లా స్కూల్ విద్యార్థుల ఫుడ్ స్టార్టప్ 'భుక్కడ్'

9th Oct 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా క్యాంపస్ క్యాంటీన్‌లో మొదలై... నెలకు 40 శాతం వృద్ధి సాధిస్తున్న స్టార్టప్ భుక్కడ్. ప్రతీ ఒక్కరికీ కాలేజ్‌ క్యాంటీన్‌లో పిచ్చాపాటీ కబుర్లతో సమయం గడిపిన సందర్భాలు ఉంటాయి. నచ్చిన ఫుడ్‌ని ఆర్డర్ చేసి తినలేకపోయామనే అసంతృప్తి చెందిన రోజులూ అనేకం ఉంటాయి. కాలేజ్ క్యాంపస్‌లలో ఇలాంటి అవసరాన్ని గుర్తించాక మొదలైన ఆలోచనలోంచి పుట్టిందే భుక్కడ్.

బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలో 2011లో ప్రారంభమైంది భుక్కడ్. బోర్ కొట్టే మెస్‌ భోజనానికి ప్రత్యామ్నాయం ఉండాలనే అరుజ్ గార్గ్ ఆలోచనకు రూపం ఈ వెంచర్.

సాధారణ కాలేజ్ క్యాంటీన్‌లాగే ప్రారంభమైంది భుక్కడ్. కానీ 2013 ఆగస్ట్‌లో అరుజ్‌కు ఆరోగ్య సమస్యలు తలెత్తాక.. తన వెంచర్‌లోని ఆహారాన్నే తాను తినలేననే విషయం అర్ధమైంది ఆయనకు. ఇలాంటి సమస్య చాలా క్యాంటీన్ నిర్వాహకులకు తలెత్తుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆర్గానిక్ ఫుడ్, హెల్దీ ఫుడ్‌లను సప్లై చేసే కేఫ్‌లు, రెస్టారెంట్లు అనేకం ఉన్నాయి. కానీ వీటిలో ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదే అరుజ్‌‌కు పాఠం నేర్పింది. ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని అందుబాటు ధరల్లో సప్లై చేయగలిగితే బావుంటుంది అనే ఆలోచన.. భుక్కడ్ భవిష్యత్తునే మార్చేసింది.

కాలేజ్ నుంచి బాహ్య ప్రపంచంలోకి

కాలేజ్ నుంచి బయటకు వచ్చాక స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉండే కాలేజ్ ఫుడ్ బ్రాండ్‌ని రూపొందించే అవకాశం కనిపించింది అరుజ్‌కి. కాలేజ్‌ల చుట్టూ తిరిగి, వాటి నిర్వాహకులతో చర్చించి ఇందులో ఉన్న సవాళ్లను అర్ధం చేసుకున్నాకే ఈ విషయం అర్ధమైందంటారు అరుజ్.

2014 మార్చ్‌లో వెంచర్ ప్రారంభంలో నిర్ణయించుకున్న లక్ష్యాలనుంచి బయటకు వచ్చి.. భుక్కడ్‌ని సాధారణ ఫాస్ట్‌ఫుడ్ చైన్ రెస్టారెంట్స్ మాదిరిగా నిర్వహించాలని నిర్ణయించారు. రెడీ టు ఈట్ తరహా ఫుడ్‌ విధానంలో మార్పులు చేయాలని తలచింది ఈ టీం. ఆరోగ్యకరమైన ఆహారం అందరూ ఆస్వాదించేదే అయినా.. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కంపెనీలన్నీ దీన్ని ఓ చిన్న అవకాశంగానే పరిగణిస్తున్నాయి. తక్కువమంది క్లయింట్లకు మాత్రమే అందించేలా నిర్వహిస్తున్నాయి.


అశుతోష్, అరుజ్, రిచా, నందిత, సునయన(ఎడమ నుంచి కుడి)

అశుతోష్, అరుజ్, రిచా, నందిత, సునయన(ఎడమ నుంచి కుడి)


“మేం ఈ తరహా విధానాన్ని మార్చాలని భావించాం. భుక్కడ్‌లు(తిండిపోతులు) ఆహారాన్ని ఎంతో ఇష్టపడతారు. వినగానే ఆహారం అని గుర్తొచ్చే పేరు కావడంతో.. భుక్కడ్‌ అనే పేరుకే మేం మొగ్గు చూపాం. ఆహారంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడేలా మా ఫుడ్ ఉండాలని భావించాం. ఎక్కువగా నిలువ ఉండేవి, ప్రాసెసింగ్ ఫుడ్స్ మా మెనూలో ఉండకుండా జాగ్రత్తపడ్డాం. మైకేల్ పొల్లన్ రాసిన డిఫెన్స్ ఆఫ్ ఫుడ్‌ని స్ఫూర్తిగా తీసుకున్నాం” అని చెప్పారు అరుజ్.

తయారీ, ప్యాకింగ్

ఈ ఏడాదిలోగా క్విక్ సర్వీస్ రెస్టారెంట్ బ్రాండ్‌ను క్రియేట్ చేయాలనే వీళ్ల ఆలోచన. అందుకే బ్రాండింగ్ కూడా పెంచుకోవడం కోసం ఎక్కువ మంది జనాలు తిరిగే ప్రాంతాలు, ఆఫీసులు ఎక్కువగా ఉండే లొకేషన్లలను ఎంపిక చేసుకుంటున్నారు. అయితే దీని వల్ల బడ్జెట్ పెరిగిపోతుందనే విషయమూ అర్థమైంది. అప్పుడు భుక్కడ్‌ కాన్సెప్ట్‌లో మార్పులు చేశారు. 2015 మే నెలలో ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేయగలిగే మీల్ బ్యాగ్స్‌ని విక్రయించడం ప్రారంభించారు. దీనిలో ప్రతీరోజూ మెనూ మారేలా జాగ్రత్తలు తీసుకుంది భుక్కడ్ టీం.

ప్రస్తుతం ఈ మీల్ బ్యాగ్స్ మధ్యాహ్న భోజనానికే అందుబాటులో ఉన్నాయి. త్వరలో బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్‌లను కూడా అందించనున్నారు. ఆర్డర్లన్నిటికీ సరిపడేలా ఒకే సెంట్రల్ కిచెన్‌లో వంట చేసి.. చిన్న డెలివరీ సెంటర్ల ద్వారా కస్టమర్లకు అందించే ఏర్పాట్లను చేసుకున్నారు.

“కస్టమర్ల ఆరోగ్యానికి మంచి చేసేదని మేం విశ్వసించాకే.. మెనూలో ఆ ఐటెంను చేరుస్తాం. మమ్మల్ని నడిపించే ప్రధాన సిద్ధాంతం ఇదే. మేం ఆహారాన్ని ప్రిపేర్ చేసే విధానంలో మార్పులొచ్చాయేమో కానీ.. మేం నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రం మార్చుకోలేదు. అందుకే సహజమైన పదార్ధాలతో.. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండానే ఫుడ్‌ని అందిస్తున్నామ”ని చెప్పారు అరుజ్.
కోరమంగళలోని భుక్కడ్ అవుట్‌లెట్

కోరమంగళలోని భుక్కడ్ అవుట్‌లెట్


నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు

కిచెన్‌లో కూడా టెక్నాలజీ సాయం చాలా అవసరం అంటారు అరుజ్. వేగంగానూ, ఎలాంటి కష్టం లేకుండానూ వంట చేసేందుకు సాంకేతిక సాయం తప్పనిసరి అంటారాయన. ఆహారం రుచిలో నిలకడ కొనసాగించడానికి కూడా టెక్ హెల్ప్ అవసరమేనని చెబ్తున్నారు.

కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించే కంపెనీగా ఎదుగుతోంది భుక్కడ్. ప్రతీ పనికీ పక్కాగా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు. వీలైనంత సులభంగా ఆయా విధులు పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు. “ఈ తరహా ప్రణాళికలు కొంచెం సవాళ్లతో కూడుకున్నవే. వీటికి ఉద్యోగులు ఎలా ప్రతిస్పందిస్తారో కూడా ఆలోచించుకోవాలి. అభివృద్ధి సాధించేందుకు వారికి అర్ధమయ్యేటట్లుగా వివరించాలి” అంటున్నారు అరుజ్.

ఈ వ్యాపారానికి వంటశాల, వంటల విధానం చాలా కీలకం అంటున్నారు అరుజ్. అత్యంత నైపుణ్యం కలిగిన చెఫ్‌లను అహ్వానించడం కష్టమైన విషయం. ఈ సమస్యను మెల్లగా అధిగమిస్తున్నామని.. త్వరలో నైపుణ్యంగల వంటవారు తమతో జాయిన్ అవుతున్నారని అంటున్నారు భుక్కడ్ టీం.

అభివృద్ధి కోసం ఖర్చులు

ఏ ఫుడ్ బిజినెస్‌కి అయినా.. రిపీట్ కస్టమర్స్ చాలా ముఖ్యం. తాజాగా ప్రారంభించిన మీల్ బ్యాగ్స్‌కు రిపీట్ కస్టమర్ల సంఖ్య 45 శాతం ఉంటోందంటే.. వ్యాపారానికి లభించిన క్రేజ్ అర్ధమవుతోంది. ఒకొక్కరూ వారానికి 2-3సార్లు మీల్ బ్యాగ్స్‌ని కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ విభాగం ప్రారంభించినప్పటి నుంచి.. నెలకు 40శాతం వృద్ధి నమోదవుతుండడం విశేషం. ప్రస్తుతం మీల్ బ్యాగ్ సేల్స్ కోసం.. మా సొంత వెబ్ ప్లాట్‌ఫాంనే ఉపయోగించుకుంటున్నాం” అని చెప్పారు అరుజ్.

క్విక్ సర్వీస్ రెస్టారెంట్ మోడల్‌ కోసం అయితే ఒక్కో యూనిట్ ఏర్పాటు చేసేందుకు ₹ 8 నుంచి 20 లక్షల వరకూ ఖర్చవుతుంది. అదే హబ్ మాదిరిగా సెంట్రల్ కిచెన్ విధానంలో అయితే కిచెన్‌కు ఎక్కువ ఖర్చు చేయాలి. ₹ 10 లక్షల నుంచి కోటి వరకూ వ్యాపార స్థాయిని బట్టి పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.

“గత నాలుగేళ్లుగా భుక్కడ్‌ని ఫుడ్ అండ్ బెవరేజెస్ వ్యాపారంగానే చూశాం. ఈ విధానంలో వర్కర్లతో నిర్వహణ చాలా సమస్యలు కొనితెచ్చింది. అట్రిషన్ రేట్ ఎక్కువగా ఉండేది. ట్రైనింగ్ స్టాఫ్‌ని తీసుకురావడం కూడా క్లిష్టమైన పనే. గత 8 నెలలుగానే సంస్థను అభివృద్ధి పథంలో నడిపించగలిగే టీంతో పని చేస్తున్నారు. వ్యవస్థాగతంగా పని చేసి.. కంపెనీ ప్రగతికి ఎంతో కృషి చేస్తున్నారు ఈ టీం.”- అరుజ్.

భవిష్యత్ ప్రణాళికలు

ఈ ఏడాది చివరినాటికి మొత్తం బెంగళూర్ సిటీ అంతా సర్వీస్ చేయగలిగే స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది భుక్కడ్. అయితే.. స్నాక్స్‌కు బదులుగా మీల్స్ ఆధారంగానే వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తుండడం విశేషం. ఆఫ్‌లైన్ అమ్మకాలను కూడా నిర్లక్ష్యం చేయబోమని చెబ్తున్నారు. “మా వ్యాపారం ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ఛానల్స్‌ సమ్మిళితమైనది. సాధారణ రిటైల్ ఔట్‍లెట్స్‌ వ్యాపారానికి కూడా ఎన్నో అవకాశాలున్నాయి. అందుకే వాటిని వదిలిపెట్టబోం” అన్నారు అరుజ్.

వెబ్‌సైట్

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి

Our Partner Events

Hustle across India