సంకలనాలు
Telugu

మహిళకు అండగా నిలుస్తున్న మేల్ ఫెమినిస్టులు..!

vennela null
5th May 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on


ఫెమినిజం అనగానే అది కేవలం మహిళలకు మాత్రమే పరిమితమైన అంశంగా సమాజంలో అనుకుంటారు. అంతేకాదు మహిళలు వాళ్ల హక్కులు అనగానే గుర్తొచ్చే సంఘాల్లో కేవలం మహిళలే కనిపిస్తుంటారు. ఇక కొందరు పురుషులయితే ఫెమినిజం అనగానే ఫక్తు పురుష వ్యతిరేక ఉద్యమంగా భావిస్తారు. అయితే, సమాజంలో స్త్రీలపై కొనసాగుతున్న లింగ వివక్షను గుర్తించి కొందరు మేల్ సెలబ్రిటీలు ముందుకు వచ్చారు. వాళ్లంతా వివిధ రంగాలకు చెందిన స్టార్లు అయినప్పటికీ మహిళలకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తుతున్నారు. అలాంటి వారిలో ఓ ఐదుగురి గురించి తెలసుకుందాం.

ఫర్హాన్‌ అఖ్తర్‌..

భాగ్‌ మిల్కా భాగ్‌ సినిమాతో స్టార్‌ అయిన ప్రముఖ దర్శక నటుడు ఫర్హాన్‌ అఖ్తర్‌. మహిళల అభ్యున్నతి కోసం తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. 2014లో ఇచ్చిన ఒక టీవీ ఇంటర్వ్యూలో ఫర్హాన్‌ మహిళలపై గల తన అభిప్రాయాలను ఓపెన్‌గా పంచుకున్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అన్యాయంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మర్ద్‌ అనే ఓ ఎన్జీవోకు ఫర్హాన్‌ ఓ యాడ్‌ ఫిలిం కూడా చేశారు. ఇందులో మహిళల రక్షణకు సంబంధించిన అంశాలను అందంగా చిత్రించారు. మహిళలకు గౌరవం ఇచ్చినవాడే అసలైన మగవాడని అందులో సందేశం వినిపించారు. మహిళల ఎలాంటి దాడి జరిగినా తక్షణమే స్పందించే గుణం పర్హాన్ సొంతం. అందుకే ఫర్హాన్ ను 2014 సంవ‌త్స‌రంలో ఐక్య రాజ్యసమితి వుమెన్ గుడ్‌విల్ అంబాసిడ‌ర్ గా ఎంపిక చేసింది.

రాహుల్ బోస్

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు రాహుల్ బోస్ కూడా మ‌హిళ తరుపున బ‌లంగా వాద‌న వినిపించే వ్య‌క్తి. మ‌హిళా హ‌క్కుల‌పై ఆక్స్ ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో రాహుల్ ఎన్నో ప్ర‌సంగాలు చేశారు. తాను ఎంపిక చేసుకున్న చిత్రాల్లో కూడా మ‌హిళ‌ల జీవితాల‌కు సంబంధించిన క‌థాంశాల‌నే సబ్జెక్ట్‌లుగా తీసుకున్నారు. అతను న‌టించిన చ‌మేలి చిత్రంలో రాహుల్ బోస్ ఒక వేశ్య జీవితాన్ని క‌థాంశంగా ఎంచుకున్నారు. అలాగే పిల్ల‌ల‌పై జ‌రిగే లైంగిక వేధింపుల‌పై అవ‌గాహ‌న తెచ్చేలా రాహుల్ బోస్ ఆడియో బుక్స్ త‌యారుచేశారు. ఇలా రాహుల్ బోస్ ప‌లు వేదిక‌ల‌పై మ‌హిళలపై జ‌రుగుతున్న అన్యాయాల‌ మీద గళమెత్తి ఒక సిస‌లైన ఫెమినిస్టుగా మారిపోయారు.

స‌ల్మాన్ ర‌ష్దీ

వివాదాస్ప‌ద ర‌చ‌యితగా పేరున్న ర‌ష్దీలో ఒక ఫెమినిస్టు దాగి వున్నాడు. ఆ విషయం అతను గర్వంగా చెప్పుకుంటాడు. ముఖ్యంగా ర‌ష్దీ త‌న కుటుంబ విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ త‌న‌కు సోద‌రులు లేర‌ని సోద‌రిమ‌ణులే ఉన్నార‌ని తెలిపారు. సిస్టర్స్ అంతా స‌ర్వ స్వ‌తంత్రుల‌ని తెలిపారు. అలాగే త‌న‌ను ఎఫ్ అని పిల‌వాల‌ని అంటాడు ర‌ష్దీ. ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో ర‌ష్దీ త‌న అభిప్రాయాల‌ను చాలా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేవారు. 

image


అశ్విన్ ముష్రాన్..

న‌టుడిగా, క‌మెడియ‌న్‌గా పేరొందిన అశ్విన్ ముష్రాన్ ఒక ఫెమినిస్టు. స్త్రీల హ‌క్కుల‌పై త‌న భావాల‌ను బ‌లంగా వినిపిస్తారు. ముఖ్యంగా ఫెమినిజం అంటే మ‌హిళ‌ల‌కు స‌మాన హక్కులు సాధించే వేదిక అని, అందులో వ్య‌తిరేకించాల్సింది ఏముంద‌ని అంటారు. పురుషుల‌కు, స్త్రీల‌కు మ‌ధ్య హెచ్చు త‌గ్గుల సంగ‌తిని ప‌ట్టించుకోను అని, స్త్రీల‌ను స‌మానంగా గౌర‌వించ‌డ‌మే అస‌లైన భార‌తీయ సంస్కృతిగా అశ్విన్ అంటారు.

విరాట్ కోహ్లీ, ర‌విశాస్త్రి, సురేష్ రైనా, అంబ‌టి రాయుడు

మైదానంలో బౌండ‌రీల వ‌ర‌ద పారించే ఈ క్రికెట‌ర్లు.. స‌మాజంలో మ‌హిళ‌ల‌ను కాపాడేందుకు బౌండ‌రీల‌ను నెల‌కొల్పాలంటూ ముందుకు వ‌చ్చారు. రెస్పెక్ట్ టు ప్రొటెక్ట్ పేరిట ముందుకు వ‌చ్చిన ఈ క్రికెట‌ర్లు.. హైద‌రాబాద్‌లోని ఒక ఎన్జీవోతో క‌లిసి ప‌నిచేస్తున్నారు. వీరంతా ఒక వీడియో విడుద‌ల చేసి.. మ‌హిళ‌కు ఇవ్వాల్సిన గౌర‌వంపై త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు. మ‌హిళ‌ల‌కు ఆర్థికంగానూ సామాజికంగానూ స‌మాన హ‌క్కుల‌ను క‌ల్పించిన‌ప్పుడే స‌మాజంలో స‌మాన‌త్వం నెల‌కొల్ప‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు.

ఇలా ప్ర‌తి ఒక్క‌రూ ముందుకు వ‌స్తే మ‌హిళ‌కు ర‌క్ష‌ణ అనేది అసాధ్యం కాదు. అర్థ‌రాత్రి ఆడ‌ది ఒంట‌రిగా తిరిగే స‌మాజం మ‌రెంతో దూరంలో లేద‌న్న‌ది వాస్త‌వం.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags