లినక్స్‌లో లీడర్‌గా ఎదిగిన అమిత్ బోరా
నిలకడ, స్థిరత్వం, పట్టుదల... ఈ మూడింటి ప్యాకేజే అమిత్ బోర్. అమిత్ పూణెలో పుట్టి పెరిగారు. నాన్న ఇంజనీర్, మెషీన్ టూల్స్‌కు క్యాం షాప్ట్స్ డిజైన్స్ చేసేవారు. చిన్నప్పటి నుంచి తండ్రి చేసే పనిపై విపరీతమైన ఆసక్తి పెంచుకున్న అమిత్, ఆయన వర్క్ ప్లేస్‌కు ఎప్పుడూ వెళుతుండేవారు. 12 ఏళ్లప్పుడే .. ఆయన వాటిని పేపర్ పై డిజైన్ చేయడం మొదలెట్టారు.
'' మొదట్లో కంప్యూటింగ్ ఒక భాగమని తెలియక, నేను సింపుల్ క్యాం డిజైన్స్ చేసే వాడిని, ఆ తర్వాత కంప్యూటర్ పద్ధతిని తెలుసుకున్నాను. మా డాడీ నాకు సింపుల్ డిజైన్స్ ఇచ్చేవారు, వాటితోనే నేను నా నేర్పరితనాన్ని చూపేవాడిని '' అంటారు అమిత్.
1980లో పుట్టిన అమిత్ వాళ్లింట్లో అప్పట్లో కంప్యూటర్ లేదు. కాలేజ్ లో చేరాక కంప్యూటర్ వాడకం మొదలుపెట్టాడు. ఫస్ట్ ఇయర్‌లో కాలేజ్ కంప్యూటర్ వాడినా .. సెకెండ్ ఇయర్‌కు వచ్చేసరికి సొంతంగా ఒక సిస్టమ్‌ను కొనుక్కున్నారు. కాలేజీలో చదువుతున్నప్పుడు ... అమిత్‌కు ఒక ఫ్రెండ్ తో పరిచయమైంది. అతడే అమిత్.. పర్సనల్ సిస్టమ్‌లో డెమియన్‌ను ఇన్ స్టాల్ చేశాడు. ఇది అతడిలో ఇంట్రెస్ట్‌ను పెంచింది. అలా లైనెక్స్‌తో పనిచేయడం ప్రారంభించారు. లైనెక్స్ డివైజ్ డ్రైవర్ సోర్సెస్ సాయంతో రిపేర్లు చేస్తూ .. ఆ ప్రపంచంలోనే రోజంతా పూర్తిగా మునిగిపోయేవారు.
IRCలో మాటిమాటికి లాగిన్ కావడం, డ్రైవర్ మెయింటెనర్స్‌ను సలహాల కోసం అడగడం ... అమిత్‌కు రోజంతా ఇదే పని. 2001లో కాలేజ్ నుంచి గ్రాడ్యూయేట్‌గా పట్టా అందుకున్న అమిత్‌కు అప్పటికే క్యాంపస్ సెలక్షన్స్‌లో ఒక MNC లో ఉద్యోగం దొరికింది. అయితే లైనిక్స్ పై అమితాసక్తి పెంచుకున్న అమిత్, డెస్క్ జాబ్ చేయడానికి అంతగా ఇష్టపడలేదు. అదృష్టవశాత్తు, పతంజలి సోమయాజీ.. అనే అతడి సీనియర్ సొంతంగా లైనెక్స్ బేస్డ్ సర్వీసెస్ కంపెనీ - కో ఆడిటోను ప్రారంభించడం, అమిత్‌ను తనతో కలిసి పనిచేయాల్సిందిగా కోరడంతో ... అందులో చేరారు.
ఆ రోజులను అమిత్ ఇలా గుర్తు చేసుకున్నారు..
జీతం గురించి బేరాలు, ఈక్విటీపై చర్చలు ఏమీ లేవు .. కేవలం ప్రశాంతంగా లైనెక్స్ లో ప్రాజెక్ట్స్ చేసుకోవాలనుకున్నాను.
వీళ్ల తొలి ప్రాజెక్ట్ ... GNU స్టాక్‌ను మొత్తం కొత్త ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ ARCలోకి పోర్ట్ చేయడం. టీమ్ మొత్తం ప్రాజెక్ట్ పై ఎన్నో ఆశలు పెట్టుకుని, రేయింబవళ్లు కష్టపడి, మొత్తానికి విజయవంతంగా అనుకున్న పని సాధించింది. యావత్ భారత్ లోనే .. ఒక ఆర్కిటెక్చర్ నుంచి మరో ఆర్కిటెక్చర్ కు పోర్ట్ చేసిన తొలి టీమ్ వీరిదే.
మొదట నలుగురితో ప్రారంభమైన వీరి టీమ్ 40 కు చేరింది. ఆ తరువాత వరుస ఆఫర్స్ ... చిప్ వెండర్స్ అయిన హిటాచి, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ నుంచి కూడా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వచ్చాయి. అమిత్ ఎంబెడెడ్ సర్వీసెస్ సిస్టమ్స్‌కు హెడ్ గా పనిచేస్తుండేవారు.
2006లో వీరి కంపెనీ వాలీ బేస్డ్ స్టార్టప్ అజింగోను కొనుగోలు చేసింది. అజింగోలో ఓపెన్ సోర్స్ మొబైల్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు అమిత్ చీఫ్ అర్కిటెక్ట్. మేజర్ ఆపరేటర్స్‌తో పాటు వోడాఫోన్, NTT, డొకొమొ, సామ్‌సంగ్ వంటి OEMలు .. ఓపెన్ సోర్స్ ఓఎస్‌ను క్రియేట్ చేసేందుకు సమిష్టిగా ముందుకొచ్చాయి. అలా లైనెక్స్ మొబైల్ ఏర్పాటైంది. అమిత్, అతడి టీమ్ కలిసి లైమొకు కొన్ని కోర్ మోడ్యూల్స్ అందించడం, సిస్టమ్ ఇంటిగ్రేషన్, వివిధ OEMలకు సానుకూలంగా ఉండే ఆప్టిమైజింగ్ లైమోను తీర్చిదిద్దడంలో విపరీతమైన కృషి చేశారు. సామ్‌సంగ్, వోడాఫోన్‌ల తొలి లైమొ హ్యాండ్ సెట్‌ల రూపు కల్పనకు అమిత్ సాయం ఎంతో ఉంది.
అయితే గూగుల్ ఆండ్రాయిడ్‌ను ప్రకటించగానే .. ఇవన్నీ కుప్పకూలిపోయాయి. 2009లో మోటరోలా అజింగోను సొంతం చేసుకుంది. లైమొతో ఎంతో ఎక్స్‌పీరియన్స్ సంపాదించుకున్న వీళ్ల టీమ్, ఆండ్రాయిడ్ పై దృష్టిపెట్టింది. మోటరోలాలోని ఈ ఆండ్రాయిడ్‌కు కూడా అమితే చీఫ్ ఆర్టిటెక్ట్‌గా వ్యవహరించారు. అమిత్‌కు రెండు ముఖ్య బాధ్యతలు అప్పగించారు. మొదటిది ... అప్‌గ్రేడ్ రిలీజ్ డేట్ టైమ్‌ను స్పీడ్ అప్ చేయడం, అంటే 9-12 నెలలను కాస్తా 3-4 నెలలకు తీసుకురావడం. రెండోది ... క్రోమో ఓఎస్ తదితర వాటితో ఆండ్రాయిడ్ కంపాటబిలిటిని చెక్ చేయడం.
ఇక్కడే ఓ విషయం చెప్పాలి ... మీలో చాలామంది వాడుతున్న మొబైల్స్‌లోని OS కాంపోనెంట్స్‌ను అమిత్, అతడి టీమ్ డెవలప్ చేసినవే అనడంలో అతిశయోక్తి కాదు.
2013లో అప్పటికే గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నమోటరోలా మొబిలిటిని అమిత్ వదిలేశారు. కో ఆడిటోతో మొదలై, ఎన్నో విజయాలను అందుకున్న తన 12 ఏళ్ల ప్రస్తానానికి ముగింపు పలికి, కొన్ని రోజులు కుటుంబంతో కలిసి గడపాలనుకున్నారు.
ఒకే కంపెనీలో రెండు మూడేళ్లకన్నా ఎక్కువ రోజులు ఎవ్వరూ పనిచేయని రోజుల్లో ... అన్ని ఏళ్లపాటు మీరు ఎలా పనిచేశారు అని అడిగితే .. " ఈ కంపెనీ పుట్టినప్పటి నుంచి నేను ఉన్నాను. దాదాపు స్టాఫ్ అంతా ఈ కంపెనీ జర్నీలో నాతో ఉన్నారు. మేమంతా కలిసి ఎంతో ఇష్టంగా, ఆసక్తిగా పనిచేసేవాళ్లం. కాబట్టి ఎప్పుడూ ఏ కారణంతోనో ఈ కంపెనీ వదిలి వెళ్లాలన్న ఆలోచనే రాలేదు ''.
ఈ బ్రేక్ లో ... యాప్ మార్కెట్‌లో పెను మార్పులు తీసుకువచ్చేలా సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్‌లలో అమిత్ కొత్త కొత్త ఐడియాలను ఎక్స్‌పెరిమెంట్ చేశారు. 14 ఏళ్లపాటు కల్సి పనిచేసిన అమిత్, పతంజలి .. జూలై 2014లో వాల్‌నట్ తో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. వాల్‌నట్ ... ఒక రియల్ టైమ్ ఎక్స్‌పెన్స్‌ట్రాకర్ ఆప్ ... SMS ఇన్‌బాక్స్‌లోని నోటిఫికేషన్స్‌ను చదివి, వాటి ఆధారంగా ఖర్చులను ట్రాక్ చేస్తుంది. క్రెడిట్, డెబిట్ కార్డ్, బ్యాంక్ డీటైల్స్ ఎంటర్ చేసే సమయంలో ఈ యాప్ ఎటువంటి ఇన్‌పుట్ తో పని లేకుండా, సొంతంగానే అన్నీ చేసుకుంటుంది.
ప్రస్తుతం, వాల్‌నట్ కోసం ఆండ్రాయిడ్, పైథాన్ గీక్స్‌ను హైర్ చేద్దామని అమిత్ అనుకుంటున్నారు. టెక్నాలజీ డెవలప్‌మెంట్‌లో తనవంతుగా ఎంతో సాయం చేసిన అమిత్, తన భవిష్యత్తు గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు.