రూ.1.3 కోట్ల ఫండింగ్ అందుకున్న హైదరాబాద్ స్టార్టప్ 'కమ్యూట్'

స్టార్టప్ బోర్డులోకి రెడ్ బస్ కో ఫౌండర్ సుధాకర్

రూ.1.3 కోట్ల ఫండింగ్ అందుకున్న హైదరాబాద్ స్టార్టప్ 'కమ్యూట్'

Saturday April 23, 2016,

2 min Read


హైదరాబాద్‌కు చెందిన మినీ బస్ షటిల్ సర్వీస్ ప్రొవైడింగ్ సంస్థ 'కమ్యూట్' నిధులు సమీకరించింది. ప్రారంభించి ఐదారు నెలలు కూడా కాకముందే మంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్న ఈ స్టార్టప్.. తాజాగా 50k వెంచర్స్ నుంచి రూ.1.3 కోట్ల నిధులను రెయిజ్ చేసినట్టు వెల్లడించింది.

కొద్దిరోజుల క్రితమే హైసియా నిర్వహించిన స్టార్టప్ అవార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న కమ్యూట్.. ఇప్పుడు మరింత వేగంగా తన సేవలను విస్తరించాలని చూస్తోంది. ట్రిపుల్ ఐటి చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు ప్రారంభించిన ఈ స్టార్టప్‌కు.. హైదరాబాద్ ఐటి కమ్యూనిటీ నుంచి మంచి సపోర్ట్ లభించింది.

కమ్యూట్ టీం

కమ్యూట్ టీం


ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులనే టార్గెట్‌ చేసుకుని మొదలైన స్టార్టప్... పాపులర్ రూట్లలో మినీ ఏసీ బస్సులు అధిక ఫ్రీక్వెన్సీలో నడుపుతూ ఆదరణ పొందింది. తక్కువ ఛార్జీతో సుఖమైన, సౌకర్యవంతమైన ఆఫీసు ప్రయాణాన్ని అందించాలనేది వీళ్ల కాన్సెప్ట్. ఈ స్టార్టప్ యాప్ ద్వారా పికప్, డ్రాపింగ్ పాయింట్లను సెలెక్ట్ చేసుకుని నచ్చిన రూట్లో రైడ్ బుక్ చేసుకునే వీలుంది.

2015 డిసెంబర్‌లో మొదలైన ఈ స్టార్టప్‌ ప్రారంభంలో రోజుకు నాలుగైదు సర్వీసులను మాత్రమే నడిపేది. అయితే కస్టమర్ల సంఖ్య పెరగడంతో 42 మినీ బస్సులను షటిల్ సర్వీస్‌ కింద తిప్పుతున్నట్టు కమ్యూట్ చెబ్తోంది. ప్రస్తుతం రోజుకు ఏడు వందలకుపైగా రెయిడ్స్ వస్తున్నట్టు వెల్లడించింది.

'' తాజాగా సమీకరించిన నిధులతో టెక్నాలజీని మరింత బలోపేతం చేస్తాం. రూట్స్, ఫ్రీక్వెన్సీని కూడా పెంచబోతున్నాం. ఇంతకాలం జస్ట్ బేసిక్ మోడల్‌లా నడిపాం. ఇప్పుడు కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌పై దృష్టిపెట్టాలని నిర్ణయించాం''

 అని కమ్యూట్ కో ఫౌండర్ ప్రశాంత్ గారపాటి యువర్ స్టోరీకి తెలిపారు.

ప్రశాంత్ గారపాటి, కమ్యూట్ కో ఫౌండర్

ప్రశాంత్ గారపాటి, కమ్యూట్ కో ఫౌండర్


50కే వెంచర్స్‌తో పాటు రెడ్ బస్ కో ఫౌండర్ సుధాకర్ పసుపునూరి నుంచి కూడా ఈ స్టార్టప్ కొద్ది మొత్తంలో నిధులను సమీకరించినట్టు వెల్లడించింది. కమ్యూట్‌ బోర్డులో కూడా సుధాకర్ చేరబోతున్నట్టు ప్రకటించింది.

'' కొన్ని నెలల క్రితం మా టీం సుధాకర్‌ను కలిశాం. అప్పటి నుంచి మా మోడల్‌ గురించి తను కొంత అధ్యయనం చేశారు. రెండు నెలల పాటు మమ్మల్ని అబ్జర్వ్ చేశారు. ఆ తర్వాతే ఇన్వెస్ట్ చేసి, బోర్డులోకి కూడా వచ్చారు. రెడ్ బస్‌ ఏర్పాటు, సక్సెస్‌ వెనుక కీలకపాత్ర పోషించిన సుధాకర్ అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడ్తుంది. ప్రోడక్ట్ బిల్డింగ్, మార్కెటింగ్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ వంటి విషయాల్లో వాళ్ల అనుభవం మమ్మల్మి మరింత ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుందని భావిస్తున్నాం '' - ప్రశాంత్. 


కమ్యూట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ లింక్ ఫాలో అవండి..