సాహస యాత్రికుల కేరాఫ్ 'అడ్వెంచర్స్365.ఇన్'

సాహస యాత్రికుల కేరాఫ్ 'అడ్వెంచర్స్365.ఇన్'

Thursday November 19, 2015,

4 min Read

చాలామంది ఓ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని సోలో టూర్ ప్లాన్ చేసుకుంటుంటారు. సాహస యాత్రలకు సంబంధించిన టూర్లను ఆర్గనైజ్ చేసే నిర్వాహకులు కొన్ని టీమ్‌లు ఆ యాత్రకు వెళ్లేందుకు సహకరిస్తుంటారు. అలా సాహసయాత్రలకు సంబంధించిన విభాగంలో దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ వేదికగా అడ్వెంచర్స్365.ఇన్(Adventures365.in) అవతరించింది. ఈ విభాగంలో టెక్నాలజీ సాయంతో కస్టమర్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని సాహసయాత్రలను ఎంపిక చేసుకునే వీలు కల్పిస్తారు. తామే సొంతంగా సాహసయాత్రను ఆఫర్ చేసే కంపెనీని స్థాపించడానికి బదులు, టెక్నాలజీ సాయంతో అలాంటి వారందరినీ ఒకే వేదికపై తెచ్చే ప్రయత్నం చేశారు.

ప్రస్తుతం పూణెలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న రోహన్ కేద్కర్, ఓంకార్ మెత్వాడే అడ్వెంచర్స్365 కంపెనీని ప్రారంభించారు. ఐటీ రంగంలో ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న రోహన్ ఈ స్టార్టప్ మొదలుపెట్టే ముందు ఇన్ఫోసిస్‌లో పని చేసేవారు. కంపెనీకి సంబంధించిన డిజైనింగ్, సాంకేతిక అంశాలపై రోహన్ దృష్టి పెట్టేవారు. ఇక మార్కెటింగ్‌లో మంచి అనుభవం ఉన్న ఓంకార్... సాహస క్రీడలు నిర్వహించే ఆర్గనైజర్లతో చర్చించేవారని రోహన్ తెలిపారు.

"మాకొచ్చిన ఐడియా విషయంలో జూన్ 2014లో ఆలోచించడం మొదలుపెట్టాం. ఈ అంశంలో కస్టమర్లు, ఆర్గనైజర్ల సమస్యలను ఇరుపక్షాల నుంచి విన్నాం. దీనికి సంబంధించి బ్యాక్ గ్రౌండ్ స్టడీ చేసిన అనంతరం టెక్నాలజీ పరంగా దీన్ని ఏ రకంగా పరిష్కరించవచ్చో అధ్యయనం చేశాము. డిసెంబర్ 25, 2014లో దీనిని మార్కెట్లోకి తీసుకురావడానికి ముందు.. రెండు మూడు నెలల పాటు దీనికి సంబంధించిన టెక్నాలజీపై పని చేశాం"

స్టార్టప్స్ కోసం 2014 జనవరిలో టాటా ఫస్ట్ డాట్ నిర్వహించిన పోటీల్లో వీరి ఐడియా సెలెక్ట్ అయ్యింది. వీరి టీమ్ టాప్ టెన్ 2014 స్టార్టప్స్ లో ఒకటిగా ఎంపికైంది.

అడ్వెంచర్స్365 సహా వ్యవస్థాపకులు, ఎడమ నుంచి రోహన్ కేద్కర్, ఓంకార్ మెత్వాడే, దీప్ ఉపాధ్యాయ్

అడ్వెంచర్స్365 సహా వ్యవస్థాపకులు, ఎడమ నుంచి రోహన్ కేద్కర్, ఓంకార్ మెత్వాడే, దీప్ ఉపాధ్యాయ్


సాహసక్రీడల నిర్వాహకులతో సమస్యలు

నిర్వాహకులతో చర్చించేందుకు ప్రస్తుతం వీరి దగ్గరి ఎనిమిది మంది సభ్యులతో కూడిన బృందం ఉంది. తమ కంపెనీలో ఓ ఆర్గనైజర్‌కు చోటు కల్పించేందుకు జాగ్రత్తలు తీసుకునే ఈ బృందం... కస్టమర్లకు వారు ఆఫర్ చేస్తున్న సేవల యొక్క నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

సాహస యాత్రా రంగం ఎక్కువ శాతం అసంఘటితమైనదే. ఇందులో వారు అందించే సేవలకు సంబంధించిన ధరలను వారే నిర్ణయిస్తుంటారు. బయటి నుంచి వచ్చేవారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ధరలు నిర్ణయించని ఇలాంటి సాహస క్రీడలు చాలానే ఉన్నాయి.

పెద్ద పెద్ద రిసార్ట్స్‌కు పలు సాహసయాత్ర కంపెనీలతో బిజినెస్ టై అప్‌లు ఉండటంతో పాటు వీటిలో కొన్ని సొంతంగా కంపెనీలను కూడా ఏర్పాటు చేసుకున్నాయి. అయితే... ఈ రంగంలోని చిన్న సంస్థలు తమ సేవలకు సంబంధించిన వివరాలను టూరిస్టులకు అందించేందుకు ఎంక్వైరీలను ఆశ్రయిస్తున్నాయి. ఇలాంటి చాలా సాహసయాత్ర సేవలు అందించే కంపెనీలకు సొంతంగా ఆన్ లైన్ లో చోటు లేకపోవడం, ఉన్నవాటిని కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం జరుగుతోంది.

పరిష్కారం

నిర్వాహకులు తాము ఎలాంటి సాహసక్రీడలను కస్టమర్లకు ఆఫర్ చేస్తున్నారో తెలియజెప్పేందుకు అడ్వెంచర్స్365 ఓ చక్కని వేదికగా ఉపయోగపడుతుంది. తాము ఎంచుకోబోయే సాహసయాత్రకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని కంపెనీ అందిస్తుంది కాబట్టి... కస్టమర్లకు ఎలాంటి అనుమానాలు లేకుండా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ స్టార్టప్ ద్వారా యాత్రికులకు ఎక్కడెక్కడ ఎలాంటి సాహసక్రీడలు ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంది. తమకు ఆసక్తి ఉన్న నిర్వాహకులు, యాత్ర స్థలాలను పోల్చుకోవడానికి కూడా యాత్రికులకు వీలు కలుగుతుంది.

ఇందులోని ఒకరు 25 విభిన్నమైన కేటగిరీలకు చెందిన ఈవెంట్స్‌ను ఎంచుకోవచ్చు. ఈ వెబ్ సైట్లో దాదాపు దేశంలోని అన్ని సాహసక్రీడలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. హాట్ వాట్ బెలూనింగ్, నైట్ ట్రెక్స్, వాటర్ ఫాల్ రాపెల్లింగ్ వంటివి ఇందులో కొన్ని.

ఈ సాహసాలను మొత్తం ఐదు విభాగాలకు కంపెనీ విభజించింది. ఆరో విభాగంలో ప్రయోగాత్మక సఫారీలు, బైక్ రైడింగ్స్‌ను చేర్చారు. ఐదు విభాగాల్లో గాలి, భూమి, అగ్ని, నీరు, ఆకాశాన్ని చేర్చారు. ఈ విభాగాలకు సంబంధించిన సాహసక్రీడలను బట్టి వీటిని విభజించారు. ఉదాహరణకు పారాగ్లైడింగ్ గాలిలో ఉంటుందని కాబట్టి దీన్ని గాలి విభాగంలో... ట్రెక్కింగ్ భూమిపై చేస్తారు కాబట్టి దీన్ని భూమికి సంబంధించిన విభాగంలో చేర్చారు.

image


సాహసక్రీడల ఆర్గనైజర్లకు బదులు ఈ రంగంలోకి ఎందుకు వచ్చారు ?

నిర్వాహకులుగా మారకుండా ఇలాంటి మార్కెట్ వేదికను ఏర్పాటు చేయడంపై రోహన్ స్పందించారు.

"నిర్వాహకుడిగా ఉండాలంటే అనేక విషయాలపై అవగాహన ఉండాలి. ఓ ఆర్గనైజర్‌గా మేము యాత్రికులకు ఎక్కువ సాహస యాత్రలను అందించలేము. టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన మాకు అది కష్టసాధ్యమైన పని కూడా. ఒకవేళ ఇలాంటి వాటికి సంబంధించి ఓ ప్లాట్‌ఫాం సృష్టించగలిగితే... దాని సాయంతో నిర్వాహకులందరిని ఒక చోట చేర్చి కస్టమర్లకు మంచి అసలు ఆ బ్యాక్ గ్రౌండ్ నుంచి సేవలు అందించగలం. అలాంటి ఓ మార్కెట్ వేదికను క్రియేట్ చేసేందుకు కొన్ని కంపెనీలు పని చేస్తున్నాయి. "

సాహస యాత్రలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన లైసెన్స్ డ్ నిర్వాహకుల వివరాలను మాత్రమే కంపెనీ సేకరిస్తుంది. కస్టమర్ల భద్రత, యోగక్షేమాలు దృష్టిలో పెట్టుకునే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.

సాహస క్రీడలు చాలా ప్రమాదకరమైనవి. మిగతా వాటితో పోలిస్తే...స్కైడైవింగ్, స్కూబా డైవింగ్ వంటి సాహస కృత్యాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగేందుకు ఎక్కవ అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నిర్వాహకుల నుంచి సాహస యాత్రలను బట్టి కంపెనీ వాటాను వసూలు చేస్తోంది. ఇందుకు సంబంధించి కస్టమర్ల దగ్గర ఎలాంటి డబ్బు వసూలు చేయరు.

ఈవెంట్ పూర్తయ్యిందని సమాచారం వచ్చేంతవరకు ఆర్గనైజర్లకు కంపెనీ ఎలాంటి డబ్బు చెల్లించదు. టూర్ రద్దు లేదా ఇతర అంశాలను విషయంలో ఆడ్వెంచర్365 బృందం జాగ్రత్తలు తీసుకుంటుందని రోహన్ చెప్పారు.

"కస్టమర్ తమ యాత్రను రద్దు చేసుకుంటే కొంత డబ్బును తీసుకుని వారి సొమ్మును తిరిగి చెల్లిస్తాం. ఎంత అమౌంట్ తీసుకుంటామన్నది వారు యాత్రను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారా లేక అంతకుముందు రద్దు చేసుకున్నారా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ నిర్వాహకులే కార్యక్రమాన్ని రద్దు చేస్తే వారికి మొత్తం డబ్బు తిరిగి చెల్లిస్తాం. అడ్వెంజర్స్365 నుంచి ఎప్పుడు ఒక ప్రతినిధి వారి వెంట వెళతారు. ఉదాహరణకు 20 మంది సభ్యులతో కూడిన ఓ బృందం మా ప్రతినిధితో కలిసి ఈవెంట్ కు వెళ్లినప్పుడు అక్కడ ఏదైనా సమస్య తలెత్తితే.. మా ప్రతినిధి నిర్వాహకులతో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు."

డిసెంబర్ 2014లో ప్రారంభమైన అడ్వెంచర్స్365 డాట్ ఇన్(Adventures356.in) మంచి ఫలితాలు సాధిస్తోంది. పది నెలల్లో పుణె, ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలకు చెందిన వెయ్యి మందికి పైగా ఇండిపెండెంట్, కార్పొరేట్ ప్రయాణికులకు సేవలు అందించింది. వారి దగ్గర 150 సాహస యాత్రలకు సంబంధించిన ప్రదేశాల జాబితాతో పాటు 30 మందిపైగా నిర్వాహకులు నమోదు చేసుకున్న 500లకు పైగా ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెంట్ నిర్వాహకులకు తమ సేవలను మరింత చేరువ చేసేందుకు ఓ మొబైల్ యాప్ రూపొందించేందుకు పనిలో కంపెనీ ప్రస్తుతం నిమగ్నమైంది.

ప్రస్తుతం వీరికి నెలకు 40-50 బుకింగ్స్ వస్తున్నాయి. ఒక్క బుకింగ్ లో సగటున ఆరుగురు వ్యక్తులు ఉంటారు. మరింత ఎదిగేందుకు సిద్ధంగా ఉన్న ఈ కంపెనీ అందుకు కావాల్సిన నిధులు కోసం అన్వేషిస్తోంది.

గత కొన్నేళ్లుగా చాలామంది సాహసం మరియు ప్రయోగాలతో కూడుకున్న యాత్రలకు సంబంధించిన బిజినెస్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న అలాంటి సంస్థల్లో క్రేజీయాత్ర, థ్రిల్లోఫిలియా వంటి మరికొన్ని సంస్థలు ఉన్నాయి. అయితే, ఈ రంగంలో ఉన్న అవకాశాలను బట్టి మరిన్ని సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.