సంకలనాలు
Telugu

స్టార్టప్‌కు ఎలా విలువ కడతారు ?

CLN RAJU
1st Sep 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

స్టార్టప్ ఈవెంట్లు, ఇన్వెస్టర్ ప్యానెల్‌లోనూ తరచుగా ఎదురయ్యే ప్రశ్న. స్టార్టప్‌కు ఇన్వెస్టర్లు విలువ ఎలా కడతారు అనే. 'పరిస్థితుల ప్రకారం వాల్యుయేషన్ ఉంటుందంతే. ప్రత్యేకమైన లక్షణాలేమీ ఉండవు' ఆ ప్రశ్నకు వచ్చే సమాధానం ఇదే.

స్టార్టప్‌కు విలువ కట్టడం.. దీనికి ఖచ్చితమైన ఆన్సర్ వెతకడం చాలా క్లిష్టమైన విషయం. వాస్తవానికి అసాధ్యం కూడా. ఎందుకంటే దీనికి ప్రత్యేకమైన నిర్వచనం ఇచ్చేందుకు తగిన వ్యవస్థ ఏం లేదు.

నిజానికి స్టార్టప్ వాల్యుయేషన్ చేయడంలో పరిశ్రమకు సంబంధించిన మార్కెట్ శక్తులు కీలకపాత్ర పోషిస్తాయి. ఏ రంగంలో ఆ స్టార్టప్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది... ఆ రంగానికి డిమాండ్, సప్లైల మధ్య ఎలాంటి బ్యాలెన్స్ ఉంది... మార్కెట్ సైజ్ ఎంత... ఈ టైంలో ఆ స్టార్టప్ ప్రారంభం సరైన చర్యేనా... వంటి వాటిని పరిశీలించడంతోపాటు... ఆ విభాగంలో పెట్టుబడులకు ఇన్వెస్టర్ ఇష్టపడడం కూడా ముఖ్యమే. వీటితోపాటు ఆంట్రప్రెన్యూర్ నిధుల కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారు అనే అంశాన్ని కూడా పెట్టుబడిదారులు పరిగణిస్తారు.

చాలా వరకూ ప్రారంభ స్థాయి స్టార్టప్‌లను విలువ కట్టేందుకు పై అంశాలు సరిపోతాయి. అయితే.. ఈ విలువ కట్టడంలో ఎలాంటి విధానాలు అవలంభిస్తారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

image


వాల్యుయేషన్ కు సంబంధించిన కొన్ని విధానాలు ఇవి

 • డీసీఎఫ్ (డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో)
 • మార్కెట్ సైజ్ మరియు లావాదేవీల సంఖ్య
 • బుక్ వాల్యూ, లిక్విడేషన్ వంటి ఆస్తుల ఆధారిత విలువ


ముందుగా చెప్పుకున్నట్లుగా... స్టార్టప్‌కు విలువ కట్టడంలో ఇండస్ట్రీకి సంబంధించిన మార్కెట్ శక్తులే ఎక్కువగా పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ఆ రంగానికి మార్కెట్లో ఉన్న అవకాశాలు ఎన్ని ఉన్నాయి... భవిష్యత్తులో అభివృద్ధి అవకాశాలు ఏమేరకు ఉన్నాయో పరిగణిస్తారు.

ఇప్పటి విలువను ఇన్వెస్టర్ ఎలా లెక్కిస్తాడు ?

పెట్టుబడులు పెట్టేముందే.. తను బయటకు వచ్చేటప్పుడు ఎంత విలువ ఉంటుంది.. ఏమేరకు రిటర్న్స్ వస్తాయో ఆలోచించుకుంటాడు ఇన్వెస్టర్. తన పెట్టుబడికి తగ్గ ఫలితం అందుతుందా లేదా అంచనా వేసుకుంటాడు. లేదా తాను బయటకు వచ్చేటప్పుడు ఎంత వాటా లభిస్తుంది అని లెక్కించుకుంటాడు. (ఇన్వెస్టర్ పెట్టుబడిని వాల్యుయేషన్ తర్వాత కంపెనీ విలువతో భాగిస్తే... ఆ పెట్టుబడిదారుని వాటా వస్తుంది.)

ఈ లెక్క వేసుకునే ముందు మరిన్ని విషయాలు తెలుసుకోవాలి.

• ప్రీ మనీ= కంపెనీ ప్రస్తుత విలువ

• పోస్ట్ మనీ = ఇన్వెస్టర్ పెట్టుబడి అందించాక కంపెనీ విలువ

• క్యాష్ ఆన్ క్యాష్ మల్టిపుల్ = బయటకు వెళ్లిపోయేప్పుడు ఇన్వెస్టర్ పెట్టుబడి కంటే ఎన్ని రెట్ల మొత్తం అందిందో... దాన్ని మొత్తం వారు చేసిన పెట్టుబడితో భాగించాలి


ఆస్తులు, ఆదాయం లేనపుడు ఎలా లెక్కిస్తారు ?

వాల్యుయేషన్ నాటికి ఎలాంటి ఆదాయం కానీ, ఏ విధమైన ఆస్తులు కానీ లేకపోతే.. ఈ ప్రక్రియ మరింత జటిలమవుతుంది. మరిన్ని అంశాలను పరిగణించాల్సి ఉంటుంది. మార్కెట్లో ఆ కంపెనీకి ఉన్న అవకాశాలను మాత్రమే ఇక్కడ లెక్కించాల్సి వస్తుంది. శూన్యం లోంచి ఓ వ్యాపారం కూడా ఉద్భవించదు. అంటే.. ఇప్పటికే ఆ తరహాలో కాకపోయినా.. అదే వ్యాపారాన్ని ఇతర పద్ధతుల్లో వేరే ఎవరైనా చేస్తూ ఉండాలి. ఆస్తులు, ఆదాయం లేనపుడు.. వాల్యుయేషన్ కోసం ఈ విషయానికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాల్సి ఉంటుంది.

కంపెనీ వాల్యుయేషన్ కోసం... మార్కెట్, వ్యాపారం, లావాదేవీలకి సంబంధించిన సమాచారం కోసం కొన్ని పద్థతులను అనుసరిస్తారు ఇన్వెస్టర్లు.

• మార్కెట్ సర్వే - ఆ రంగానికి సంబంధించిన సేవలను ఎంతమంది ప్రజలు ఉపయోగించుకునే అవకాశముందనే గణాంకాలు.

• కంపెనీల మధ్య కంపారిజన్ - అదే రంగంలోని ఇతర కంపెనీల స్థితిగతులు.

• భవిష్యత్ అంచనా - భవిష్యత్తులో అంటే కనీసం మరుసటి ఐదేళ్లకు క్యాష్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో, నికర లాభదాయకత, ఆస్తులు-అప్పుల స్థితి

అయితే వాల్యుయేషన్ అనేక పద్ధతులు ఉన్నా... స్వయం పరిశీలనే ఎక్కువ పాత్ర పోషిస్తుంది. ప్రారంభస్థాయి స్టార్టప్స్‌లో ఇది తప్పనిసరి. మొదట్లో చేసుకున్న డీల్స్, కంపెనీ అభివృద్ధి చెందుతున్న తీరు, అందుబాటులో ఉన్న ఆర్థిక గణాంకాలు, క్రమంగా మారుతున్న తీరును పరిగణించాల్సి ఉంటుంది.

కేవలం గణాంకాలు, వాటి విశ్లేషణ ఆధారంగా స్టార్టప్ వాల్యుయేషన్ చేయడం జరగదు. ఇన్వెస్టర్‌కు ఆ రంగంలో ఉన్న అనుభవం, ఎంట్రీ-ఎగ్జిట్ సమయాల్లో పెట్టుబడికి విలువపై... వాల్యుయేషన్ ఆధారపడి ఉంటుంది. నిజానికి గణాంకాల విశ్లేషణ పద్ధతుల్లో పెద్దగా తేడాలుండవు. అయితే... మరిన్ని అంతర్గత విలువలను క్రోడీకరిచండంతో... సరైన సమయంలో బయటకు రావడంపై అంచనాలు వేసుకునేందుకు ఇవి సహకరిస్తాయి.

ఇలాంటి లెక్కల కోసం మార్కెట్ & ట్రాన్సాక్షన్ కంపారబుల్స్ పద్ధతి అనువైనది. వాల్యుయేషన్ చేస్తున్న కంపెనీ భవిష్యత్తులో ఎలా ఉండాలో చెప్పేందుకు కాకుండా... అప్పటికే మార్కెట్లో ఇదే రంగంలో వ్యాపారం నిర్వహిస్తున్న ఇతర కంపెనీలకు విలువను అంచనా వేసేందుకు ఉపయోగపడతాయి. (కొన్నిసార్లు ఆదాయం, కొన్ని మార్లు పన్నుకు ముందు ఆదాయం, మరికొన్ని సార్లు కస్టమర్ల సంఖ్య). దీని ద్వారా స్టార్టప్‌కు ప్రస్తుత విలువ అంచనా వేసేందుకు అవకాశం చిక్కుతుంది.

ఇన్వెస్టర్లను ఆకర్షించే అంశాలు

 • యూజర్ల సంఖ్య పెంపు

ఇన్వెస్టర్లను అత్యధికంగా ఆకర్షించే విషయం కస్టమర్ల సంఖ్య క్రమేపీ పెరిగే అవకాశాలు ఉండడం. కొన్నిసార్లు ఆంట్రప్రెన్యూర్‌కు అనుకూలమైన వాతావరణం కనిపించకపోయినా... క్రమమైన యూజర్ల సంఖ్య పెరుగుదల వాళ్లను ఆకర్షిస్తుంది. మొత్తం కంపెనీయే కాదు... అందులో కస్టమర్లను ఆకర్షించే ఒక్క అంశమైనా ప్రభావం చూపగలిగేది అవుతుంది ఒకోసారి.

 • ఆదాయం

లాభదాయకత కంపెనీకి విలువ కట్టడాన్ని సులభతరం చేస్తుంది. స్టార్టప్‌లకు ఆదాయ మార్గాల సంఖ్య చాలా ముఖ్యం. ఆదాయం తక్కువగా ఉంటే వాల్యుయేషన్ తగ్గే అవకాశం ఉంటుంది. కస్టమర్లు/యూజర్లపై ఎక్కువ ఛార్జీలు మోపితే... అభివృద్ధి నెమ్మదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలానికి ఇది సరైన విధానం కాదు. అప్పుడు వాల్యూయేషన్ కూడా తగ్గిపోతుంది.

రెండు విధాలుగానూ ఆంట్రప్రెన్యూర్‌కు ప్రతికూలతలు కనిపిస్తాయి. అందుకే ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే.. స్టార్టప్ అనేది కేవలం రెవెన్యూ ఆర్జించడానికి మాత్రమే కాకుండా... వేగంగా అభివృద్ధి సాధించి, సంపద సృష్టి చేయగలిగేలా ఉండాలి. ఇలా వేగమైన వృద్ధి సాధించలేకపోతే... వినూత్నంగా కాకుండా సాంప్రదాయ వ్యాపార విధానాలను అవలంబిస్తున్నట్లే.

image


వ్యవస్థాపకుల ప్రొఫైల్

నిధుల సేకరణకు స్టార్టప్ ప్రయత్నించినపుడు... ఇన్వెస్టర్లు వ్యవస్థాపకుల ప్రొఫైల్‌ను ఎక్కువగా పరిశీలిస్తారు. ఆయా వ్యక్తుల భవిష్యత్ వ్యూహాలకు ఇక్కడ అవకాశం తక్కువగా ఉంటుంది. గతంలో నిర్వహించిన వెంచర్ నుంచి సరైన టైంలో బయటకు వస్తే... ఈ స్టార్టప్‌కు విలువ ఎక్కువ కట్టేందుకు ఉపయోగపడుతుంది. తమకి ఉన్న వనరులు, అవకాశాలను సక్రమంగా ఉపయోగించుకుని... వారి వ్యాపార ఆలోచనలను విజయవంతమైన వాణిజ్యంగా మార్చారనే నమ్మకం కలిగించేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఒకవేళ మిగిలిన అంశాలన్నీ ప్రతికూలంగా ఉన్నపుడు కూడా... ఆంట్రప్రెన్యూర్ ప్రొఫైల్ ఆధారంగా... ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ వ్యక్తి ఇమేజ్ చాలా ముఖ్యం.

ముగింపు

ఏ వ్యాపారం అయినా ఆర్థిక అంశాలతోనే ముడిపడి ఉంటుంది. కానీ స్టార్టప్‌లకు వేగంగా అభివృద్ధి సాధించే గుణం ఉండాలి. స్టార్టప్ అభివృద్ధి కోసమే నిధుల సమీకరణ చేస్తూ ఉండాలి. స్టార్టప్లకు ఫండింగ్ చేయడం పూర్తిగా ఇన్వెస్టర్ల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే వీరు మార్కెట్ సైజ్, అభివృద్ధి అవకాశాలు, నమ్మకం, కీర్తిప్రతిష్టలు, వ్యవస్థాపకుల బ్యాక్ గ్రౌండ్‌లను నిశితంగా పరిశీలిస్తారు.

ఏదైనా సమాచారం కావాలంటే... కామెంట్స్ రూపంలో అడగచ్చు. info@taxmantra.com మెయిల్ ఐడీ ద్వారా అయినా సందేహాల నివృత్తి చేసుకోవచ్చు

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags