ఏంజిల్ ఇన్వెస్ట్ మెంట్ తో భాగ్యనగరంలో స్టార్టప్ 2 డే
స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న ఇన్వెస్టర్లకోసం స్టార్టప్ 2డే ఈవెంట్ జరగనుంది. ఈ నెల 20న హైటెక్స్ లో దీన్ని నిర్వహిస్తున్నట్లు ఫౌండర్ నామా వివేక్ ప్రకటించారు. వందకు పైగా స్టార్టప్స్ ఈ ఫెస్ట్ లో పాల్గొంటాయని భావిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న స్టార్టప్ లతో పాటు బెంగళూరు, ముంబై నుంచి కూడా మరిన్ని స్టార్టప్ కంపెనీలు ఇందులో పాల్గొనబోతున్నాయి.
మల్టిపుల్ ఫండింగ్
సీడ్ ఫండింగ్ తో పాటు ప్రీ సిరీస్ ఏ లాంటి రౌండ్ ఫండింగ్ కోసం ఎదురు చూస్తున్న స్టార్టప్ లను గుర్తించడం తమ స్టార్టప్ లక్ష్యమని వివేక్ అన్నారు.
“మేం నిర్వహించబోయే స్టార్టప్ 2డే ఇన్వెస్టర్లకు ఓ మంచి అవకాశం”- నామా వివేక్
కొత్తగా స్టార్టప్ ఇకో సిస్టమ్ లోకి రావాలనుకుంటున్న ఇన్వెస్టర్లకు సరికొత్త ప్లాట్ ఫాం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనికోసమే ఈ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు వివేక్ చెప్పుకొచ్చారు. దీంతోపాటు సరికొత్త స్టార్టప్ ఐడియాలను ఇన్వెస్టర్ల ముందు ప్రజెంట్ చేయడానికి అవకాశాలున్నాయని అంటున్నారు. ఐడియాకు సరిపడా పెట్టుబడి ఎవరి దగ్గరైనా ఉంటే వెంటనే కనెక్ట్ చేస్తారు. ఇలా ఫండింగ్ కు మొదటి ప్రియారిటీ ఇస్తూ స్టార్టప్2డే ఈవెంట్ జరుగుతుంది.
హైదరాబాద్ స్టార్టప్స్ గెట్ రెడీ
తెలంగాణ ఐటి మంత్రి కేటీ రామారావు స్టార్టప్ 2 డే ఈవెంట్ లోగోని లాంచ్ చేశారు. స్థానికంగా స్టార్టప్ కంపెనీలు మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయిని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
“స్టార్టప్ ఇకో సిస్టమ్ కు మద్దతుగా ఎవరు పనిచేసినా మేం సాయమందిస్తాం”- కేటీఆర్
మరిన్ని స్టార్టప్ ఈవెంట్స్ కి హైదరాబాద్ కేంద్రం కావాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. ఫండింగ్ సొల్యూషన్ తో వస్తున్న ఇలాంటి ఈవెంట్స్ లో స్టార్టప్ కంపెనీలు పాల్గొనడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో జరిగిన ఈవెంట్స్ కంటే ఇది భిన్నంగా లేకపోయినప్పటికీ ఫండింగ్, ఇన్వెస్ట్ మెంట్ టార్గెట్ గా జరగబోయే ఈవెంట్.. కనక స్టానిక స్టార్టప్ లు కూడా ఆసక్తిగానే ఉన్నాయి.
మరింత మంది ఏంజిల్ ఇన్వెస్టర్లు
ప్రి సిరీస్ ఏ , సిరీస్ ఏ కు మాత్రమే ఈరోజుల్లో ఇన్వెస్టర్లు సిద్ధపడుతున్నారు. ఏంజిల్ ఇన్వెస్ట్ మెంట్ అనేది రాను రాను తగ్గిపోతోంది. అయితే దాంట్లో కూడా అవకాశాలకు కొదవ లేదని వివేక్ అంటున్నారు. దాన్ని వినియోగించుకోడానికి తాము ఈ ప్లాట్ ఫాం అందిస్తున్నామని ముగించారు.