సాంప్రదాయ మిఠాయిలకు కేరాఫ్ నేటివ్ టేస్ట్
పిజ్జాలు, బర్గర్లు ఎన్ని వచ్చినప్పటికీ మన సాంప్రదాయ వంటకాల రుచే వేరు. అందునా తెలుగు వంటకాలకు ఒక ప్రత్యేకత ఉంది. మనకంటూ సొంతమైన కొన్ని ఫుడ్ హాబిట్స్ ఉన్నాయి. హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ ఫేమస్ అన్న సంగతి తెలుసు. నాటుకోడి కూర రాగిసంకటి కాంబినేషన్ మజాయే వేరు. చేపలు పులుసు గురించి చెప్పనవసరం లేదు. ఉలవచారు టేస్టు దొరికితే వదిలిపెట్టే సవాల్ లేదు. రాజుగారి కోడి పులావు లాగించినా కొద్దీ కడుపులో పడుతుంది. ఇక సకినాలు ఎవర్ గ్రీన్ స్నాక్స్. జెంతికలు కొరకని తెలుగువాడు భూమ్మీద ఉండవు. పులిహోర ఇష్టపడని వాళ్లు చూద్దామన్నా కనపించరు. లడ్డూ కనిపిస్తే చిన్నపిల్లాడిలా మారిపోతాం. ఇలా చెప్పుకుంటే పోతే లిస్టు కొండవీటి చేంతాడంత కనిపిస్తుంది. ఇక పండగలొస్తే ఘుమఘుమలకు అడ్డూ అదుపూ ఉండదు. ఇవన్నీ మన తెలుగు వారికే ప్రత్యేకం. అలాంటి వాటిలో కొన్నింటిని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది వైజాగ్ స్టార్టప్ నేటివ్ టేస్ట్. పైగా ఊరి పేర్లతో ప్రారంభమయ్యే వంటకాలను అందించడమే ఈ స్టార్టప్ లక్ష్యం.
రాజశేఖర్ ఈ స్టార్టప్ ఫౌండర్. దేశం మొత్తంమీద ప్రాంతాల వారీగా ఊరిపేర్లతో ప్రారంభమయ్యే స్వీట్లు, తినుబండారాలను ఆన్ లైన్ ప్లాట్ ఫాంలోకి తీసుకురావాలని చూస్తున్నారు.
నేటివ్ టేస్ట్ పనితీరు
మైసూర్ పాక్ నుంచి కాకినాడ కాజా దాకా. హైదరాబాదీ దమ్ బిర్యానీ నుంచి బందరు లడ్డూ దాకా.. ఊరి పేరుతో మొదలైన స్వీట్స్ ఆన్ లైన్ లో ఆర్డరిచ్చే అవకాశాన్ని నేటివ్ టేస్ట్ కల్పిస్తోంది. నోరూరించే వంటకాలే వాటి ఒరిజినల్ ప్లేస్ నుంచి మనకు అందిస్తారు. ఆగ్రా పేడా నుంచి ఢిల్లీ మిఠాయి, కోల్ కతా రసగుల్లాలాంటి నార్తిండియన్ రెసిపీలను సైతం ఈ వైజాగ్ స్టార్టప్ అందుబాటులోకి తెచ్చింది.
ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు యూపీలో సేవలను అందిస్తోందీ స్టార్టప్. ఆయా రాష్ట్రాల్లోని స్థానిక తినుబండారాలను ప్రపంచంలో ఏ చోటికైనా చేర్చే ఏర్పాట్లను చేశారు. ఇప్పటి వరకూ 32 ప్రాడక్టులను గుర్తించారు. స్నాక్స్ అండ్ స్వీట్స్ వీరి ప్రత్యేకం. ప్రస్తుతానికి వారానికి 30 దాకా ఆర్డర్లు వస్తున్నాయి. పండగ సీజన్లలో వీటి సంఖ్య భారీగా ఉంటుంది. ఇటీవల అమెరికాలో ఒక ఎన్నారై వాళ్లింటో జరిగిన బర్త్ డే పార్టీకి గిఫ్ట్ ప్యాకింగ్ పంపారు. దానికి అనూహ్య స్పందన రావడంతో గిఫ్టింగ్ లను సైమల్టేనియస్ గా ప్రారంభించారు. భారత్ తో పాటు మొత్తం ఏడు దేశాలకు నేటివ్ టేస్ట్ ప్రాడక్టులను సప్లై చేస్తున్నారు.
నేటివ్ టేస్ట్ టీం
నేటిట్ టేస్ట్ కి రాజశేఖర్, భైరవమూర్తి ఫౌండర్లు. రాజశేఖర్ సాప్ట్ వేర్ రంగం నుంచి వచ్చారు. భైరవమూర్తికి మేనేజ్మెంట్ లో అనుభవం ఉంది. వీరితో పాటు గౌతమి అనే మరో కో ఫౌండర్ ఉన్నారు. ఐఐఎం లక్నో నుంచి గ్యాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె స్నాప్ డీల్ మాజీ ఉద్యోగి. ప్రకాశ్ అనే మరో సీరియల్ ఆంట్రప్రెన్యూర్ ఈస్టార్టప్ కి మెంటార్ గా ఉన్నారు. వీరితో పాటు ప్రపంచ వ్యాప్తంగా 20 మంది ఉద్యోగులు, ఫ్రీలాన్సర్స్ పనిచేస్తున్నారు.
ప్రధాన సవాళ్లు
1. క్వాలిటీ అనేది తమలాంటి ఫుడ్ స్టార్టప్ కి ప్రధాన సవాలని రాజశేఖర్ చెప్పారు. ప్రాపర్ ప్యాకింగ్ చేయడం ద్వారా దీన్ని అధిగమిస్తున్నామన్నారు. దీనికి కోసం వెండార్ కు సరైన ట్రెయినింగ్ అందిస్తున్నారు. దీంతోపాటు ప్రతి ప్రాంతంలో క్వాలిటీ కంట్రోల్ ను మానిటరింగ్ చేయడానికి ఒక ప్రతినిధిని కూడా నియమిస్తున్నారు.
2.లాజిస్టిక్స్ మరో సవాలని రాజశేఖర్ చెబుతున్నారు. సాధారణంగా సాంప్రదాయ వంటకాలు పల్లె ప్రాంతాల్లోనే దొరుకుతాయి. వాటిని సరైన టైంలో కొరియర్ కు అందించడం ఒక పెద్ద సవాల్. సరైన కో ఆర్డినేషన్ ద్వారా దాన్ని అధిగమిస్తున్నామన్నారు.
3.ఫుడ్ ఆర్డర్ తర్వాత దాన్ని తయారు చేయాలి. దీనికి ప్రభుత్వం దగ్గరి నుంచి కొన్ని పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంది. అయితే తమ కాన్సెప్ట్ పై పేటెంట్ అప్లై చేశారు. తొందరలోనే ఇది ఒక కొలిక్కి రానుందని, దీన్ని కూడా అధిగమిస్తామని అంటున్నారాయన.
ఫండింగ్ , లక్ష్యాలు
పూర్తిస్థాయి బూట్ స్ట్రాపుడ్ స్టార్టప్ ఇది. నేటివ్ టేస్ట్ కి డేటా వేర్ హౌస్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ని రన్ చేసే మరో సంస్థ దీనికి పేరెంటింగ్ కంపెనీగా ఉంది. ప్రస్తుతానికి నిధులను ఆ సంస్థనుంచే సమకూర్చుతున్నారు. అయితే ఇప్పటికే ఫండింగ్ కోసం చాలా సంస్థలు తమకు సంప్రదించినట్లు రాజశేఖర్ చెబుతున్నారు. వచ్చే మూడు నెలల్లో ప్రీ సిరీస్ ఏ ఫండ్ రెయిజ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మార్కెటింగ్ తో పాటు టీం ఎక్స్ పాన్షన్ కు ఈ నిధులను వినియోగిస్తామని అన్నారాయ. ఈ నెలలోనే హైదరాబాద్ లో మరో బ్రాంచి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
భవిష్యత్ ప్రణాళికలు
భారతదేశంలో చూడటానికి ఎన్ని ప్రాంతాలున్నాయో, తినడానికి కూడా అన్ని రకాలైన తినుబండారాలున్నాయి. వీటన్నింటిని ప్రపంచానికి అందించడమే తమ లక్ష్యం అన్నారు రాజశేఖర్. ఈ ఏడాది చివరికల్లా లాజిస్టిక్స్ , ట్రాన్స్ పోర్టేషన్ లాంటి వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని అన్నారు. కెనడాలాగానే ప్రపంచం మొత్తం మన సాంప్రదాయ వంటకాల గురించి గొప్పగా మాట్లాడుకోవాలి. దానికి నేటివ్ దివా నాంధి పలకాలనేది తమ అంతిమ లక్ష్యం అని ముగించారాయన.