మీ కలిగ్స్ తో కలిసిపోయేందుకు మూడు సూత్రాలు!
ఆఫీసులో అయినా పనిచేసే ఏ స్థలంలోనైనా మన చుట్టూ ఉన్న కలిగ్స్ తో కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. వర్క్ ప్లేస్ లో బుద్ధిగా తలొంచుకొని పనిచేసుకుంటూ పోతే ఈ పోటీ ప్రపంచంలో సరిపోదు. చుట్టూ ఉన్న సహ ఉద్యోగులతో ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ మెయిన్‌టెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. టీం లీడర్ అయితే మాత్రం కచ్చితంగా సహ ఉద్యోగులతో రిలేషన్స్ మెయిన్‌టెయిన్ చేయాల్సిందే. ఆఫీసులో ఒకరిపై నిశ్చితాభిప్రాయానికి రావడం అనేది అంత శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా ఒక్కో వ్యక్తి ఒక్కో సందర్భంలో ఒకలా ఉంటుంటారు. ఇలాంటి వాతావరణంలో ఎలా వ్యవహరించాలో విచక్ణణతో కూడిన నిర్ణయాలు తీసకోవాలి. కొన్ని పరిస్థితులను ఎలా స్వీకరించాల్సి ఉంటుంది.. ఎలా స్వీకరించకూడదు అనేది కూడా తెలుసుకోవాల్సిందే. ముఖ్యంగా ఒక టీం లీడర్‌గా కలిగ్స్‌తో ఎలా బిహేవ్ చేస్తే మీటింగ్స్‌లో కానీ వర్క్ డివిజన్ లో కానీ సక్సెస్ అవుతామో చూద్దాం.
ముందే సబ్జెక్ట్‌పై క్లారిటీ ఇవ్వకూడదు..!
సాధారణంగా టీం లీడర్‌గా ఒక మీటింగ్ లో ప్రజెంటేషన్ సబ్జెక్ట్‌ని తొందరగా కంప్లీట్ చేయడం అంతమంచిది కాదు. మీటింగ్‌లో పాల్గొన్న సభ్యులకు సబ్జెక్ట్‌లో సందేహాలు కలిగేలా కొన్ని క్వశ్చన్స్ వదిలేయాలి. పూర్తిగా సబ్జెక్ట్‌ని చెప్పేసి ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే మాత్రం కలిగ్స్కి మీ పట్ల వ్యతిరేకభావం పెరిగే అవకాశం ఉంది. మీటింగ్‌లో సహచరుల ముఖకవళికలను గమనించాల్సి ఉంది. ఎప్పుడైతే వాళ్లలో అసహనం కనిపించిందో వెంటనే వారి మూడ్‌ను చేంజ్ చేసేలా మాటలు కలపాలి. ఎక్కువగా సబ్జెక్ట్ ను విశ్లేషిస్తే దానిలోని లోపాలు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. కలిగ్స్ కు వారి అభిప్రాయాలను తెలియజేసే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు మనుషుల స్వభావరీత్యా మనం ప్రతీ ఒక్కరికీ నచ్చకపోవచ్చు. అయినప్పటికీ అందరినీ సమష్టిగా కలుపుకొని పోవాల్సి ఉంటుంది. అన్నింటి కన్నా ముఖ్యమైంది ఒక ప్రాజెక్టు మేనేజర్‌గా మనకు ఏదైతే పనిని నిర్దేశించారో ఆ పనిని పూర్తి చేసేందుకు శాయశక్తులా అందరినీ కలుపుకుంటూ, సమష్టిగానే ముందుకు కదలాల్సి ఉంటుంది.
పని విషయంలో అందరితో కలవాల్సిందే..!
మీరు పనిచేసే ఆఫీసులో కలిగ్స్లో కొందరు నచ్చకపోవచ్చు. అయినప్పటికీ ఆ భావం మాత్రం వారితో పనిచేసేటప్పుడు మాత్రం బయట పడకుండా పనిచేయాలి. వీలైనంత వరకూ వారితో కలుపుగోలుగా ఉండాల్సిందే. వర్క్ విషయంలో మాత్రం ఎలాంటి మినహాయింపులు ఉండకూడదు. మన పర్సనల్ అభిప్రాయాలు పని విషయంలో మాత్రం ప్రతిబింబించకూడదు. అలాగే పనికి విఘాతం కలిగించేలా వాదన లాంటివి పెట్టుకోవద్దు. వర్క్ విషయంలో కఠినంగా ఉంటూనే అందరినీ కలుపుకుపోయే వర్క్ కల్చర్ డెవలప్ చేయాల్సి ఉంటుంది.
మీ హుందా తనమే మీ చిరునామా..!
పనిచేసే ప్లేస్‌లో హుందాతనంగా మెలగడం అనేది చాలా అవసరం. ఎందుకంటే పనిచేసే చోట మన సోషల్ బిహేవియర్ మొత్తం వర్క్ స్పేస్‌నే మార్చేస్తుంది. అందరితోనూ హుందాగా ఉంటూనే వారిని కలుపుకుపోయే గుణం అలవర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు గౌరవం దక్కుతుంది. పనిచేసే స్థలంలో కలిగ్స్‌తో వారి వ్యవహారాల్లో కలిగించుకోవడంతో పాటు వారికి తోడ్పాటు అందించడం లాంటివి చేయాలి. అప్పుడు మీ పట్ల గౌరవం పెరుగుతుంది. పని చేసే చోట నలుగురికి ప్రోత్సాహం కలిగించడం కూడా చాలా ముఖ్యం.