మీ వ్యాపారాన్ని అనలైజ్ చేస్తాం..
Sunday February 21, 2016 , 4 min Read
వందల కొద్దీ ఛానళ్లు.. వేల కొద్దీ పాపులర్ వెబ్‌సైట్లు.. ఆన్‌లైన్ టూల్స్, బ్లాగులు.. క్షణక్షణానికి అప్‌డేట్స్ అందిస్తూ ప్రపంచం రూపురేఖలను మార్చేశాయి. ఈ నేపధ్యంలో మీడియా అనలిటిక్స్ అనేది ప్రతీ దానికి కీలకంగా మారింది. అడ్వర్టయిజింగ్‌కు కానీ.. బ్రాండ్ డెవలప్ చేయడానికి కానీ.. కొంత బడ్జెట్ కేటాయించాలని నిర్ణయించినప్పుడు.. ఏ ప్రాతిపదికపై దేనికి ఎంత ఖర్చుపెట్టాలనేదానిపై క్లారిటీ ఉండటంలేదు. పెద్దపెద్ద సంస్ధలే ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. గతంలో వర్కవుట్ అయిన పద్ధతినే చాలా కంపెనీలు ఫాలో అవుతున్నాయి. క్యాంపెయిన్ పూర్తయిన తర్వాత కానీ.. దాని ఎఫెక్ట్ ఎలా ఉందనేది తెలియడంలేదు. ఇలాంటి పరిస్ధితుల్లో పూర్తిస్ధాయి మీడియా అనలిటిక్స్‌ను టెక్నాలజీతో మిక్స్ చేసి ఒక ఆన్‌లైన్ టూల్‌ని డెవలప్‌చేసింది ఒక కంపెనీ. దానిపేరే "కేఅనలిటిక్స్"
మీడియా డేటాను బేస్ చేసుకుని రియల్‌టైమ్‌లో సమాచారాన్ని అందిస్తుంది కేఅనలిటిక్స్. గతంలో జీటీవీ, సహారా, రియలన్స్‌లాంటి మీడియా సంస్ధల్లో పనిచేసిన అనుభవం ఉన్న 48 ఏళ్ల మీడియా గురు అశుతోష్.. ఈ కంపెనీ ఫౌండర్ కమ్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు.
ఐడియా ఇలా వచ్చింది!
2012లో ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో తలపండిన, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీకి సన్నిహితుడిగా ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్న సమయంలో అశుతోష్‌కి ఒక వింత ప్రశ్న ఎదురైంది. గాంధీ కుటుంబం గురించి మోదీ చేసిన ఒక స్టేట్‌మెంట్‌ను మీడియా రకరాలుగా ఎందుకు చూపించిందని ఆయన అశుతోష్‌ని ప్రశించారు. ఆ ప్రశ్నకు సమాధానం కనుక్కునే క్రమంలో మీడియాపై దాదాపు వారం పదిరోజుల పాటు అనాలసిస్ చేశారు. అందులో ఉన్న బలాన్ని, మీడియా అనాలసిస్ వల్ల ఉన్న లెక్కలేనన్ని ఉపయోగాలను గుర్తించారు.
మన కధలు కానీ.. కధనాలు కానీ.. ఏదైనా సరే..టార్గెట్ ఆడియన్స్‌ని రీచ్ కాలేని రోజు, వ్యాపార లక్ష్యాన్ని అది చేరుకోలేని రోజు మీడియాలో ఉండటం దండగ. పీఆర్ అనేది విలువైన మార్కెటింగ్ వ్యవస్ధ వాటిమీదనే ఆధారపడలేం. ఈ నేపధ్యంలో మీడియా అనాలసిస్‌పై సమగ్రమైన అవగాహన పెంచుకోవడంతో పాటు అందులో ఉన్న లోటుపాట్లను గమనించాను అంటారు అశుతోష్.
కెఅనలిటిక్స్ ఏంచేస్తుంది?
కెఅనలిటిక్స్‌లో ముఖ్యంగా రెండు బేస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి లోతైన విశ్లేషణ చేయడానికి సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫాం కాగా.. మరొకటి మీడియా ప్రభావాన్ని అంచనా వేసే బ్రాండ్ మీడియం ఇంప్రెషన్స్(బీఎంఐ). వీటి నుంచి ఉత్పన్నమయ్యే మరికొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మీడియాలో తమ క్లయింట్ పనితీరు మెరుగుపడేందుకు అవసరమైన సలహాలు,సూచనలను.. అనలిటిక్స్ ద్వారా స్టడీ చేస్తుంది కెఅనలిటిక్స్.
టీవీ, ప్రింట్, ఎలక్ట్రానిక్ పబ్లికేషన్స్, సోషల్ మీడియాలను ఇంటిగ్రేట్ చేసి తమ పనితీరును విశ్లేషించుకోవచ్చు. అలాగే ఇండస్ట్రీల పరంగా కూడా లోతైన విశ్లేషణను ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా పొందవచ్చు. ఇలా దాదాను 300 రకాల రిపోర్టులను గ్రాఫుల ఆధారంగా తెలుసుకొవచ్చు. క్లయింట్ తనకు సంబంధించిన రిపోర్టులు, డేటాను మొబైల్‌లో చూసుకునే అవకాశంతో పాటు డెస్క్‌టాప్‌పై డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు.
"ఉదాహరణకు జెట్ ఎయిర్‌వేస్ కెఅనలిటిక్స్ వాడుతోందని అనుకుందాం. జెట్ అయిర్‌వేస్‌కు ఆ ఇండస్ట్రీలో పనితీరుతో పాటు.. మిగతా పోటీ కంపెనీలైన ఇండిగో, స్పైస్‌జెట్‌లకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తాం. ఏవియేషన్ రంగానికి సంబంధించి ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల్లో జరిగే చర్చల వివరాలను అందిస్తాం. ఒక్కమాటలో చెప్పాలంటే మార్కెటింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్‌పై దృష్టిపెట్టాలనుకునేవాళ్లు కెఅనలిటిక్స్‌కు క్లయింట్స్ అవుతారు" - అశుతోష్
బిజినెస్ మోడల్
ఏడాది కాంట్రాక్ట్‌తో కెఅనలిటిక్స్ నెలనెలా బిల్లింగ్ చేస్తోంది. దీనితో పాటు క్లయింట్ అవసరాలను బట్టి తక్కువ సమయంలో క్యాంపెయిన్ అనాలసిస్ కూడా నిర్వహిస్తుంది. మార్చ్ 2015లో సంస్ధ మొదలుపెట్టిన దగ్గర్నుంచి.. వయాకామ్18, లాఫార్గే, లెనోవో, ఇడెల్‌వైస్ లాంటి దాదాపు 10 పెద్దపెద్ద కంపెనీలకు సేవలను అందిస్తోంది. నవీ ముంబై స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లాంటి ప్రభుత్వ ప్రాజెక్ట్‌లను సైన్ చేసింది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయస్ధాయిలో కంపెనీని తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు అశుతోష్. క్లయింట్ అవసరాన్ని బట్టి ఒక బ్రాండ్‌కి ఒక నెలకు రూ.60వేల నుంచి రూ.3లక్షల 50వేల వరకూ చార్జ్ చేస్తున్నారు.
టీమ్, ఇన్వెస్టర్లు
అశుతోష్‌తో పాటు మీడియా అనలిటిక్స్, పబ్లిక్ రిలేషన్స్‌లో అపార అనుభవం ఉన్న శ్రింగేష్ వ్యాస్ జీఎంగా వ్యవహరిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ హెడ్‌గా మనీష్ శర్మ, జీ నెట్‌వర్క్‌లో ఐటీ హెడ్‌గా పనిచేసిన సునీల్ కృష్ణమూర్తి, సెలబ్రిటీ మేనేజర్ పకుల్ చతుర్వేది కూడా కెఅనలిటిక్స్ టీమ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ కూడా పెట్టుబడి పెట్టారు. మా మీద నమ్మకంతో కనీసం డబ్బును ఎలా ఖర్చుపెట్టారో కూడా అడగలేదు. నాకు ఆయన మంచి మిత్రుడు, స్నేహితుడు - అశుతోష్
2017లో రూ.17 కోట్ల రూపాయల వార్షికాదాయం సాధించాలని కంపెనీ టార్గెట్‌గా పెట్టుకుంది. సోషల్ మీడియా మాడ్యూల్‌ని ఈ మధ్యనే లాంచ్ చేయగా..ప్రిడిక్టివ్ అనాలసిస్ ప్లాట్‌ఫామ్ తయారీ దశలో ఉంది. 2016 ఆగస్ట్ నాటికి దాన్ని కూడా లాంఛ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అశుతోష్‌తో పాటు మరికొంతమంది ఇన్వెస్టర్లు మొదట్లో రూ.6 కోట్లు పెట్టుబడి పెట్టారు. రాబోయే రెండేళ్లలో మరో రూ.27 కోట్లు ఫండింగ్ కోసం చూస్తున్నామని అంటున్నారు అశుతోష్
మార్కెట్
నాస్కామ్ లెక్కల ప్రకారం.. ఇండియన్ ఎనలిటిక్స్ ఇండస్ట్రీ 207-18 నాటికి రూ.17,718 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని ఒక అంచనా. హోమ్స్ 2015 రిపోర్ట్ చెబుతున్నదాని ప్రకారం,. ప్రపంచవ్యాప్తంగా పీఆర్ ఇండస్ట్రీ ఇప్పటికే రూ.లక్ష కోట్లు దాటిపోయింది. రాబోయే 10 ఏళ్లలో భారత్‌లో కూడా 31 శాతం వృద్ధి వస్తుందని అంచనా. ఇక సోషల్ మీడియా అనలిటిక్స్‌లో కూడా విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి.
పోటీ
వ్యాపార లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని అనలిటిక్స్, బ్రాండ్ ప్రెజెన్స్‌పై దృష్టిపెట్టే కంపెనీలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టే ఆ సర్వీసులు ఇచ్చే కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. అంతర్జాతీయంగా మెల్ట్‌వాటర్ ..సోషల్ మీడియాలో విషయాలను అనలైజ్ చేయడంలో ముందు ఉంది. డో జోన్స్, ఫాక్టివాలాంటి కంపెనీలు న్యూస్ అనాలసిస్‌లో ముందున్నాయి. అయితే, కేవలం డిజిటల్ మీడియాపై మాత్రమే ఈ కంపెనీలు ఫోకస్ పెడుతున్నాయి. ఈ నేపధ్యంలో కెఅనలిటిక్స్ అందిస్తున్న బీఎంఐ ఫీచర్.. కచ్చింతంగా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.
యువర్‌స్టోరీ విశ్లేషణ
ఆగ్రి టెక్, రీటైల్, ఫైనాన్షియల్, సర్వీస్, ఇన్‌ఫ్రా.. ఇలా కొన్ని రంగాలకు మాత్రమే సర్వీసులను అందించగలిగిన వ్యవస్ధ కెఅనలిటిక్స్. అయితే, రాబోయే రోజుల్లో కేవలం జనరిక్‌గా(సాధారణంగా)నే ఉండాలా లేక.. మిగతా పరిశ్రమలపై కూడా దృష్టిపెట్టాలా అనేది ముందుగా కంపెనీ నిర్ణయించుకోవాలి.