IPL,WWE,TVF నుంచి స్టార్టప్స్ ఏం నేర్చుకోవచ్చు..?

IPL,WWE,TVF నుంచి స్టార్టప్స్ ఏం నేర్చుకోవచ్చు..?

Sunday May 08, 2016,

3 min Read


డిజిటల్ కంటెంట్ ప్రొడక్షన్ కు ఇటీవలి కాలంలో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ రంగంలో దూసుకుపోతున్న ద వైరల్ ఫీవర్ పిక్చర్స్ (టీవీఎఫ్)లో టైగర్ గ్లోబల్ సంస్థ కోటి డాలర్లు అంటే.. 67 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. టీవీఎఫ్.. ఔత్సాహిత పారిశ్రామికవేత్తలు, వెంచర్ క్యాపిటలిస్టులకు ఒక ఐకాన్ గా మారింది. ఈ సంస్థ రూపొందించి పెట్టిన ప్రతి ఎపిసోడ్ ను యూట్యూబ్ లో లక్షల మంది తిలకిస్తున్నారు. 

టూవీఎఫ్ వ్యవస్థాపకుడు అర్నబ్ కుమార్ చెప్పిన స్టోరీలను మొదట్లో ఎంటీవీ తిరస్కరించింది. దీంతో సొంతంగా టీవీఎప్ స్థాపించి ఫిలిమ్స్ తీసి… యూట్యూబ్ లో పెడుతున్నారు. కట్ చేస్తే.. టీవీఎఫ్ పిక్చర్స్ నెటిజన్లలో చాలా పాపులరయ్యింది. “తు బీర్ హై “ అనే ఎపిసోడ్ బీభత్సంగా క్లిక్ అయింది. అంతర్జాతీయ సంస్థల ప్రశంసలను సైతం అందుకుంది. స్టోరీలో దమ్ముంటే ఆదరణ, డబ్బు అదే వస్తుందని నిరూపిస్తోంది ఈ వైరల్ ఫీవర్. కాన్సెప్ట్ కొత్తగా ఉంటే ఏ స్టార్టప్ అయినా సక్సెస్ అయి తీరాల్సిందే అని చెప్తోంది వైరల్ ఫీవర్ పిక్చర్స్. అలాంటి వాటిలో బెస్ట్ అనిపించుకున్నవి ఏంటో ఓసారి చదవండి. 

image


క్రికెట్ నుంచి పాఠాలు

భారత్ లో అత్యంత ఆదరణ పొందిన క్రీడ క్రికెట్. అంతా మేల్ డామినేషనే అనుకుంటాం గానీ… అయితే ఐపీఎల్ ను తిలకించిన ఆడియన్స్ లో… 36 శాతం మంది మహిళలేనని తేలింది. అంటే అమ్మాయిల్లోనూ క్రికెట్ పై క్రేజ్ పెరుగుతుందన్నమాట. మరి కొన్నేళ్లలో మేల్ అండ్ ఫిమేల్ ఆడియన్స్ చెరిసగం అయిపోతారు. దానికి కారణం ఐపీఎల్ అని వేరే చెప్పక్కర్లేదు.

మార్పు మంచిదే

ఐపీఎల్ మ్యాచ్ లను ప్రైమ్ టైంలోనే టీవీల్లో ప్రసారం చేస్తున్నారు. వీక్ నైట్స్ లేదా వీకెండ్స్ లో టెలికాస్ట్ అవుతున్నాయి. టెస్టులు, వన్డేలను డే టైంలో ప్రసారం చేస్తున్నారు.

పూర్తిస్థాయి ఐపీఎల్ మ్యాచ్ చూడాలంటే మూడు గంటలు చాలు. అంటే ఒక సినిమా చూసినట్లన్నమాట. అదో ఎంటర్టయిన్మెంట్ ఆప్షన్ మాత్రమే.

ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ లో భావోద్వేగాలుంటాయి. ఐపీఎల్ మ్యాచుల్లో అవేమీ ఉండవు. ఒక సిటీ తరపున ఆడేవారెవరో వారికే తెలియదు.

అయినా రోజు రోజుకూ ఐపీఎల్ కు ప్రాధాన్యత పెరుగుతోంది. కేవలం ఆట కోసమే కాదు… ఐపీఎల్ లో వేరే విషయాలూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మ్యాచ్ లకు సరిపడ గ్లామర్ అద్దారు. క్రికెటర్ల ఆఫ్ ద గ్రౌండ్ ఎఫైర్లపై కూడా అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.

 ఐపీఎల్ లో ఎక్స్ ట్రాలు

• అందమైన అమ్మాయిలు, యాంకర్లు, కామెంటేటర్లు, రిపోర్టర్లు, చీర్ లీడర్స్

• ఐపీఎల్ ఫ్రాంఛైజ్ థీమ్ ఆల్బమ్స్, ఆంథెమ్స్. 

• గేమ్ ముందు, ముగిసిన తర్వాత ఎంటర్టయిన్మెంట్

• కామెంటేటర్ల అతిశయోక్తులు సైతం ఆకట్టుకుంటున్నాయి. వారి పొగడ్తలపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

• భారీగా బాణసంచా కాల్చడం. డీజే మోత ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.

image


 WWE అట్రాక్షన్

• గతంలో WWEని గతంలో WWF (వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్) అని పిలిచేవారు. పాశ్చాత్యదేశాల్లో చాలా ఫేమస్ క్రీడ. మన దేశంలోనూ దీన్ని చూసే టీవీ ఆడియన్స్ తక్కువేమీ కాదు. ఇది కూడా క్రికెట్ లాగే పురాషాధిక్య క్రీడ. అయితే దీనికి ప్రేక్షకుల్లో 36 శాతం మంది మహిళలుండటం విశేషం.

HBO కన్నా WWEనే ఎక్కువమంది చూస్తున్నారా?

నమ్మడానికి కష్టంగా ఉన్నా… ఇది నిజమే. ప్రపంచ ప్రఖ్యాత HBO ఛానల్ కన్నా WWF ఛానల్ నే ఎక్కువమంది చూస్తున్నారు. WWEలో హింస, రక్తపాతం, కోపాలు తాపాలు అన్నీ ఉంటాయి. రెజ్లింగ్ అంటే మనకు అర్థం కాకపోయినా… చూడటానికి ఇష్టపడతాం. చిన్న పిల్లలు కూడా రెజ్లింగ్ వస్తుంటే టీవీలకు అతుక్కుపోతారు.

image


WWF మండే నైట్ రా … 12 వందల ఎపిసోడ్లను ప్రసారం చేసింది. ఒక్కో ఎపిసోడ్ మూడు గంటల నిడివి ఉంటుంది. WWEకి మాస్ ఫాలోయింగ్ ఉంది. నిడివి ఎక్కువైనా జనం ఓపికతో చూస్తున్నారు. 90ల్లోనే WWE సీఈఓ విన్స్ మెక్ మోహన్ … దీన్నో రెజ్లింగ్ షోలా కాకుండా… స్పోర్ట్స్ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ గా మార్చేశారు. దీంతో అన్ని వర్గాల్లోనూ ఆదరణ పెరిగింది. ఇప్పుడు WWEని యాక్షన్ సోప్ ఒపేరాగా మార్చాలనుకుంటున్నారు. 

WWE ఎంత పాపులరయ్యిందంటే… అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ షోల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పలు షోల్లో పాల్గొన్నారు కూడా. డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని బహిరంగంగానే మద్దతిచ్చింది WWE. కొత్త కొత్త కాన్సెప్టులతో అందర్నీ కట్టిపడేస్తోంది.

కొత్త కాన్సెప్టు… ప్రజలను ఒప్పిస్తే సక్సెస్ కొట్టడం పెద్ద కష్టం కాదు. ఈ విషయాన్ని టీవీఎల్, ఐపీఎల్, WWE నిరూపించాయి. స్టార్టప్స్ సైతం ఇలా కొత్త కాన్సెప్టులతో వస్తే… విజయం సాధించడం ఖాయం.

(శుభాంకర్ భట్టాచార్య రాసిన వ్యాసంలోనుంచి తీసుకున్నవి…)