప్‌మెంట్‌ టీంను 27 నుంచి 5కు తగ్గించుకోవాల్సి వచ్చింది ఈ వెంచర్‌కు. ప్రస్తుతం ఈ కంపెనీకి 11 మంది కో-వర్కర్స్ పని చేస్తున్నారు.

హెల్త్‌5సీ అంటే ఐదు Cలతో ఆరోగ్యం అని అర్ధం. ఒక్కో Cకి ఒక్కో అర్ధం ఉంది. కాంప్రహెన్సివ్(సమగ్రమైన), కన్సిస్టెంట్(స్థిరమైన), కొలాబరేటివ్ (సహకారం), సిటిజన్(పౌరులు), కేర్(జాగ్రత్త).. ఇవే ఆ 5 Cలు. చికిత్స తర్వాత ఫాలోఅప్ విజిట్స్, స్వీయ పర్యవేక్షణ, ఔషధ వినియోగం.. ఇలా వ్యాధుల నుంచి కోలుకునేందుకు అవసరమైన అన్ని విభాగాల్లోనూ జాగ్రత్తలు సూచిస్తుంది హెల్త్5సీ. ప్రస్తుతం సాంకేతిక రంగం విప్లవాత్మక స్థాయిలో అభివృద్ధి చెందడంతో.. వైద్య సేవలు ఆస్పత్రి నాలుగు గోడలకే పరిమితం కాదని నిరూపించేందుకు ఈ వెంచర్ శాయశక్తులా కృషి చేస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 139 హాస్పిటల్స్, డయాగ్నస్టిక్ సెంటర్లతో ఒప్పందాలు చేసుకుంది 5 సీ. అపోలో డెంటల్ నుంచి ఎస్ఆర్ఎల్ ల్యాబ్స్ వరకు.. అపోలో క్లినిక్ నుంచి వాసన్ ఐ కేర్ వరకూ.. అనేక బడా కంపెనీలతో అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నారు. అంతేకాదు.. రెండు పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు, టెలికాం ఆపరేటర్లు కూడా.. హెల్త్5సీ క్లయింట్స్‌లో ఉండడం విశేషం.

ఇప్పటికి నాలుగున్నర లక్షల మంది హెల్త్5సీ అందిస్తున్న యాప్స్‌ను ఉపయోగించుకుంటున్నారు. దీన్ని బట్టే ఈ వెంచర్ ఎంతగా పాపులర్ అయిందో అర్ధమవుతుంది.

“ ఈ యాప్స్‌లో కొన్ని మాకు ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్నాయి కూడా ” అంటున్నారు హెల్త్5సీ కోఫౌండర్ బాల ఉన్నికృష్ణన్.

బాల ఉన్ని కృష్ణన్, సహ వ్యవస్థాపకుడు

బాల ఉన్ని కృష్ణన్, సహ వ్యవస్థాపకుడు


పిల్ ఐడెంటిఫయర్ యాప్

హెల్త్5సీ అందిస్తున్న మొబైల్ అప్లికేషన్స్.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై అందుబాటులో ఉన్నాయి. సరైన ఔషధాలను తీసుకోవడంలో సహాయపడుతుంది పిల్ ఐడెంటిఫయర్ యాప్. దీంతోపాటు ఆయా మెడిసిన్స్‌కు సంబంధించిన వివరాలను కూడా అందిస్తుంది. ఆయా పిల్స్ సైజ్, రూపం, రంగు, దానిపై ఉన్న ప్రింట్స్ ఆధారంగా.. డేటాబేస్‌లోని వివరాలను క్రోడీకరించిన మెడిసిన్ డీటైల్స్ చెప్పగలగడం పిల్ ఐడెంటిఫైయర్ యాప్ ప్రత్యేకత. ఆయా ట్యాబ్లెట్స్ విడిగా ఉన్నా సరే.. వాటి వివరాలను పూర్తిగా తెలుసుకోవచ్చు. అమెరికాకు చెందిన ఓ కంపెనీతో కలిసి.. ఆ విభాగాన్ని హెల్త్‌5సీని ప్రారంభించడం విశేషం.


"మన దేశంలో మాదిరిగా కాకుండా.. అమెరికాలో మెడికల్ సర్వీసును ఆన్‍‌లైన్‌లో ఆర్డర్ చేసే సదుపాయం ఉంది. చిన్న డోసేజ్ కంటెయినర్ల ద్వారా అవసరమైన ఔషధాల షిప్పింగ్, డెలివరీ చేస్తారు. ఫార్మసీలు డోసేజ్ కంటెయినర్లలో పంపే లూజ్ ట్యాబ్లెట్స్‌ను గుర్తించడానికి.. యూఎస్ మార్కెట్లో పిల్ ఐడెంటిఫయర్ యాప్ చాలా అవసరం కూడా" అన్నారు ఉన్నికృష్ణన్.

ఎల్లలు లేకుండా ఎదుగుతోంది

కేపీఎంజీ రిపోర్ట్ ప్రకారం.. మన దేశంలో హెల్త్ టెక్ మార్కెట్ విలువ ₹రూ. 3,500 కోట్లు. ఏటా 18-20శాతం వృద్ధి చెందుతోంది ఈ రంగం. హెల్త్‌ కేర్ రంగమంటే రిమోట్ కంట్రోల్‌తో మేనేజ్ చేయడం, రికార్డుల నిర్వహణతోనే సరిపెట్టకుండా.. అంతకుమించి అభివృద్ధి చెందేలా ప్రయత్నిస్తామంటున్నారు చిట్‌నవీస్.

హెల్త్‌5సీ క్లయింట్స్ లిస్ట్

బెంగళూరులో నెక్ట్స్‌జెన్ డేటా సెంటర్ సర్వీసెస్‌తోపాటు అనేక హాస్పిటల్స్ హెల్త్5సీ క్లయింట్స్‌గా ఉన్నాయి. ముంబైలో సుహాస్ డయాగ్నస్టిక్స్, అభయ హాస్పిటల్స్, బిజిఎస్, పూజ హాస్పిటల్, ఎక్స్‌ప్రెస్ క్లినిక్, కేర్ పాట్రన్స్, చిరాగ్ హాస్పిటల్‌ ప్రముఖమైనవి కాగా.. మరిన్ని క్లయింట్ కంపెనీలు ఉన్నాయి. ఆల్మండ్జ్, జేఎల్‌టీ వంటి ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సంస్థలతో కూడా హెల్త్5సీకి టైఅప్ ఉంది.


పలు కార్పొరేట్ కంపెనీలతోనూ కొన్ని రకాల కార్యక్రమాలను కలిసి నిర్వహిస్తోంది హెల్త్5సీ. ఆయా కంపెనీలకు చెందిన హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి ఫిట్నెస్, హెల్త్ సంబంధిత కాంటెస్ట్‌లు నిర్వహిస్తున్నారు.

" ప్రస్తుతం ఉద్యోగులు తమ ఆరోగ్య పరిస్థితిని పెద్దగా పట్టించుకోవడం లేదు. బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ , బరువుతోపాటు పలు అంశాలను గాలికొదిలేస్తున్నారు. కార్పొరేట్ కార్యక్రమాల ద్వారా హెల్త్5సీ ఇలాంటి వివరాలను సమీకరిస్తుంది. ఈ డేటా ద్వారా ఉద్యోగుల ఆరోగ్య స్థితిపై పరిశీలించి.. వారికి అవసరమైన చికిత్స తీసుకోవడంలో సహాయ సహకారాలు అందిస్తుంది."అని చెప్పారు ఉన్నికృష్ణన్.

కార్పొరేట్ రంగంలో హెల్త్5సీ నిర్వహించే "వెయిట్ లాస్ ఛాలెంజ్" పెద్ద సక్సెస్ సాధించింది. వ్యక్తిగతమైన ఆహారపు ప్రణాళిక, ఫిట్నెస్ ప్లాన్స్, కోచింగ్‌లో సహాయం అందించడం ద్వారా.. బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండేందుకు ఉద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు.

ప్రస్తుతం హెల్త్5సీకి ఫౌండర్స్‌తో కలిపి 15మంది ఫుల్ టైం ఉద్యోగులున్నారు. పైన చెప్పిన కార్పొరేట్ వెల్‌నెస్ కార్యక్రమాలు చీఫ్ వెల్‌నెస్ స్పెషలిస్ట్ ఆధ్వర్యంలో జరుగుతాయి.

వాట్ నెక్ట్స్

దేశవ్యాప్తంగాను, ఈఎంఈఏ(యూరోప్, ది మిడల్ ఈస్ట్, ఆఫ్రికా), సార్క్ సహా.. మొత్తం కోటి మంది సబ్‌స్క్రయిబర్లకు సేవలు అందించాలన్నది హెల్త్5సీ లక్ష్యం. విస్తరణ కార్యకలాపాల్లో భాగంగా.. ఇందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆదాయపరంగా చూసుకుంటే.. హెల్త్5సీ నిర్వహిస్తున్న కార్పొరేట్ కార్యక్రమాలు ఇప్పటికే లాభదాయకత సంతరించుకున్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ₹కోటి టర్నోవర్‌ను అందుకునేందుకు ఈ స్టార్టప్ ప్రయత్నిస్తోంది.

"హెల్త్‌కేర్ సర్వీసులు కోరుకునే వారు, అందించేవారి మధ్య సంధానకర్తగా ఉండి.. సమాచారం పంచుతూ అలర్ట్స్, సేవలు అందించే వ్యవస్థగా హెల్త్5సీ ఎదిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి" అంటున్నారు చిట్‌నవీస్.

వెబ్‌సైట్

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close
Report an issue
Authors

Related Tags

Latest

Updates from around the world

Our Partner Events

Hustle across India