100, హైదరాబాద్ స్టార్టప్ సాటర్ డే స్కోర్ ఇది. ఒకటి కాదు రెండు కాదు. వంద ఎపీసోడ్ లు నిరాటంకంగా కొనసాగుతోంది. ఇంచుమించు బెంగళూరులోని స్టార్టప్ సాటర్ డే తోనే ప్రారంభమైన మన భాగ్యనగరం చాప్టర్ ఇప్పుడు వంద ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది. మరింత ఉత్సాహంగా నూటొకవ ఎపీసోడ్ కి సిద్ధమైపోయింది.
ఆటపాటలతో పిచింగ్
స్టార్టప్ అంటే కెరియర్ , ఫండింగ్, యాప్ లాంటి సీరియస్ డిస్కషన్స్ ఉంటాయి. టార్గెట్ మార్కెట్, ట్రాక్షన్ అంటూ ఎప్పుడూ టెన్షన్ పడుతూ కనిపిస్తారు మన స్టార్టప్ జనం. కానీ స్టార్టప్ సాటర్ డే లో మాత్రం ఇలాంటి విషయాలు ఉన్నప్పటికీ కొద్దిగ ఉత్సాహాన్ని కలిగించే యాక్టివిటీ లాంటికి ఉంటాయి. వందో ఎపిసోడ్ లో ఇది కాస్త పీక్ స్థాయిలో కనిపించింది. ఏకంగా పాటలు పాడుతూ స్టార్టప్ ఫౌండర్లు ఏంజిల్ ఇన్వెస్టర్లను ఇంప్రస్ చేసే ప్రయత్నం చేశారు. విరితో ఇతర స్టార్టప్ జనం జతకట్టి ఉత్సాహపరిచారు. మొత్తానికి హైదరాబాద్ అంటే ఓ ప్రత్యేకం అనే విధంగా స్టార్టప్ సాటర్ డే వందో ఎపిసోడ్ ముగిసింది.
“మొదటి రోజు ఏ ఉత్సాహం చూశానో, ఇప్పుడు దానికి పదిరెట్లు ఉత్సాహం చూస్తున్నా,” రమేష్ లోకనాధన్
స్టార్టప్ సాటర్ డే మొదటి రోజు నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంటున్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో రమేష్ ఒకరు. స్టార్టప్ సాటర్ డే లో జరిగిని సింగింగ్ పిచింగ్ తాలూకు వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన రమేష్ స్టార్టప్ జనాల్లో మరింత్ ఉత్సాహాన్ని పెంచే ప్రయత్నం చేశారు
పదులు సంఖ్య నుంచి వందకు
ప్రారంభించిన రోజు స్టార్టప్ పై అవగాహణ ఉన్న వారు చాలా తక్కువ మంది వచ్చే వారు. ఒక వారం పది మంది దాటితే అదో పెద్ద అద్భుతం అనేలా ఉండేది. లామాకాన్ లో స్టార్టప్ సాటర్ డే జరిగే రోజుల్లో అయితే సరాసరి వంద మంది దాకా జనం అటెండ్ అయ్యేవారు. తర్వాత వెన్యూ మార్చాల్సి వచ్చింది. వందో ఎపిసోడ్ అయితే ఓ పెద్ద సంబరం లాగ జరిందనే చెప్పాలి. స్టార్టప్ సాటర్ డే మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో స్టార్టప్ లు ప్రారంభం అయ్యాయి. కొన్ని షట్ డౌన్ అయ్యాయి. కొన్నింటిని మరికొన్ని కంపెనీలు టేక్ ఓవర్ చేశాయి. కొన్ని వివిధ దేశాలకు తమ సేవలను విస్తరించాయి. కొన్ని ఫండింగ్ లో సరికొత్త రికార్డులను దాటాయి. ఇలా చెప్పుకుంటూ వస్తే వంద ఎపిసోడ్ లకు వేయి కధలు దొరుకుతాయి. ఇందులో ప్రతి కధ ముఖ్యమైనదే. ప్రతి స్టార్టప్ భాగస్వామియే.
“స్టార్టప్ కమ్యూనిటీకి స్టార్టప్ సాటర్ డే ఇచ్చిన మద్దతు అంతా ఇంతా కాదు,” శ్రీనివాస్ కొల్లిపొర
నిజానికి టీ హబ్ ప్రారంభించిన ఉద్దేశం హైదరాబాద్ దేశానికి స్టార్టప్ రాజధాని కావాలనే. ఈ విషయాన్ని ప్రారంభిచ రోజు రాష్ట్ర ఐటి మంత్రి కెటిఆర్ అన్నారు. ఇలా హైదరాబాద్ లో మరిన్ని స్టార్టప్ లు ప్రారంభం కావాలంటే కమ్యూనిటీ ఉండాలి. దానికోసం స్టార్టప్ సాటర్ డే చేస్తున్న సాయం ఎనలేనిది. ఇదే విషయాన్ని శ్రీనివాస్ గుర్తు చేసుకున్నారు. స్టార్టప్ కమ్యూనిటీతో ఇంట్రాక్ట్ అయ్యారు.
ఐడియాలున్నాయి, టీం ఉంది, ఫండింగే ఆలస్యం
హైదరాబాద్ స్టార్టప్ సీన్ ఇది. సమస్యలను పరిష్కరించే ఆలోచనలున్నాయి. వాటిని సమర్ధవంతంగా నడిపే టీం కూడా ఉంది. ఇక ఫండింగ్ ఒక్కటే ఆలస్యం. అయితే ఇప్పటికే స్థానిక స్టార్టప్ కంపెనీలు ఫండింగ్ లో దూసుకు పోతున్నాయి. మరింత మంది ఏంజిల్ ఇన్వెస్టర్లు మరిన్ని సంస్థల్లో పెట్టుబడులు పెడితే పరిస్థితులు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉండొచ్చని స్టార్టప్ కమ్యూనిటీ అభిప్రాయపడింది. చాలా సంస్థలు సెల్ఫ్ సస్టెనబుల్ మొడల్ ను ఎంచుకుని ఫండింగ్ అవసరం లేకుండానే దూసుకుపోతున్నాయి. వీటి పరిస్థితి వేరు. కానీ ఇప్పటికీ కొన్ని కంపెనీలు ఫండింగ్ కోసం చూస్తున్నాయి. టీ హబ్ ఈ పరిస్థితిని మార్చగలిగింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో టీహబ్ కూడా ఒకటి కావడం విశేషం. ఏది ఎలా ఉన్నా స్టార్టప్ కమ్యూనిటీకి ముందు నుంచి మెంటార్ చేస్తోన్న స్టార్టప్ సాటర్ కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎప్పటి కప్పుడు ట్రెండ్స్ పై చర్చిస్తూ, వక్తలతో స్టార్టప్ కమ్యూనిటీని ఇంట్రక్ట్ చేయడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయిన మన హైదరాబాద్ స్టార్టప్ సాటర్ డే మరిన్ని వంద ఎపిసోడ్ లను పూర్త చేయాలని కోరుకుందాం.