సబేరీతో ఇంటి దగ్గరకే కంటి వైద్య పరీక్షలు
మీ ఇంట్లో అమ్మమ్మలు, నాయనమ్మలున్నారా? తాతమ్మలు, తాతయ్యలున్నారా? కంటి పరీక్షలకు తీసుకెళ్లమని కొన్నాళ్లుగా మిమ్మల్ని అడుగుతున్నారా? అయితే సబేరీ ట్రక్ కికాల్ చేయండి. లేదా ఆన్ లైన్లో బుక్ చేయండి. ఇకపై కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. ప్రపంచస్థాయి ఐ టెస్టింగ్ ఎక్విప్మెంట్ తో సబేరీస్ ఆన్ వీల్స్ కంటి పరీక్షల సమస్యకి పరిష్కారం చూపుతామంటోంది సబేరీ.
ట్రక్ లోనే కళ్లద్దాల షాప్
కంటి పరీక్షలే కాదు కళ్లద్దాలను సైతం ఇక్కడే విక్రయిస్తారు. కంటికి సంబంధించిన అన్ని రకాల ప్రాడక్టులు, సర్వీసులు ఈ ట్రక్ నుంచే నిర్వహిస్తారు. క్యూలో నిలబడి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్ లోనే యూజర్లు కన్వీనియెంట్ టైంకి ఫిక్స్ చేసుకోవచ్చు. సన్ గ్లాసెస్, స్పెక్టాకుల్ లెన్స్, ఫ్రేమ్స్, కాంటాక్ట్ లెన్స్, యాక్ససిరీస్.. ఇలా లాంటి అన్ని ప్రాడక్టులు సబేరీస్ ఆన్ వీల్స్ లో దొరుకుతాయి.
“దేశంలోనే మొదటి ఇంటిగ్రేటెడ్ వర్చువల్, మొబిలిటీ ప్లాట్ ఫాం ఇది” హసన్ సబేరీ
ఐకేర్ కి సంబంధించి ప్రతిదాన్ని కవర్ చేయగలిగామని హసన్ సబేరీ అంటున్నారు. కస్టమర్ల ఫీడ్ బ్యాక్ తీసుకొని అవసరం అనుకంటే మరిన్ని సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారాయన.
ఆన్ సైట్ సర్వీసు
ఆన్ లైన్ సర్వీసుల్లాగానే పూర్తిస్థాయి ఆన్ సైట్ సర్వీసు ఇది. దీంట్లో కంప్యూటర్ ఐ ఎగ్జామినేషన్, మెజర్మెంట్ ఫర్ గ్లాసెస్ అండ్ ఫిటింగ్, హెల్త్ కండీషన్ టెస్టింగ్ లాంటివి కూడా అందుబాటులోకి తెచ్చారు. డయాబెటీస్, హైపర్ టెన్షన్ చెకప్ ఇందులో చేస్తారు. లో విజన్, పార్షియల్ సైట్ లాంటి వాటికి కూడా మెరుగైన సేవలు అందిస్తున్నారు. గ్లాకోమా, కోమీల్ అండ్ ఎక్స్ టర్నల్ ఐ డిసీజ్, కంటికి సంబంధించి న్యూరోలాజికల్ డిసీజెస్ కి కూడా పరీక్షలు నిర్వహిస్తారు. కంటి ఆసుపత్రిలో చేసే దాదాపు అన్ని సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని మరో డైరెక్టర్ సీహెచ్ జీవన్ రావు అంటున్నారు.
ఐ కేర్ మార్కెట్
ఇప్పుడున్న హెల్త్ కేర్ రంగం 2017 నాటికి 160 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. 2020 నాటికి ఇది 280 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. దేశంలో ఉన్న అన్నిరంగాల్లో హెల్త్ కేర్ రంగం అగ్రగామిగా కొనసాగుతోంది. లక్షల మందికి ఉపాధిని అందిస్తూ కోట్ల రూపాయిలను గడిస్తోంది. దీనిలో ఐకేర్ ట్రీట్ మెంట్ వాటా 2013 -14 ఏడాదికి 2 బిలియన్ డాలర్లుగా ఉంది. క్రిసిల్ రిపోర్టు ప్రకారం అయిదేళ్లలో ఇది 3 బిలియన్ డాలర్లకు చేరనుంది.
“వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉండటంతో పాటు సామాజికంగా సాయం చేయడానికి మాకొక అవకాశం వచ్చిందని భావిస్తున్నాం” -హసస్
సవాళ్లు, ప్రణాళికలు
ఈ రంగంలో ఆన్ వీల్ సేవలందించే స్టార్టప్ ఏదీ లేదు. పోటీ లేకపోయినప్పటికీ మొదటిసారి వచ్చిన వారికి కొన్ని సవాళ్లు మాత్రం ఎదురవుతాయి. ఇప్పటికే ఈ తరహా వ్యాపారం ఎస్టాబ్లిష్ అయితే లాక్కు రావడం ఈజీ. అలా కాకపోవడంతో బాగా ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అయితే సబేరీ బ్రాండ్ హైదరాబాదీలకు సుపరిచితమైందే కనక దీన్ని తక్కువ కాలంలోనే అధిగమిస్తామని హసన్ దీమా వ్యక్తం చేశారు.
ఆన్ లైన్ బుకింగ్ ప్రారంభమయ్యాయి. ఆఫ్ లైన్ కస్టమర్లను ఆన్ లైన్ లోకి తీసుకురావడంపై ప్రణాళిక చేస్తున్నారు. వచ్చే ఆరు నెలల్లో మరో రెండు మెట్రో నగరాలకు సేవలను విస్తరించనున్నారు. ఏడాదిలో దేశంలో ఉన్న అన్ని మెట్రోలకు వ్యాపారాన్ని విస్తరించాలని ప్రణాళికలు రెడీ చేస్తున్నారు.