ఆవాల తోటల్లో గోల్ఫ్ నేర్చుకుని.. అంతర్జాతీయ ప్లేయర్ అయ్యాడు
ఆవాల తోటల్లో గోల్ఫ్ ఆట ప్రాక్టీస్.యూట్యూబ్‌లో చూసి టెక్నిక్స్ నేర్చుకున్న శుభం.ప్రతిభను గుర్తించిన గోల్ఫ్ ఫౌండేషన్.వెన్నంటే ఉండి గోల్ఫ్ కిట్స్ మోస్తున్న తండ్రి.10ఏళ్ల వయసులోనే 100 గోల్ఫ్ టోర్నమెంట్లలో నెగ్గిన శుభం జగ్లన్.
రెండు వారాల్లో 2 మేజర్ గోల్ఫ్ టోర్నమెంట్ టైటిల్స్ నెగ్గేశాడు శుభం జగ్లన్. కాలిఫోర్నియాలో జరిగిన ఐఎంజీ (ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ గ్రూప్) అకాడమీ జూనియర్ వరల్డ్ గోల్ఫ్ ఛాంపియన్‌షిప్‌ను జూలై 17న గెలవగా... గతేడాది ఇదే టోర్నమెంట్‌లో రన్నరప్ కావడం విశేషం. ఇది జరిగి వారం కూడా గడవక ముందే జూలై 23, 2015న లాస్ వెగాస్‌లో జరిగిన ఐజేజీఏ (ఇంటర్నేషనల్ జూనియర్ గోల్ఫ్ అకాడమీ)వరల్డ్ స్టార్స్ ఆఫ్ జూనియర్ గోల్ఫ్ ఈవెంట్‌లోనూ విన్నర్‌గా నిలిచాడు శుభం.
హర్యానా వ్యవసాయ క్షేత్రాల నుంచి ప్రపంచంలో అత్యుత్తమ గోల్ఫ్ ట్రోఫీలను సాధించడం వరకూ.. శుభం జగ్లాన్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమైనది. ఇప్పుడు ఇతను మన దేశంలో గోల్ఫ్ సెన్సేషన్ ఈ చిన్నారి.
2005 జూలై 1న హర్యానాలోని పానిపట్ జిల్లాలో ఇస్రానా అనే గ్రామంలో పుట్టాడు శుభం. రెజ్లింగ్ కుటుంబంలోంచి వచ్చిన ఇతని తండ్రి.. ఓ పాలవ్యాపారి.
అనుకోకుండా గోల్ఫ్ ఆట
అనుకోకుండా గోల్ఫ్ ఆడ్డం మొదలుపెట్టాడు శుభం. కపూర్ సింగ్ అనే ఎన్నారై తన స్వగ్రామం ఇస్రానాలో గోల్ఫ్ క్రీడను ప్రోత్సహించాలని భావించాడు. ఇందుకోసం కొన్ని ప్రయత్నాలు చేసినా.. అవి సక్సెస్ కాకపోవడంతో శుభం తండ్రి దగ్గర గోల్ఫ్ కిట్స్ వదిలేసి వెళ్లిపోయాడు.
ఐదేళ్ల వయసులో ఉన్నపుడు గోల్ఫ్ సెట్ తీసుకున్న శుభం.. వాళ్ల గ్రామం పొలిమేరల్లో ఉన్న ఆవాల తోటల్లో గోల్ఫ్ బాల్‌ని కొడుతూనే ఉన్నాడు బ్యాట్‌తో. సొంతగానే నేర్చుకుని, ప్రాక్టీస్ మొదలుపెట్టిన శుభంకి... తాతయ్య దగ్గరనుంచి ప్రోత్సాహం లభించింది. యూట్యూబ్‌లో గోల్ఫ్ ఆటకు సంబంధించిన వీడియోలు చూస్తూ... ఈ గేమ్‌కి సంబంధించిన నియమాలు, ఆడే విధానాలను ప్రాక్టీస్ చేశాడు శుభం.
ప్రపంచ స్థాయి క్రీడాకారునిగా మార్పు
క్రీడలో చిన్నారిలో ప్రతిభను గుర్తించిన కర్నాల్‌లోని మధుబన్ గోల్ఫ్ కోర్స్‌లో ప్రాక్టీస్ చేసేందుకు అనుమతినిచ్చారు అధికారులు. ఈ గోల్ఫ్ ఫౌండేషన్ ట్యాలెంట్ స్కౌట్‌లోని కోచ్, భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన నోనిటా లాల్ ఖురేషీ.. శుభంలోని ట్యాలెంట్‌కు అబ్బరపడ్డాడు.
ఈ గోల్ఫ్ ఫౌండేషన్‌కు వ్యవస్థాపకుడు అమిత్ లుథ్రా. ఈయన ఏషియల్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్న ఈయన దగ్గర ట్రైనింగ్ పొందుడు శుభం. ప్రకృతి ప్రసాదించిన సహజమైన ప్రతిభ... ఈ ట్రైనింగ్ తర్వాత ప్రపంచస్థాయి గోల్ఫ్ క్రీడాకారునిగా రూపాంతంరం చెందింది.
ఈ చిన్నారి గోల్ఫ్ ప్లేయర్.. ఇప్పటివరకూ తన కెరీర్‌లో దేశీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో 100కు ట్రోఫీలు గెలుచుకున్నాడు. న్యూయార్క్ యూఎస్ కిడ్స్ ఛాంపియన్ షిప్, న్యూజెర్సీ యూఎస్ కిడ్స్ ఛాంపియన్ షిప్‌లను 2012లో గెలుపొందాడు. 2013లో ప్రతిష్టాత్మక టేలర్ మేట్ అడిడాస్ వరల్డ్ జూనియర్ గోల్ఫ్ టోర్నమెంట్‌లో ఛాంపియన్‌గా నిలవడం.. శుభం కెరీర్‌లో కీలకమలుపు. ఇదే టోర్నమెంట్‌లో రెండుసార్లు రన్నర్‌గా నిలచాడీ ప్రతిభావంతుడైన చిన్నారి. ఇదే ఏడాది ఎన్‌డీటీవీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్, మార్గదర్శన్ అవార్డ్‌లు కూడా శుభం సొంతమయ్యాయి.
సెవ్ బాలెస్టోరస్, గారీ ప్లేయర్‌లు... శుభంకు స్ఫూర్తిగా నిలిచిన గోల్ఫ్ క్రీడాకారులు. అలాగే టైగర్ వుడ్స్‌తోపాటు ఇండియన్ గోల్ఫర్ శివ్ కపూర్‌కు అభిమాని.
ప్రయాణం, లక్ష్యం
హర్యానాలోని ఓ కుగ్రామంలో ఆవాల తోటల నుంచి ప్రపంచంలో అత్యుత్తమ గోల్ఫ్ కోర్స్‌ల వరకూ సాగింది శుభం ప్రయాణం. ప్రతీ అడుగులోనూ ఎంతో ప్రయాసలకి ఒనర్చి శిక్షణ పొందాడు. ప్రపంచ స్థాయి ట్రైనింగ్ సెంటర్స్‌లో తన ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నాడు. ఏడేళ్ల వయసులో బిడియపడే చిన్నారిగా ఉన్నపుడు నోనిటా లాల్ ఖురేషి మొదట గుర్తించినపటి నుంచీ... ఇంత దూరం ప్రయాణించడానికి ఎంతో శ్రమ పడ్డాడు. శుభం విజయంలో తండ్రి జగ్‌పాల్ జగ్లన్ అందించిన సహకారం, ప్రోత్సాహం చాలా ఉంది. ఎంతలా అంటే.. ప్రతీ ప్రయాణంలోనూ తోడు ఉండడమే కాదు.. ఆట సమయంలో గోల్ఫ్ సెట్‌ను మోసుకొచ్చే కాడీ పాత్ర కూడా స్వయంగా తనే పోషిస్తారు జగ్‌పాల్.
అమెరికన్ గోల్ఫర్ జాక్ నిక్‌లాస్ సాధించిన ఫీట్స్‌ను తాను అందుకోవడమే లక్ష్యంగా చెబ్తున్నాడు శుభం. తన కెరీర్‌లో ప్రపంచవ్యాప్తంగా 18 మేజర్ ఛాంపియన్ షిప్స్ గెలుచుకున్న అల్ టైం గ్రేటెస్ట్ ప్రొఫెషనల్ గోల్ఫర్ జాక్ నికలాస్.
ప్రస్తుతం ఢిల్లీలోని లక్ష్మణ్ పబ్లిక్ స్కూల్‌లో నాలుగవ తరగతి చదువుతన్నాడు శుభం జగ్లన్.