ఉరిమే ఉత్సాహంతో అదరగొట్టిన అండర్ 25

ఉరిమే ఉత్సాహంతో అదరగొట్టిన అండర్ 25

Monday August 01, 2016,

2 min Read

పది పదిహేనేళ్ల క్రితం 25 ఏళ్లు వచ్చాయంటే పెళ్లి వయసు వచ్చేసిందనే వారు. ఇక అమ్మాయిలకైతే పెళ్లైపోవాల్సిందే. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. 25ఏళ్లు దాటాకే బిజినెస్ సెట్ చేసుకోవాలనుకునేవారు. పేరెంట్స్ కూడా అలాంటి ధోరణికే అలవాటు పడుతున్నారు. ఉద్యోగంలో చేరినా అది టెంపరరీగానే చూస్తున్నారు. స్టార్టప్ ప్రారంభించడం, నచ్చిన రంగంలో రాణించాలని సరికొత్త ప్రయోగాలు చేయడం.. ఇలా కలగలిసి 25ఏళ్లు అనేది పెద్ద వయసు కాదనిపిస్తుంది. అంటే అండర్ 25 ఇప్పుడు టీనేజి అన్నమాట. గతంలో అండర్19 అనే జనం ఇప్పుడు అండర్ 25 అంటున్నారు. ఇదే పేరుతో ఓ క్లబ్ కూడా ఏర్పడింది. ఈ క్లబ్ నిర్వహించిన స్టార్టప్ ఫెస్ట్ కి హైదరాబాద్ లోని టీ హబ్ వేదికైంది. వందల మంది పార్టిసిపెంట్స్, స్పీకర్స్, కళాకారులు స్టార్టప్ ఔత్సాహికులతో సభ కళకళలాడింది.

“యువత ఇప్పుడున్న ఉత్సాహం వారి జీవితాంతం కొనసాగినప్పుడే లీడర్స్ అవుతారు. దానికి ఇప్పుడే బీజం పడాలి.” విజయ్ కుమార్

ఉస్మానియా ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయిన విజయ్ కుమార్ ఈ యూత్ ఫెస్ట్ లో స్పీకర్ గా పాల్గొన్నారు. యూత్ ఉత్సాహానికి కొద్దిగా ఎక్స్ పీరియన్స్ తోడైతే దేశంలో వండర్స్ క్రియేట్ చేయొచ్చని ఆయన అభిప్రాపడ్డారు.

image


ఇక యూత్ ఫెస్ట్ లో సింగింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పాలి. అండర్ 25 అయిన చాలా మంది కళాకారులు పాటలతో ఉర్రూతలూగించారు. రాక్ మ్యూజిక్, డ్రమ్స్ లాంటివి ప్లే చేశారు.

“మేం ఎక్కడా పనిచేయాలని అనుకోవడం లేదు, ఫ్రీలాన్సింగ్ మాత్రమే చేస్తాం. ఇదే రంగంలో రాణించాలని అనుకుంటున్నాం. ఇప్పుడు కాకపోవచ్చు, ఎప్పటికైనా మేం ఫేమస్ అవుతాం. దానికోసమే మా ప్రయత్నమంతా”- కళాకారులు

ఇంటిపట్టున ఉండి ఉద్యోగాల్లో జాయిన్ అవడం ఇష్టం లేదంటున్నారు. ఈ విషయంలో వారిని ఒప్పించగలిగామని కళాకారులు చెప్పుకొచ్చారు. మ్యూజిక్ , ఇంస్ట్రూమెంట్ లాంటి రంగాల్లో రాణించాలనేది తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు.

స్టార్టప్ ఐడియాలు

యూత్ ఫెస్ట్ లో కొన్ని క్రియేటివ్ స్టార్టప్ ఐడియాలు ప్రదర్శనకు పెట్టారు. మ్యూజిక్ ఆల్బమ్ లాంటి ఐడియాలు తెరపైకి వచ్చాయి. అయితే దీనిపై కొంతమంది ఇన్వెస్టర్లు కూడా ఫండింగ్ చేయడానికి ఆసక్తి చూపారు. స్టార్టప్ అంటే ఓ సాఫ్ట్ వేర్ రంగానికి చెందింది కాదనే అభిప్రాయం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ వెలిబుచ్చారు. దీంతో పాటు ఈ సమ్మిట్ లో పాల్గొన్న మెంటార్స్, స్పీకర్స్ కూడా ఆనందంగా వారి పాత గుర్తులను నెమరువేసుకున్నారు. సింగర్ శ్రీరాంచంద్ర పాట పాడి ఉర్రూతలూగించాడు.