స్టార్టప్ పెట్టాలంటే ఈ రూల్స్ ఫాలో అవ్వాలంటున్న కేంద్రం
ఏప్రిల్ 17, 2015న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ "స్టార్టప్" అనే పదాన్ని నిర్వచిస్తూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టార్టప్ ఇండియా.. స్టాండప్ ఇండియా సభలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగంలో చాలా స్ధిరమైన విషయాలను ప్రస్తావించారు. అయితే, కేంద్రం నోటిఫికేషన్ ప్రకారం.."ఎంటిటీని" స్టార్టప్‌గా పేర్కొనవచ్చును.
1. కంపెనీ ఏర్పాటు చేసుకున్న ఐదేళ్ల వరకూ దాన్ని స్టార్టప్‌గా పిలవచ్చు.
2. ఐదేళ్ల పాటు టర్నోవర్ రూ.25 కోట్లు మించకుండా ఉండాలి
3. కొత్త కొత్త ఆవిష్కరణలు, వాటి అభివృద్ధి, విస్తరణ, వ్యాపారం చేసే కంపెనీలు, టెక్నాలజీ కేంద్రంగా నడిచే కంపెనీలను స్టార్టప్‌లుగా పరిగణిస్తారు.
ఒకవేళ మీ వ్యాపారంలోని ఒక భాగాన్ని విడిగా( ఒక ఎంటిటీగా) ప్రొజెక్ట్ చేద్దామనే ఆలోచనలో ఉంటే. అది అప్పటికే ఒక రిజిస్టర్డ్ కంపెనీలో భాగం కాబట్టి దాన్ని స్టార్టప్ అని పిలవలేం.
స్టార్టప్‌కు పన్నుమినహాయింపులు కావాలని అనుకుంటే.. ఇంటర్ మినిస్టీరియల్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్ నుంచి ఒక సర్టిఫికెట్‌ను పొందాల్సి ఉంటుంది. ఆ బోర్డులో ఈ కింద పేర్కొన్న వాళ్లు సభ్యులుగా ఉంటారు.
1) జాయింట్ సెక్రటరీ, ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్
2) డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతినిధి
3) బయోటెక్నాలజీ ప్రతినిధి
ఎంటిటీ(కంపెనీ లేదా పరిధి) అనే పదాన్ని నోటిఫికేషన్లో నిర్వచించారు. అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లేదా రిజిస్టర్డ్ పార్ట్‌నర్‌షిప్ లేదా.. లిమిటెడల్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్ ఫర్మ్ అయి ఉండాలి. అప్పుడే అది ఎంటిటీగా పిలవబడుతుంది. ఒకే యజమాని ఉన్న కంపెనీ లేదా ఒకే వ్యక్తి ఉన్న కంపెనీని స్టార్టప్‌గా నిర్వచించాలని ఎక్కడా ప్రస్తావించలేదు.
ఒక ప్రొడక్ట్‌ని తయారుచేసి దాన్ని డెవలప్ చేయడమే కాకుండా.. వ్యాపార పరంగా దాన్ని మార్చినప్పుడే (లేదా) కస్టమర్ల పనితీరును మెరుగుపర్చే సర్వీసులను అందించే పద్ధతిని కానీ.. విధానాన్ని కానీ.. రూపొందించిన లేదా తయారుచేసిన కంపెనీని మాత్రమే స్టార్టప్‌గా పేర్కొనాలని నోటిఫికేషన్ అంటోంది.
అయితే, ఒకరు చేసిన ప్రొడక్ట్‌ని పోలిన ప్రొడక్ట్ తయారుచేసినా కూడా పన్ను మినహాయింపులు వచ్చే అవకాశాల్లేవు. ఉదాహరణకు మీరు ఒక ఈ కామర్స్ సంస్ధను మొదలుపెట్టారనుకుందాం. ఏదైనా కొత్త ఆవిష్కరణ, విధానం లేక సర్వీసులు లేకపోతే మీ సంస్ధను స్టార్టప్‌గా పిలవరు. అలాంటి సమయంలో పన్ను మినహాయింపు లభించదు.
స్టార్టప్‌గా రిజిస్టర్ చేసుకోవడం ఇలా!
స్టార్టప్‌గా రిజిస్టర్ చేసుకునే విధానం కూడా చాలా సులువు. ఒక మొబైల్‌యాప్ (ఇంకా లాంచ్ చేయలేదు) లేదా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్(DIPP ) పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. కింది వాటిలో ఏదైనా ఒక డాక్యుమెంట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
1. ముందుగా సూచించిన పద్ధతిలో ఏదైనా ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలోని ఇన్‌క్యుబేటర్ నుంచి రికమెండేషన్.
2. మీ ప్రొడక్ట్‌ని సపోర్ట్ చేస్తూ ఏదైనా ఒక కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం ఫండింగ్ చేస్తున్న ఇన్‌క్యుబేటర్ నుంచి ఉత్తరం.
3. DIPP పేర్కొన్న పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఇన్‌క్యుబేటర్ నుంచి రికమెండేషన్ లెటర్.
4. ఈక్విటీలో 20 శాతానికి తగ్గకుండా ఫండింగ్ చేసిన ఇన్‌క్యుబేషన్(లేదా) ఏంజిల్ ఫండ్(లేదా) పీఈ ఫండ్(లేదా) యాక్సిలరేటర్(లేదా)ఏంజిల్ నెట్‌వర్క్ నుంచి ఒక ఉత్తరం. అయితే, ఆ సంస్ధ కచ్చితంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయి ఉండాలి.
5. ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ ఫండింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తరం.
6. ఇండియన్ పేటెంట్ ఆఫీస్ జర్నల్‌లో ప్రచురించబడిన మీ ప్రొడక్ట్ యొక్క పేటెంట్ వివరాలు లేదా పేటెంట్ కోసం ఫైల్ చేసిన వివరాలు. ఎలాంటి వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారో తెలియజేయాలి.
పోర్టల్ లేదా మొబైల్ యాప్ విడుదల చేసేవరకూ.. స్టార్టప్‌ని గుర్తించడానికి DIPP కొన్న విధానాలను అవలంబిస్తోంది. ఒకసారి అప్లికేషన్‌ని అప్‌లోడ్ చేసిన తర్వాత.. రికగ్నిషన్ నంబర్ వస్తుంది. ఒకవేళ నకిలీ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసినట్టు తేలినా..పెయిడ్ అప్ క్యాపిటల్‌లో 50 శాతం లేదా రూ.25 వేలకు తగ్గకుండా సదరు దరఖాస్తుదారుకు జరిమానా విధించబడుతుంది.
"ఇన్నొవేషన్"(ఆవిష్కరణ) అనే పదాన్ని కేంద్రం నోటిఫికేషన్‌లో చాలాసార్లు ప్రస్తావించింది, అయితే, స్టార్టప్ అనే పదానికి నిర్వచనం మాత్రం అంత అర్ధవంతంగా ఇవ్వలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇందులో ప్రభుత్వం పాత్ర, ఇన్‌క్యుబేటర్లు ప్రభుత్వం ఫండింగ్ చేయాలని, వాటిని ప్రభుత్వం గుర్తించాలన్న అంశం అవినీతికి ఆస్కారం కలిగిస్తుంది.