90 సెకెండ్లలో వేడివేడి 'ఫుడ్ బాక్స్' మీ చేతుల్లోకి
ఇండియా స్టార్టప్స్‌లో ఫుడ్ టెక్ ఇంత పెద్ద సెక్టార్‌గా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అసలు ఫుడ్ టెక్ అంటే ఏమిటి ? టెక్నాలజీ సాయంతో ఫుడ్ తయారు చేయడమా ? కాదు, ఆహారాన్నిఎటువంటి సమస్యా లేకుండా డెలివరీ చేసేందుకు ఉపయోగపడే ఒక టెక్నాలజీ.
ఫుడ్ బాక్స్‌ను దిగ్విజయంగా నడుపుతున్న వారిలో చెన్నైకు చెందిన సతీష్ ఒకరు. బెంగళూరు కోరమంగళలోని దర్శినిలో ఆయన కలిశారు.
సతీష్ .. ఒక మెకానికల్ ఇంజనీర్. న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ నుంచి మ్యానుఫాక్చరింగ్ టెక్నాలజీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు, సుమారు పదేళ్లపాటు అమెరికాలోని పలు MNCల్లో ఆపరేషన్స్ ఇంజనీర్‌గా పనిచేశారు. 2013లో ఆయన అనేక కారణాలతో భారత్ తిరిగొచ్చారు. స్వదేశంలో ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకున్నారు. అప్పుడే అత్చాయం బిజినెస్ సొల్యూషన్స్ ప్రై.లి. తెరపైకి వచ్చింది. ఐడియా ఏంటంటే ... ట్రావెలింగ్‌లో ఉన్నవారికి వారి ఫేవరెట్ బ్రాండ్స్ నుంచి నచ్చిన ఆహారాన్ని అందించడం. చెన్నైలో ఊపిరి పోసుకున్న ఈ అత్చాయంకు రెండు ఔట్ లెట్స్ ఉన్నాయి. A2B, మద్రాస్ కాఫీ హౌజ్ తదితర రెస్టారెంట్ల నుంచి ఎవరికి ఏది కావాలంటే అది ఆర్డర్ చేయవచ్చు.
“నేను ఫుడ్ డెలివరీ యాప్స్‌కు ఫ్యాన్ ను కాదు. గ్రౌండ్ మోడల్‌లో ఇది ట్రై చేయాలనుకున్నాం,” అని అంటారు సతీష్. చెన్నై సెంట్రల్ లో ఫుడ్ బాక్స్ 900 నుంచి 1300 ప్యాక్స్‌ను సేల్ చేస్తోంది. DLF IT పార్క్ ఔట్ లెట్ 200-300 ప్యాక్స్‌ను ప్రతి రోజు విక్రయిస్తోంది. “త్వరలోనే బెంగళూరులో, చెన్నైలోని చెన్నై సిల్క్క్, టి నగర్ వద్ద మరో స్టోర్‌ని ప్రారంభిస్తున్నాం” అని సతీష్ చెప్పారు.
అసలు ఇన్నోవేషన్ ఏంటంటే ... ఫుడ్ బాక్స్ తయారుచేసుకున్న డిస్పెన్సర్ మెషీన్స్. ఈ మెషీన్స్ మనుషుల సాయం లేకుండానే పనిచేస్తాయి. వీటిని ఎంత ప్రత్యేకంగా తయారుచేశారంటే ... ఆహారం తినడానికి ఓకేనా లేక చెడిపోయిందా తెలియజేస్తుంది. అంతేకాదు అవసరాన్ని బట్టి ఫుడ్‌ని వేడి, చల్లబరుస్తుంది. “ఫుడ్ బాక్స్ ఒక మార్కెట్ ప్లేస్. మనసుకు నచ్చిన రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని కోరుకునే వారికి ఇదో మీటింగ్ పాయింట్. ఈ విధంగా కస్టమర్లకు నోరూరించే ఆహారం, అలాగే రెస్టారెంట్లు పైసా ఖర్చు లేకుండా మరింత లాభాలు దండుకోవచ్చు” అంటారు సతీష్.
ఇది సప్లై, డిమాండ్ లింకింగ్ ప్రాసెస్. ఫుడ్ బాక్స్ రెస్టారెంట్ పార్టనర్స్ రుచికరమైన ఆహారాన్ని వండి, చక్కగా ప్యాక్ చేసి ... అనుకున్న సమయానికి ఫుడ్ బాక్స్ ఔట్ లెట్స్ కు పంపిస్తారు. “కస్టమర్లకు.. మేము క్విక్ ఫుడ్ పికప్ కోసం సెల్ఫ్ సర్వీస్డ్ స్టోర్‌ను నడుపుతున్నాం. వెరైటీ ఆఫ్ బ్రాండ్స్, టేక్ అవే - ఫ్రెండ్లీ ప్యాకేజింగ్, నిమిషాల్లో నచ్చిన ఆహారాన్ని కొనుక్కునే వీలు, అంతేనా ఇవన్నీ రెస్టారెంట్ ధరల్లోనే దొరకడం మరో ప్లస్,” అంటారు సతీష్.
ఫుడ్ బాక్స్‌కు యూఎస్ కు చెందిన కొందరు సపోర్ట్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఫుడ్ బాక్స్ ఇతర నగరాలకు విస్తరించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటివరకూ అడయార్ ఆనందభవన్, అంజప్పార్ చెట్టినాడు, మోతి మహల్ డీలక్స్, హోటల్ సుధ, చార్మినార్ హైదరాబాదీ బిర్యానీ, మిస్టర్ చౌస్ అనే ఆరు రెస్టారెంట్లతో భాగస్వామ్యం వహిస్తోంది.
“కాణీ ఖర్చు లేకుండా కొత్త మార్కెట్లకు చేరుకోవడం, లాభాలు సంపాదించుకోడం ఈ రెస్టారెంట్ యజమానులకు ఎంతో ఆనందంగా ఉంది,” అని సతీష్ చెబుతున్నారు.
మరింత అడ్వాన్స్డ్ గా ఉండే నెక్ట్స్ జనరేషన్ డిస్పెన్సర్స్‌ను ప్రస్తుతం ఫుడ్ బాక్స్ డెవలప్ చేస్తోంది. రాబోయే రోజుల్లో ఫుడ్ బాక్స్ ఇంకెన్నో విజయాలను అందుకునేలా ఘమఘమలాడిస్తోంది. ఇప్పటికున్న స్టోర్స్ కాకుండా, మిడిల్ ఈస్ట్ లాంటి కంపెనీలతో ఫుడ్ బాక్స్ ఔట్ లెట్స్ ఇన్ స్టాల్ చేయడానికి సంప్రదింపులు జరుపుతోంది. మరో ఎక్సైటింగ్ విషయమేమిటంటే .. ఇండియన్ రైల్వేస్‌తోనూ చేతులు కలపాలనుకుంటోంది. “ ఇప్పటికే రైల్వే ఉన్నతాధికారులకు ప్యాంట్రీ కారు స్థానంలో ఫుడ్ బాక్స్ ఔట్ లెట్స్ ను పెట్టాలన్న ప్రపోజల్‌ను అందజేశాం. వారి నుంచి ఆఫర్ కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నాం. ఈ ఏడాది చివర్లోగా గుడ్ న్యూస్ వస్తుందని వెయిట్ చేస్తున్నాం,” అని సతీష్ ఎంతో ఆశగా చెప్పారు.
ఫుడ్ బాక్స్ కేవలం 10మంది టీమ్ తోనే పనిచేస్తోంది. భవిష్యత్తులోనూ తక్కువ స్టాఫ్‌నే నియమించుకోవాలనుకుంటోంది. పూర్తిగా ఆటోమేటెడ్ స్టోర్ ఫ్రంట్స్‌ను రంగంలోకి దింపి, ఒకవేళ ఆ మోడల్ వర్కౌట్ అయితే, మరింత ఫాస్ట్ గా దూసుకుపోయేందుకు రెడీగా ఉన్నారు. బిజినెస్ పార్క్స్, రైల్వే స్టేషన్స్ మాత్రమే కాకుండా .. మన దేశంలో ఫుడ్ బాక్స్ కు చాలా పెద్ద మార్కెటే ఉంది.