లిఫ్ట్కే కొత్త అర్థం చూపిన లిఫ్టో
ఓలా, ఉబర్ మాత్రమే కాదు, మరెన్నో ఫ్లాట్‌ఫామ్స్ రైడ్ షేరింగ్ కాన్సెప్ట్‌తో ముందుకొచ్చాయి. అందరి ఉద్దేశ్యం ఒక్కటే … దేశవ్యాప్తంగా నగరాల్లో పెరిగిపోయిన ట్రాఫిక్ ఊబి నుంచి కనీసం కొందరినైనా బయటపడేయడం. ఈ బ్యాండ్ వ్యాగన్‌ను ఫాలో అవుతూ రోడెక్కిందే లిఫ్టో. అయితే ఈ స్టార్టప్ మిగతా వాటితో పోలిస్తే కాస్త డిఫరెంట్. లిఫ్టోతో యూజర్స్ కేవలం కార్ రైడ్స్ మాత్రమే కాదు .. ట్యాక్సీలు, ఆటో రిక్షాలను కూడా షేర్ చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే వాహనం ఏదైనా సరే .. లిఫ్టో సాయంతో రైడ్‌ను షేర్ చేసుకునే వీలుంది.
కారు, ట్యాక్సీ (ఓలా, ఉబర్, మేరు, ట్యాబ్ క్యాబ్) ఇలా ఏ వాహనంలో వెళుతున్నా సరే .. లిఫ్టోలో యూజర్స్ పోస్ట్ చేయొచ్చు. ఇదే రూట్లో వెళుతున్న వేరే వ్యక్తి ఎవరైనా ఈ పోస్ట్ చూసి, తాను వారితో రైడ్ షేర్ చేసుకోవచ్చు.
ఈ సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ ప్లాట్ ఫామ్, పోవాయ్ పరిసరాల్లో నివసించేవారు, ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేయబడింది. రోజూ ప్రయాణం కోసం రూ. 150 – రూ. 250 ఖర్చు చేసే 26-45 ఏళ్లున్న వర్కింగ్ ప్రొఫేషనల్స్ కోసం స్పెషల్ గా డిజైన్ చేశారు.
ఎలా పుట్టింది ?
వికేష్ అగర్వాల్, నిఖిల్ అగర్వాల్ బెంగళూరు, ముంబైలలో కొన్నేళ్లుగా ఉంటూ దాదాపు రోజుకు 40-50 కి.మీ. ప్రయాణం చేస్తుండేవారు.
కార్ పూలింగ్ కాన్సెప్ట్ గురించి తెల్సుకున్నా .. వాళ్లకు ఆ ఐడియా అస్సలూ నచ్చలేదు. “రెండుమూడుసార్లు కారు పూలింగ్ లో ప్రయాణం చేశాక, మళ్లీ రైడ్ షేరింగ్ చేయాలనిపించదు. ఒక్కోసారి రూట్, మరోసారి టైమ్ అస్సలు మ్యాచ్ కాదు. మేము అనుకున్నాం ప్రస్తుతం ఉన్న సిస్టమ్‌నే కాస్త ట్రాన్స్ఫామ్ చేద్దామని, అది కూడా రియల్ టైమ్ బేసిస్ తీసుకుని రూట్ మ్యాచింగ్ అల్గారిథమ్ డిజైన్ చేయడం ద్వారా. అలా మార్కెట్‌ను ఓ ఊపు ఊపేయాలనుకున్నాం. ఇక అప్పటి నుంచి మా యాప్ లిఫ్టో పై దృష్టి పెట్టడం మొదలెట్టాం ,” అని చెప్పారు వికేష్.
లిఫ్టో టీమ్
లిఫ్టో కోర్ టీంలో నిఖిల్ ఒకరు. నిఖిల్ సిఈఓ, కో-ఫౌండర్. ఐఐటి ఢిల్లీ, ఐఐఎం లక్నో గ్రాడ్యూయేట్ … ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో తొమ్మిదేళ్ల అనుభవం ఉంది.
వికేష్, సిఓఓ, కో –ఫౌండర్. బిట్స్ పిలానీ, ఏఐఎం మనీలా అలూమ్ని. మార్కెటింగ్, మీడియా సేల్స్‌లో ఆరేళ్ల ఎక్స్పీరియన్స్ ఆయన సొంతం.
నంద కుమార్, సిటిఓ, ఎస్ ఆర్ ఎం ఇంజనీరింగ్ కాలేజ్ అలూమ్ని. మొబైల్ అప్లికేషన్స్ డెవలప్మెంట్లో పదేళ్ల పరిజ్ఞానం ఉంది.
“స్టార్టప్ కావడంతో, మాతో చేతులు కలపాలనుకుంటున్న వారిలో ఓపెన్ నెస్ కోసం చూశాం. బాధ్యతను స్వీకరించి, ఎటువంటి పరిస్థితుల్లోనూ పూర్తి చేసే వారి కోసం వెదికాం,” అని చెప్పారు వికేష్.
టెక్నాలజీ – భిన్నత్వం
వికేష్ ప్రకారం ఈ కంపెనీ USP … ‘రూట్ మ్యాచింగ్ అల్గోరిథమ్’, ఇది యాప్‌కు ఊపిరి వంటిది. వికేష్ అంటారు. ఈ అల్గోరిథమ్ యూజర్‌కు అన్ని వివరాలు అందిస్తుందని. పిక్-అప్ పాయింట్, డ్రాప్ పాయింట్, రైడ్ ట్రాకింగ్ మెకానిజమ్ ఇలా అన్ని డీటైల్డ్గ్ గా వివరిస్తుంది. యాప్ సాయంతో ట్యాక్సీని ఎలాగైతే బుక్ చేసుకుంటారో లిఫ్టో అలాంటి ఎక్స్‌పీరియన్స్‌నే ఇస్తుందని.
యూజర్స్ కేవలం మ్యాప్‌లో వారి ఎండ్ లొకేషన్, స్టార్టింగ్ టైమ్‌ను సెలెక్ట్ చేసుకుంటే చాలు. నిమిషాల్లో, అదే రూట్ లో వెళ్లే మ్యాచింగ్ యూజర్‌ను లిఫ్టో వెదికి పెడుతుంది. అలాని ఎవరంటే వారితో యూజర్స్ వెళ్లనక్కర్లేదు. ఎవరితో రైడ్ షేర్ చేసుకుంటున్నారో .. వారి పూర్తి ప్రొఫైల్, పిక్ అప్ టైమ్, పిక్ అప్ పాయింట్ ఇలా అన్నీ కూడా జర్నీ షేర్ చేసుకునే ముందే తెల్సుకునే వీలుంది. ఒక్కసారి లిఫ్ట్ తీసుకునే వారి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాక, పికింగ్ పాయింట్ లో రైడింగ్ పార్టనర్ ను కలిశాక .. వారు లిఫ్టో యాప్ లో ‘స్టార్ట్ రైడ్’ను క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఇక లిఫ్ట్ తీసుకునే యూజర్స్ విషయానికొస్తే, వారు మ్యాప్‌లో ఎండ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాక, వెయిటింగ్ టైమ్ ను బట్టి రకరకాల వెహికల్స్ (ఏసి క్యాబ్, నాన్ ఏసి క్యాబ్, ఆటో ) ఇలా ఏది కావాలో కూడా ఎంచుకోవచ్చు. ఇదంతా అయ్యాక, పిక్ అప్ లొకేషన్ తో పాటు లిఫ్ట్ ఇచ్చే వ్యక్తి ప్రొఫైల్ ను కూడా చూడొచ్చు. ఒకవేళ అన్నీ ఓకే అనుకుంటే వారు రిక్వెస్ట్ పంపించవచ్చు, వారితో కల్సి రైడ్ షేర్ చేసుకోవచ్చు.
లాంఛ్
యాప్ తొలి ఫేస్ పోవాయ్, పరిసర ప్రాంతాల నుంచి లాంఛ్ అయ్యింది. వికేష్ అంటారు, ఈ సర్వీసులు ఉదయం ఇక్కడ్నించి బయలుదేరి పాపులర్ ఆఫీస్ లొకేషన్స్ అయిన BKC, లోయర్ పరేల్, నారిమన్ పాయింట్, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయని. “ఇక సాయంత్రం ఆఫీసుల నుంచి ముంబైలోని తమ ఇళ్లకు తిరిగొచ్చే ఫ్రొఫేషనల్స్ తమ యాప్ ద్వారా మ్యాచింగ్ రైడ్ పార్టనర్స్ ను వెదుక్కోవచ్చు,” అన్నారు వికేష్.
ఆటోలు, క్యాబ్స్ దొరకని వేళలో … పీక్ అవర్ సర్వీసెస్ కు లిఫ్టో ఒక ఆల్టర్ నేటివ్ అంటారు ఆయన. వీక్ డేస్ లో కంపెనీకి వచ్చే రిక్వెస్ట్ లు అన్నీ ఇన్నీ కావు.
“ప్రస్తుతం లిఫ్టో కేవలం గూగుల్ ప్లే స్టోర్ లోనే కనిపిస్తుంది. మేము iOS వర్షన్ పై పనిచేయడం మొదలెట్టాం, జనవరిలోగా అందుబాటులోకి వస్తుంది,” అని చెప్పారు వికేష్.
ఆపరేషన్స్ ప్రారంభించిన మొదటి నెలలోనే, రోజుకు కనీసం 50 ట్రాన్సాక్షన్స్ .. అంటే ఎంతలేదన్నా 500-600 రైడ్స్ రోజూవారిగా పోస్ట్ అయ్యేవని టీమ్ చెప్పింది. సిస్టమ్ లో ఇప్పటికే 16,500 రైడ్స్ పోస్ట్ చేయబడ్డాయి. యూజర్ బేస్ ఇప్పటికే 4,300 దాటేసింది. ఇప్పుడు లిఫ్టో టార్గెట్ … రోజుకు కనీసం వంద ట్రాన్సాక్షన్స్.
ఫండింగ్ – ఫ్యూచర్
ఇప్పటికే ఈ టీమ్ రూ. 85లక్షల ఫండింగ్ చేజిక్కించుకుంది. స్టార్టప్ ప్రపంచంలోని కొందరు పెద్దవారు తనకెంతో సపోర్ట్ గా నిలిచారని వికేష్ చెప్పారు.
సెంట్రల్ ముంబై నుంచి ఆపరేషన్స్, మార్కెటింగ్ ను ఈ టీమ్ ప్రారంభించేసింది. వచ్చే మార్చికల్లా మొత్తం నగరమంతా విస్తరించాలనుకుంటోంది. వచ్చే ఏడాదిలోగా ఇతర మెట్రో సిటీస్ అయిన ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, పూణె, కోల్ కతాలలో, మరో రెండేళ్లలో ఇంటర్నేషనల్ లెవెల్లో సర్వీసెస్ ను డెవలప్ చేయాలనుకుంటోంది.
చట్టాలు
రైడ్ షేరింగ్, ట్యాక్సీ, వెహికల్ అగ్రిగేషన్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాలసీలు, చట్టాలు అనుకూలిస్తాయా లేదానన్నది అనుమానమే. జిప్ గో తాజా రిపోర్ట్స్ ప్రకారం … ఇలాంటి ప్లాట్ ఫామ్స్ నెట్టుకురావడం కష్టమే. అయితే వికేష్ మరోలా భావిస్తున్నారు .. మోటర్ వెహికల్స్ యాక్ట్, 1988 (సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్)ను తీసుకుంటే అందులో ఎక్కడా ఈ కార్ పూలింగ్, రైడ్ షేరింగ్, లిఫ్ట్ ఇవ్వడం వంటివి లేనేలేవు. కాబట్టి ఏ చట్టం కూడా ఇటువంటి సర్వీసులను రద్దు చేయదు, చేయబోదు అని.
యాక్ట్ లోని సెక్షన్ 66 ప్రకారం .. ‘కాంట్రాక్ట్ క్యారేజెస్’, ‘పబ్లిక్ సర్వీస్ వెహికల్స్’ (సెక్షన్ 2, పాయింట్ 7) అంటే అద్దెకు తీసుకున్న వాహనాలు, ప్యాసెంజర్లను తీసుకెళ్లే క్యారేజెస్ కూడా అందులోనే వస్తాయని.
కార్ పూలింగ్ ని తీసుకుంటే … కార్ పూలింగ్ చేసే కార్లు ఈ సెక్షన్ లోకి రావు. ఎందుకంటే … లిఫ్ట్ ఇచ్చే వ్యక్తి కేవలం ట్రాన్స్ పొర్టేషన్ ఖర్చులను మాత్రమే షేర్ చేసుకోగలడు కానీ దాని ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోలేడు, వ్యాపారంగా మలచుకోలేడు.
మార్కెట్ స్పేస్
కార్ పూలింగ్ … షేర్డ్ ఎకానమీ గొడుగు కిందకి వస్తుంది. ప్రైజ్ వాటర్ హౌజ్ కూపర్స్ రిపోర్ట్ ప్రకారం గ్లోబల్ మార్కెట్ లో దీని విలువ 15 బిలియన్ అమెరికన్ డాలర్లు. 2025 కల్లా 335 బిలియన్ అమెరికన్ డాలర్లను చేరుకునే అవకాశం ఉంది.
ఎక్స్ పర్ట్స్ అంటారు, ఇండియాకు ఇందులో మంచి భవిష్యత్తు ఉందని. కొన్నేళ్లుగా మిబడ్డీ, రైడింగ్ఓ, పూల్ సర్కిల్, కార్ పూల్ అడ్డా వంటివి స్పేస్ ను తీసుకున్నా … బ్రెజిలియన్ ట్రిప్డా, ఫ్రెంచ్ బ్లా బ్లా కార్ వంటి గ్లోబల్ ప్లేయర్స్ రియల్ గేమ్ చేంజర్స్ గా మారాయి. ఇండియన్ మార్కెట్లో అవి కార్ పూలింగ్ అవసరాలకు వాలిడేషన్ తీసుకొచ్చాయి.