అథ్లెట్లను తయారుచేస్తున్న యాడెడ్ స్పోర్ట్
మీకూ అధ్లెట్ కావాలనుందా? అయితే వాళ్లను కలవండి.. ఫ్యూచర్ పర్‌ఫెక్ట్!
టెన్త్ అయిపోగానే ఇంటర్ చదివేయాలి. తర్వాత బీటెక్.. ఆ వెంటనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిపోవాలి. మన దేశంలో చాలామంది ఫాలో అయ్యే పద్ధతి ఇది. ఇక ప్రపంచంలో ఇంజినీర్లు, డాక్టర్లు తప్ప వేరే ప్రొఫెషన్స్ లేనట్టే ఉంటుంది మన ఇళ్లల్లో సీన్. చిన్ననాటి నుంచి ఇంట్రస్ట్ ఉన్న స్పోర్ట్స్‌ను ప్రొఫెషన్‌గా స్వీకరించవచ్చన్న ఆలోచన కూడా ఎవరికీ ఉండటంలేదు. ఇన్‌ఫాక్ట్.. చాలామందికి అది ఒక ప్రొఫెషన్‌గా కనిపించడంలేదు. ఎందుకంటే.. సాఫ్ట్‌వేర్‌లో ఉన్న షార్ట్‌కట్స్ ఇలాంటివాటిలో ఉండవు కదా..! ఎవరో ఒకరి ఒత్తిడితో ఏ డాక్టరో, ఇంజినీరో అయిపోయినా.. ఏదో తెలియని వెలితి వెంటాడుతుంటుంది. సరదాగా అయినా స్పోర్ట్స్ ఆడాలనే ఆలోచన మనసును చిరాకుపెడుతుంది. సరిగ్గా ఇదే ప్రాబ్లం ఎదుర్కొన్నాడు ఒక వ్యక్తి. దానికి సమాధానంగా ఆయన మొదలుపెట్టిందే యాడెడ్ స్పోర్ట్!
అక్షయ్ మాలివాల్. 26 ఏళ్ల ఈ యువకుడికి 6 ఏళ్ల నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రస్ట్. టెన్సిస్ నేర్చుకోవడం మొదలుపెట్టినా.. భుజానికి గాయం అవడంతో గోల్ఫ్‌పైన దృష్టిపెట్టాడు. ప్రొఫెషనల్ గోల్ఫ్ ప్లేయర్ కావాలనే ఆశతో ప్రఖ్యాత యూసీ బెర్క్‌లీకి స్కాలర్‌షిప్‌పై వెళ్లాడు. అయితే, తానేదో తలిస్తే ఇంకేదో అయినట్టు.. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా సెటిల్ అవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ స్పోర్ట్స్ మీద మక్కువతో ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు. తన ట్విన్ సిస్టర్ అదితీ మాలివాల్‌తో కలిసి ఆసియాలో అధ్లెట్లకు అవసరమైన సదుపాయాలను సమకూర్చేందుకు స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ఫర్మ్ స్ధాపించారు. అదితి కూడా స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో అధ్లెట్.
"ప్రపపంచవ్యాప్తంగా అధ్లెట్లతో పోటీ పడాలంటే ఆసియా అథ్లెట్లకు మార్గదర్శకులు కావాలి. యాడెడ్ స్పోర్ట్ సరిగ్గా అదే పనిచేస్తుంది" - అక్షయ్.
అలా మొదలైంది
స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ఫర్మ్‌గా మొదలైన యాడెడ్‌స్పోర్ట్.. ఆసియాలోని రకరకాల కాలేజీల్లో చదువుతున్న అథ్లెట్ల టీమ్‌గా రూపాంతరం చెందింది. సంస్ధలో ఉండే ప్రతీ ఒక్కరిమీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఫిట్‌నెస్, అథ్లెట్ ట్రైనింగ్, అకడమిక్స్ దగ్గర్నుంచి అమెరికన్ యూనివర్శిటిల్లోకి వెళ్లడానికి అవసరమైన సాయాన్ని కూడా చేస్తోంది ఈ కంపెనీ.
"కేవలం చదువుకుని ఊరుకోకుండా... యూనివర్శిటీ స్కాలర్‌షిప్‌ల కోసం జూనియర్ అధ్లెట్లు ఆరాటపడుతుంటారు. అందుకే.. కేవలం టాప్ యూనివర్శిటీల్లో మాత్రమే భారత విద్యార్ధులకు అవకాశం ఇస్తాం. ప్లేస్‌మెంట్ విషయంలోనూ యాడెడ్‌స్పోర్ట్ అప్రోచ్ వేరుగా ఉంటుంది. ముఖ్యంగా టెన్సిస్, గోల్ఫ్, స్క్వాష్, సాకర్, స్విమ్మింగ్, ఫీల్డ్ హాకీ గేమ్స్‌పైనే మేం ఎక్కువగా దృష్టిపెడతాం" అంటారు అక్షయ్.
ఒక స్టూడెంట్‌ని సెలెక్ట్ చేశాక.. అతని పూర్తి బాధ్యత సంస్ధ తీసుకుంటుంది.ఆ ఒక్క స్టూడెంట్‌పై మాత్రమే దృష్టిపెట్టే సైకాలజిస్ట్, ఫిజియాలజిస్ట్, కోచ్‌లు ఉంటారు. ఫారిన్ యూనివర్శిటీల్లో స్కాలర్‌షిప్‌ల కోసం ట్రై చేయడానికి మేనేజ్‌మెంట్ నిత్యం సపోర్ట్ అందిస్తూ ఉంటుంది.
కార్పొరేట్ ఫీజు కింద.. ఆ స్టూడెంట్‌కి వినియోగించిన రీసోర్స్‌ని బట్టి రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకూ ఈ సంస్ధ ఛార్జ్ చేస్తోంది. ఎక్కువ దృష్టిపెట్టాలి కనుక.. వర్శిటీల్లో అప్లయ్ చేయగలిగిన స్ధాయిలో ఉన్నవాళ్లకు ఫీజు ఎక్కువగా ఉంటుందంటారు అక్షయ్.
జూనియర్ స్పోర్ట్స్ స్టార్స్‌ని తయారుచేయడం..
గత రెండేళ్లలో 42మంది క్లయింట్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా ప్లేస్ చేసిందీ సంస్ధ.. వారిలో 70శాతంమంది భారతీయులు కాగా..మరో 30మంది ఫిలిప్పీన్స్, చైనా, మలేసియా, సింగపూర్ విద్యార్ధులున్నారు. భారత్ నుంచి ఐదుగురు, ఫిలిప్పీన్స్, చైనాల నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని వారికి అవసరమైన ట్రైనింగ్ ఇస్తున్నారు. మొదటి ఏడాది 13 మంది విద్యార్ధులుంటే.. మూడో సంవత్సరానికి ఆ సంఖ్య 42కి చేరింది. అత్యుత్తమ సర్వీసులను అందిస్తున్నప్పుడు విశ్వసనీయత సంపాదించడమే అసలు టార్గెట్ అంటారు అక్షయ్. IP లేని కారణంగా మిగతా సంస్ధలూ ఇదే కాన్సెప్ట్‌తో స్టార్ట్ అయ్యే అవకాశముందని ఆయన అంటున్నారు. అయితే, మనదేశంలో అధ్లెట్లు, ఆసియాలోని వర్శిటీలకు మధ్య అనుసంధానంగా నిలిచే ఒక వ్యవస్ధను తయారుచేస్తున్నందుకు మాత్రం ఆనందంగా ఉందంటారు ఈ కంపెనీ నిర్వాహకులు.
ఇండియా, సింగపూర్, చైనా నుంచి ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి ఐదు నెలల క్రితమే ఈ సంస్ధ ఫండింగ్ దక్కించుకుంది. ఏడాది చివరకు మరో కోటి రూపాయల ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూస్తోంది. రాబోయే రోజుల్లో జూనియర్ గోల్ఫ్, టెన్నిస్ టోర్నమెంట్లతో పాటు ఆసియాకు టాలెంట్‌ను తీసుకువచ్చేందుకు కోచ్‌లతో అమెరికాలో సమ్మర్ టూర్ నిర్వహించాలని భావిస్తోంది కంపెనీ.
స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ వర్కవుట్ అవుతుందా?
నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ చేసిన ఒక స్టడీ ప్రకారం భారత్‌కు 3.6 లక్షల స్పోర్ట్స్ కోచ్‌ల అవసరం. అలాగే 9.7 లక్షల మంది ఫిట్‌నెస్ ట్రైనర్లు, 3.6 లలక్షలమంది ఫిజియో, మెడిసిన్, సైకాలజీ ట్రైనర్లు అవసరం. ఈ లెక్కలన్నీ చూస్తే.. భారత్‌కు అధ్లెట్లతో పాటు స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ అవసరం ఎంతో ఉందన్నది సుస్పష్టంగా తెలుస్తోంది. ఇన్‌స్టా స్పోర్ట్స్, స్పోర్ట్స్ వేవ్ లాంటి సంస్ధలు నిర్వహించిన సర్వే ప్రకారం.. దేశంలో అతి తక్కువమంది ఆడాలనే ఆశ ఉన్నా.. అందుకు తగ్గ అవకాశాల్లేక.. సమాచారం అందక, ట్రైనర్లు లేక.. ఇలా వివిధ రకాల కారణాలతో ఆటకు దూరమవుతున్నారు. ఈ కారణంతోనే స్మాష్‌లాంటి ఆఫ్‌లైన్ స్పోర్ట్స్ వెన్యూస్ పుట్టుకొచ్చాయి. ప్లే ఎన్ లైవ్, ప్లేయోలాంటి యాగ్రిగేటర్లు తయారయ్యాయి. అయితే, బార్సిలోనా, మాంచెస్టర్ యునైటెడ్, ఆర్సినల్, లివర్‌పూల్‌లాంటి పాపులర్ ఫుట్‌బాల్ క్లబ్స్ కూడా ఇండియాలో టాలెంట్‌ను వెలికి తీసేందుకు క్లబ్‌లు ఏర్పాటు చేశాయంటే పరిస్ధితి అర్ధమవుతుంది.
పాజిటివ్‌గా ఇండియాలో క్రీడలకు ఉన్న ఆదరణ, దానికి దక్కుతున్న అటెన్షన్ కూడా ఈ మధ్యకాలంలో పెరుగుతోందన్నది స్పష్టమవుతోంది. ఈ నేపధ్యంలో దేశీయంగా ఉన్న టాలెంట్‌ను వెలికితీసిన అధ్లెట్లను తయారుచేసే యాడెడ్‌స్పోర్ట్‌లాంటి సంస్ధల అవసరం ఉంది.