క‌ల‌కాలం గుర్తుండిపోయే గిఫ్ట్‌.. చిటికెలో త‌యార్..!

22nd Mar 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close


పెళ్లి కావ‌చ్చు.. బ‌ర్త్‌డే అయ్యుండ‌చ్చు.. మ‌రో ఈవెంట్ కావ‌చ్చు. సంద‌ర్భం ఏదైనా కానీ.. గిఫ్ట్ ఇవ్వ‌డం అనేది ఒక రోటీన్ అల‌వాటుగా మారిపోయింది ఇప్పుడు. కానీ.. వేల‌కు వేలు ఖ‌ర్చుపెట్టి కొనిచ్చే గిఫ్ట్ కంటే..కాస్త క‌ష్ట‌ప‌డి సొంత‌గా ఏదైనా త‌యారుచేసి ఇస్తే.. అది ఇచ్చిన‌వాళ్ల‌కు హాపీ. దాన్ని తీసుకున్న‌వాళ్ల‌కూ తృప్తి. ఏదో తెలియని ఎమోష‌న‌ల్ అటాచ్‌మెంట్‌. కాఫీ క‌ప్పులు అయితే రెండో రోజుకే అట‌కెక్కుతాయి. అదే చేత్తో చేసిన గ్రీటింగ్ కార్డో.. మ‌రో చిన్న గిఫ్టో అయితే నాలుగు కాలాల పాటు ఇంట్లోని డిస్‌ప్లేలో అలా ఉంటాయి. దాన్ని చూసినపుడ‌ల్లా ఆ సంద‌ర్భం గుర్తుకు వ‌స్తుంది. కానీ.. ప్ర‌స్తుత బిజీ లైఫ్‌లో అంత తీరిగ్గా గిఫ్ట్‌లు త‌యారు చేసే తీరిక ఎవ‌రికి ఉంది చెప్పండి. అందుకే.. "డూ ఇట్ యువ‌ర్‌సెల్ప్ కిట్స్" (Do it Yourself Kits) అనే కాన్సెప్ట్‌తో ఒక స్టార్ట‌ప్ మొద‌లైంది.

image


ఇలా మొద‌లైంది.

2006లో మిషా, అమిత్ అనే ఇద్ద‌రు ఔత్సాహికులు ఒక స్టార్ట‌ప్ మొద‌లుపెట్టారు. త‌మ ఆలోచ‌నకు రాబోయే కాలంలో మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని భావించిన ఇద్ద‌రు.. డిజైన్‌, టెక్నాల‌జీ క‌ల‌గ‌లిపిన గిఫ్ట్‌లు త‌యారుచేసే స్కైడిజైన్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ త‌ర్వాత కాలంలో సినిమాలు, కార్పొరేట్ సెక్టార్ల‌లో ఊహించ‌ని విధంగా స‌క్సెస్ అయింది ఈ కాన్సెప్ట్‌. అయితే.. తాము అనుకున్న‌ది ఇది కాద‌ని అనిపించి.. కొత్త కాన్సెప్ట్‌ల‌ను స్ట‌డీ చేయ‌డం మొద‌లుపెట్టారు. 2013లో ఈ కామ‌ర్స్ హవా మొద‌ల‌వుతున్న స‌మ‌యంలో.. దొరికే ప్రొడ‌క్ట్స్‌ను గిఫ్ట్‌ల రూపంలో చిన్న చిన్న బొమ్మ‌లుగా త‌యారుచేయాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది. ఆ ఆలోచ‌న నుంచి పుట్టిందే "స్కై గూడీస్‌". చేత్తో త‌యారు చేసి పెయింట్ వేసిన కొన్ని వ‌స్తువుల‌ను "డూ ఇట్ యువ‌ర్‌సెల్ప్ కిట్స్"గా రెడీ చేసి త‌మ షాపులో ప్ర‌ద‌ర్శ‌న‌కు పెట్టారు. 

మార్కెట్ రియాక్ష‌న్‌ను చూసి పెద్ద మొత్తంలో వాటిని త‌యారుచేయాల‌ని ప్లాన్ చేశారు. పేప‌ర్ క్రాఫ్ట్స్‌తో పోలిస్తే.. త‌మ బిజినెస్ రిస్కీ అని తెలిసి కూడా ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కానీ.. అనూహ్యంగా ఊహించిన రెస్పాన్స్ వ‌చ్చిందంటారు మిషా.

image


"ఎట్సీ బ్లాగ్‌లో మేం త‌యారుచేసిన వ‌స్తువుల‌ను ప్ర‌ద‌ర్శించ‌డం ఎంతో హ్యాపీగా అనిపించింది. ప్ర‌ప‌పంచ‌వ్యాప్తంగా ఎంతోమంది క‌స్ట‌మ‌ర్లు మంచి రివ్యూల‌ను ఇవ్వ‌డంతో పాటు మ‌రిన్ని వ‌స్తువుల‌ను పెట్టాల‌ని కోరారు. కొంత‌మంది మా ప్రొడ‌క్ట్స్‌ను త‌యారుచేసి డిఫ‌రెంట్లీ ఏబుల్డ్ పిల్ల‌ల‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. వారిలో క్రియేటివిటీని పెంపొందించ‌డానికి అవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ్డాయి." అంటారు మిషా..

స్కై గూడీస్‌

ఇలాంటి గిఫ్ట్‌లు త‌యారు చేయాలంటే ఫెవికాల్‌, క‌త్తెర‌లు ఇవ‌న్నీ కావాల‌నుకుంటారు. కానీ.. వాట‌న్నిటి అవ‌సరం ఏమాత్రం లేకుండానే ముందుగానే క‌ట్‌చేసిన పీసెస్‌ను.. జ‌స్ట్ ద‌గ్గ‌ర‌కు చేరిస్తే అద్భుత‌మైన గిఫ్ట్ త‌యార‌య్యేలా స్కై గూడీస్‌ను త‌యారుచేశారు. "త‌క్కువ ఖ‌ర్చుతో ప‌దికాలాల పాటు గుర్తుగా నిలిచిపోయేలా, చూడ‌టానికి అద్భుతంగా ఉండే బ‌హుమ‌తులు త‌యారుచేయాల‌న్న‌దే మా ఆలోచ‌న‌" అని మిషా అంటున్నారు.

మిషా, అమిత్‌లు నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో క్లాస్‌మేట్స్‌. మిషా గ్రాఫిక్ డిజైన్‌లో ఉంటే.. అమిత్ ప్రొడ‌క్ట్స్‌లో ఉండేవారు. కానీ.. చేసే ప‌నిప‌ట్ల మాత్రం ఇద్ద‌రికీ కావాల్సినంత నిబ‌ద్ధ‌త ఉంది. మొద‌ట‌ ఫ్రెండ్స్‌గా ఒక‌రికి ఒక‌రు ప‌రిచ‌య‌మ‌య్యారు. త‌ర్వాత ఒకే సంస్ధ‌లో ప‌నిచేయ‌డం, ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డి పెళ్లిచేసుకోవ‌డం వ‌ర‌కు ఇద్ద‌రి ప‌రిచ‌యం వెళ్లింది. ఇప్పుడు ఇద్ద‌రు ఒక కంపెనీకి కోఫౌండ‌ర్లు కూడా!

image


ఒరిజిన‌ల్ డిజైన్ పేప‌ర్ ప్రొడ‌క్ట్స్‌తో పాటు వాటితో త‌యారు చేసిన క్రాఫ్ట్స్‌ను స్కైగూడీస్ విక్ర‌యిస్తోంది. చేతితో గీసిన బొమ్మ‌లు ఉన్న ప్రొడ‌క్స్‌ను అమ్మ‌డం ద్వారా గిఫ్ట్‌ను త‌యారు చేసుకోవ‌డంలో ఉన్న ఆనందాన్ని క‌స్ట‌మ‌ర్ల‌కు అందించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మంటున్నారు కంపెనీ ఫౌండ్సర్స్‌.

దేశీయ క‌ళ‌ల నుంచే తాము స్ఫూర్తి పొందామంటున్నారు స్కైగూడీస్ వ్య‌వ‌స్థాప‌కులు. ఇలాంటి గిఫ్ట్‌లు త‌యారు చేయాలంటే ఫ‌లానా వ‌య‌సు ఉండాల‌నే నిబంధ‌న‌ల‌ను ప‌క్క‌కు పెట్టేసి అన్ని వ‌య‌సుల వాళ్లు త‌యారుచేసుకునే విధంగా గిఫ్ట్‌ల‌ను రెడీ చేస్తున్నారు. వీటితో పాటు నోట్‌బుక్స్‌, గిఫ్ట్ బాక్స్‌లు, ప్లాన‌ర్స్‌, లేబుల్స్‌.. ఇలా ర‌క‌ర‌కాల ప్రోడ‌క్ట్స్‌ను స్కైగూడీస్ విక్ర‌యిస్తోంది.

ఆకాశ‌మే హ‌ద్దు..

ముంబై కేంద్రంగా ప‌నిచేస్తున్న ఈ సంస్ధ పేరులో ఉన్న "స్కై" అనే ప‌దానికి చాలా పెద్ద క‌థే ఉంది. “నిత్యం హ‌డావుడిగా ఉండే ముంబై వీధుల్లో మా కెరీర్ మొద‌లుపెట్టాం. మా వ‌ర‌కు మాకు ఆకాశం అనేది స్వేచ్ఛ‌కు, ఎల్ల‌లు లేని క్రియేటివిటీకి చిహ్నం. అందుకే మా కంపెనీకి ఆ పేరు పెట్టుకున్నాం ”అంటారు మిషా. 

గ‌త రెండేళ్ల‌లో ఆశించిన స్ధాయిలో వృద్ధి సాధించింది స్కైగూడీస్‌. డూ ఇట్ యువ‌ర్‌సెల్ఫ్ కాన్సెప్ట్ మొద‌లుపెట్టాకే సేల్స్ పెరిగాయి. మొట్ట‌మొద‌ట్లోనే విదేశీ క‌స్ట‌మ‌ర్లు మంచి రివ్యూలు ఇవ్వ‌డంతో.. రిస్క్ ఉన్నా కూడా ధైర్యం చేసి వీటిని మొద‌లుపెట్టామంటారు మిషా. ప్ర‌స్తుత డిజిట‌ల్ ప్ర‌పంచంలో హ‌స్త‌క‌ళ‌ల‌కు ఏమాత్రం విలువ ఉండ‌టంలేదు. అందుకే.త‌ర్వాతి త‌రానికి ఈ ర‌కంగా అయినా క‌ళ‌ల‌ను ద‌గ్గ‌ర‌చేయాల‌న్న‌ది త‌మ తాప‌త్ర‌య‌మ‌ని ఆమె అంటున్నారు.

image


ఈ మ‌ధ్య‌నే ముంబైలో స్కైగూడీస్ మొట్ట‌మొద‌టి షాప్ ఓపెన్ చేసింది. నిత్యం అమ్మ‌కాల్లో కొత్త ఆలోచ‌న‌ల‌ను తీసుకురావ‌డానికి కృషిచేస్తోంది. ఇప్ప‌టికే ఎన్నో ఇన్వెస్ట్‌మెంట్ ఆప్ష‌న్స్ వ‌చ్చినా.. వాటిని సున్నితంగా తిర‌స్క‌రించారు మిషా, అమిత్‌.

‘‘ ఇన్వెస్ట్‌మెంట్ అనే ప‌దం విన‌డానికి బాగానే ఉన్నా.. మ‌నం త‌యారుచేస్తున్న ప్రొడ‌క్ట్ గురించి మ‌న‌కు మాత్ర‌మే తెలుసు. వాటి గురించి అర్ధంకాని వాళ్ల ద‌గ్గ‌ర ఇన్వెస్ట్‌మెంట్ తీసుకోవ‌డం మంచిది కాదు. ఇవాళ్టి రోజు వ‌ర‌కు కూడా మేం అనుకున్న స్ధాయిలోనే వ‌స్తువుల‌ను త‌యారుచేస్తున్నాం. అంటారు మిషా

ప్ర‌స్తుతానికి ఆశించిన స్ధాయిలోనే రెవెన్యూ గ‌డిస్తున్న స్కైగూడీస్‌.. 2016 చివ‌రినాటికి పూర్తిస్ధాయిలో మార్కెట్‌లోకి రావ‌డానికి ప్లాన్ చేస్తోంది,

వెబ్‌సైట్‌

image

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India