మల్టీ బిలియన్ డాలర్ల ఐ-వేర్ మార్కెట్లో అద్భుత అవకాశాలు
ఈమధ్య ఏ పదిమందిలో చూసినా కనీసం ఆరుగురు కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్సులతో కనిపిస్తున్నారు లేదా కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారు ఉంటున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రతి పదిమందిలో ఆరుగురికి కంటిచూపు లోపాలు ఉన్నా … వారికి నేత్ర చికిత్స, కళ్లద్దాల వాడకం గురించి తెలియదు, ఒకవేళ కొందరికీ తెల్సినా … అవి అందుబాటులో లేవు . (సోర్సెస్).
ప్రపంచవ్యాప్త జనాభాతో పోల్చి చూస్తే ఈ నిష్పత్తి కొంత ఆవేదన కలిగిస్తుంది. అయితే ఇంతమందికి అవసరమైన కళ్లద్దాలు ఎవరు తయారుచేస్తారు ?
ఐ-వేర్ ఇండస్ట్రీలో ఉన్న ఎవరికైనా ‘లక్సోటికా’ ఒక కామన్ పేరు, కానీ సామాన్యులకు మాత్రం అపరిచితం. అయితే, అందరూ ప్రాడా, జార్జియో అర్మానీ, వెర్సేస్, లెన్స్ క్రాఫ్టర్స్ లాంటి పేర్లు వినే ఉంటారు.
వీరందరికీ లక్సోటికా సన్ గ్లాసెస్, ఇతర ప్రిస్క్రైబ్డ్ ఫ్రేమ్స్‌ని తయారుచేసి ఇస్తుంది. లక్సోటికా గ్రూప్ ఒక ఇటాలియన్ ఐ-వేర్ కంపెనీ, 1961లో ఏర్పాటైంది. ప్రపంచంలోని మేజర్ ఐ-వేర్ బ్రాండ్స్‌ను పక్కనబెట్టి ఏకంగా 80శాతం మార్కెట్ షేర్‌ని సొంతం చేసుకుంది.
రే-బాన్, లెన్స్‌క్రాఫ్టర్స్, పర్ల్ విజన్ లాంటివెన్నో ఈ గ్రూప్ సొంతం. ఛానెల్, ప్రాడా, జార్జియో అర్మానీ, బర్బెరీ, వర్సెస్, డోల్స్ అండ్ గబానా తదితర డిజైనర్ బ్రాండ్స్‌కు సన్‌గ్లాసెస్, ప్రిస్క్రిప్షన్ ఫ్రేమ్స్‌ను సప్లై చేస్తుంది. లక్సోటికాకు ఏడు వేల రిటైల్ స్టోర్స్ ఉన్నాయి.
ఆన్‌లైన్ యాంగిల్
ఆన్ లైన్ స్పేస్, డిస్ట్రప్టర్స్ గురించి మాట్లాడాల్సి వస్తే … వార్బీ పార్కర్ ఫ్రంట్ రన్నర్ అనే చెప్పాలి. ఏప్రిల్‌లో 1.2 బిలియన్ అమెరికన్ డాలర్ల వాల్యూతో అందరి కళ్లు తనవైపుకు తిప్పుకుంది. వార్బీ పార్కర్ ఒక ఆన్ లైన్ ఐ గ్లాస్ రీటైలర్, ఈ కంపెనీకి ఆన్ లైన్లో ఎంతోమంది కస్టమర్లు ఉన్నారు. అంతే కాదు అమెరికాలో పలుచోట్ల స్టోర్స్ కూడా ఉన్నాయి.
వంద అమెరికన్ డాలర్లకు డిజైనర్ ఫ్రేమ్స్‌ని అమ్మి, ఈ కంపెనీ ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది. అమెరికాలో కొనే ప్రతీ గ్లాసెస్‌తో ఒక పెయిర్‌ని డొనేట్ చేయడంలో కూడా మోడల్‌గా నిలిచింది. ఈ కంపెనీకి ఎంతో వాల్యూవేషన్ ఉన్నా … లక్సోటికాతో పోలిస్తే కొంత భిన్నం.
ఇండియాలో ఏం జరుగుతోంది ?
భారత్‌లో సన్‌గ్లాసెస్, ఐ-గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్, యాక్సెసరీస్ తదితర ఆప్టికల్ ప్రొడక్ట్స్ తయారుచేయడంలో GKB ఆప్టికల్స్ ఒక అతిపెద్ద రీటైలర్. ఇండియాలోని పలు ప్రాంతాల్లో ఎన్నో రీటైల్ స్టోర్స్ ఉన్నాయి. కోల్కతా హెడ్ క్వార్టర్స్‌గా … దేశవ్యాప్తంగా 60 స్టోర్స్ , 600మంది ఉద్యోగులు ఉన్నారు.
ఈ మధ్య కాలంలో ఆప్టికల్ రీటైల్ చైన్‌లో బెన్ ఫ్రాంక్లిన్ వంటి అప్‌కమింగ్ రీటైలర్స్ ఉన్నారు. ఆన్‌లైన్ స్పేస్‌లో, లెన్స్‌కార్ట్ దూసుకుపోతోంది. వాల్యూ గొడుగు కింద జ్వెల్స్ కార్ట్, బ్యాగ్స్ కార్ట్, వాచ్ కార్ట్‌లతో కలిసి 2010లో ఇది ప్రారంభమైంది. ఈ ఏడాది జనవరిలో రూ. 135 కోట్ల మార్జిన్‌తో తన సత్తా చాటుకుంది. అయితే ఇకపై కేవలం లెన్స్ కార్ట్ పై దృష్టి పెట్టాలని మిగతా పోర్టల్స్‌ని మూసి వేయాలని భావిస్తోంది. ఆన్‌లైన్ ఛానెల్‌తో పాటు, లెన్స్ కార్ట్‌కు 66 నగరాల్లో వంద బ్రాండెడ్ షాప్స్ ఉన్నాయి. ఇక ఆఫ్ లైన్ మార్కెట్‌పై ఫోకస్ చేయాలనుకుంటోంది.
ఆవిష్కరణలు – కొత్త వెంచర్స్
లెన్స్ కార్ట్ ఈ మధ్యే ‘3D ట్రై ఆన్’ ఫీచర్ ని వెబ్ సైట్లో లాంఛ్ చేసింది. దీని సాయంతో యూజర్స్ వర్చువల్‌గా రకరకాల ఫ్రేమ్స్‌ని ట్రై చేయవచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేయమని, దానివల్ల ఫీచర్స్ అన్నీ డిటైల్ గా రికార్డ్ అవుతాయని యూజర్స్‌ను ఈ టూల్ సూచిస్తుంది. ఆప్టికల్ షాపుకు వెళ్లకుండానే హాయిగా కంప్యూటర్ ఎదుట కూర్చుని, రకరకాల ఫ్రేమ్స్‌ని పెట్టుకుని, స్క్రీన్ పై తాము ఎలా కనిపిస్తున్నామో యూజర్స్ చూసుకోవచ్చు. గ్లాసెస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
త్వరలోనే మరెన్నో వెంచర్స్ రాబోతున్నాయి. గ్లాసిక్ అండ్ జార్జ్ ఐ .. గతేడాది ఆన్ లైన్ లో ఎంటరయ్యాయి.
గ్లాసిక్‌ను కైలాష్, దేవేష్ నిచానీలు ప్రారంభించారు. ఫౌండర్స్ ఫ్యామిలీ బిజినెస్ గా రంగంలోకి వచ్చి, రీటైల్ ఆప్టికల్ డిస్పెన్సింగ్‌గా ఎదిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ ఆన్‌లైన్ ద్వారానే ఆపరేట్ చేస్తోంది. వర్చువల్ ట్రై ఆన్ ఫీచర్‌తో అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. “మా సైట్, ప్రొడక్ట్స్, సర్వీసెస్ గురించి మాకు ఎంతో మంది నుంచి చాలా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది, ఇప్పటివరకూ ఒక్క ఐటమ్ కూడా రిటర్న్ రాలేదు,” అని చెప్పారు కైలాష్.
ఈ రంగంలో జార్జ్ ఐ మరో స్టార్టప్. కేశవ్, నిధి గుప్తా నేతృత్వంలో ప్రారంభమైంది. ఈ కంపెనీ అనూహ్య ఫలితాలను అందుకుంటూ ఇప్పుడు 45శాతం వృద్ది చెందింది. నిధి అంటారు, “ఈ నాలుగు నెలల్లో, అంటే మేము ఈ ఆపరేషన్ మొదలుపెట్టిన తర్వాత, మా CTR 1.8 శాతం నుంచి 3.2 శాతానికి పెరిగింది. మొదట్లో 30మోడళ్లతో ప్రారంభించగా ఇప్పుడు మా డిజైనర్ కలెక్షన్ దగ్గర వందకు పైగా మోడల్స్ ఉన్నాయి. మేము త్వరలోనే సన్ గ్లాసెస్, పవర్ గ్లాసెస్ ను కూడా మా కలెక్షన్స్ లో పొందుపరచాలనుకుంటున్నాం.”
ఈ ఏడాది చివర్లోగా నెలకు వెయ్యి ఆర్డర్లు తీసుకునే స్థాయికి చేరాలని టార్గెట్ పెట్టుకుంది. అంతేకాదు నెలకు పదిలక్షల లాభం వచ్చే రేంజ్‌కు ఎదగాలనుకుంటోంది.
భవిష్యత్తు
కొన్ని దశాబ్ధాలుగా ఐ-వేర్ ఇండస్ట్రీ కొంతమంది చేతుల్లోనే ఉండిపోయింది, ఇప్పుడిప్పుడే చేతులు మారుతోంది. టెక్నాలజీ పుణ్యమా అని ఇతర రంగాల్లో ఎలాంటి పెను మార్పులు సంభవించాయో, ఐ-వేర్ ఇండస్ట్రీలో కూడా అలాంటి అద్భుతాలు జరిగే రోజులు వచ్చేశాయి. ఎన్నో ఏళ్లుగా ఈ ఇండస్ట్రీని తమ చెప్పుచేతల్లో పెట్టుకున్న వారి నుంచి విముక్తిని కలిగించి, న్యూ ఫీల్ ఇవ్వబోతున్నాయి. అందరికీ అందుబాటులో ఉండేలా, కస్టమర్‌కు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా చేయడమే ముఖ్య ఉద్దేశంగా దూసుకుపోతోంది.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంకా లక్షలాదిమందికి ఐ – కేర్ అందుబాటులో లేదు, అలాంటి సమస్యలకు ఇకపై స్టార్టప్స్ చక్కని పరిష్కారాన్ని అందిస్తాయి.
ఉదాహరణకు, Forus’ flagship product 3nethra ఒక తెలివైన, కఠినమైన, సరసమైన ధరకు దొరికే, పోర్టబుల్ ఐ స్క్రీనింగ్ డివైజ్. ఇది కేవలం ఐదు నిమిషాల్లో పేషంట్‌కు ఉన్న కంటి సమస్యను స్క్రీన్ చేసేస్తుంది.
ఐ-వేర్ డెలివరీ చేస్తున్న కంపెనీలకు, దేశంలో పెద్ద మార్కెట్ ఉంది. అతి త్వరలోనే ప్రపంచదేశాలను కూడా ప్రభావితం చేయవచ్చు.