సరికొత్త కాన్సెప్టుతో రీఎంట్రీ ఇవ్వబోతున్న బర్ప్!
జేబులో 500 ఉన్నాయి. మంచి రెస్టారెంట్ ఏదో తెలియదు. కొత్త ఊరికెళ్లాం. ఎక్కడ ఏం తినాలో ఐడియా లేదు. నలుగురు నాలుగు ఆప్షన్స్ ఇస్తారు. ఏది తేల్చుకోవాలో డైలమాలో ఉంటాం. ప్రతీ ఒక్కరికీ ఈ సమస్య కచ్చితంగా ఎదో ఒక సమయంలో ఎదురయ్యే ఉంటుంది. అలాంటి వాళ్లకు రెస్టారెంట్ల గురించి పూర్తి సమాచారం ఇవ్వాలనే కాన్సెప్ట్‌తో పుట్టుకొచ్చిందే బర్ప్! ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కాన్సెప్ట్ దాదాపు ఇండియాలోకి రాకముందే బర్ప్ వెబ్‌సైట్ చాలా పాపులర్ అయింది. 2009లో నెట్‌వర్క్ 18 చేతుల్లోకి వెళ్లాక మెల్లగా ఫేడవుట్ అయింది. అయితే, తాజాగా 2014లో రిలయన్స్ గ్రూప్..నెట్‌వర్క్ 18ని టేక్ ఓవర్ చేసిన తర్వాత.. బర్ప్ మళ్లీ ఇండియన్ ఫుడ్ టెక్ ఇండస్ట్రీలో పూర్వవైభవం కోసం కృషిచేస్తోంది.
అభిషేక్ చెజ్‌లానీ, ప్రదీప్ ప్రభుల మేనేజ్‌మెంట్‌లో కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో మళ్లీ ముందుకు వస్తోంది బర్ప్. జనవరి 2015న నెట్‌వర్క్ 18 కొనుగోలు చేసిన సోషల్ డిష్ డిస్కవరీ ఇంజిన్ "మైప్రెఫ్"కి అభిషేక్ కోఫౌండర్‌గా ఉన్నారు. వయాకామ్18లో ఎంటర్‌టైన్మెంట్, కన్‌స్యూమర్ ప్రొడక్ట్స్, డిజిటల్ డివిజన్స్‌లో బిజినెస్ ఫైనాన్స్ విభాగం బాధ్యతలు చూసిన అనుభవం ప్రదీప్‌కు ఉంది. ప్రస్తుతం బర్ప్‌లో అభిషేక్.. ప్రొడక్ట్, టెక్నాలజీ చూస్తుంటే.. ప్రదీప్ సేల్స్, మార్కెటింగ్ చూసుకుంటున్నారు.
అలా మొదలైంది..!
అమెరికా నుంచి ఇండియా తిరిగొచ్చిన దీప్ ఉభి, ఆనంద్ జైన్‌లు 2006 ఆగస్ట్‌లు బర్ప్‌ని మొదలుపెట్టారు. సైట్‌ని లాంచ్ చేయకముందు అల్వేష్ సింగ్ అనే వ్యక్తి కూడా దీనికి పనిచేశారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో స్ధానిక వ్యాపారాల గురించి రివ్యూలు అందించే యెల్ప్ అనే యాప్ స్ఫూర్తితో దీన్ని తయారుచేశారు. 2010లో రకరకాల కారణాలతో ముగ్గురూ బర్ప్‌ని విడిచిపెట్టారు. నెట్‌వర్క్ 18 సొంతం చేసుకున్న నాటి నుంచి బర్ప్ పతనం మొదలయింది. 2010 నుంచి 2014 వరకు.. మేనేజ్‌మెంట్ వ్యవహారాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది బర్ప్.
రియలన్స్ చేతుల్లోకి వెళ్లాక!
నెట్‌వర్క్ 18ని రిలయన్స్ సొంతం చేసుకున్న తర్వాత ప్రస్తుతతం బర్ప్‌లో 200 మంది పనిచేస్తున్నారు. అందులో 150 మంది కేవలం కంటెంట్ మేనేజ్‌మెంట్‌లోనే ఉన్నారు. దేశవ్యాప్తంగా 14 ప్రధాన నగరాల్లో రెస్టారెంట్లకు సంబంధించిన సమాచారం అందిస్తుంటే.. వాటిలో 6 నగరాల్లో మార్కెటింగ్ టీమ్స్ ఉన్నాయి. ఈ ఏడాది చివరికి పటిష్టమైన మార్కెటింగ్ టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
2015 అక్టోబర్‌లో 30లక్షల డిష్‌లతో పాటు 65,000 రెస్టారెంట్స్‌కి సంబంధించిన సమాచారంతో బర్ప్ రీలాంచ్ అయింది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్‌స్టోర్‌లలో బర్ప్ యాప్ దొరుకుతుంది. ప్రతీనెలా ఖచ్చితంగా 10వేల రెస్టారెంట్స్ డీటైల్స్‌ని డిజిటైజ్ చేస్తోంది బర్ప్.
బర్ప్ చేస్తున్న మార్పుల గురించి నెట్‌వర్క్ 18 చాలా ఉత్తేజంగా ఉంది. మిగతా సంస్ధలు కష్టాల్లో ఉన్న ఈ టైంలో కూడా ఫుడ్ స్పేస్‌లో మళ్లీ బర్ప్.. తన ప్రాభవాన్ని తిరిగి తెచ్చుకుంటుందని భావిస్తున్నాను- నెట్‌వర్క్ 18 చైర్మన్ అదిల్.
కొత్త ఫీచర్లు
జీపీఎస్ టెక్నాలజీతో దగ్గర్లోని రెస్టారెంట్స్, కేఫ్, బార్‌ల వివరాలు అందించడం కొత్త వెబ్‌సైట్‌లో స్పెషల్ ఫీచర్. వన్ టచ్‌తో హోండెలివరీ, పార్కింగ్, వైఫై ఫెసిలిటీలాంటి ఫిల్టర్లను వినియోగించుకునే విధంగా ప్లాట్‌ఫామ్‌ను తయారుచశారు.
"రీడెమ్షన్‌తో పాటు కూపన్ ఆఫర్స్‌ని ప్రకటించబోతున్నాం. సైట్‌మీద జరిగే ట్రాన్సాక్షన్లే మా బిబినెస్ మోడల్ అవబోతున్నాయి. కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తున్నాం. అందుకు సంబంధించి బ్యాక్ ఎండ్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. వచ్చే రెండేళ్లలో మరో 35 నగరాలకు విస్తరించడంతో పాటు 300మందిని రిక్రూట్ చేసుకుంటాం"-ప్రదీప్.
ఫుడ్ టెక్ ఇండస్ట్రీ కొత్త రూపు
ఇండియాలో ఫుడ్ టెక్ ఇండస్ట్రీ ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. కొత్త కొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతోంది. వినియోగదారులు పెరుగుతున్న సమయంలో కొత్త కొత్త స్టార్టప్‌లు పుట్టుకువచ్చి.. సంప్రదాయ మార్కెట్‌ను కాస్త దెబ్బతీశాయి. ఏడాదికి16 నుంచి 20 శాతం వృద్ధితో ఫుడ్ టెక్ ఇండస్ట్రీ 50 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా!
"దేశంలో యువత సంఖ్య పెరగడం, ఒక కుటుంబంలో ఇద్దరు సంపాదించడంలాంటి అంశాలు ఫుడ్‌టెక్ మార్కెట్ విస్తరణకు దోహదపడుతున్నాయి" ఇండియా కోషెంట్ ఫౌండర్ ఆనంద్.
మునుగుతున్న పడవ
గత కొన్నేళ్లుగా ఫుడ్ టెక్ ఇండస్ట్రీ చాలానే హడావుడి చేసింది. అయితే, 2015లో పెద్ద కంపెనీలే డీలా పడ్డాయి. కొన్ని సంస్ధలు ఉద్యోగులను తొలగించడం, కొన్ని ప్రాంతాల్లో సర్వీసులు నిలపివేయడంలాంటివి చేస్తే.. కొన్ని మొత్తానికే షట్టర్ దించేశాయి. దీంతో.. ఇండస్ట్రీ ఉనికి ప్రమాదంలో పడింది. డాజో, స్పూన్‌జాయ్‌లు గత ఏడాది అక్టోబర్‌లో మూతబడితే.. టైనీ ఔల్ నాలుగు చోట్ల ఆఫీసులను మూసేసి 300మంది ఉద్యోగులను తొలగించింది. ఈ మధ్యనే 110 మిలియన్ అమెరికన్ డాలర్ల ఫండింగ్ దక్కించుకున్న ఫుడ్‌పాండా కూడా 300మందిని తొలగించింది.
అయితే, ప్రదీప్ చెబుతున్నదాని ప్రకారం, నెలనెలా 500 శాతం వృద్ధి సాధిస్తోంది బర్ప్. ప్రస్తుతానికి 500మంది బర్ప్‌లో అడ్వర్టయిజ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో బర్ప్ రీలాంచ్‌తో మార్కెట్‌లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ మోడల్ కోసం మిగతా ప్లేయర్స్ అంతా తాపత్రయపడుతుంటే.. బర్ప్ మాత్రం కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ని పెంచడంపైనే దృష్టిపెట్టింది. రాబోయే రోజుల్లో ట్రాన్సాక్షన్ బేస్‌మీద రెవెన్యూ మోడల్ ఉంటుంది. అయితే, గతంలో బర్ప్‌కి ఉన్న పేరుని తిరిగి తెచ్చకోవాలంటే ప్రతీ చిన్నవిషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.