చిన్నారుల హెయిర్ కటింగ్ కోసం పుట్టిన 'స్టార్ ఫిష్'
స్టార్‌ఫిష్ సెలూన్ చిన్నారులకే ప్రత్యేకం. వారికి సంబంధించిన హెయిర్ కట్, పెడిక్యూర్, మానిక్యూర్‌ల్లో స్పెషలైజ్ సాధించింది. అంతేకాదు హాని చేయని నెయిల్ ఆర్ట్‌కు పెట్టింది పేరు. పెద్దల సెలూన్స్‌లో ఉండేటువంటి రసాయనాలతో కూడిన సౌందర్యోత్పత్తులు ఇక్కడ ఏమాత్రం ఉండవు. చిన్నారుల కోసం ప్రత్యేక సెలూన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు... మార్యా తన సహ-వ్యవస్థాపకురాలు ప్రీతి హర్కరేతో కలిసి పలు నగరాల్లోని ట్రెండ్ పరిశీలించారు. చాలా మంది తల్లితండ్రులు పిల్లలను తమతో పాటూ సెలూన్స్ కు తీసుకెళ్లేందుకు ఇష్టపడడంలేదని గుర్తించారు.
"చాలా మంది తల్లులు అమ్మాయిలను తమతో సెలూన్స్ కు తీసుకెళ్లేందుకు భయపడుతున్నారు. అక్కడ ఉండే రసాయనాలకు పిల్లలను అలవాటు చేయడానికి ఇష్టపడడం లేదు. దీంతో చిన్నారులకు ప్రత్యేక సెలూన్స్ ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తించాం " అంటారు 35ఏళ్ల మార్యా.
రీసెర్చ్ పూర్తైన తర్వాత మార్యా, ప్రీతి 2014 మార్చిలో స్టార్‌ఫిష్ కిడ్స్ సెలూన్ ప్రారంభించారు. ఏడాదిన్నరలోనే వివిధ ప్రాంతాల్లోని వారికి ఈ కాన్సెప్ట్ విపరీతంగా నచ్చేసింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ ఆదరణ లభించడంతో పాటూ ఫ్రాంచైజీ ఏర్పాటుకూ చాలా మంది ముందుకు వచ్చారు.
పబ్లిక్ రిలేషన్సే ముఖ్యం
మార్యా-ప్రీతి ఇద్దరూ ముంబైలోని గ్జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్‌లో పబ్లిక్ రిలేషన్స్ కోర్స్ చేశారు. భోపాల్ చెందిన ప్రీతి పై చదువుల కోసం ముంబై వచ్చారు. మార్యా ముంబై వాసే కావడంతో తమదైన అవుట్ లెట్ ప్రారంభానికి ముంబైనే ఎన్నుకున్నారు. ఫైనాన్స్-కమ్యూనికేషన్, పౌర సంబంధాల విభాగంలో మార్యా-ప్రీతిలకు దశాబ్దకాలం అనుభవం ఉంది. అంతే కాక ఓ సంస్థలో వీరు మూడేళ్లు సహోద్యోగులుగా పనిచేశారు. స్నేహ బంధం బలపడడంతో కలిసికట్టుగా ఏదైనా చేయాలన్న ఆలోచన వీరికి కలిగింది. పీఆర్ అనుభవాలతో వ్యాపారం ప్రారంభించడం వీరద్దిరికి కలిసొచ్చింది. ప్రజా సంబంధాలు కొనసాగించడం కష్టమే అయినా.... సమస్యలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించాలో ఈజీ గా అర్ధమవుతుందని మార్యా చెప్పారు.
లొకేషన్ కోసమే చాలా ఆలోచించాం
సేవల రంగంలో చాలా కాలం పనిచేసిన మార్యా, ప్రీతి తాము కూడబెట్టినదంతా సెలూన్ ఏర్పాటుకే ఖర్చు చేశారు. ముంబైలో సెలూన్‌కు తగిన చోటును గుర్తించడమే పెద్ద పనైంది. కమర్షియల్ హబ్ కావడంతో బాంద్రాను సురక్షిత ప్రాంతంగా ఎన్నుకున్నారు. భౌగోళికంగా ముంబై ఉత్తర దిశగా విస్తరించడంతో బాంద్రాను సెంట్రల్ లొకేషన్ పరిగణిస్తారు. అంతేకాక ఇక్కడ జనాలు ఎక్కువగానే ఉంటారు. రెస్టారెంట్లు సైతం ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది వస్తుంటారు. దీంతో ఈ తమ సెలూన్ ఏర్పాటుకు, బ్రాండ్ ప్రచారానికి బాంద్రాను సరైన స్థావరంగా నిర్ణయించుకున్నారు.
బాంద్రాలో స్టార్‌ఫిష్ కిడ్స్ సెలూన్
బాంద్రాలో సెలూన్ విజయవంతమైతే ఈ కాన్సెప్ట్‌లో వృద్ధి గణనీయంగా ఉంటుందని వాళ్లకు తెలుసు. ఈ వ్యాపారవేత్తలిద్దరికీ తమ సేవలను మరింత విస్తరించే ఆలోచనలున్నాయి. ఐదేళ్లలో ముంబైలోనే కాక ఇతర నగరాల్లోనూ సెలూన్స్ ఏర్పాటు చేయాలని తమకు తామే టైమ్ లైన్ పెట్టుకున్నారు.
స్టార్ ఫిష్ పేరే ఎందుకు ?
" చిన్నారులను గుర్తుకు తెచ్చే పేరుకోసం అన్వేషిస్తున్నాం. సముద్ర జీవులెప్పుడూ పిల్లలకు ఆసక్తికరంగానే ఉంటాయి. వాటిలో ఒకటి బాలల మనసుల్లో పాతుకుపోయి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటిదే బ్రాండ్ పేరుగా ఉండాలనుకున్నా" మని ప్రీతి చెప్పారు. అందుకే పూర్తిగా చిన్నారులే లక్ష్యంగా స్టార్‌ఫిష్ లాంచ్ చేశామని తెలిపారు.
ఒకసారి హెయిట్ కట్ చేయించుకుంటున్న చిన్నారి దృష్టిని మరల్చేందుకు ఓ చిన్నారి బామ్మ ఓ చిన్న కోడిపిల్లను పట్టుకొచ్చిందట. కోడిపిల్లను చూడగానే తాము నవ్వు ఆపుకోలేకపోయామని, ఈ సంఘటన చాలా ఫన్నీగా అనిపించిందని ప్రీతి చెప్పారు. ప్రతీరోజూ ఆసక్తికర ప్రజలను కలుసుకుంటున్నామని ఏ మాత్రం ఒత్తిడి లేదని చెప్పారు. మొత్తంగా తమ రోజులు అద్భుతంగా గడుస్తున్నాయని అన్నారు.
వ్యాపార ప్రయాణం
వ్యాపారవేత్తలుగా చేస్తున్న ప్రయాణంపై మార్యా-ప్రీతి పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సెలూన్ సేవల్లో గ్యాప్‌ను భర్తీ చేస్తున్న ప్రయత్నంపై ఆనందంగా ఉన్నారు. అంతే కాక తమ ఆలచోనకు వస్తున్నస్పందన చూసి లోలోపల మురిసిపోతున్నారు. గతేడాదంతా వీరికి అనుకూలంగానా సాగింది. సెలూన్ ఏర్పాటుకు అయిన ఖర్చును ఆర్జించగలిగారు. ఐదుగురు సిబ్బందినీ నియమించుకున్నారు.
స్టార్ ఫిష్‌లో అతిపెద్ద ఆకర్షణ స్పా పార్టీలు. స్పా పార్టీలంటే ఆశ్చర్యపోతున్నారా ? టీనేజర్లు-ప్రీ టీనేజర్ల మధ్య పాపులర్ అయిన ఈ కాన్సెప్ట్‌ను చిన్నారులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ పార్టీల్లో ఎలాంటి వానిటీ ఉండదు. ఇది కేవలం సరదాగా సాగిపోయే చిన్నారుల వేడుక. నెయిల్ ఆర్ట్ నిర్వహణతో పాటూ కెమికల్స్ లేకుండా చిన్నారులను అపురూపంగా లాలించే సెలబ్రేషన్. స్టార్ ఫిష్ లో నెలకు రెండు సార్లు స్పా పార్టీలు నిర్వహిస్తారు. ఈ వేడుకలకు పెరుగుతున్న చిన్నారుల సంఖ్యే కిడ్స్ సెలూన్ కాన్సెప్ట్ పిల్లలు-తల్లితండ్రులకు విపరీతంగా నచ్చిందనడానికి నిదర్శనం.