వేఫుల్స్ బిజినెస్ లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న నిషిత బియానీ

ఎగ్ లెస్ వేఫుల్స్ పరిచయం చేసిన నిషితఏడాదిలో రెండు వేఫుల్ స్టోర్స్ ప్రారంభించిన ముంబై యువతి 

26th Apr 2016
 • +0
Share on
close
 • +0
Share on
close
Share on
close


కొన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ టేస్ట్ నాలుకకు ఎంతగా నచ్చుతాయంటే వారంలో ఒక్కసారైనా వాటిని కచ్చితంగా టేస్ట్ చేయాలనిపిస్తుంది. వేఫుల్స్ కూడా అలాంటివే. గళ్లు గళ్లుగా ఉండే క్రిస్పీ అండ్ క్రంచీ స్నాక్ ఐటెమ్. ముంబైకి చెందిన నిషిత బియానీకి కూడా వేఫుల్స్ అంటే చాలా ఇష్టం. ముంబై మొత్తం తిరిగినా అవి దొరికే స్టోర్స్ ఒక్కటి కూడా కనిపించలేదామెకు. ఇంత పెద్ద మహానగరంలో వేఫుల్స్ దొరకకపోవడం ఆమెకు విచిత్రంగా తోచింది. ఇదే నిషిత మైండ్ లో స్టార్టప్ ఐడియా తళుక్కున మెరిసేలాచేసింది. అలా 2014లో ముంబైలో ప్రారంభమైంది వేఫుల్స్ బిజినెస్. వాటి టేస్ట్ జనానికి ఏ రేంజ్ లో నచ్చిందంటే- ఏడాది తిరిగే సరికి సిటీలో సెకండ్ వేఫులిస్ట్ స్టోర్ ఓపెన్ చేయాల్సి వచ్చింది.

image


నిషితకు ఒకప్పుడు బేకింగ్ గురించి అసలేమీ తెలియదు. కానీ పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిదేమీ ఉండదన్న మాటలను నిజం చేస్తూ.. ఆమె ఇప్పుడు ఎక్స్ పర్ట్ అయిపోయింది. వేఫుల్స్ తయారు చేయాలంటే ఎగ్స్ మస్ట్. గుడ్లు కలపనిదే వేఫుల్స్ చేయడం అసాధ్యం. బెల్జియంలోని బడా చెఫ్ లు సైతం ఆమెకు ఇదే మాట చెప్పారు. కానీ నిషిత మాత్రం పట్టు వదలలేదు. ఇంటి కిచెన్ నే ప్రయోగశాలగా మార్చేసింది. గంటల తరబడి కష్టపడి చివరకు ఎగ్ లెస్ వేఫుల్స్ ను జనానికి పరిచయం చేసింది.

“చిన్నప్పటి నుంచి ఏమైనా కొత్తగా చేయాలనిపించేది. కొత్తగా ఏదైనా ప్రయత్నిద్దామన్న ఆలోచనతో వేఫుల్స్ బిజినెస్ లో అడుగుపెట్టా. కృష్టి ఉండే ఏదైనా సాధ్యమేనన్న ధీమా, పట్టుదలతో ఈ రంగాన్ని ఎంచుకున్నా”-నిషిత
image


ముంబైలోని ఓ బడా వ్యాపార కుటుంబంలో పుట్టింది నిషిత. చిన్నప్పటి నుంచి డబ్బుకు కొదవలేదు. సొంతంగా బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉన్నా.. ముందు ఎంతో కొంత అనుభవం సంపాదించుకోవాలనుకొని ఫ్యామిలీ బిజినెస్ లోకి ఎంటరైంది. అయితే కస్టమర్లతో డైరెక్టుగా మాట్లాడే ఛాన్స్ లేకపోవడం, వర్క్ ఛాలెంజింగ్ కాకపోవడంతో ఆమెకు ఆ పని నచ్చలేదు.

అనుభవం నేర్పిన పాఠాలతో ధైర్యంగా ముందడుగేసి సొంత వెంచర్ స్టార్ట్ చేశారు. నిషితకు వ్యాపార పాఠాలు నేర్పిన గురువులు ఇద్దరున్నారు. వారే ఆమె తండ్రి, బాబాయి. సప్లై చైన్, కాస్ట్ మేనేజ్ మెంట్, బ్యాలెన్స్ షీట్ తదితర విషయాల గురించి ఆమె వారి దగ్గరే నేర్చుకుంది. తండ్రి, బాబాయి కేవలం గురువులు మాత్రమే కాదు, మంచి విమర్శకులు కూడా. వేఫులిస్ట్ ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు నిషిత తండ్రి ఆమెకు ఓ ఛాలెంజ్ విసిరారు. నిషిత స్వయంగా వేఫుల్స్ తయారు చేసి అమ్మాలని పందెం కట్టారు.

నిజానికి ఆ పందెం వల్లనే మంచి అనుభవం వచ్చిందంటారు నిషిత. మొదట రోడ్డు పక్కన వేఫుల్స్ తయారుచేసి అమ్మాలని నిర్ణయించుకుంది. అయితే గాలికి స్టవ్ మాటిమాటికీ ఆరిపోతోంది. ఎండ వేడికి వేఫుల్స్ బ్యాటర్ గట్టిపడుతోంది. ఆమె ఇబ్బంది చూసి పక్కనే దోశలు అమ్ముతున్న వ్యక్తి బ్యాటర్ ఎండిపోకుండా తడిగా ఉంచేందుకు ఏం చేయాలో చెప్పాడు. అది ఫాలో అయింది. అలా తొలిసారి వేఫుల్స్ అమ్మడం.. జీవితంలో గొప్ప పాఠం నేర్పింది అంటారు నిషిత

తర్వాత రోజుకో కొత్త సమస్య ఎదురయ్యేది. వాటిని పరిష్కరిస్తుంటే ఏదో తెలియని ఉత్సాహం కమ్మేసేది. నిషిత జీవితంలో మ్యూజిక్ కూడా ఒక భాగం. పని ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆమె సంగీతంతో స్వాంతన పొందేది.

టీం వేఫులిస్ట్

వేఫులిస్ట్ లో ప్రస్తుతం 25 మంది సిబ్బంది ఉన్నారు. ఉద్యోగుల్ని నియమించుకోవడం కన్నా వారికి ట్రైనింగ్ ఇవ్వడం చాలా కష్టం. మొదట్లో ఇబ్బందులు ఎదురైనా ఉద్యోగులకు అనుభవం వచ్చే కొద్ది అంతా సాఫీగా సాగిపోతోంది. వేఫులిస్ట్ టీంలో చాలా మందికి ఇంగ్లీష్ సరిగా రాదు. అందుకే మీటింగ్ లలో హిందీలోనే మాట్లడుతుంది నిషిత. ఇంగ్లీష్ రాదన్న కారణంతో తన స్టోర్ట్ లో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకపోవడమన్నది ఇప్పటి వరకు జరగలేదంటారు నిషిత.

వేఫులిస్ట్ కు కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. తరచూ వచ్చేవారు కొత్త మెనూ కావాలని డిమాండ్ చేస్తుంటారు. నిజానికిది పెద్ద సవాల్. రుచిలో తేడా రాకుండా కొత్త వెరైటీలను తయారుచేయడమన్నది కత్తి మీద సాములాంటి వ్యవహారమే. ఏ మాత్రం తేడా వచ్చినా బిజినెస్ దెబ్బతింటుంది.

అలా డిమాండ్ కు తగ్గ క్వాలిటీని మెయింటెన్ చేయడం వల్ల కస్టమర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఫోర్ట్ స్టోర్ లో ఉన్న వేఫులిస్ట్ బాంద్రాలోని స్టోర్ కన్నా 8 రెట్లు పెద్దగా ఉంటుంది. అక్కడి మెనూకీ ఇక్కడి మెనూకి తేడా ఏం లేదు. ఫోర్ట్ స్టోర్ లో వై-ఫై ఫెసిలిటి, సీటింగ్ అరేంజ్ మెంట్ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. వేఫులిస్ట్ లో జనం ఎక్కువ సేపు గడుపుతున్నారంటే ఆర్డర్ లు పెరిగినట్లే లెక్క.

సెకండ్ స్టోర్ ఓపెన్ చేసేందుకు అవసరమైన డబ్బు సమకూర్చుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. బ్యాంకులను ఒప్పించి లోన్ పొందేందుకు దాదాపు ఆరు నెలల సమయం పట్టిందంటారు నిషిత. ప్రస్తుతం బిజినెస్ బాగా సాగుతోంది. భవిష్యత్తుపై ఆమెకు భారీ అంచనాలే ఉన్నాయి. త్వరలోనే ఇతర సిటీల్లోనూ వేఫులిస్ట్ లను ప్రారంభించాలన్నది నిషిత ప్లాన్. వేఫుల్స్ ను రిటైల్ గా అమ్మే అలోచన కూడా ఉంది.

“సవాళ్లను సంతోషంగా స్వీకరించాలి. అప్పుడే వ్యక్తిగతంగానూ, ఆర్థికపరంగానూ అనుకున్నది సాధించగలుగుతారు.”-నిషిత 

 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • WhatsApp Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • WhatsApp Icon
 • Share on
  close
  Report an issue
  Authors

  Related Tags