పరువు ముఖ్యమా..? తేల్చుకో మిత్రమా..!!
ఆ రోజు ఇండియా ఇంగ్లండ్ మ్యాచ్. ఇంట్లో కూర్చొని గేమ్ ఎంజాయ్ చేస్తున్నా. స్పెషల్గా పకోడీలు కూడా తయారవుతున్నాయి. ఇంతలో కృష్ణ నుంచి ఫోన్. మీ అపార్టుమెంట్ బయట ఉన్నాను.. అర్జెంటుగా కలువు అన్నాడు. నేను రాను.. నువ్వే పైకి రా అన్నాను. అలా కాదు.. ముఖ్యమైన విషయం మాట్లాడాలి.. ఇంట్లో చెప్పడం కుదరదు అన్నాడు. సీన్ నాకర్ధమైంది. కృష్ణకు మళ్లీ డబ్బు అవసరం పడింది.