సంకలనాలు
Telugu

వీళ్లు తయారుచేసిన సైకిల్ తొక్కితే మీరు వేరే ప్రపంచంలో విహరిస్తారు

team ys telugu
16th Apr 2017
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

వర్చువల్ రియాలిటీతో ఇప్పుడు ఏదైనా సాధ్యమే. ఇంట్లో కూర్చునే సరదాగా కొండల్లో సైక్లింగ్ చేయొచ్చు. బీచ్ లో ఇసుక తిన్నెల మీద హాయిగా సైకిల్ తొక్కొచ్చు. అంతేనా? నలుగురు ఫ్రెండ్స్ కలిసి గ్రూప్ సైక్లింగ్ పోటీలు పెట్టుకోవచ్చు. వీఆర్ సైక్లింగ్ తో ఫిట్నెస్ కూడా మెరుగవుతుంది. అయినా ఇదంతా ఎప్పటికి సాధ్యం అనుకోకండి. అలాంటి వీఆర్ సైకిల్ ని మన హైదరాబాద్ కుర్రాళ్లు తయారు చేశారు.

image


రోజూ సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి మంచిదే. కొందరు సైకిల్ తీసుకొని రోడ్ల మీద పరుగులు తీస్తుంటారు. అంత ఓపిక లేని వాళ్లు జిమ్ కి వెళ్లి సైక్లింగ్ చేస్తారు. నెలా రెండు నెలలు బాగానే ఉంటుంది. ఆ తర్వాత సైక్లింగ్ మీద ఇంట్రస్ట్ పోతుంది. మెల్లమెల్లగా సైక్లింగ్ ను మానేస్తుంటారు. ఇంట్లో చేసే వాళ్లు రూమ్ వాతావరణం బోర్ ఫీలయ్యి మధ్యలోనే డ్రాపౌట్ అవుతారు. సూరజ్, జిగ్నేశ్ కూడా అలా సైక్లింగ్ వదిలేసిన వాళ్లే. ఆ ఇబ్బందిని అధిగమించడానికి వాళ్లు వీఆర్ సైకిల్ ను తయారు చేశారు. హైదరాబాదుకి చెందిన ఆ కుర్రాళ్ల కంపెనీ పేరు లూప్ రియాలిటీ.

వీఆర్ హెడ్ సెట్ తెలుసు కదా. ఈ వీఆర్ సైకిల్ కూడా అలాంటిదే. సైకిల్ ఒక చోట ఫిక్స్ చేసి ఉంటుంది. వెనక చక్రానికి లూప్ రియాలీటి కిట్ అమర్చారు. ఆ చక్రం కదలికలను కంప్యూటర్కి అనుసంధానించారు. సైకిల్ మీద కూర్చుని వీఆర్ హెడ్ సెట్ పెట్టుకుంటే- వర్చువల్ ప్రపంచంలోకి వెళ్లిపోవచ్చు. ఇందులో రకరకాల మోడ్స్ క్రియేట్ చేసి ఉంటాయి. ఎత్తయిన కొండలు, బీచులు, సిటీ రోడ్లు, రేసింగ్ ట్రాకులు.. ఇలా కావాల్సిన లొకేషన్ ని ఎంపిక చేసుకోవచ్చు. సైకిల్ తొక్కుతున్నప్పుడు అచ్చం అదే లోకేషన్ లో విహరిస్తున్నట్టు ఉంటుంది. సైకిల్ కదలికలను బట్టి రియల్ టైంలో ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది. వీఆర్ సైకిల్ వెనక చక్రానికి అమర్చిన సిస్టమ్ కు సెన్సర్లు ఉంటాయి. అవి మనిషి కదలికలను గుర్తిస్తాయి. కొండలు ఎక్కుతున్నప్పుడు సైకిల్ కుదుపులకు గురైన ఫీలింగ్ కలుగుతుంది. ఇందుకోసం హై ఎండ్ గ్రాఫిక్స్ ఉపయోగించారు.

image


వీఆర్ సైకిల్ తో గ్రూప్ రేసింగ్స్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు. సపోజ్.. మీరు హైదరాబాదులో ఉన్నారు. మీ ఫ్రెండ్ ఎక్కడో యూఎస్ లో ఉంటున్నాడు. ఇద్దరూ కలిసి వీఆర్ సైక్లింగ్ లో పోటీ పెట్టుకోవచ్చు. అన్నట్టు వీఆర్ సైకిల్ తో మరో ప్రయోజనం కూడా ఉంది. ఫిట్ నెస్ కాపాడుకోవడానికి ఈ సైకిల్ ది బెస్ట్. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చినట్టుగా కంప్యూటరే మీ వర్కవుట్ ఎజెండా రూపొందిస్తుంది. రోజుకు ఎన్ని క్యాలరీలు బర్న్ చేయాలి, ఈ రోజు ఎన్ని క్యాలరీలు కరిగించారు, టార్గెట్ రీచ్ అవడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది లాంటి సమాచారమంతా కంప్యూటరే అందిస్తుంది. ఒకవేళ సైకిల్ తొక్కీ తొక్కీ మీరు డీ హైడ్రేట్ అయిపోతే- ఆట ఆటేమేటిగ్గా ఆగిపోతుంది. మీరు వాటర్ తాగిన తర్వాతే మళ్లీ గేమ్ రెజ్యూమ్ అవుతుంది.

లూప్ రియాలిటీ స్టార్టప్ ఆదిలోనే అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్ నుంచి వీళ్లకు మంచి సపోర్ట్ లభించింది. ఫస్ట్ చైనా కాంపీటీషన్ లో ఇండియా రీజియన్ నుంచి రెండో బహుమతి గెలుచుకున్నారు. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో వీరి ప్రాడక్టుకి మంచి రెస్పాన్స్ వచ్చింది. పోర్చుగల్ వెబ్ సమ్మిట్ లో కూడా మంచి అప్లాజ్ వచ్చింది. ఇలా కుర్రాళ్ల ప్రతిభకు మరెన్నో అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. భవిష్యత్తులో ఈ-స్పోర్ట్స్ దిశగా తమ కంపెనీని నడిపించడమే తమ లక్ష్యం అంటున్నారు లూప్ రియాలిటీ ఫౌండర్లు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags