హ్యాంగోవర్‌ను వదిలించే స్టార్టప్ ఇది !

హ్యాంగోవర్‌తో ఇబ్బందిపడేవాళ్లకు పరిష్కారంభారత్ లో ఏకైక హ్యాంగోవర్ నిర్మూలన ప్రోడక్ట్విస్తరించేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు

హ్యాంగోవర్‌ను వదిలించే స్టార్టప్ ఇది !

Sunday August 30, 2015,

3 min Read

పార్టీల వల్ల కలిగే అతి పెద్ద నష్టం మరుసటి రోజు ఉదయం హ్యాంగోవర్‌ బారినపడడం. ఈ సమస్య ఒక్కో మనిషికి ఒక్కోలా ఉండొచ్చు. కానీ ప్రభావం మాత్రం ఇంచుమించు ఒకేలా ఉండొచ్చు. రోజంతా నీరసంగా ఉంటారు. దాని ప్రభావం 24 గంటల వరకూ ఉండే అవకాశమూ ఉంది.

హ్యాంగోవర్ నుంచి తప్పించుకోవాలంటే ఆల్కహాల్‌ను తీసుకోకుండా ఉండడం మొదటి ఆప్షన్. తక్కువగా తాగడం రెండో ఆప్షన్. ఇక ఫుల్లుగా తాగితే మాత్రం ఆ సమస్య తప్పదు. దీన్ని పోగొట్టుకునేందుకు ఇంటి చిట్కాలు చాలానే ఉన్నాయి. అయితే.. వందశాతం అవి పనిచేస్తాయని నమ్మలేం.

బయోటెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ధృవ్ త్రివేది, వందన పిళ్లై ఇద్దరూ హ్యాంగోవర్‌కి పరిష్కారం కనుగొన్నారు. అదే యాంటి – డిజ్ (Anti-Dizz) ఆల్కహాల్ తాగడం వల్ల ఉత్పత్తి అయ్యే విషపదార్థాలపై ఇది పనిచేస్తుంది. హ్యాంగోవర్ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ సమస్యతో సతమతమయ్యే వాళ్లు ఎవరైనా యాంటి-డిజ్ డ్రింక్‌ను తీసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవని ఆ ఇద్దరు మిత్రుల బృందం చెబ్తోంది. ప్రస్తుతానికి ఇది ముంబైలో మాత్రమే సాచెట్లు, పెట్ బాటిల్స్ రూపంలో లభిస్తోంది. హ్యాంగోవర్ తీవ్రత జెండర్, ఏజ్ మరియు ఆల్కహాల్‌ను బట్టి ఉంటుంది. అయితే యాంటి-డిజ్ మాత్రం ఈ లక్షణాలతో ఏమాత్రం సంబంధం లేకుండా పనిచేస్తుంది.

image


ముంబైలోని డాక్టర్ డి.వై.పాటిల్ యూనివర్సిటీ నుంచి ధృవ్, వందన డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. 2011లో రీఇన్వెంట్ లైఫ్ సైన్సెస్ (Reinvent Life Sciences -RLS) లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. వాళ్ల మొదటి ఉత్పత్తి యాంటి-డిజ్. ఇందులో మరో ముగ్గురు కూడా భాగస్వాములయ్యారు. TiE బెంగళూరు నిర్వహించిన అంతఃప్రేరణ (Antah Prerana) విభాగంలో యాంటి-డిజ్ విజేతగా నిలిచింది. 

“నేను గుజరాత్ లోని సవరకుండ్ల అనే చిన్న గ్రామం నుంచి వచ్చాను. బారూచ్ పట్టణంలో పెరిగాను. ఆ తర్వాత బయోటెక్నాలజీలో ఇంజినీరింగ్ చేయడానికి ముంబై పయనమయ్యాను. ఈ సమయంలో నేను చాలా నేర్చుకున్నా. జ్ఞానం పెంపొందించుకోవడానికి చిన్న పట్టణాలతో పోల్చినప్పుడు పెద్ద నగరాల్లో ఉండే అవకాశాలను గమనించాను. కాలేజీలో ఉన్నప్పుడే నేను వ్యాపారవేత్తగా మారాలని నిర్ణయించుకున్నా. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఫార్మాస్యుటికల్ స్టార్టప్‌లో పనిచేయడం వల్ల అది ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాను. అయితే నా నిర్ణయం మా ఇంట్లో వాళ్లను సంతృప్తి పరచలేదు. కానీ కలలను సాకారం చేసేందుకు వాళ్లు సహకరించారు.” అని చెప్పారు ధృవ్.

వినడానికి కాస్త ఆశ్చర్యం కలిగించినా యాంటి-డిజ్ ఆలోచన తన సొంత హ్యాంగోవర్ నుంచే పుట్టుకొచ్చింది. “రీయూనియన్ పార్టీలో చాలా బాగా ఎంజాయ్ చేశాను. అవి చాలా సంతోషకరమైన క్షణాలు. తనివితీరా తాగాం ఆ రోజు. మరుసటిరోజు నేను మధ్యాహ్నం 12 గంటలకు లేచాను. తలంతా చాలా భారంగా అనిపించింది. మైకంగా, వికారంగా అనిపించింది. చాలా భయంకరమైన పరిస్థితి అది. నా స్నేహితులదీ అదే సమస్య. అసలు హ్యాంగోవర్ ఎలా వస్తుంది.. దాన్ని నివారించడం ఎలా.. అనే ఆలోచన అప్పుడే కలిగింది..” అన్నారు ధృవ్.

యాంటి-డిజ్ వ్యవస్థాపకులు ధృవ్

యాంటి-డిజ్ వ్యవస్థాపకులు ధృవ్


కాలేజీ ప్రయోగశాలలో చాలాకాలం పాటు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. చివరకు R&D, మార్కెట్ అనాలిసిస్, వినియోగదారుల సర్వేలను గమనించాక ఓ ప్రొడక్టును తీసుకొచ్చారు. యాంటి హ్యాంగోవర్ ప్రొడక్టులకు మార్కెట్లో చాలా పెద్ద గిరాకీ ఉందని ధృవ్‌కు అర్థమంది. హ్యాంగోవర్ వల్ల చాలా కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. “ భారత్‌లో ఆల్కహాల్ వినియోగం ఏటా 30 శాతం పెరుగుతోంది. వినియోగం పెరిగేకొద్దీ హ్యాంగోవర్ తీవ్రత కూడా పెరుగుతుంది. హ్యాంగోవర్ వల్ల భయంకర లక్షణాలేవీ ఉండవు. దాని వల్ల నిద్ర పట్టదు, దేనిపైనా దృష్టి పెట్టలేం. ఏ పనీ సక్రమంగా చేయలేం. తీవ్రత పెరిగితేనే డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం, ఆందోళన పెరగడం, నేర ప్రవృత్తిని ఎంచుకోవడం జరుగుతుందని సర్వేలు వల్లడిస్తున్నాయి. హ్యాంగోవర్ వల్ల 300 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పాదనను కోల్పోతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి” అని వివరించాడు ధృవ్.

ప్రస్తుతం యాంటి-డిజ్ ముంబైలోని 87 ఔట్‌లెట్లలో లభిస్తోంది. ఈ ప్రొడక్టును అమ్మాల్సిందిగా మద్యం షాపుల యజమానులను ఒప్పించడం చాలా కష్టమయిందని చెప్పారు ధృవ్. దీనికంతటికీ కారణం అవగాహన లేకపోవడమే. అయితే మందుల షాపులు, పబ్బుల్లో మాత్రం దీనికి మంచి స్పందన లభించింది. “ ప్రస్తుతానికి భారత్‌లో మాకు కాంపిటీషన్ లేదు. విదేశీ ఉత్పత్తులతో పోల్చినప్పుడు మేము చాలా ముందున్నాం..” అని చెప్పాడు ధృవ్. ముంబై తర్వాత బెంగళూరు, ఢిల్లీల్లోని పబ్బులు, బార్లు, హోటళ్లు, మందుల షాపులు, రిటైల్ వైన్ షాపుల్లో విక్రయించాలని ప్లాన్ చేశారు. ఈ-కామర్స్ పోర్టళ్ల ద్వారా అమ్మాలనే ఆలోచన కూడా ఉంది.

కేవలం 24 మందితో దీన్ని ప్రారంభించడం, అనుభవం లేకపోవడం పెద్ద సవాలే. నిర్ణయాలు వేగంగా తీసుకోకపోవడం వల్ల ఆచరణ కూడా ఆలస్యమవుతుంది. “ విశ్వసనీయత మేం ఎదుర్కొన్న పెద్ద సమస్య. మేమేమీ అత్యున్నత విద్యాసంస్థల నుంచి రాలేదు. మాకు ఎంబీఏలు లేవు. ఫార్మా, హెల్త్ కేర్ రంగాల్లో పెద్దగా అనుభవం కూడా లేదు ” అని కొద్దిగా ఆందోళనపడ్డాడు ధృవ్. 

ఇప్పుడు ఈ స్టార్టప్ లో ఏడుగురు భాగస్వాములున్నారు. దీన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మరిన్ని పెట్టుబడులకోసం ఎదురుచూస్తున్నారు.