ఒక రోజుకి ఒకే డీల్.. ఒకే ప్రాడక్ట్..

-యునిక్ కాన్సప్ట్ తో దూసుకొచ్చిన హైదరాబాద్ స్టార్టప్-నాలుగు నెలల్లో 40శాతం గ్రోత్ -5వేల మంది యూజర్లతో సరికొత్త రికార్డు-కస్టమర్లకు ఈజీ షాపింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తున్న స్టార్టప్

3rd Nov 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

సాధారణంగా ఈ కామర్స్ సైట్ లో ప్రాడక్టులు వెతుక్కోడానికే కనీసం పదినిమషాలు పడుతుంది. కానీ త్రీ పీఎం స్టోర్ డాట్ కామ్ లో రెండంటే రెండే నిమిషాల్లో ఆర్డర్ పూర్తవుతుంది. ఎందుకంటే అక్కడ ఉండేది ఒకే ప్రాడక్ట్ కాబట్టి. వేరే ప్రాడక్ట్ కోసం వెతికినా దొరకదు.

“ఈకామర్స్ సైట్స్ లాగా ఉన్నప్పటికీ మాకొక యునిక్ ఫీచర్ ఉండాలని ఆలోచించాం. దీన్ని మొదలు పెట్టాం.” కో ఫౌండర్ మనీష్

యునిక్ ఫీచర్ అని చెప్పి ఏదో స్టైలింగ్ లేదా కొన్ని ప్రాడక్టులకు పరిమితం కావడమో లేదంటే ప్రీమియం ప్రాడక్టుల్ని ఉంచడమో చేయడమో అయితే చేయలేదు. యూనిక్ అంటే నిజంగానే యూనిక్ ఉన్న కాన్సెప్ట్

image


త్రీ పీఎం స్టోర్ కాన్సప్ట్

ప్రతిరోజు సాయంత్రం మూడు గంటలకు ఈ సైట్ లో ఓ ప్రాడక్ట్ పోస్టు చేస్తారు. తర్వాతి రోజు మూడు గంటల వరకూ అదొక్క ప్రాడక్టే అందుబాటులో ఉంటుంది. మరో దాని జాడ కూడా కనపడదు. ఎన్ని ఆర్డర్లైనా ఆ ప్రాడక్టుపై మాత్రమే రావాలి తప్పతే వేరే ప్రాడక్టుకు అవకాశం లేదు. రోజుకి ఒకటే ప్రాడక్టు అమ్ముతారు. అవి ఎన్నైనా అమ్ముతారు.

“ఇలాంటి కాన్సెప్ట్ ప్రారంభించాలనే ఆలోచన ఏడాది క్రితమే వచ్చింది. అయితే ఇది ఎంతవరకూ వర్కవుట్ అవుతుందనే దానికోసం మార్కెట్ రీసెర్చి చేయడానికి ఇంత సమయం పట్టింది.” మనీష్

కొత్త కస్టమర్ల కంటే రిపీటెడ్ కస్టమర్లే ఎక్కువ మంది మా సైట్ ను విజిట్ చేస్తున్నారు. వారి రిఫరెన్స్ తోనే కొత్తవాళ్లు యాడ్ అవుతున్నారు. ఈ కామర్స్ బిజినెస్ సక్సెస్ కి ఇంతకంటే కొలమానం ఏముంటుందని చెప్పుకొచ్చారు.

image


స్టార్టప్ పనితీరు

త్రీ పీఎం స్టోర్ డాట్ కామ్ నెలకి 40 శాతం గ్రోత్ లో ఉంది. ఇప్పటి వరకూ 10వేల ఆర్డర్లు తీసుకున్నారు. 15 నుంచి 20 శాతం రిపీటెడ్ కస్టమర్లు వస్తున్నారు. 80 శాతం డెలివరీలు ఇన్ టైంలో చేస్తున్నారు. సైట్ లో సెర్చ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే వేరే ఆఫ్షన్ లేదు కనక. 8వేల మంది రిజిస్ట్రర్ యూజర్లున్నారు. రోజుకి కనీసం 150 ఆర్డర్లు వస్తున్నాయి. జెన్యూన్ గా డిస్కౌంట్ ఇస్తున్నారు. అలా కస్టమర్లకు దగ్గరవుతున్నారు. ప్రాడక్టులు పెట్టడానికి సైతం వెండర్లు క్యూ కడుతున్నారు. ఒక ప్రాడక్టుకు సంబంధించిన స్టాక్ క్లియర్ చేయాలంటే మా సైట్ పరిష్కారం చూపుతుందని మనీష్ అభిప్రాయపడ్డారు.

త్రీ పీఎం టీం

త్రీ పీఎం స్టోర్ టీంలో ఇద్దరు సభ్యులున్నారు. మనీష్ కో ఫౌండర్. గీతం యూనివర్సిటీ నుంచి బీబీఎం పూర్తి చేసిన మనీష్ మరో స్టార్టప్ కు కో ఫౌండర్ గా ఉన్నారు. యూకే లోని లివర్కా పూల్ జాన్ మూర్స్ యూనివర్సిటీ నుంచి ఎంబీయే పూర్తి చేశారు. గతంలో కొన్ని స్టార్టప్ కోసం పనిచేస్తున్న సమయంలోనే ఆయన త్రీ పీఎం స్టోర్ యునిక్ ఐడియాని ఇంప్లిమెంట్ చేశారు. నాలుగు నెలల్లో ఆశించదగిన ఫలితాలను సాధించింది. లలిత అని మరో టీం మెంబర్ ఉన్నారు. ఆపరేషన్స్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారామె. ప్రహ్లాద్ అని మరో టీం మెంబర్ ఉన్నారు. ఈయన ఫ్రీలాన్సింగ్ గా సేవలందిస్తున్నారు. కో ఆర్డినేషన్ లాంటి వ్యవహారాలు చూస్తున్నారు.త్రీ పీఎం స్టోర్ పేరుకు తగినట్లు త్రీ మెంబర్ టీంతో దూసుకుపోతోంది.

image


సవాళ్లు, లక్ష్యాలు

కాన్సెప్ట్ బేస్డ్ స్టార్టప్ మొదట్లో చూపించిన పెర్ ఫార్మన్స్ భవిష్యత్ లో నెట్టుకు రావడం కష్టం. దీన్ని అధిగమించాల్సి ఉంది. ప్రాడక్టులను ఎక్కువగా చూపించక పోతే యూజర్ బేస్ పెంచుకోవడం పెద్ద సవాలు. కాన్సెప్ట్ పై పనిచేస్తున్నారు కనక ధర విషయంలో కాంప్రమైజ్ కావాల్సిన పనిలేకపోయినా, క్లియరెన్స్ స్టాక్ కి మాత్రమే పరిమితం అయ్యే అవకాశం లేకపోలేదు.

“మిగిలిన ప్రాడక్టులు మాకిస్తే మేం స్టాక్ క్లియర్ చేస్తాం. మా బిజినెస్ రెవెన్యూ ఇదే.” మనీష్

సైట్ పెర్ఫార్మన్స్ బాగా ఉండటం వల్ల ఫండింగ్ అవసరం ఇప్పుడు లేందంటున్నారాయన. అయితే ఫండింగ్ వస్తే కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తామని చెప్పుకొచ్చారు.

భవిష్యత్ ప్రణాలికలు

ప్రాడక్ట్ లాంచింగ్ లకు మా సైట్ కేరాఫ్ గా మార్చాలని ఆలోచిస్తున్నాం. ఆదిశగా అడుగులేస్తున్నాం. ఫ్లిప్ కార్డ్, అమెజాన్ లాంటి సైట్ లకు లేని ఫీచర్ మాదగ్గరుంది. ఒక ప్రాడక్టు లాంచ్ చేయాలంటే మా సైట్ ద్వారానే సాధ్యపడుతుందన్నారు మనీష్. వెబ్ సైట్ నుంచి యాప్ ప్లాట్ ఫాం లోకి మరో నెలలో ప్రవేశిస్తామన్నారు. భవిష్యత్ లో మరిన్ని కేటగిరీలు, కమింగ్ అప్ ప్రాడక్ట్ లిస్టు లను సైట్ లో పెడతామంటున్నారు.

వెబ్ సైట్

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి

Our Partner Events

Hustle across India