ఆంధ్రా స్టార్టప్ లకు ఫండింగ్ సొల్యూషన్ అందిస్తామంటున్న ‘అల్కోవ్’
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత స్టార్టప్ కల్చర్ ఉన్న నగరం వైజాగే. ఇప్పుడిప్పుడే స్థానికంగా మీటప్స్, స్టార్టప్ టాక్స్, ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి వచ్చిన కొన్ని స్టార్టప్ లు ఫండ్ రెయిజ్ కూడా చేశాయి. మరికొన్ని బూట్ స్ట్రాపుడ్ కంపెనీలు సస్టేనబుల్ రెవెన్యూ మొడల్ తో ముందుకు పోతున్నాయి. కొత్తగా ప్రారంభమవుతున్న స్టార్టప్ లకు ఫండింగ్ అందించే స్పేస్ లో ఎంట్రీ ఇచ్చిన అల్కోవ్ పార్ట నర్స్ ఇప్పటి వరకూ 20 స్టార్టప్ లను షార్ట్ లిస్ట్ చేశాయి.
“ఫండింగ్ అందించడం ద్వారా స్థానికంగా కొన్ని బ్రాండ్ లను తయారు చేయాలని అనుకుంటున్నాం,” దీపక్ మాదాల
దీపక్ మాదాల దీని కో ఫౌండర్. అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్టప్ లపై పనిచేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ కల్చర్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని అంటున్నారాయన.
మెంటార్షిప్ ప్రధాన లక్ష్యం
స్టార్టప్ కంపెనీలను ఎంతో ఉత్సాహంగా ప్రారంభిస్తారు. అంతే తొందరగా దాన్ని షట్ డౌన్ చేస్తున్నారు. బిజినెస్ ను సస్టేన్ చేయడంలో సరైన స్ట్రాటజీ ఉండటం లేదు. దీనికి సరైన మెంటార్షిప్ అవసరం. అమెరికాలోని సిలీకాన్ వేలీలో సైతం మెంటర్షిప్ క్రియాశీలకంగా ఉండటం మనం చూడొచ్చని దీపక్ అన్నారు.
“కంపెనీ ఐడియాను సక్సెస్ ఫుల్ స్టార్టప్ గా మార్చే క్రమంలో ప్రతి సవాలును ఎదుర్కోవాలంటే సరైన సూచనలు పాటించాలి. వాటిని అందించడానికి మేమున్నాం,” దీపక్
వైజాగ్ లో ఉత్సావంతులున్నారు. వ్యాపారం చేస్తామంటే ఇంటిలో ఒప్పుకోవక పోవచ్చు. పేరెంట్స్ ని ఒప్పించి ధైర్యంగా ఒక అడుగు ముందకేస్తున్నారు. ఆ తర్వాత సగానికి పైగా సక్సెస్ కాలేకపోవడానికి కారణం మెంటార్షిప్ మాత్రమే అని ఆయన అభిప్రాయపడ్డారు.
“సక్సెస్ ఫుల్ స్టార్టప్ లు ఈరోజు మన ముందున్నాయంటే వాటి వెనకాల ఉన్నది మెంటర్ ల సలహాలే ,” పీటర్ సెనీ బర్గర్
అల్కోవ్ పాట్నర్స్ కి పీటర్ మరో కో ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. వైజాగ్ లో సెటిలైపోయిన అమెరికా వాసి పీటర్. స్థానిక స్టార్టప్ లకు మెంటార్ గా వ్యవహరిస్తున్న పీటర్ ఈ సంస్థలో భాగస్వామిగా ఉన్నారు. పాశ్చాత్య దేశాల పరిస్థితులకు మన పరిస్థితులకు వ్యత్యాసాలున్నప్పటికీ ఇక్కడున్న యువతరం సరైన లక్ష్యం వైపు వెళ్తున్నారని ఆయన అభిప్రయపడ్డారు.
స్టార్టప్ లకు ఆరెండు అత్యంత ప్రధానం
స్టార్టప్ లకు ప్రధానంగా కావల్సినవి ఐడియా, ఫౌండర్ లే అని అని దీపక్ అన్నారు. మంచి ఐడియా అంటూ ఏమీ ఉండదు. గొప్ప ఐడియా సైతం స్టార్టప్ గా రూపాంతం చెందాక ఫెయిల్ అయిన సందర్భాలున్నాయి. అదే మామూల ఐడియా అనుకున్నవి సైతం పెద్ద సక్సెస్ అయిన ఉదాహరణలు మనం చూడొచ్చని అన్నారు.
“ఫౌండర్ విజన్ స్టార్టప్ ను నిలబెడుతుంది, అదే సక్సెస్ శాతాన్ని పెంచుతుంది,” పీటర్
స్టార్టప్ ప్రారంభించిన రోజుల్లో ప్రతికూల పరిస్థితులకు ఎదుర్కొన్న ఎన్నో కంపెనీలు ఉన్నాయి. తర్వాత గొప్ప విజయాలను అందుకున్న సందర్భాల్లో ఫౌండర్ విజనే ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంచేత తాము ఫండింగ్ ఇచ్చే కంపెనీల్లో ప్రధానంగా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని అన్నారాయన.
అల్కోవ్ పాట్నర్స్ టీం
అల్కోవ్ పాట్నర్స్ ను మొత్తం ఐదుగురు ప్రారంభించారు. ఒక్కొక్కరికీ దాదాపు దశాబ్దం నర పాటు ఇండస్ట్రియల్ ఎక్స్ పీరియన్స్ ఉంది. ఇందులో దీపక్ మాదాల యూఎస్ నుంచి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లో పిహెచ్ డి చేశారు. అనంతరం 2000లో భారత్ వచ్చేశారు. హెల్త్ కేర్ తో పాటు టెక్ స్పేస్ లో పనిచేశారు. పీటర్ 1998లో షికాగో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. 1999 తో వైజాగ్ వచ్చి ఇక్కడే ఫైనాన్స్ లో పీజీ చేశారు. 2000 నుంచి సాఫ్ట్ వేర్ లో ఉన్నారు. సాఫ్ట్ వేర్ తోపాటు ఫినాన్స్ లో 16 ఏళ్ల అనుభవం ఉంది. కిరణ్ కొరివి మరో కో ఫౌండర్. అకౌంటింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన ఫిషరీస్ ఇండస్ట్రీలో అపార అనుభవం ఉంది. ప్రస్తుతం సోషల్ ఆంట్రప్రెన్యూర్షిప్ లో పిహెచ్ డీ చేస్తున్నారు. రవి ఈశ్వరాపు సత్యం సౌత్ గ్లోబల్ హెడ్ గా పనిచేశారు. టెక్ మహింద్ర తో పాటు ఈ రంగంలో 15 ఏళ్ల అనుభవం ఉంది. ఇక చివరగా శ్రీనివాస సవరం. సాఫ్ట్ వేర్ తో పాటు మేనేజ్మెంట్ రంగంలో దాదాపు రెండు దశాబ్దాల అనుభవం ఉంది.
అల్కోవ్ ప్రధాన సవాళ్లు
సాధారణంగా ఫండింగ్ కంపెనీలకు ఉండే చాలెంజ్ లే తమకీ ఉంటాయని దీపక్ అంటున్నారు. సరైన స్టార్టప్ ని గుర్తించడం ప్రధాన సవాలని చెప్పుకొచ్చారాయన. దీనికోసం పూర్తిగా ప్రాడక్ట్ డెవలప్ మెంట్ ను స్టడీ చేస్తామని అన్నారాయన.
“వైజాగ్ స్టార్టప్ లను ఎంచుకోవడం ఒక సవాలు,” పీటర్
దేశ వ్యాప్తంగా పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి వైజాగ్ పై కాన్సన్ ట్రేట్ చేయడం ఒక సవాలని పీటర్ చెప్పారు. సక్సెస్ ఫుల్ స్టార్టప్ బ్రాండ్ లను తీసుకు రావడం ద్వారా దీన్ని అధిగమిస్తామన్నారు. దీనికోసం కాలేజీల్లో ట్రెయినింగ్ సెషన్స్ ప్రారంభించామని అన్నారాయన. స్కిల్ డెవలప్ మెంట్ ప్రొగ్రాం ఏర్పాటు చేశామని దీపక్ చెప్పారు.
భవిష్యత్ ప్రణాళికలు
ప్రస్తతం తమ దగ్గరున్న ఫండ్స్ ని ఇన్వెస్ట్ చేయడం వరకే ఆలోచిస్తున్నామని దీపక్ అంటున్నారు. స్థానికంగా తాము ఫండింగ్ అందించిన కంపెనీలు గొప్ప సక్సెస్ సాధించడం ముందున్న లక్ష్యం అంటన్నారు. వచ్చే ఏడాదిలో దేశంలో అన్ని చోట్ల తాము పెట్టుబడులు పెడతామని అన్నారు. స్టార్టప్ ఐడియాలున్న వారు తమతో సంప్రదించాలని ముగించారాయన.