కంపెనీ సక్సెస్‌కు ప్రాడక్ట్ మేనేజర్లు పాటించాల్సిన పది సూత్రాలు

కంపెనీ సక్సెస్‌కు ప్రాడక్ట్ మేనేజర్లు పాటించాల్సిన పది సూత్రాలు

Sunday May 08, 2016,

5 min Read


కంపెనీ విజయం సాధించాలంటే ఉద్యోగులంతా ఐక్యంగా ముందుకు సాగాలి. సీఈవో నుంచి అటెండర్‌ వరకు అందరూ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తేనే మార్కెట్‌లో సంస్థ పట్టు నిలుపుకుంటుంది. అందునా ప్రాడక్ట్ మేనేజర్ మంచి లీడరైతే ఆ కంపెనీకి ఎదురే ఉండదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కంపెనీకి సీఈవో ఎంతో ప్రాడక్ట్ మేనేజర్‌ కూడా అంతే ముఖ్యం. ఓ కంపెనీని విలువైనదిగా సృష్టించేందుకు ప్రాడక్ట్ మేనేజర్ పాటించాల్సిన పది టిప్స్‌ను రూమ్ టునైట్ సీపీఓ కార్తిక్ ప్రభు అందిస్తున్నారు. విలువైన టిప్స్ ఆయన మాటల్లోనే..

లింక్డిన్ సెర్చ్‌లో ‘ప్రొడక్ట్ మేనేజర్స్’ అని సెర్చ్ చేస్తే పెద్ద సంఖ్యలో ఆ ఉద్యోగం కోసం పోటీపడే వారి వివరాలు వస్తాయి. టెక్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్ నుంచి ప్రాడక్ట్ మేనేజ్‌మెంట్‌కు కెరీర్‌ను మార్చుకుంటున్నవారి సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరిగిపోతున్నది.

ప్రాడక్ట్ ఫీచర్‌ను వివరించడం, ప్రాడక్ట్‌ను విడుదల చేయడంతోపాటు ప్రాడక్ట్ మేనేజేర్ ఇంకా ఏమేమీ కార్యకలాపాలు చేస్తాడు? కంపెనీని సక్సెస్‌ఫుల్ ప్రాడక్ట్ కంపెనీగా మార్చేందుకు ప్రాడక్ట్ మేనేజర్ ఏం చర్యలు చేపడతాడు?

ఇమేజ్ క్రెడిట్ షట్టర్ స్టాక్

ఇమేజ్ క్రెడిట్ షట్టర్ స్టాక్


1. కంపెనీకి సీఈవో ఎలాగో ప్రాడక్ట్ మేనేజర్స్ కూడా అలాగే

ప్రాడక్ట్ ఆధారిత కంపెనీలో ప్రాడక్టే కంపెనీకి ఫేస్ ఆఫ్ ది ప్రాడక్ట్. ఒక వేళ మీ కంపెనీ ‘యాప్ ఓన్లీ’ వ్యాపారమైతే, అప్పుడు కంపెనీ ఫేస్ ఆఫ్ ది ప్రాడక్ట్ 4.5 నుంచి 5.5 అంగుళాల తెర మాత్రమే.

ప్రాడక్ట్ బాగోగులు చూసే వ్యక్తికి కంపెనీ నిధుల ప్రవాహం గురించి 360 డిగ్రీల కోణంలో అవగాహన ఉండాలి. మార్కెటింగ్‌ కోసం తీసుకున్న ప్రాడక్ట్, ప్రాడక్ట్ సేల్స్ సర్వీస్ సపోర్ట్, ప్రాడక్ట్ పెర్ఫార్మెన్స్, ఆర్‌ఓఐ, అభివృద్ధి, పోటీ ప్రాడక్టులు, కంపెనీ ప్రదర్శన ఇలా అన్నీ తెలిసుండాలి.

2. డాటానే మీ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్

ప్రాడక్ట్ మేనేజర్లకు డాటానే డెసిషన్ మేకింగ్ ఫ్యాక్టర్. సీఈఓ లేదా డైరెక్టర్ ప్రాడక్ట్‌తో కంపెనీ బిల్డ్ చేయమని కోరినప్పుడు, మరోవైపు డాటా ఇంకో విధంగా చెప్తున్నప్పుడు మీరు డాటా చెప్పిందే వినాలి. ప్రాడక్ట్ మేనేజర్ లైఫ్ సైకిల్ చాలా సింపుల్‌. ‘ఆలోచించు, అబివృద్ధి చేయు, డాటాను పరిశీలించు.. మళ్లీ మొదటి నుంచి ప్రయత్నించు’ ఇదే చక్రం ఉంటుంది. ఎంఎస్ ఎక్సెల్ టేబుల్స్‌ను చక్కగా ఉపయోగించుకోండి. అందులో విలువైన సమాచారం దాగి ఉంటుంది.

3. గ్రోత్ హాక్ ఎఫర్ట్‌ను లీడ్ చేయండి

గ్రోత్ హాకింగ్ అంటే మార్కెటింగ్‌కు సమానం కాదు. మార్కెటింగ్‌ టీమ్‌కు గ్రోత్ హ్యాకింగ్ ఒక్కటే బాధ్యత కాదు. అన్ని డిపార్ట్‌మెంట్ల నుంచి కొందరేసి ఉద్యోగులు గ్రోత్ హ్యాక్ టీమ్‌లో సభ్యులుగా ఉంటారు. ఈ విభాగానికి ప్రాడక్ట్ మేనేజర్ నాయకత్వం వహించాలి. అన్ని డిపార్ట్‌మెంట్ల సభ్యులకు బాధ్యతలను కేటాయించాలి. ఉదాహరణకు రూమ్ టునైట్ యాప్‌ను ఓపెన్ చేస్తే యూజర్ కన్వర్షన్ రేట్ చాలా బాగుంటుంది. ఒకవేళ యూజర్ బేస్‌ను పెంచితే, ఆన్ డిమాండ్‌పై ప్రజలు ప్రజలు హోటల్స్‌ను బుక్ చేసుకుంటారు. తక్కువ ఖర్చుతో యూజర్ బేస్‌ను పెంచాల్సి ఉంటుంది. గ్రోత్ టీమ్ ఒక్కచోటికి వచ్చి ఓ వినూత్న ఐడియాను ముందుకు తీసుకురావాలి. ఓ ప్రత్యేక దినం రోజు హోటల్ గదిని ఒక్క రూపాయికి అందించాలి. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మరో ఆర్టికల్‌లో వివరిస్తాను. ఈ ఆఫర్ ఇచ్చిన రోజు యాప్‌లో విపరీతమైన ట్రాఫిక్ చోటు చేసుకుంది. దీన్ని మరింత విస్తృత పరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నం.

ప్రాడక్ట్ టీమ్ బాధ్యతలను ఏవిధంగా నిర్వహిస్తున్నామన్నది గుర్తించాల్సిన అవసరముంది.

4. ఎనుగంత ఫీచర్లు.. చీమంత ఉపయోగం

ప్రతి విడుదలకు మరిన్ని ఫీచర్లను చేకూర్చాల్సిన బాధ్యత ప్రాడక్ట్ మేనేజర్లది కానేకాదు. ఫెయిల్యూర్‌కు ‘ఫీచర్ బ్లోట్’ సరైన రిసిప్ట్. ఏనుగంత సైజు ఫీచర్లు ఉండి చీమంత సైజు ఉపయోగం కూడా లేకపోతే ఆ ప్రాడక్ట్‌కు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆర్‌ఓఐని దృష్టిలోపెట్టుకునే ఫీచర్లను రూపొందించాలి.

5. ఉద్వేగాలపై విజయం సాధించాలి

మీ ప్రాడక్ట్ కోసం ట్రాన్సాక్షన్లు, కన్వర్జేషన్లపై ఫోకస్ పెట్టడం మంచిది. అలాగే మీ కస్టమర్లు ఎవరు? వారేం చేస్తారు? మీ ప్రాడక్ట్‌ను ఎలా ఉపయోగించుకుంటారు? వారు సంతోషంగా ఉండేందుకు ఏం కావాలి? వారి హృదయాలను ఎలా గెలుచుకోవాలని అన్న అంశాలపై కూడా దృష్టి సారించాలి. దేశంలోని ఓ ప్రముఖ ఆన్‌లైన్ జ్యుయలరీ నుంచి ఓ విషయాన్ని నేను నేర్చుకున్నాను. వారి టార్గెట్ కస్టమర్లు.. మహిళలు కాదు. పురుషులు. ఈ సందర్భంగా ఓ చైనా సామెతను గుర్తు చేసుకోవాలి. ‘ఓ పేదవాడికి ఓ చేపను తెచ్చిస్తే అది ఆ రోజుకు మాత్రమే కడుపు నింపుతుంది. అదే చేపలు పట్టడం నేర్పిస్తే జీవితాంతం కడుపు నింపుతుంది’’ ఇదే సూత్రాన్ని కంపెనీ వ్యవహారాలకు, ఉద్వేగాలకు అమలు చేయాలి. కస్టమర్‌ మీ ప్రాడక్ట్‌ను అంటగడితే అది ఒక్కసారికి మాత్రమే ఉపయోపడతుంది. అలా కాకుండా అతను/ఆమె మనసును దోచుకుంటే జీవితాంతం మీ ప్రాడక్ట్‌ను వారు కొనుగోలు చేస్తారు.

కస్టమర్ల సైకాలజీని అర్థం చేసుకోవడం ప్రాడక్ట్ మేనేజర్‌కు ఎంతో కీలకం. కస్టమర్ల దృక్పథం నుంచి ఆలోచించే సామర్థమ్యముంటే కంపెనీకి ఎంతో ఉపయోగపడుతుంది.

6. మీరు సాధించిన దాన్ని ప్రేమించొద్దు

మనం అభివృద్ధి చేసిన దాన్ని ప్రేమించడం చాలా సాధారణం. అయితే అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతే, ఆ ఫీచర్‌ను నిర్దాక్షిణ్యంగా తీసేయాల్సి ఉంటుంది.

ఇందుకు గూగుల్ కంపెనీయే మంచి ఉదాహరణ. ఎంతో కష్టపడి రూపొందించిన వేవ్, స్కీమర్, ఐగూగుల్, పిక్‌నిక్, జీటాక్ వంటి ఫీచర్లను గూగుల్ తొలగించింది. సమస్యలను ప్రేమించండి.. మీరు రూపొందించిన ఫీచర్లను కాదు.

7. పోటీలో లేని వర్గాల నుంచీ నేర్చుకోండి

ఏ ఒక్క యాప్ కానీ, వెబ్‌సైట్ కానీ అన్ని సరిగ్గా సమకూర్చుకోలేదు. కానీ ఎన్నో యాప్‌లు, వెబ్‌సైట్లు ఒక్క పని విషయంలో మాత్రం కరెక్ట్‌గా ఉంటాయి.

మా వరకు (రూమ్స్ టునైట్), ప్రస్తుతం ఆన్ డిమాండ్ ట్యాక్సీలు మార్కెట్‌లో పోటీ పడటం లేదు. వారి ‘సర్జ్ ప్రైసింగ్‌’ గురించి వివరించాల్సిన పనిలేదు. రూమ్స్ టు నైట్‌కు సొంతంగా సెమీ క్లోజ్డ్ వ్యాలెట్ ‘ఆర్టీ మనీ’’ ఏర్పాటు చేసింది. తమకు లభించిన క్యాష్ బ్యాక్/ఆఫర్ మనీని కస్టమర్లు అందులో దాచుకోవచ్చు. ఆర్టీ మనీ బ్యాలెన్స్‌కు మరింత విలువ ఎలా సమకూర్చాలి అన్న విషయంపై మేం లోతుగా ఆలోచిస్తున్నం. ఈ సమయంలో ‘సర్జ్ ప్రైసింగ్’ కాన్సెప్ట్‌ను తీసుకుని ఆర్టీ మనీ బ్యాలెన్స్‌కు యాడ్ చేశాం.

ఆర్టీ మనీ కొంతకాలం పాటు కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. సర్జ్ ప్రైజ్ అంటే ఎక్కువ మొత్తంలో చెల్లించడం. కానీ ఆర్టీ మనీ సర్జ్‌లో ఉన్నదాని కంటే ఎక్కువ మొత్తాన్ని ఉపయోగించడం. అంటే ఒక్కసారిగా వాలెట్‌లో ఉన్న అమౌంట్ పెరిగిపోతుంది. అంతే వేగంగా తగ్గిపోతుంది. సర్జ్ అమౌంట్, సర్జ్ డ్యూరేషన్, సర్జ్ డే ఇలా అన్నీ ఓ సర్‌ప్రైజ్ సృష్టించేవే. రూమ్స్ టునైట్ కస్టమర్‌కు ఓ సందేశం అకస్మాత్తుగా అందుతుంది. వచ్చే నాలుగు గంటల్లో మీ ఆర్టీ మనీ బ్యాలెన్స్ వెయ్యి నుంచి 1300కు పెరుగుతుందని, ఈ నాలుగు గంటల్లో పెరిగిన అమౌంట్‌ను వాడుకోవచ్చు. నాలుగు గంటల తర్వాత ఆటోమెటిక్‌గా సర్జ్ మనీ వెయ్యికి చేరుతుంది.

ఈ ప్రత్యేక ఫీచర్ రూమ్స్ టునైట్‌ను సూపర్ హిట్ చేసింది. కస్టమర్లు ఈ పద్ధతిని సులభంగా అర్థం చేసుకుంటారు. అవసరంలో ఆదుకున్నందుకు కృతజ్నతలు కూడా చెప్తారు. మేం ఎప్పుడు సర్జ్ బ్యాకెండ్‌ వెళ్లినా బుకింగ్స్ ఒక్కసారిగా రెట్టింపవుతాయి. మొత్తం గేమ్‌లో ‘‘సర్జ్ సర్‌ప్రైజ్’’ కొత్త కొత్త అంశాలను చేరుస్తోంది. ఈ ‘‘సర్జ్‌’’ను అందరూ సంతోషంగా అంగీకరిస్తారు.

8.#FFFFFF నుంచి #FFFFFE మధ్య వ్యత్యాసాలను గ్రహించుట

అంశాలపై అప్రమత్తత ప్రాడక్ట్ మేనేజర్‌కు ఉన్న అత్యంత క్లిష్టమైన నైపుణ్యం. స్పెల్లింగ్ కావొచ్చు, ఒక చిన్న పిక్సెల్ కావొచ్చు, తప్పుడు రంగు లేదా డిజైన్ విధానం, సందిగ్ధ వ్యాఖ్యానం, మిస్ అలైన్‌మెంట్, రాంగ్ ట్యాగింగ్, రాంగ్ డెసిమల్ డిజిట్స్, పేజ్ లోడింగ్, స్క్రోలింగ్ స్పీడ్, యూనిఫామ్ బటన్ సైజ్.. ఇలా చిన్న చిన్న సూక్ష్మ విషయాలను కూడా ప్రాడక్ట్ మేనేజర్ గ్రహించగలగాలి.

9. భవిష్యత్‌ను అంచనా వేయగలగాలి

వచ్చే ఆరు నెలల్లో తమ ప్రాడక్ట్ మార్కెట్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ప్రాడక్ట్ మేనేజర్ అంచనా వేయగలగాలి. ఇది ఒక్క ఫీచర్‌కు సంబంధించినదే కాదు, రోజువారీ, నెలవారీ కస్టమర్ల సంఖ్యపైనా, ఆదాయ వ్యయాలపైనా, ఎదుర్కొబోయే సమస్యలను కూడా అంచనా వేయగలగాలి. మీరు బీ2సీ కంపెనీకి ప్రాడక్ట్ మేనేజర్ అనుకోండి.. ఓ నిర్దేశిత గంటలో యాప్‌ను ఎంతమంది వినియోగించుకుంటున్నారో 10-20% తేడాతో అంచనా వేయగలగాలి. యూజర్ ప్రవర్తన డాటా మీ వద్ద వుంటే మీరు దీన్ని సులభంగా అంచనా వేయగలుగుతారు.

10. నాన్ ప్రాడక్ట్ టీమ్‌ను సైతం విజయవంతంగా నడిపించడం

ప్రతి నాన్ ప్రాడక్ట్ టీమ్‌ను నేరుగా విజయవం వైపు నడిపించగలగాలి. ఉబర్ విజయం వెనుక గొప్ప ప్రాడక్ట్ ఇంజినీరింగే ఒక్కటే లేదు. కస్టమర్ సర్వీస్ కూడా ఎంతో ఉపయోగపడింది. కస్టమర్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం, డ్రైవర్ పార్ట్‌నర్ టీమ్, మార్కెటింగ్ టీమ్‌లను సమన్వయం చేయగలగడం వల్లే ఉబెర్ విజయవంతమైంది.

( NOTE: ఈ స్టోరీలో వ్యక్తపరిచిన ఆలోచనలు, అభిప్రాయాలు రచయిత సొంత అభిప్రాయాలు మాత్రమే. యువర్‌స్టోరీవిగా భావించొద్దు. )