వార్తలకు వేదిక వ్యూజ్ (Veooz)
మైక్రోసాఫ్ట్ మాజీ ఎండీ శ్రీని కొప్పోలు స్థాపించిన వ్యూజ్వార్త మాధ్యమాలకు వేదికగా నిలుస్తున్న వ్యూజ్ఒకే ప్లాట్ ఫాంపై పలు వార్తా వెబ్ సైట్లు
డిజిటల్ ప్రపంచంలో వార్తల ప్రసార వేగం విపరీతంగా పెరిగిపోయింది. వార్తను సులువుగా, వేగంగా చెప్పగలిగే వాళ్లదే రాజ్యం. భారతీయ కంపెనీలైన షార్ట్స్ (Shorts), వే2న్యూస్ (Way2News) ఇందుకు అతి పెద్ద ఉదాహరణలు. సులువుగా చదువుకునేలా వార్తలను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా వ్యూజ్ ఏర్పాటైంది.
మైక్రోసాఫ్ట్ మాజీ ఎండీ (భారత్) శ్రీని కొప్పోలు, హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ వాసుదేవ వర్మ, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ (NLP) నిపుణుడు డాక్టర్ ప్రసాద్ పింగళి కలిసి వ్యూజ్ ను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని వారందరికీ వారికి అనుగుణంగా వివిధ భాషల్లో వార్తలను అందించడం వీరి ముఖ్య ఉద్దేశం.
మైక్రోసాఫ్ట్ లో 21 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత శ్రీని కొప్పోలు పలు స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఆ క్రమంలోనే ప్రసాద్, వాసుదేవతో కలిసి వ్యూజ్ ను ఏర్పాటు చేశారు. టీంలో తాను కూడా భాగస్వామిగా ఉంటే బాగుంటుందని ఆయన అనుకున్నారు. “ సోషల్ మీడియాతోపాటు పలు న్యూస్ వెబ్ సైట్లలో ఎంతో సమాచారం రోజూ వెల్లడవుతోంది. ఈ సమాచారాన్నంతా క్రోఢీకరించి.. ఒక క్రమ పద్ధతిలో అమర్చడం ద్వారా వినియోగదారులకు అందించాలని భావించాం.. ఇలా చేయడం ద్వారా వినియోగదారులకు సులువుగా సమాచారం చేరుతుంది” అన్నారు శ్రీని కొప్పోలు.
ఇది ఎలా పనిచేస్తుంది..?
వార్తల కంటెంట్ విస్తృతంగా లభిస్తుండడంతో దాన్ని చదివే వాళ్లకు అనుగుణంగా వాటిని అమర్చడం వెనుక చాలా సంఖ్యలు, పరిష్కారాలు ఉంటాయి. వార్తలకు అనుగుణంగా వాటిని వర్గీకరించడం, అందుకు అనుగుణంగా వాటిని అమర్చడం పెద్ద పని. విభాగాల వారీగా వినియోగదారుడు వీటిని చదువుతాడు. చివరగా వినియోగదారుడు చదివేదాన్ని బట్టి వాటిని వర్గీకరిస్తారు.. అలా ఏ వార్తలకు చదువరులు అధిక ప్రాధాన్యమిస్తున్నారనే విషయం తెలిసిపోతుంది. ఏ ఏ ప్రాంతాలవారు ఎలాంటి వార్తలు చదువుతున్నారో కూడా తెలుసుకోవచ్చు.
అంతేకాదు.. మీకు ఏది నచ్చుతుందో కూడా వెబ్ సైట్ సూచిస్తుంది. పూర్తిస్థాయి కథనం చదవకముందే హెడ్ లైన్, ట్యాగ్ లైన్స్ ను బట్టి ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవచ్చు. దానికితోడు వీడియోలు, ఫోటోలతో ఆ కథనానికి మరింత హంగులు ఉంటాయి. ఎప్పటికప్పుడు వస్తున్న వార్తలను మీ ఆసక్తిని బట్టి మీకు నచ్చినవాటిని చదువుకునే అవకాశం ఉంది.
సవాళ్లు
వినియోగదారుడికి అనుగుణంగా ఈ వెబ్ సైట్ ను సమర్థంగా తీర్చిదిద్దిడం అతి పెద్ద సవాల్ అంటున్నారు వ్యవస్థాపకులు శ్రీని రాజు. “ రియల్ టైమ్ వార్తలకు టెక్నాలజీ జోడించి అమర్చడం పెద్ద ఛాలెంజ్. వార్తల పరిణామం, సంక్లిష్టతలకు అనుగుణంగా పనిచేయడం మెదడుకు పదునులాంటిదే” అంటారాయన.
వైబ్ సైట్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే క్రమంలో టీమ్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. ఎదురైన సవాళ్లన్నింటినీ బీటా స్టేజ్ లోనే పరిష్కరించగలిగింది.
మార్కెట్
బిజీ జీవితాలు గడుపుతున్న ప్రజలకు వారికి అనుకూలమైన సమయాల్లో చిన్నగా, వేగంగా వార్తలను చేరవేయడమే వ్యూజ్ లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంలో సిర్కా (circa), జైట్ (Zite) చాలా ఫేమస్. ఈ ఏడాది ఆరంభంలో సిర్కా (Circa) సుమారు 38 కోట్ల రూపాయలను పెట్టుబడుల రూపంలో పొందగలిగింది. భారత్ లో షార్ట్స్(Shorts), వే2న్యూస్ (Way2News) ఈ విభాగంలో బాగా పనిచేస్తున్నాయి. Shortsలో టైగర్ గ్లోబల్ పెట్టుబడులున్నాయి.
ఏడాది చివర్లో వ్యూజ్ పెట్టుబడులు కోరనుంది. ఈ విభాగంలో మరింత అభివృద్ధి చెందేందుకు టీమ్ కృషి చేస్తోంది. కంపెనీ పూర్తిస్థాయిలో పట్టాలెక్కిన తర్వాత ప్రకటనల ద్వారా ఆర్జించేలా ప్లాన్ చేస్తోంది.