వైద్య రంగంలో వినూత్న సంచలనం 'జీవంతి'
గొలుసుకట్టు ఆసుపత్రులు నిర్వహిస్తున్న జీవంతిమహారాష్ట్ర, గుజరాత్ లపై పట్టు చిన్నపట్టణాల్లో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంచిన్న ఆసుపత్రులను స్వాధీనం చేసుకోవడం ద్వారా సేవలు
టెక్నాలజీని వినియోగించడానికి, మొబైల్ స్టార్టప్‌ను స్టార్ట్ చేయడానికి భారత్‌లో ఏ ఏ రంగాలు బాగుంటాయి అని అంచనా వేసినప్పుడు హెల్త్ కేర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ ప్రధానంగా మన ముందు కనిపిస్తాయి. టెక్నాలజీ లేదా మొబైల్ ప్రాడక్టులే కాకుండా ఈ రంగాల్లోని సమస్యలు విశ్వజనీనమైనవి. ఎంత చేసినా ఈ రంగాల్లో చేయాల్సింది చాలా ఉంటుంది. అయితే.. ఈ రంగాల్లోని సంక్లిష్టతల వల్ల వీటిల్లో ప్రవేశించడానికి చాలా మంది వెనకాడుతున్నారు. అయితే.. జీవంతి(Jeevanti) ఈ రంగాన్ని ఛాలెంజ్ చేసేందుకు ముందుకొచ్చింది.
వీళ్లెవరు..?
మాజీ బ్యాంకు ఉద్యోగి అరుమ్ దియాజ్, మరో సామాజిక కార్యకర్త జీవంతి హెల్త్ కేర్‌ను 2011 ఏప్రిల్‌లో ప్రారంభించారు. మూలధనంతో మహారాష్ట్ర, గుజరాత్‌లలో 50 పడకల ఆసుపత్రులను ప్రారంభించింది జీవంతి. ముంబై సబర్బన్‌లో ప్రారంభించిన ఆసుపత్రులలో గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ విభాగాల్లో సేవలందిస్తోంది.
నివేదికల ప్రకారం దేశంలో అతి పెద్ద రంగం హెల్త్ కేరే..! 2017 నాటికి భారతదేశ వైద్య రంగం 11వందల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. దీన్ని దృష్టిలో ఉంచుకుని జీవంతి తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. మంచి వైద్య సేవలకు ఎప్పుడూ గిరాకీ ఉంటుందనేది సంస్థ నమ్మకం. కార్పొరేట్ ఆసుపత్రులకు, ప్రభుత్వాసుపత్రులకు, సింగిల్ డాక్టర్ ఆసుపత్రులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని పూర్తి చేసేందుకు మధ్యస్తంగా ఆసుపత్రులను నెలకొల్పడం జీవంతి ప్రణాళిక.
అరుణ్, దీపా... థానేలో అపోలో క్లినిక్‌ను నిర్వహిస్తున్నారు. వైద్యరంగంలో తాము మరింత ముందుకెళ్లాలనేందుకు ఇదే పునాది.
జీవంతి నమూనా
ముంబై సమీపంలోని థానే జిల్లాలో అంబర్‌నాథ్, భివాండి ప్రాంతాల్లో జీవంతి ఆసుపత్రులున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలను బేరీజు వేసుకుని తదుపరి తమ ప్రణాళికను రూపొందించుకుంటోంది జీవంతి.
ఈ ఆసుపత్రుల నిర్వాహణ అంతా వ్యవస్థాపకులే చూసుకుంటారు. డాక్టర్లు, సిబ్బంది తప్పకుండా NABH సర్టిఫికేట్ పొందినవారై ఉండాలి. “ ఆయుర్వేద, యునాని నిపుణుల నుంచి మేం ఆసుపత్రులను తీసుకుంటున్నాం. నిపుణులైన టెక్నీషియన్లను అందించడం.. వారి ద్వారా ప్రస్తుత ఓనర్లకు లబ్ది చేకూర్చడం కూడా జీవంతి లక్ష్యం ” అంటున్నారు అరుణ్.
ఆసుపత్రిని ఎంపిక చేసుకునేందుకు జీవంతి కొన్ని ప్రత్యేక నిబంధనలను విధించుకుంది. ఆసుపత్రి ఉన్న ప్రాంతం, 50 పడకలు ఉండడం, కనీసం 2 లక్షల జనాభా ఉండడం, వాణిజ్య లేదా నివాస ప్రాంతాల్లో సొంత భవనం కలిగి ఉండడం లాంటి నియమాలు పెట్టుకున్నారు. భవనం అమ్మేవాళ్లను కూడా భాగస్వాములుగా చేర్చుకుంటున్నారు. అలా ఆ ప్రాంతంపై పూర్తిస్థాయి నియంత్రణ తెచ్చుకుంటోంది జీవంతి.
కొంతమంది వైద్యులు జీవంతిలో పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు. మరికొంతమంది అవసరం మేరకు వచ్చి సేవలందిస్తుంటారు. తగినంతమంది రోగులు లేనప్పుడు పూర్తిస్థాయిలో వైద్యులను అందుబాటులో ఉంచడం గిట్టుబాటు కాదు. అందుకే కొంతమంది వైద్యులను అవసరం మేరకు పిలిపిస్తూ ఉంటామంటారు అరుణ్. ఆసుపత్రిని స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు పనిచేస్తున్న వైద్యులు కొనసాగుతారు. హాస్పిటల్ మేనేజ్‌మెంట్ చదివిన డాక్టర్లు అడ్మినిస్ట్రేటివ్ టీమ్‌లో ఉంటారు.
ఆసుపత్రిని స్వాధీనం చేసుకున్న తర్వాత జీవంతి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. “ స్వాధీనం చేసుకున్న తర్వాత పెద్ద ఎత్తున ప్రారంభ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఇది ఆ ప్రదేశంలోని వారందరి దృష్టిలో పడుతుంది. స్థానిక సెలబ్రిటీలను, లీడర్లను తీసుకురావడం ద్వారా మరింత ముందుకెళ్తాం. అవుట్ డోర్ ప్రచారం చేయడం ద్వారా జనాలకు చేరువవుతాం” అంటారు అరుణ్.
ఇలాంటి కార్యక్రమాల ద్వారానే కాకుండా అప్పుడప్పుడు ఆర్థోపెడిక్స్, గైనకాలజీ లాంటి విభాగాల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తూ ఉంటుంది జీవంతి. కమ్యూనిటీ కార్యక్రమాలు, హెల్త్ చెకప్‌లు, స్థానిక సంస్థలు, కాలనీల్లో ఇలాంటి కార్యక్రమాలను నిత్యం ఏర్పాటు చేస్తూ ఉంటుంది. “ పరిశుభ్రత పాటించడం, చేతులు కడుక్కోవడం వల్ల కలిగే లాభాలు, గ్యాస్ట్రో సమస్యలు లాంటి చిన్న చిన్న అంశాలపైన కూడా అప్పుడప్పుడూ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాం. సిబ్బంది అదనపు సమయంతో పాటు కొంతమంతి స్వచ్ఛంద కార్యకర్తలను కూడా ఈ కార్యక్రమాలకు వినియోగించుకుంటూ ఉంటాం ” అంటారు అరుణ్.
శస్త్రచికిత్సల విషయంలో జీవంతి ఎన్నో ఖచ్చితమైన ప్రమాణాలు పాటిస్తోంది. ఒక్క ఫిర్యాదు కూడా రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటోంది. చికిత్సా పద్ధతులపై అవగహన కలిగి ఉండడంతో ఇది సాధ్యమవుతోంది. మార్కెట్లో ఆయా శస్త్ర చికిత్సలకు వసూలు చేస్తున్న మొత్తాన్నే జీవంతి కూడా వసూలు చేస్తోంది. ప్రమాణాలకు అనుగుణంగా జీతాలు ఇస్తోంది. ఆసుపత్రిని స్వాధీనం చేసుకున్న 18 నెలల్లో లాభాలను ఆర్జించాలనేది జీవంతి లక్ష్యం.
గొలుసు కట్టు ఆసుపత్రులను ప్రారంభించాలనే జీవంతి లక్ష్యం ఇంకా ఎంతో ఉంది. దీనికి ఇంకా సమయం పడుతుంది. చిన్న పట్టణాల్లో మంచి ఆరోగ్య సేవలను అందించేందుకు ఎన్నో అవకాశాలు ఉండడంతో జీవంతి లక్ష్యం సులభం కానుంది. అయితే ప్రస్తుతానికి జీవంతి లక్ష్యం మహారాష్ట్ర, గుజరాత్ లలో పూర్తిస్థాయిలో విస్తరించడమే..!