చిరుతిళ్లను మరింత రుచిగా మారుస్తున్న 'స్నాక్ ఎక్స్‌పర్ట్స్'

చిరుతిళ్లను మరింత రుచిగా మారుస్తున్న 'స్నాక్ ఎక్స్‌పర్ట్స్'

Monday November 02, 2015,

4 min Read

మార్కెట్ లోని అనారోగ్యకమైన చిరుతిళ్లను చూసిన ముగ్గురు చెన్నై వాసులు... ప్రజలకు ఆరోగ్యకరమైన స్నాక్స్ అందించాలనే లక్ష్యంతో ఓ స్టార్టప్ మొదలుపెట్టారు. అదే 'స్నాక్స్ ఎక్స్ పర్ట్స్'.

image


ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే విషయంలో గతంతో పోలిస్తే భారతీయుల్లో అవగాహన బాగా పెరిగింది. సంప్రదాయమైన వంటకాలు, చిరుతిళ్లను సుష్టుగా లాగించిన చాలామంది భోజన ప్రియులు... పెరుగుతున్న ఆరోగ్యక సమస్యలు, తాము తీసుకునే ఆహారంలోని క్యాలరీలను దృష్టిలో ఉంచుకుని మెనూను మార్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న చాలామంది ఫుడ్ స్టార్టప్స్... ఈ రంగంలో వ్యాపారాన్ని మొదలుపెడుతున్నాయి. ఇలాంటి ఆలోచన నుంచి పుట్టిన సరికొత్త వ్యాపార సంస్థే "స్నాక్స్ ఎక్స్‌పర్ట్స్".

టీ టైంలో తీసుకునే కొన్ని స్నాక్స్ కారణంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయనే ఆలోచనతోనే... ఈ సంస్థ ప్రారంభానికి బీజం పడింది. ఇదే కాన్సెప్ట్‌తో ముగ్గురు చెన్నై వాసులు ఆన్ లైన్‌లో మొదలుపెట్టిన స్నాక్స్ స్టోర్స్... దేశవ్యాప్తంగా పలు వెరైటీ స్నాక్స్‌ను ఆఫర్ చేస్తోంది.

ఆలోచన పుట్టిన సందర్భం

ఒక వారాంతంలో ఛాయ్ తాగేందుకు కలుసుకున్న అరుణ్ ప్రకాశ్, అరుల్ మురుగన్, మేరీ శామ్లాకు రెడీమేడ్‌గా దొరికే స్నాక్స్ గురించి సడన్‌గా ఓ ఆలోచన కలిగింది.

"ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే పలురకాల స్నాక్స్‌ను తీసుకుని మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. కొన్ని పాపులర్ స్నాక్స్ కారణంగా ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసీ ఏమీ చేయలేకపోతున్నాం. ఈ స్నాక్స్ తీసుకోకుండా ఆపేందుకు మన దగ్గర ఓ అవకాశం ఉంది. కానీ మనం అలా చేయడం లేదు" అన్నాడు అరుణ్. 

ఆ తరువాత రోజు నుంచి ఆరోగ్యకరమైన స్నాక్స్ ఏమేం ఉన్నాయి ? అని కనుక్కోవడం ద్వారా వీటిని అడ్డుకట్ట వేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ ప్రయత్నంలో చెన్నై మొత్తం తిరిగిన ఈ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్... ఉత్త చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు.

" ఈ ప్రయత్నంలో ఎంతగానో విసుగు చెంది, చిరాకు రావడంతో ఏదో ఒకటి చేయాల్సిందే అని రంగంలోకి దిగాం. ఆరోగ్యకమైన స్నాక్స్‌ తయారు చేయాలని భావించాం. అవి మన ఇంట్లో వండిన భోజనం తరహాలో ఉండాలని అనుకున్నాం. అలాంటి స్నాక్స్ ప్రజలకు అందించాలని నిర్ణయించాం" అంటారు అరుణ్.

ప్రజలకు ఆరోగ్యకరమైన స్నాక్స్ అందించాలని ఆగస్టు 2014లో భావించిన ఈ త్రయం, కొద్ది నెలల్లోనే తమ ఆలోచనను ఆచరణలో చేసి చూపించారు. తమ ఉద్యోగులను వదిలిపెట్టి ఈ ఏడాది దీనిపై పూర్తి సమయం కేటాయించారు. అప్పటివరకు దిండిగల్‌లో క్వాలిటీ అసూరెన్స్ మేనేజర్‌గా పని చేసిన అరుల్, చెన్నైకు మారిపోయాడు. అప్పటి నుంచి మొదలైన ఆన్ లైన్ స్నాక్స్ ఎక్స్‌పర్ట్స్ నిర్విరామంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంది.

స్నాక్ ఎక్స్ పర్ట్స్ వ్యవస్థాపకులు

స్నాక్ ఎక్స్ పర్ట్స్ వ్యవస్థాపకులు


పొడి స్నాక్స్ నుంచి తొలి అడుగు

స్నాక్స్ ఎక్స్‌పర్ట్స్ బృందం మొదటగా పండ్ల ముక్కలను, కాల్చిన పప్పు దినుసులు, ఫ్రూట్ సలాడ్స్ ఆఫర్ చేయాలని భావించింది. అయితే సరైన సమయానికి డెలివరీ ఇవ్వకపోతే పాడైపోయే ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని గ్రహించి పొడి (డ్రై) స్నాక్స్ అయితి మేలు అనే అభిప్రాయానికి వచ్చారు.

"మేము తయారు చేసే స్నాక్స్ దేశవ్యాప్తంగా సరఫరా చేయాలని అనుకున్నాం. వీటిని కొనుగోలు చేసే వారు కనీసం వాటిని 30 నుంచి 40 రోజుల పాటు నిల్వ చేసేలా ఉండాలనుకున్నాం"అని వివరించారు అరుణ్.

20 నుంచి 25 స్నాక్స్ ఐటమ్స్ తో మొదలైన కంపెనీ, మొదట ఎక్కువగా బేక్డ్ ఐటమ్స్‌నే ఎంచుకుంది. ఆ తరువాత కొన్ని కొత్త రకం స్నాక్స్‌ను తమ మెనూలో చేర్చింది. కొత్త వంటకాలను చేర్చే విషయంలో న్యూట్రీషనిస్ట్ రంజనీ రామన్ వీరికి సాయం చేశారు. కొత్తగా ప్రవేశ పెట్టే స్నాక్స్ ఐటమ్స్‌లో పోషక విలువలు నిర్ణీత స్థాయిలో ఉన్నాయా లేదా అనే విషయాన్ని వారికి సూచించారు.

ప్రస్తుతం 40 రకాల వెరైటీలను ప్రజలకు అందిస్తున్న స్నాక్స్ ఎక్స్‌పర్ట్స్, అందులో రాగి సేవ్, ఓట్స్, డ్రై ఫ్రూట్ లడ్డూలు, షూగర్‌లెస్ బ్రౌనీస్, జాక్ ఫ్రూట్ ఫ్రిట్టర్స్, పలు రకాల కేకులను కూడా చేర్చారు. ఈ స్నాక్స్‌ను సొంతంగా తయారు చేయకుండా తమిళనాడులోని అనేక మందితో ఒప్పందం కుదుర్చుకుని వీటి తయారి బాధ్యతను అప్పగించారు.

image


ఏంటి వీరి ప్రత్యేకత ?

స్నాక్స్ ఎక్స్‌పర్ట్స్‌కు కస్టమర్లే ప్రధానం. "కస్టమర్ల ఫీడ్ బ్యాక్ రెగ్యూలర్‌గా తీసుకుంటూ కొత్త ఐటమ్స్‌ను మా మెనూలో చేర్చుతుంటాం. కొన్ని ఐటమ్స్ అంత రుచిగా లేకపోవడంతో, వాటికి కస్టమర్లు అంతగా ఇష్టపడటం లేదని గ్రహించిన వెంటనే వాటిని మార్చడానికి ప్రయత్నిస్తాం. అప్పటికీ కస్టమర్లు సంతృప్తి చెందకపోతే ఆ ఐటమ్‌ను తీసేసి, ఆ స్థానంలో మరో కొత్త వంటకాన్ని ప్రవేశపెడతాం"అని వివరిస్తారు అరుణ్.

స్నాక్స్ బాక్సులు (ఒక్క బాక్స్ బరువు దాదాపు 750 గ్రాములు) ఖరీదు రూ.699, కస్టమర్ల ప్రాధాన్యతలను బట్టి ధరలో కొద్దిపాటి మార్పులు చేస్తుంటారు. వీటిని ఓ కొరియర్ పార్టనర్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు అందజేస్తారు. కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ చెన్నై నుంచి వస్తే మాత్రం స్నాక్స్ ఎక్స్‌పర్ట్స్ వ్యవస్థాపకులే వీటిని స్వయంగా డెలివరీ చేస్తారు.

మార్కెట్ ఆలోచన ఏమిటి ?

పీఎస్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ నివేదిక ప్రకారం, 2014లో ప్రపంచ స్నాక్స్ మార్కెట్ విలువ దాదాపు రూ.7,22,150 కోట్లు. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం 2015 నుంచి 2020 వరకు స్నాక్స్ మార్కెట్ 7.1 శాతం వృద్ధి సాధించే అవకాశం ఉంది. దీంతో ప్రపంచ స్నాక్స్ మార్కెట్ విలువ 10,82,900 కోట్లకు చేరే అవకాశం ఉంది.

సంస్థ నివేదిక ప్రకారం, జనభా ఎక్కువగా ఉండే చైనా, భారత్‌లో స్నాక్స్ కు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ వృద్ధి శాతం మరింత ఎక్కువగా ఉండొచ్చు.

దీనితో పాటు ప్రజలు ఆరోగ్యకరమైన బేక్డ్, రోస్టెడ్ వస్తువులు, స్వచ్ఛమైన పండ్లు, పండ్ల రసాల వంటి ఇతర స్నాక్స్ వైపు ఆలోచిస్తున్నారని నివేదిక వెల్లడించింది. ప్రజల అభిరుచుల్లో మార్పు వస్తున్న నేపధ్యంలో కంపెనీలు పోటాపోటీగా ఆరోగ్యకరమైన స్నాక్స్ అందించడానికి మరిన్ని కొత్త ఐటమ్స్ ను తయారు చేసే అవకాశం ఉంది.

స్నాక్స్ ఎక్ట్స్‌పర్ట్స్‌తో పాటు మరిన్ని కొత్త కంపెనీలు ఈ మార్కెట్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ మార్కెట్ పెరుగుదలకు ది గ్రీన్ స్నాక్ కంపెనీ, స్నాకోసోర్ అండ్ స్పూన్ జాన్ వంటి పలు కంపెనీలు కూడా దోహదపడ్డాయి.

చెన్నైలోని ఆఫీసులో స్నాక్స్ ఎక్స్ పర్ట్స్ బృందం

చెన్నైలోని ఆఫీసులో స్నాక్స్ ఎక్స్ పర్ట్స్ బృందం


వ్యాపార విస్తరణ, భవిష్యత్ ఆలోచనలు

సోషల్ మీడియాలో కొంత ప్రచారం మినహా ఈ స్టార్టప్ కంపెనీ మార్కెటింగ్ కోసం పెద్దగా ఖర్చు చేయలేదు. అయినా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వీరు 500 అర్డర్లను డెలివరీ ఇచ్చారు.

రీసెంట్‌గా ఐఐటీ ముంబై ఆంట్రప్రెన్యూర్షిప్ సెల్ నిర్వహించిన "ది 10 మినిట్ మిలియన్ " కార్యక్రమంలో స్నాక్స్ ఎక్స్‌పర్ట్స్ టీమ్ రూ.10 లక్షలు గెలుచుకుంది. ఆ తరువాత అజిత్ ఖురానా, తహనబి, వీసీ కార్తీక్, రవి గురురాజ్ వంటి ఇన్వెస్టర్ల సహాయంతో రూ.20 లక్షలు సమీకరించారు.

"మా ఐటమ్స్ ద్వారా సమాజంలో స్నాకింగ్‌ను ఓ ఆనందకరమైన, ఆరోగ్యకరమైన అలవాటుగా మార్చాలని భావిస్తున్నాం. పిల్లలు, యువతరంలో దీనిపై అవగాహన తీసుకురావడమే మా ప్రధమ లక్ష్యం" అంటున్నారు అరుణ్. మొత్తం 12 మంది తమ టీమ్ సభ్యులతో "హెల్తీ స్నాకింగ్" క్యాంపెయిన్ ను దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహించాలని భావిస్తున్నారు.

website