Brands
Discover
Events
Newsletter
More

Follow Us

twitterfacebookinstagramyoutube
ADVERTISEMENT
Advertise with us

ఆటోమేటేడ్ చెస్ బోర్డ్ సృష్టించిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు

మొదట దృష్టిలోపం ఉన్న వాళ్లకోసం తయారీఅనూహ్యంగా సామాన్యుల నుంచి విపరీతంగా పెరిగిన డిమాండ్వివిధ సమావేశాల్లో ఆటోమేటెడ్ చెస్ బోర్డుకు మంచి స్పందనబోర్డ్ గేమ్స్‌ను ఉత్సాహంగా ఆడేలా చేయడమే వీళ్ల ఆలోచనఎదురుగా ఓ మనిషి కూర్చుని ఆడుతున్నట్టే ఫీల్థ్రిల్ ఫీలవుతున్న జనాలు

ఆటోమేటేడ్ చెస్ బోర్డ్ సృష్టించిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు

Thursday July 23, 2015 , 4 min Read

కాలేజీ విద్యార్థులు రెండు రకాలు. ఒకరు.. కాలేజ్ వెళ్లామా, వచ్చామా.. టైం పాస్ చేశామా.. ఏదో ఒకటి చదివి డిగ్రీ పాస్ అయ్యామా అనేవాళ్లు. రెండో రకం పూర్తిగా భిన్నం. కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచే వాళ్లకు ఏదో చేయాలని తపన. ఇక ఇంజనీరింగ్‌ వంటివాటిల్లో చేరిన పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు. ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్‌, కంప్యూటర్లతో కుస్తీ పడ్తూ.. వినూత్నమైన వాటిని కనుగొని మంచిపేరు సంపాదించాలని ఆత్రపడేవాళ్లు.

ఇప్పుడు మీరు తెలుసుకోబోయే భవ్య గోహిల్, అతుర్ మెహ్తా కూడా రెండో బాపతకు చెందిన వాళ్లే. ముంబైలోని కెజె సోమయ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చదవడానికి వచ్చారు. అయితే కాలేజీకి వచ్చేంత వరకూ ఒకరి గురించి ఒకరికి తెలియదు. అక్కడికి వచ్చాక ఇద్దరి ఆలోచనలూ కలిసాయి. చదువుతో కుస్తీ పడుతూనే టెక్ సమావేశాలు, హ్యాకథాన్స్‌కు హాజరయ్యేవారు. తమ ఆలోచనలతో చిన్న ప్రాజెక్ట్ రిపోర్టులు అక్కడ సమర్పించేవారు. మొదటి సెమిస్టర్‌లో వాళ్లకు లభించిన ఖాళీ సమయాన్నంతటినీ తమ కలల ప్రాజెక్ట్ కోసమే ఇద్దరూ వెచ్చించేవారు. ఈ నేపధ్యంలో యువర్ స్టోరీ వీళ్లకు కదిపింది. ఈమెయిల్ ద్వారా వాళ్ల నుంచి వాళ్లను అడిగి కొన్ని విషయాలను రాబట్టింది.

image


సాధారణంగా ఫ్రెషర్స్ మా లాంటి వినూత్న తరహా ప్రాజెక్టుల జోలికి రారు. కానీ మా అదృష్టం కొద్దీ సోమయా విద్యావిహార్ నిర్వహించే RiiDL - (రీసెర్చ్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ డిజైన్ ల్యాబ్) రీసెర్చ్ ల్యాబ్ నుంచి పిలుపొచ్చింది. ఇక్కడ ఇన్ హౌస్ ల్యాబ్స్, స్టార్టప్ ఫండింగ్, మెంటారింగ్, బూట్ క్యాంప్స్, ఏంజెల్ నెట్వర్క్, ప్రాజెక్ట్ మానిటరింగ్ వంటివి జరిగేవి. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు సరైన పరిష్కారం కనుగొనే దిశగా అక్కడ ఎంతో మంది కృషి చేస్తూ ఉంటారు. స్కిల్ డెవలప్మెంట్‌తో పాటు కొత్త వెంచర్లకు అవసరమైన ప్రోత్సాహాన్నీ అందిస్తారు.

ఆలోచనల్లో స్పష్టత ఉండడంతో పాటు సరైన మెంటారింగ్‌, ఆర్థిక ప్రోత్సాహం కూడా దొరకడంతో ఈ ఇద్దరికీ బుర్రనిండా పనిదొరికింది.

అతుర్ మెహతా, భవ్య గోహిల్ - ఆటోమేటెడ్ చెస్ సృష్టికర్తలు

అతుర్ మెహతా, భవ్య గోహిల్ - ఆటోమేటెడ్ చెస్ సృష్టికర్తలు


''రెండో ఏడాది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో ఉండగా మేం కన్ని ప్రోటో టైప్ కాన్సెప్టులకు రూపకల్పన చేశాం. RiiDLలో రూపొందించిన వాటిని మేకర్ ఫెయిర్, గోద్రెజ్, క్యాప్ జెమిని, వాస్సప్, ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్‌పూర్ ఈవెంట్లలో ప్రదర్శనకు ఉంచాము. అక్కడ మా ఆలోచనలకు మంచి ప్రోత్సాహమే లభించింది, అదే మేం మరింత వేగంగా ముందుకు కదిలేందుకు దోహదపడింది అంటారు'' అతుర్

ఈ ఇద్దరి స్నేహితుల ఆలోచన ఒక్కటే. అదేంటంటే బోర్డ్‌ గేమ్స్‌ను మరింత ఇంటరాక్టివ్‌గా తయారు చేయడమే. అదే సమయంలో కేవలం బొమ్మలతో ఆడుతున్నాం అనే ఫీల్ పోగొట్టేందుకు వాటిల్లో ప్రాణాన్ని నింపగలగాలి. ఎదురుగా ఎవరితోనో కూర్చుని ఆడుతున్నాం అనేలా బోర్డ్ గేమ్స్ ఉండాలనేది వీళ్ల సింగిల్ టార్గెట్. అదే సమయంలో ఇద్దరికీ చెస్ అంటే అమితమైన ఇష్టం. మెదడును పదును చేస్తూ ప్రత్యర్థి కంటే ముందు నాలుగు ఎత్తులు ఆలోచించగలిగే ఆ ఆట అంటే ఇద్దరికీ ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. అందుకే ఆటోమేటేడ్ చెస్ బోర్డ్ తయారు చేయాలని ఇద్దరూ సంకల్పించారు. చెస్ ఆటోమేటెడ్ అనేది ఓ ఇంటరాక్టివ్ చెస్ బోర్డ్. ఇక్కడ ఒక వ్యక్తి కంప్యూటర్‌తోనే గేమ్ ఆడతాడు, కానీ అదే సమయంలో ఎదురుగా వ్యక్తి ఉన్నట్టుగానే బోర్డ్‌పై రియల్ గేమ్‌ ఆడిన ఫీల్ ఉంటుంది.

కాస్త కన్ఫ్యూజన్‌గా ఉందా.. కంప్యూటర్‌లో గేమ్ ఆడేందుకూ దీనికి తేడా ఏంటో అర్థం కావడం లేదా.. ? అయితే ఈ వీడియో చూడండి. మీకు స్పష్టంగా తెలిస్తుంది.


మొదట్లో దీన్ని దృష్టిలోపం ఉన్నవాళ్ల కోసం తయారు చేయాలని భావించారు. ఇందుకోసం ఎంతో కష్టపడ్డారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లైండ్ దగ్గరికి వెళ్లి అక్కడ చాలామందితో మాట్లాడారు. వాళ్ల ఫీడ్ బ్యాక్ తీసుకుని అనేక మార్పు, చేర్పులు చేశారు. చెస్ ఆడేటప్పుడు వాళ్లు పడే ఇబ్బందులు ఏంటి, ఏం చేస్తే సులువుగా ఆట ఆడగలరో తెలుసుకుని ప్రోటో టైప్ మొదలుపెట్టారు. నాలుగు నెలల కష్టపడిన తర్వాత ఓ రూపం వచ్చింది. దీన్ని చూసిన వారంతా అచ్చెరువొందారు. చెస్ లవర్స్‌తో పాటు టెక్ అభిమానుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఇదే సమయంలో అనూహ్యమైన ఫీడ్ బ్యాంక్, సలహాలు, సూచనలు కూడా ఈ టీమ్ అందుకుంది.

image


ప్రస్తుతం కరెంట్ వర్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ దశలో ఉంది. మొదట చైనాలో తయారీ అనుకున్నారు కానీ క్వాలిటీ, రవాణా విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్టు గుర్తించారు. ఎవరెవరికో ప్రొడక్ట్ ఇచ్చేకంటే మన దేశంలోనే తయారు చేస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు. మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్‌కు కూడా దోహదపడ్తుందని ఇక్కడే ఉత్పత్తికి సిద్ధపడ్డారు. మన దేశంలో తయారయ్యే మన ప్రొడక్ట్‌ అని గర్వంగా చెప్పేందుకు వీలవుతుందని ఈ తరహా అభిప్రాయానికి వచ్చింది అతుర్ మెహతా అండ్ భవ్య గోహ్లీ టీం. మొదట వాళ్ల రీసెర్చ్ ల్యాబ్‌లోనే చిన్న అసెంబ్లింగ్ చేద్దామని నిశ్చయించుకున్నారు. ఓ స్టార్టప్‌కు ఇదే మెరుగైన సౌలభ్యం. ఖర్చు, క్వాలిటీ విషయంలో మాకు పట్టు ఉంటుంది. కస్టమర్లతో మెరుగైన రిలేషన్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఇది దోహదపడ్తుందని చెప్తారు అతుర్.

2013లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లైండ్‌లో పలు దఫాల్లో చర్చలు జరిపిన తర్వాత నాలుగు ప్రోటోటైప్స్‌ను సిద్ధం చేశారు. ఇందులో కేవలం ఇంజనీరింగ్ ఒక్కటే కాకుండా ఎలక్ట్రానిక్స్ సహా వివిధ విభాగాల సాయం కూడా ఎంతో అవసరమని రానురాను గుర్తించారు. ఎలక్ట్రానిక్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ ఇద్దరికీ ప్రతీ రోజూ ఒక్క అనుభవం లాంటిదే ఎదురైంది. అందుకే మొదట ఎలక్ట్రానిక్స్‌తో ప్రారంభించి, ఎలక్ట్రానిక్స్, ఆ తర్వాత ఆటోమేషన్ వరకూ ఒక్కో పనీ చేసుకుంటూ వెళ్లారు. గత అక్టోబర్‌లో జరిగిన రోమ్ మేకర్ ఫెయిర్‌లో వీళ్లు మొదటిసారి ప్రొడక్ట్ ప్రదర్శించినప్పటి నుంచి చాలా మంది ఎంక్వైరీలు వెల్లువెత్తాయి. ఎయిర్‌పోర్ట్ లాంజ్స్, క్లబ్స్, రిసార్ట్స్, సొసైటీలు, కెఫేలు, హోటల్స్‌తో పాటు సాధారణ కస్టమర్లు కూడా ఎంతో ఉత్సాహంగా వీళ్లను సంప్రదించడం మొదలుపెట్టారు.

ప్రదర్శనలో ఆసక్తిగా తిలకిస్తూ ఫోటోల్లో బంధిస్తున్న సందర్శకులు

ప్రదర్శనలో ఆసక్తిగా తిలకిస్తూ ఫోటోల్లో బంధిస్తున్న సందర్శకులు


దీంతో వీళ్లపై బాధ్యతతో పాటు బరువు కూడా పెరిగింది. ఎంతో నమ్మకం పెట్టుకున్న తాము మెరుగైన ప్రొడక్ట్ కస్టమర్‌కు అందజేయాలనే ఒత్తిడీ ఎక్కువైంది. అందుకే రేయింబవళ్లూ కష్టపడ్తున్నామంటారు. ' చెస్ క్లబ్స్ నుంచి మాకు అనుకోని ఆర్డర్లు, ఎంక్వైరీలు వస్తున్నాయి. వాళ్లకోసం కస్టమైజ్డ్ వర్షన్స్ కావాలని అడుగుతున్నారు. వాళ్ల కోసం ఆర్ అండ్ డి మొదలుపెడ్తాం. తర్వాత బ్యాచ్‌లో ప్రొడక్ట్ అందిస్తామని చెప్తున్నాం' అంటారు భవ్య. మొదట చిన్న చిన్న బ్యాచుల్లోనే ఈ గేమ్ తయారు చేద్దామని ఈ సోదరద్వయం అనుకుంటోంది. అయితే కేవలం ఫిజికల్ బోర్డ్‌కే పరిమితం కాకుండా ఆన్‌లైన్ గేమ్ ప్లే కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒక కమ్యూనిటీని తయారు చేసి ఆన్ లైన్ ద్వారా ఒకరితో ఒకరు గేమ్స్ ఆడుకునే విధంగా దీని రూపకల్పన జరుగుతోంది. ప్రపంచంలో ఏ మూలనో ఉన్న మీ స్నేహితులో లేక మీ పోటీదార్లతోనే మ్యాచ్ ఆడొచ్చు. అది కూడా వాళ్లు ఎదురుగా కూర్చుని ఆడుతున్న ఫీల్‌తో.

image


ప్రస్తుతం హార్డ్‌వేర్ హంగామా కూడా దేశంలో మొదలైనట్టే అనిపిస్తోంది. ఎంతసేపూ ఈ-కామర్స్, సాఫ్ట్‌వేర్ ఒక్కటే కాకుండా ఈ రంగంలోనూ 2014 నుంచి జోష్ కనిపిస్తోంది. చాలా స్టార్టప్స్ ఈ దిశగా ప్రోత్సాహకర ప్రయత్నమే చేస్తున్నాయి. ప్రభుత్వ make in India కలలు సాకారమవుతాయని ఆశిద్దాం.

website