మానసిక సమస్యలను ఆన్‌లైన్‌లో పరిష్కరించే వినూత్న స్టార్టప్

మానసిక సమస్యలను ఆన్‌లైన్‌లో పరిష్కరించే వినూత్న స్టార్టప్

Monday August 24, 2015,

3 min Read

సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులను ఒకే వేదికపైకి.

మానసిక సమస్యలకు ఆన్‌లైన్ పరిష్కారం.

గుర్గావ్ అమ్మాయి శిప్రా వినూత్న ఆలోచన.

తన సమస్య నుంచే పుట్టిన స్టార్టప్ ఐడియా.


శిప్రా దావర్ ఆస్ట్రేలియా లో MBA చదువుకుంటున్న సమయంలో హోమ్ సిక్‌నెస్‌తో బాధ పడ్డారు. వెంటనే ఆమె ప్రొఫెసర్.. ఓ ప్రొఫెషనల్ సహాయం తీసుకోమని సలహా ఇచ్చారు. దానికి 'నేను ఏదైనా కోల్పొయినా... ఎందుకు నాకు ఈ సలహా ఇస్తారు అంటూ సమాధానం ఇచ్చాను'.అయినా ప్రొఫెసర్ సూచనతో రెండు సార్లు కౌన్సెలింగ్ తీసుకున్న తర్వాత నాలో ఎంతో మార్పు వచ్చింది. ఆతృత , ఒత్తిడితో ఇబ్బందులు పడ్డానన్న నిర్ణయానికి వచ్చారు. కుటుంబంతో కలిసి లేకపోవడం వల్ల మానసిక సమస్య సాధారణమని గమనించారు 

స్వదేశంలో అయితే చుట్టూ సొంత వాళ్లు, పరిస్థితులు ఉంటాయని తెలుసుకున్నారు. అయితే ఈ విధమైన మానసిక సంఘర్షణకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని వివరిస్తారు శిప్రా. అలా నాలుగు సంవత్సరాల తరువాత ఇండియాకు వచ్చిన శిప్రా ఎప్సీ క్లినిక్‌ను ప్రారంభించారు. గుర్గావ్ అమ్మాయి శిప్రా అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్‌ను ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్శటీ నుంచి పూర్తి చేశారు. తర్వాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌తో కన్సల్టింగ్ ప్రారంభించి... ఫస్ట్ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టారు.ఆస్ట్రేలియాలో చికిత్సతో తీసుకున్న తర్వాత..శిప్రా ఇండియాకు తిరిగి వచ్చేశారు. ఇక్కడే తను భారీ వ్యత్యాసం చూశారు. మొదట మానసిక సమస్యలకు సహాయం అందించడం, ఆ తర్వాత ఆ సమస్యలకు తగ్గట్టుగా సైకియాట్రిస్ట్స్ అండ్ సైకాలజిస్ట్స్ అందుబాటు లో లేకపోవడం.

ఐఐటి, IIMలలో చదివిన శిప్రా స్నేహితుడు ఓ సారి ఆమెను కలిశాడు. అతడిని చూడగానే ఏదో మానసిక సంఘర్షణతో కుమిలిపోతున్నట్టు అర్థం చేసుకున్నారు. ఆ ఒత్తిడి నుంచి బయటపడేందుకు శిప్రా ఓ సలహా ఇచ్చారు. కౌన్సిలింగ్ కు వెళ్లామని సూచించాను. 'నేను అక్కడ ఉద్యోగం మానేసి.. పిచ్చోళ్ల వార్డులో కూర్చోనా ? ' అంటూ అతగాడు హేళనగా మాట్లాడినట్టు శిప్రా వివరిస్తారు. 

ఆమె స్నేహితుడితో జరిగిన సంభాషణ తర్వాత మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్న వారికి ఓ సులువైన మార్గం చూపించాలని అనుకున్నారు. ఈ వ్యవస్థను ఆన్ లైన్ చేయాలనే ఆలోచన తట్టింది. అలా కొన్ని నెలల పాటు ఆమె చేసిన పరిశోధన తర్వాత ఓ సమర్థవంతమైన వేదిక దొరికింది. చివరికి మే నెలలో ePsyclinic.com ను ప్రారంభించారు.

image


ఈ-సై క్లినిక్ ఎలా పనిచేస్తుంది ?

మానసిక సమస్యలతో ఇబ్బందులు పడ్తున్న వారికి అవసరమైన సాయాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన సంస్థ ఇది. సైక్రియాటిస్ట్, సైకాలజిస్టుల సాయం కోరుకొనే వారికి... మానసిక రుగ్మతలు తగ్గించేందుకు మధ్య వారధిలా ఈ క్లినిక్ పనిచేస్తుంది. అవసరమైతే... ఆడియో, వీడియో చాట్‌ల ద్వారా సాయాన్ని అందిస్తారు. దేశంలోని డాక్టర్లే కాకుండా ఇతర దేశాల్లోని వైద్య రంగ నిపుణుల సేవలు అందించేందుకు కూడా మనస్తత్వవేత్తలు ముందుకు వస్తున్నారని శిప్రా చెబుతారు.

ఒక విలక్షణ కౌన్సెలింగ్ కేసు కనీసం 20 మరియు 60 నిమిషాలు వరకు కొనసాగుతుంది. అయితే మొదటి సెషన్ ఉచితంగా అందించనున్నారు. తర్వాత సెషన్లలో రూ .600 నుంచి రూ. 1,500 మధ్య ఫీజు ఉంటుంది. గుర్గావ్ కేంద్రంగా పని చేస్తున్న ఈ స్టార్టప్‌లో 15 మంది సైకాలజిస్టులు మరో నలుగురు సైక్రియాటిస్టులు, ఒక గైనకాలజిస్ట్ పూర్తి సమయం అందుబాటులో ఉంటున్నారు. మరో 20 మంది వివిధ రకాల కోర్సులలో శిక్షణ పొందుతున్నారు. రెండు నెలల కాలంలో , ePsyclinic 1100 సెషన్స్ విజయవంతంగా నిర్వహించింది.

ePsyclinic.com ఆరు వారాల శిక్షణ మాడ్యూల్ రూపొందించింది. చాట్, ఆడియో వీడియో ఆధారంగా సూచనలను అందిస్తూ, వారికి తగిన మానసిక సమస్య నిర్ధారణ చేయడానికి సైకియాట్రిస్ట్స్ అండ్ సైకాలజిస్ట్స్ సాయం అందిస్తారు.మానసికంగా ఇబ్బంది పడుతున్న వారికి సమస్య నిర్ధారణలో సూచనల ఆధారంగా కనుగోవడం పెద్ద సవాల్. ముఖ్యంగా మనిషిని అంచనా వేయడం,అతని మాటలతో, పరధ్యానంలో సంభాషణ ద్వారా అస్సలు సమస్య గుర్తిస్తామని చెప్పారు.

మేము ఇచ్చే శిక్షణలో మానవ సంబంధాలు, పని, లైంగికత, సంరక్షణ, ప్రెగ్నెన్సీ, వ్యసనం, పేరెంటింగ్, ఓల్డ్ ఏజ్ వంటి తీవ్రమైన మానసిక సమస్యలపై అవగాహన కల్గిస్తున్నాము. మంచి చేయాలనే ఆలోచన ఉండాలనే ని దానికి ఎలాంటి ఇబ్బందులు రావంటూ భరోసా ఇస్తారు శిప్రా... సంస్థ పెరగడానికి మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తలేదని వివరిస్తారు. అయినా నిధులు ఇవ్వడానికి ఎంతో మంది ముందుకు వచ్చారని చెప్పుకొచ్చారు.

ఎన్నో సమస్యలకు పరిష్కారం

ePsyclinic.com ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం చూపించింది. వైవాహిక సమస్యలు, పని సంబంధిత ఒత్తిడి సమస్యలు , అభద్రత వంటి వాటికి అవసరమైన సలహా ఇచ్చాము. ఈ పోర్టల్ లైంగిక సంబంధిత సమస్యలతో సతమతమవుతున్న వారికి దారి చూపించింది. సెక్సువల్ ప్రాబ్లమ్ ఉన్న వారిలో చాలా కొద్ది మందే బయిటకు వచ్చి ఓపెన్ గా మాట్లాడటానికి ఒప్పకుంటారు. సెక్సువల్ బలహీనత కారణంగా జీవితంలో ఒత్తిడి, నిరాశ, నిస్పృహలతో జీవితం చాలించడానికి సిద్ధమౌతున్నారు. వారి బాధను తట్టుకోలేక.. సైకాలజిస్టుల ముందు బహిరంగంగా ఏడ్చిన సంఘటనలు అనేకమని వివరిస్తారు.

మార్కెట్ సైజ్, కాంపిటీషన్

వాస్తవానికి జనాభాలో 6.5 శాతం తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడతున్నారు. అయితే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సైక్రియాటిస్టులు మాత్రం మూడున్నర వేల నుంచి ఐదు వేల మంది వరకు ఉన్నారు. అంటే ఈ లెక్కల ప్రకారం... ప్రతి మానసిక వైద్యుడికి సగటున 200,000 మధ్య 300,000 మందికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఎక్కువ మంది ప్రజలు సాధారణంగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మెంటల్ హెల్త్‌పై కౌన్సెలింగ్ ఇచ్చేందుకు పెద్ద ఎత్తున స్టార్టప్ ముందుకు వస్తున్నాయి. గత నెలలో మేము బెంగుళూర్‌లో హెల్తీ మైండ్స్ పేరుతో వీడియో కౌన్సెలింగ్ ద్వారా మానసిక ఆరోగ్యానికి అవసరమైన సూచనలు అందించామని చెబుతున్నారు.

భవిష్యత్తు ఎంతో ఉంది

epsy క్లినిక్ కు భవిష్యత్తు ఎంతో ఉంటుందని శిప్రా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ప్రస్తుతం సెల్ఫ్‌ మేనేజ్‌మెంట్ యాప్స్ తయారీలో కంపెనీ బిజీగా ఉంది. త్వరలో దేశంలో మొదటి వర్చువల్ క్లినిక్‌ను ప్రారంభించే పనిలో ఉన్నట్టు చెబ్తున్నారు.