చెస్ ఆడుతూ...బిజినెస్‌ బ్యాలెన్స్ చేస్తూ... దూసుకుపోతున్న కృత్తిక

చెస్ ఆడుతూ...బిజినెస్‌ బ్యాలెన్స్ చేస్తూ... దూసుకుపోతున్న కృత్తిక

Thursday October 22, 2015,

4 min Read

చదరంగం ఆటకు ఆంట్రప్రెన్యూర్‌షిప్‌కి సంబంధం ఉందా ?

జాతీయ స్థాయి చెస్ ఛాంపియన్‌షిప్స్ గెలుచుకున్న కృత్తికా నదిగ్.. ఈ రెండింటికీ రిలేషన్ ఉందని నిరూపిస్తున్నారు. ఐడియా మిల్‌కు ఈమె ఫౌండర్ కం డైరెక్టర్. ఔత్సాహిక ఆంట్రప్రెన్యూర్‌లకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్న పూనేలో.. ఫ్రీలాన్సర్స్, చిన్న స్టార్టప్స్‌తో కలిసి కొత్త బ్రాండ్‌ను సృష్టిస్తున్నారు కృత్తిక.

image


image credit - http://www.prerit.org/kruttika-nadig/

తన వెంచర్‌ను స్వీట్ స్పాట్‌గా పిలుచుకుంటారు కృత్తిక. శుభ్రమైన చురుకైన కార్యాలయానికి, పరధ్యాన్నంగా ఉండే ఇంటికి.. మధ్య స్థాయిలో తన వెంచర్‌ ఉంటుందంటారు ఆమె.

“మెంబర్లకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ రెండు ప్రపంచాలను సమపాళ్లలో మిక్స్ చేశాం. మోడర్న్ డెస్క్, వేగవంతమైన వైఫై సదుపాయాలు, అనేక బుక్స్ ఉండే లైబ్రరీలు, ఉత్సాహాన్ని అందించే బాల్కనీ. ఇదీ మా ఆఫీస్ ” అంటున్నారు కృత్తిక.

స్టార్టప్ సంస్కృతిలో కలిసి ఆఫీస్‌లు ఏర్పాటు చేసుకోవడం చాలా సాధారణ విషమయే. దీనికి మరిన్ని సదుపాయాలు జత చేసి కొత్త ప్రపంచాన్ని వ్యాపారాన్ని సృష్టించాలనే దృక్పథం కృత్తికది. ఈమె వయసు 20ల్లోనే ఉన్నా.. ఇప్పటికే ఆమెకు రచయిత, పాఠకురాలు, జాతీయ స్థాయి చెస్ ఛాంపియన్ కలగలిపిన వ్యక్తిత్వం ఉంది. అందుకే ముందునుంచే స్వతంత్రంగా ఆలోచించడం కృత్తికకు అలవాటు.

"నేను ఏడేళ్ల వయసులో తొలిసారిగా ఒంటరిగా విమాన ప్రయాణం చేశాను. నా వయసుతోపాటే ఈ ఒంటరితనం కూడా పెరిగింది. అయినా నేను ఎంతో పోటీ ఉన్నా కొన్ని జాతీయస్థాయి చెస్ పోటీలను నెగ్గాను"

వర్కింగ్‌ స్పేస్ చాలా అవసరం

ఏషియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెన్షియల్ ప్రోగ్రాం పూర్తి చేశారు కృత్తిక. ఇక్కడ స్టోరీలు, ఆర్టికల్స్ రాయడం నేర్చుకున్నారామె. విభిన్నమైన ఆలోచనలు, దృక్పథాలు, అంచనాలు ఉన్న మనుషులను తొలిసారిగా ఆమె ఇక్కడే కలిశారు. తర్వాత కొంతకాలం పాటు ది ఎకనమిక్ టైమ్స్ కోసం పని చేశారు. తరచూ ప్రయాణాలు చేసే ఈమె.. ఇప్పటికి 25 దేశాలను చుట్టేయడం విశేషం. ఇందులో కొన్ని చెస్ టోర్నమెంట్స్ ఆడేందుకు వెళ్లగా.. మరికొన్ని లోన్‌లీ ప్లానెట్ మ్యాగజైన్ కోసం ట్రావెలాగ్స్ రాసేందుకు సందర్శించినవి.

“కొన్ని నెలల క్రితం ప్రపంచవ్యాప్తంగా కో వర్కింగ్ స్పేసెస్‌ పెరుగుతున్నాయనే ఆన్‌లైన్ ఆర్టికల్ చదివాను. అప్పటివరకూ నేను అలాంటి కాన్సెప్ట్ వినలేదు. అందుకే చూడగానే ఇది నచ్చేసింది. ఒక ఫ్రీలాన్సర్‌గా.. ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ పనులు చేయడం ఎంత కష్టమైన విషయమో నాకు బాగానే తెలుసు. దీన్ని ఓ వెంచర్‌గా మార్చాలనే ఆలోచన నా మనసులో నాటుకుపోయింది. ఇది నాకు ఆదాయం సంపాదించి పెడుతుందనే ఆలోచన ఒకవైపుండగా.. మరోవైపు నా సొంతఊరు పూనేలో ఓ కొత్తతరం మార్పునకు నాంది పలికినదాన్ని అవుతాననే స్వార్ధం కూడా ఉంది” అని చెప్పారు కృత్తిక.

image


రోజూ గంటలపాటు దీనిపై పరిశోధన చేసి, మరికొంతమందితో సుదీర్ఘంగా చర్చలు నిర్వహించాక.. ఎలాగైనా ఈ వెంచర్ ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చేశారు కృత్తిక. ఇంటి వాతావరణం మాదిరిగా కాకుండా.. కార్పొరేట్ స్టయిల్లో పర్సనల్ ఆఫీసుల నిర్వహించుకునేలా.. సోషల్ వర్క్‌ ప్లేస్‌ల నిర్వహణకు సిద్ధమయ్యారు కృత్తిక.

తాజాగా తన స్టార్టప్‌ను లాంఛ్ చేశారు కృత్తిక. 16 మంది సభ్యులు గల కోవర్కింగ్ ప్లేస్ ఇది. చూసేందుకు ఒక సుందరమైన స్టూడియో మాదిరిగా దీన్ని తీర్చిదిద్దారు. సూర్యరశ్మి సోకేలా.. చుట్టూ చెట్లతో పచ్చని వాతావరణం ఉండడం ఈ వెంచర్ స్పెషాలిటీ. అవసరమైనవన్నీ అందుబాటులో ఉండడంతోపాటు.. ఆధునికమైన వర్క్ స్పేస్ ఈ స్టార్టప్ సొంతం.

ఐడియా మిల్ ఎలా ఉంటుందంటే ?

పూనేలో కృత్తిక కుటుంబానికి ఓ అపార్ట్‌మెంట్ ఉంది. కొంతకాలం పాటు దీన్ని అద్దెకు ఇచ్చినా.. ఇప్పుడు తన వెంచర్‌ కోసం దాన్ని ఉపయోగించుకుంటున్నారు. తన స్టూడియో నిర్మాణానికి ఈ అపార్ట్‌మెంట్‌నే ఎంచుకున్నారామె. ముందస్తుగా అక్కడున్న పరిస్థితులన్నీ మార్చేసేయాలని డిసైడ్ అయ్యారు. తన ఆఫీస్ మొత్తం ఆర్గానిక్ స్టైల్లో ఉండాలన్నదని ఆమె ఆలోచన.

ప్రస్తుతం ఈ ఆఫీస్ స్పేస్ మెంబర్లందరికీ.. ఉధయం 9 నుంచి రాత్రి 7వరకూ.. వీకెండ్స్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. తర్వాత ఒకే వర్క్ స్టేషన్‌ని తమంతట తామే పంచుకుని ఇద్దరేసి కూడా ఉపయోగించుకునేలా మార్పులు చేయబోతున్నారు.

పేరుకు తగినట్లుగానే..

"ఐడియా మిల్ అనే పేరుకు తగినట్లుగానే.. సాంకేతిక సహాయ సహకారాలు అందించడంతోపాటు నేర్చుకునేలా ఓ డైనమిక్ హబ్‌ను ఏర్పాటు చేసాను. ఇక్కడ హ్యాంగవుట్స్, టాక్స్, వర్క్‌షాప్స్, ఫిలిం స్క్రీనింగ్స్‌తోపాటు ఔట్ డోర్ యాక్టివిటీస్ కూడా చేపట్టచ్చు. ఆంట్రప్రెన్యూర్స్, క్రియేటివ్ ప్రొఫెషనల్స్‌కు ఎంతో కంఫర్టబుల్ వర్క్ ప్లేస్ ఐడియా మిల్. అంతేకాదు ప్రశాంతమైన ఆధునిక వాతావరణంలో చదువుకోవాలని అనుకునే విద్యార్ధులకు కూడా ఇది ఎంతో అనుకూలం. "అంటున్నారు ఈ 27ఏళ్ల ఆంట్రప్రెన్యూర్. ప్రస్తుతం ఈ స్టూడియోలో వ్యక్తిగతంగా విడివిడిగా సేవలు అందించడంతోపాటు... ఒకేసారి 6గురు కలిసి టీం వర్క్‌గా పని చేసుకోగలిగేలా ఏర్పాట్లు ఉన్నాయి.

ఓ నవలకు సంబంధించిన మ్యాన్యుస్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న కృత్తిక స్నేహితుడు ఒకరు ఈ మధ్య ఓ ఇబ్బందిని ఎదుర్కున్నాడు. ఇతను స్మోక్ చేసేందుకు బయటకు వచ్చిన సమయంలో.. అతని ల్యాప్ టాప్‌ని దుర్వినియోగపరచారు వేరెవరో. ఇలాంటి సమస్యలన్నిటికీ చక్కని పరిష్కారంగా ఐడియా మిల్‌ని చూపుతున్నారు కృత్తిక. తమకు ఖచ్చితంగా అవసరమైన వర్క్‌స్పేస్‌ను అందుబాటు ధరల్లోనే అందిస్తుండడడంతో. ఈ వెంచర్‌కు డిమాండ్ బాగానే ఊపందుకుంది.

అందుకే తాను దాచుకున్న నిధులన్నిటినీ వెచ్చించేసి ఈ వెంచర్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. రెండు నెలలపాటు సోషల్ మీడియాలో అడ్వర్టెయింజింగ్ ఇచ్చిన తర్వాత.. మౌత్ పబ్లిసిటీ ద్వారా మరింత ప్రచారం లభించింది.

image


కృత్తిక తల్లిదండ్రులిద్దరూ ఉన్నత విద్యావంతులే. అందుకే కూతురి కలలకు, కోరికలకు మధ్య అడ్డుగోడగా నిలవలేదు వారు. తండ్రికి ఆర్థిక రంగంలోనూ, తల్లికి మేనేజ్మెంట్ విభాగంలోనూ మంచి అనుభవమే ఉంది. శిక్షాంగన్ ఎడ్యుకేషన్ పేరుతో పూనేలో ఓ కంపెనీ నిర్వహిస్తున్నారు వీరిద్దరు. ట్విస్ట్ ఓపెన్ పేరుతో బెంగళూరులో డిజైన్ స్టూడియో నడుపుతోంది కృత్తిక సోదరి.

“ఈ వెంచర్ ప్రారంభానికి ముందు నేను చాలా కసరత్తు చేశారు. పూర్తి స్థాయి ప్రాజెక్ట్‌గా సంతరించుకునేలోపు.. ఓ నోట్ బుక్ నిండా ప్లాన్స్ రాసుకున్నాను. అంతేకాదు తేడా వస్తే బ్యాకప్ ప్లాన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. నా టైం, శక్తిలను ఐడియా మిల్‌ని అభివృద్ధఇ చేసేందుకు ఉపయోగించడం చాలా సంతోషంగా ఉంది” అంటున్నారు కృత్తిక.

చెస్, బిజినెస్‌లకు సమన్యాయం

చెస్ గేమ్‌ను కొనసాగిస్తూనే మరొకటి ఏదైనా సాధించాలనే తపన కృత్తికలో కనిపిస్తుంది. చదరంగంపై మక్కువ ఎక్కువగానే ఉన్నా.. ఈ మధ్య ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొనడం తగ్గిపోయింది. “ఓ అవకాశాన్ని వదిలేయడం నాకు నచ్చదు. అందుకే చదరంగం ఆటకు సంబంధించిన అవకాశాలను పూర్తిగా వదిలేయలేదు. ఎప్పుడైనా నాకు తిరిగి వెనక్కు వెళ్లాలని అనిపిస్తే ? అందుకే సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. నిజానికి అదో మైండ్ గేమ్. చెస్‌కి ఎలాంటి వయో పరిమితి, రిటైర్మెంట్ ఉండదు కదా” అంటూ ముగించారు కృత్తిక.

website